peethala sujatha
-
మహిళా నేతలనూ వంచించిన బాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది. పనబాకను మోసం చేసిన బాబు టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా భారతికి మొండిచేయి టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు. అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు
సాక్షి, విజయవాడ: టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారని, చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. ‘‘నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు. పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం. మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు. నాతో పాటు మాజీమంత్రి జవహర్‌కి కూడా టికెట్ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం. నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు’’ అంటూ పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు? -
నేను నోరు తెరిస్తే టీడీపీ బండారం మొత్తం..చంద్రబాబు పై సునీత సంచలన కామెంట్స్
-
మాజీ మంత్రి పీతల సుజాతకు ఝలక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌కుమార్ నియామకం రాజకీయ చిచ్చురేపింది. టికెట్ ఆశిస్తూ ఐదేళ్లుగా రూ.కోట్లు కుమ్మరించిన నేతలను, దళిత మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాతను కాదని కొత్త వ్యక్తికి ఇవ్వడంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ అంశంపై సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో బుధవారం జరిగిన పవన్‌కళ్యాణ్ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. దీంతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంపైనా నిరసన వ్యక్తమవుతోంది. అనూహ్యంగా సొంగా రోషన్‌ను ఇన్చార్జిగా నియమించడం, టికెట్ అతనికేనంటూ కేడర్‌కు సంకేతాలు పంపేలా నియామక ప్రకటన చేయడంతో చింతలపూడి తెలుగుదేశం పార్టీలో గందరగోళం మొదలైంది. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో దళిత మహిళగా పీతల సుజాత కీలకంగా పనిచేశారు. 2004లో టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందా రు. ఆ తరువాత రాజకీయ సమీకరణాల కారణాలు చెప్పి 2009లో టికెట్ కేటాయించలేదు. 2014లో చింతలపూడి అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు సామాజికవర్గ ప్రజాప్రతినిధుల చేతుల్లో అవమానాలు, ఇబ్బందులు ఎదు ర్కొని వారి లాబీయింగ్‌తో మంత్రి పదవి నుంచి మధ్యలోనే వైదొలిగారు. 2019 ఎన్నికల్లో చింతలపూడి టికెట్ ఆశించినా మొండిచేయి చూపారు. టీడీపీ ఓటమి అనంతరం ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అయినా పార్టీలోనే ఉండి చింతలపూడిలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆమెకు మొండిచేయి చూపడంతో సుజాత వర్గం తీవ్ర అసంతృప్తితో రగులుతోంది. దీనికి తోడు ఉమ్మడి పశ్చిమగోదావరిలోని మూడు రిజర్వు స్థా నాలూ ఎస్సీల్లో ఒకే సామాజిక వర్గానికి టీడీపీ టి కెట్ కేటాయించిందన్న ప్రచారం బలంగా సాగుతోంది. దళిత మహిళను అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుజాతతో పాటు టికెట్ ఆశించిన బొమ్మాజీ అనిల్ కూడా మాగంటి బాబు, చింతమనేనిల ప్రోద్బలంతో యువగళం, చంద్రబాబు సభలకు భారీగా ఖర్చు చేశారు. పార్టీ డబ్బు అవసరాలకు వాడుకుని చివరికి ఆయనకూ మొండిచేయి చూపారు. -
దళిత నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: టీడీపీలో మరోసారి దళిత నాయకులపై తమ అక్కసును వెళ్లగక్కారు. మాజీ మంత్రి పీతల సుజాతపై సినీ నిర్మాత, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొగరు అహంకారం అంటూ సుజాతను నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ వ్యాఖ్యలను ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవి చేపట్టి, రాజకీయంగా పేరొందిన దళిత మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీలో దళిత నాయకులపై గౌరవంగా ప్రవర్తించరని, చులకనభావంతో చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రెండో జాబితాలోనూ ఆమెకు టికెట్ అనుమానమే..!
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తొలి జాబితాలో తనకు సీటు దక్కకపోవడంతో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజాతకు టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు టీడీపీ కేటాయించింది. అయితే, మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటునైనా కేటాయించాలని సుజాత చంద్రబాబును ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును వంగలపూడి అనితకు కేటాయించినట్టు తెలిసింది. కాగా, టీడీపీ తొలి జాబితాలో జిల్లాలో ఉన్న 11 స్థానాల్లో 9 మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. సుజాతకు టికెట్ కేటాయించే విషయంలో మాగంటి వర్గం వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. వ్యతిరేక వర్గం ఒత్తిడితోనే సుజాతకు టికెట్ దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్ కేటాయించిన చంద్రబాబు తనకు మాత్రం అన్యాయం చేశాడని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. రెండో జాబితాలో కూడా ఆమెకు టికెట్ దక్కడం అనుమానమేనని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయాలతో సుజాత భవితవ్యం డోలాయమానంలో పడింది. -
అధికార పార్టీలో కొలిక్కిరాని సీట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి పై కార్యకర్తలు ధ్వజమెత్తుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధిష్ఠానం ఉంది. వారికి టిక్కెట్లు ఇస్తే తామే ఓడిస్తామని చెబుతుండటంతో ఏం పాలుపోవడం లేదు. మరోవైపు జిల్లాలోని మూడు ఎస్సీ, ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థుల కోసం వెదుకులాట మొదలుపెట్టింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను మార్చితేగాని ఒప్పుకోమంటూ నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సిట్టింగ్‌ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి ప్రకటించకపోయినా తమకే సీటు దక్కిందంటూ సిట్టింగ్‌లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయకపోవడానికి ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలే కారణం. చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఖరారు చేయలేదు. ఇక్కడ ఏలూరు ఎంపీ మాగంటి బాబు పీతల సుజాతకు సీటు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. తన మాట వినని సుజాతకు ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వకూడదని ఎంపీ సామాజిక వర్గం పట్టుపడుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఖరారు కాకపోవడం వెనుక జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఉన్నారు. ఆయన తన అనుచరుడు వెంకటరాజుకు ఇప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వకుండా బలమైన లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రి జవహర్‌కు చెందిన కొవ్వూరు సీటు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అచ్చిబాబు వర్గం అడ్డుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దే ఇరువర్గాలు బాహాబాహీకి తలపడటం తెలిసిందే. దీంతో జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లను ముఖ్యమంత్రి ఖరారు కాకుండా నిలిపివేశారు. ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం పోలవరం విషయంలో కూడా అదే సామాజిక వర్గం నేతలు చక్రం తిప్పుతుండటంతో అక్కడ అభ్యర్థి ఎన్నిక కూడా పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల సీట్లను దాదాపు ఖరారు చేసినా రిజర్వుడు సీట్లు ఖరారు చేయకపోవడం వివాదానికి దారితీస్తోంది. మరోవైపు ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా వారికి తలనొప్పిగా మారింది. నర్సాపురం అభ్యర్థిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోటీలోకి దింపాలని చూశారు. అయితే వారిద్దరు కూడా సుముఖత చూపకపోవడంతో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ ఓటమి భయంతో పోటీ చేయడానికి ఇష్టపడని సంగతి తెలిసిందే. ఏలూరు స్థానాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు. మాగంటి బాబును అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిడదవోలు నియోజకరవ్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని నేతలు పట్టుపడుతున్నారు. ఆయన స్థానంలో ఎవరికి సీటు ఇచ్చినా మద్దతు తెలియచేస్తామని కుందుల సత్యనారాయణ వర్గం చెబుతోంది. ఒకవైపు బూరుగుపల్లి శేషారావు తనకే సీటు వచ్చిందని చెబుతుండగా, కుందుల సత్యనారాయణ ప్రచారానికి శ్రీకారం చుట్టి అక్కడ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. -
పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెలమూరు: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామదర్శిని సభలో మంత్రులు నారా లోకేష్, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పీతల సుజాత, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సంభోదించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో కేంద్రానికి వెళ్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాత వ్యాఖ్యలతో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. అంతకుముందు పెనుగొండ గ్రామదర్శిని సభలో మంత్రి నారా లోకేష్‌కు మహిళలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలోనే మహిళలు సమస్యలపై మొరపెట్టుకున్నారు. తమకు ఇళ్లు, మరుగుదొడ్లు లేవని, ఇళ్ల స్థలాలు ఇప్పించండంటూ మహిళలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. పితాని సమక్షంలోనే భారీగా ఫిర్యాదులు రావడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకోవడంతో మంత్రి లోకేష్, ఇన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయా అని విస్తుపోయారు. -
పశ్చిమగోదవరిలో రసాబాసగా దళితతేజం కార్యక్రమం
-
రాజీనామాలు తుస్సేనా?
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాల కథ కంచికి చేరినట్టేనా? ఇప్పటి వరకూ ఆ రాజీనామాలు ఆమోదించే విషయంలో పట్టుపట్టకపోవడంతో బ్లాక్మెయిల్ చేసేందుకే రాజీనామాలు చేసినట్లు స్పష్టం అవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, ఎంపీ మాగంటి బాబు తరపున సీనియర్ నేత ముత్తారెడ్డి ఆధ్వర్యంలోని వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం రోడ్డెక్కిన మాగంటి బాబు వర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు ఇటీవల తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన తర్వాత రెండుసార్లు అమరావతికి వెళ్లి ఇన్చార్జి మంత్రితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు పీతల సుజాత వర్గం శనివారం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని సత్యనారాయణను కలిసి చర్చించినట్లు సమాచారం. ఏఎంసీ చైర్మన్‌గా తమకు అనుకూలం అయిన వ్యక్తిని నియమించుకునేందుకు ఎంపీ బాబు వర్గం చేస్తున్న ప్రయత్నాల పట్ల సుజాత వర్గం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ప్రతిచోటా ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే ఏఎంసీ చైర్మన్ ఇస్తుండగా, చింతలపూడిలో మాత్రం ఎంపీ పెత్తనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిబంధనలను కాదని ముఖ్యమంత్రి కూడా ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు తమను పట్టించుకోవడం లేదని ఎంపీ వర్గం చెప్పినా అది వాస్తవం కాదనే వాదనను పీతల వర్గం ఇంఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు రాజీనామా అస్త్రం ఉపయోగించిన వారిలో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్న విషయం, వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉద్యానవన శాఖలో మొక్కలు వేయకుండానే కోట్లాది రూపాయలు డ్రా చేసిన విషయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు తమ వర్గానికి ఇప్పించుకుని, కట్టకుండా డబ్బులు డ్రా చేసిన వైనాలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇదే కాకుండా దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న వాదనను ముందుకు తీసుకువెళ్లడంతో అధిష్టానం కూడా డైలమాలో పడినట్లు సమాచారం. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నామినేటెడ్ పదవుల కోసం తమ పదవులకు రాజీనామా చేసినట్లు డ్రామాలు ఆడటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రాజీనామా చేసిన వారు ఈ గొడవకు త్వరగా ఫుల్స్టాప్ పెట్టాలని తమ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని వారు తమ అనుయాయుల వద్ద వాపోతున్నారు. -
మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే...
పశ్చిమగోదావరి ,చింతలపూడి/జంగారెడ్డిగూడెం : మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే. బ్లాక్మెయిల్ చేయడం కోసమే రాజీనామా డ్రామాకు తెరలేపారు. మాగంటి బాబు ఎంపీగా గెలిచాక చింతలపూడి నియోజకవర్గానికి చేసిందేమిటి? ఏఎంసీ విషయంలో ఎంపీ పెత్తనమేంటి, ఎంపీటీసీలను ప్రలోభపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారు.. అంటూ చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది. పీతల సుజాత వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీతల సుజాత వర్గం తీవ్రంగా స్పందిం చింది. చింతలపూడి, జంగారెడ్డిగూడేలలో ఆ వర్గం నేతలు విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి ఎంపీపీ దాసరి రామక్క, పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీ మాగంటి బాబు వర్గం నియోజకవర్గంపై పెత్తనం కోసం కావాలనే రాజీనామాల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కొందరు కావాలని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో ఎమ్మెల్యే సుజాతను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ నియామకంలో ఎంపీ మాగంటి జోక్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగంటి వల్లే ఇక్కడ గ్రూపులు తలెత్తాయన్నారు. సమస్యను పరిష్కరించకపోతే చంద్రబాబును కలిసి ఎంపీ వర్గంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీలు ఎం.సుందరమ్మ, కె.వీర్రాజు, వెలగం సత్యవతి, మిండా ప్రకాశం, కృపాబాయమ్మ, కొండపల్లి సరస్వతి, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, బి.ఆశీర్వాదం, సీనియర్ నాయకులు పొట్టి విశ్వేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సి లర్ నంబూరి రామచంద్రరాజు ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా, చెరుకూరి శ్రీధర్ కౌన్సిలర్లు సీహెచ్ రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తూటికుంట దుర్గారావు, మండల కో–ఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయేల్ తదితరులు మాట్లాడుతూ కేవలం ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వలనే ఇక్కడ విభేదాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. వీరు గిరిజన, దళిత ఎమ్మెల్యేలపై గతంలో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించే వ్యక్తి కనీసం ఎమ్మెల్యేను కలవలేదన్నారు. రూరల్ కమిటీ అధ్యక్షులు దాకారపు గోపాలకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాంబా బు, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, పగ డం దినేష్, తూటికుంట రాము, యాకూబ్, కౌన్సి లర్ చాబత్తుల మరియ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
టీడీపీలో ముదిరిన సంక్షోభం
చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు క్లయిమాక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, 17 మంది ఎంపీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా, మంగళవారం మరికొంతమంది రాజీనామాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఈ సమస్యను పరిష్కరించకుండా నానుస్తుండటంతో విసిగిపోయిన నేతలు రాజీనామా పర్వానికి తెరలేపారు. అయితే ఈ రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఇది మరో డ్రామాగా మిగిలిపోనుందని తెలుస్తోంది. పశ్చిమగోదావరి , సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ రోడ్డెక్కుతున్నారు. గత వారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చిన సందర్భంలో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో ఎంపీ వర్గం రాజీనామాలు చేస్తామని బెదిరించింది. వారితో మాట్లాడుతున్న మరో మంత్రి పితాని సత్యనారాయణ సహనం కోల్పోయి చేతనైంది చేసుకోండనడంతో వివాదం ముదిరింది. ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయాలన్న ప్రయత్నానికి పీతల సుజాత వర్గం కలిసి రాలేదు. దీంతో కామవరపుకోట, చింతలపూడి జెడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, తాళ్లూరి రాధారాణితో పాటు చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాలకు చెందిన 17 మంది ఎంపీటీసీలు తమ రాజీనామా లేఖలను జెడ్పీ సీఈవోకి సమర్పించారు. తమను పూర్తిగా విస్మరించడం వల్లే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని ఎంపీ మాగంటి బాబు వర్గం చెబుతోంది. తమకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని, పనులు కాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. ఇనన్ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇరువర్గాలను కూర్చుని చర్చించుకోమని చెప్పడంతో రాత్రి 11 గంటల వరకూ తాము వేచి చూసినా ఎమ్మెల్యే సుజాత రాకపోవడం వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కామవరపుకోట జెడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, చింతలపూడి జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి మీడియాకి తెలిపారు. ఎన్నికలకు కేవలం 13 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చినా తామంతా దగ్గరుండి కష్టపడి గెలిపించామని, ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కావాలని పార్టీ పరువును వీధికి లాగుతున్నారని ఆరోపిస్తున్నారు. -
అయిననూ పోయిరావలె అమరావతికి
♦ పీతలపై అమీతుమీకి సిద్ధమవుతున్న అసమ్మతి నేతలు ♦ చింతలపూడి సెగ్మెంట్లో మాగంటి, పీతల మధ్య వర్గ పోరు ♦ ఆదివారం ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి సమక్షంలో పంచాయితీ చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి నిప్పు రాజుకుంటోంది. వారం రోజుల క్రితం ఏలూరు అతిథి హోటల్లో నాలుగు మండలాల ముఖ్య నేతలతో పాటు నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు సమావేశమై స్థానిక శాసనసభ్యురాలు పీతల సుజాతపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే మరుసటి రోజు జంగారెడ్డిగూడెంలో వీరంతా సమావేశమై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి రావడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫోన్ చేసి ఆదివారం అసమ్మతి నాయకులను అమరావతి రమ్మని సూచించడంతో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ అమరావతికి చేరింది. అమరావతిలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే వారం చింతలపూడిలో జరిగే టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అసంతృప్తులంతా అమీతుమీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏఎంసీ వేదికగా : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరుకు ఏఎంసీ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలన్నీ భర్తీ అయిపోయినా గత మూడున్నర ఏళ్లుగా చింతలపూడి ఏఎంసీ పాలకవర్గం మాత్రం భర్తీ చేయడం లేదు. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తమవర్గానికి చెందిన వ్యక్తికి ఇప్పించుకోవడానికి ఎంపీ మాగంటి బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దానికి సుజాత చెక్ పెట్టడంతో ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే సుజాత వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపధ్యంలోనే సుజాత మంత్రి పదవి పోవడానికి జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గ నేతల ప్రమేయం ఉందనేది పీతల వర్గం ఆరోపణ. ఆమె మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఎంపీ మాగంటితో పాటు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సుజాత నియోజకవర్గంలో వేలు పెట్టడమేకాక, అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుకు ఫిర్యాదులు చేయడం వల్లనే మంత్రి పదవికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని సుజాత వర్గం గుర్తుచేస్తోంది. కలుపుకు పోవడం లేదు : ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే సుజాత పార్టీలో అందర్నీ కలుపుకు పోవడం లేదని కేవలం ఒక వర్గాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారని అసంతృప్త నాయకులు ఆరోపిస్తున్నారు. గత జూలైలో జంగారెడ్డిగూడెంలో టీడీపీ అసమ్మతి నాయకులు బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు ప్రగడవరం సమీపంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగా అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గారు. 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవహించిందని అంటున్నారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఇంత వరకు సీరియస్‌గా స్పందిం చలేదు. అసమ్మతి నాయకులు సమావేశం అయిన ప్రతిసారి పాలపొంగుపై నీళ్లు చల్లినట్లు జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అసమ్మతి నాయకులంతా వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా మీటింగులు పెడితే సహించను అంటూ పదేపదే చెప్పే పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నియోజకవర్గంలో ముదిరి పోతున్న వర్గపోరుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చింతలపూడి టీడీపీలో ముదిరిన వివాదం
చింతలపూడి(పశ్చిమగోదావరి): చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. మాజీ మంత్రి పీతల సుజాతకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో తెలుగు తమ్ముళ్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోగా దీనికి నాలుగు మండలాల నుంచి నేతలు హాజరయినట్లు సమాచారం. చింతలపూడి మార్కెట్ కమిటీ భర్తీ కాకుండా సుజాత మూడేళ్లుగా అడ్డుపడుతున్నారని ఎంపీ మాగంటి బాబు వర్గం ఆరోపిస్తోంది. ఆమె తీరుకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు వర్గాల మధ్య ముదిరిన వివాదం ఎక్కడి వరకు వెళుతుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘మాలలను అవమానించిన చంద్రబాబు’
చింతలపూడి: పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించడంపై పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందిన సుజాతను కేబినెట్ నుంచి తప్పించడంపై మాలలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడిలో సోమవారం మాలలు ఆందోళనకు దిగారు. 80 లక్షల మంది మాలలను సీఎం చంద్రబాబు అవమానించారని ఆందోళనకారులు మండి పడ్డారు. 2019 ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
దురుసుగా ప్రవర్తించిన పీతల సుజాత, అనిత
-
దురుసుగా ప్రవర్తించిన పీతల సుజాత, అనిత
అమరావతి: శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది. ఏపీ అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర మంగళవారం గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఎమ్మెల్యేలకు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలపై వేధింపుల అంశంపై మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత...వాళ్లని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, అనిత మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో మీడియా పాయింట్ దద్దరిల్లింది. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే అనిత వెళ్లిపోగా... మంత్రి పీతల సుజాత, కొంతమంది పురుష ఎమ్మెల్యేలతో అక్కడకు వచ్చి వాగ్యుద్ధానికి దిగారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో పీతల సుజాత మైక్‌లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గొడవ పెద్దది కావడంతో మార్షల్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
టీడీపీలో వేడి
రెండేళ్ల అనంతరం తొలిసారి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లిన మంత్రి సుజాత జానంపేట అక్విడెక్ట్‌ను పరిశీలించిన దేవినేని ఉమ ఏలూరు : పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ముంపు మండలాల్లో ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి అధికార పార్టీలో వేడి మొదలైంది. అయితే, అనివార్య కారణాల వల్ల వైఎస్ జగన్ పర్యటన రద్దయ్యింది. తన నియోజకవర్గంలోనే పొగాకు వేలం కేంద్రాలు ఉన్నా ఏనాడూ వాటివైపు కన్నెత్తి చూడని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సోమవారం ఆగమేఘాల మీద రెండు వేలం కేంద్రాలను సందర్శించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందు లకు గురై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నా వారి సమస్యలపై మంత్రి స్పందించలేదు. తాజాగా జగన్మోహన్రెడ్డి వస్తున్నారనే సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుజాత వేలం కేంద్రాలకు వెళ్లారు. వర్జీనియా పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వంద రోజుల్లో వేలం పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ చేయలేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారంటూ వారిపై జాలి చూపించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న పోలవరం కుడికాలువ అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడానికే సమయాన్ని కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడం జగన్మోహనరెడ్డికి ఇష్టం లేదని, అందుకే ముంపు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముంపు మండలాల అభివృద్ధికి రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఆ ప్రాంతంలో కనీస అభివృద్ధి కూడా జరగకపోగా.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు ఇతరత్రా ఏ పథకాలు అందకపోవడంతో వేలేరుపాడు, కుకునూరు మండలాల ప్రజలు అధికార టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి రెండు నెలల క్రితం పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై బురదచల్లే పనిలో రాష్ట్ర మంత్రులు నిమగ్నమయ్యారు. -
పీతల సుజాత తీవ్ర మనస్థాపం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు అవమానం జరిగింది. గురువారం విజయవాడలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దళిత మంత్రి పీతల సుజాత ఫొటో కనిపించలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందారు. దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పీతల సుజాత ... తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవలే జరిగిన బాబూ జగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో కూడా పీతల సుజాతకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. -
ఇందుమతి కుటుంబానికి మంత్రి పీతల పరామర్శ
ఏలూరు : ప్రమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఇందుమతి కుటుంబాన్ని మంత్రి పీతల సుజాత ఆదివారం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పీతల సుజాత పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల మీ కుటుంబాన్ని అదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఇందుమతి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పీతల సుజాత హామీ ఇచ్చారు. చట్టపరంగా నిందితులపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఇందుమతి అనే యువతికి ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నారు. ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకువచ్చాడు. దాంతో ఇందుమతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు సదరు యువకుడిని మందలించారు. ఇందుమతితో చదువు మాన్పించారు. దీంతో ఆగ్రహించన సదరు ప్రేమికుడు .. శనివారం ఇందుమతిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుమతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. -
మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
పంగిడిగూడెంలో సొంత పార్టీ నేతలే అడ్డగింత ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభోత్సవం రసాభాస జంగారెడ్డిగూడెం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఓ వర్గం నేతలు అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ భీష్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోట రమేష్ అనే వ్యక్తి గత నెల 20న తనను అకారణంగా కొట్టాడని, ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కేసు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేత బేతాళ రమేష్ మంత్రి సుజాత దృష్టికి తీసుకెళ్లారు. కోట రమేష్‌కు మరోవర్గం వారు మద్దతు పలుకుతున్నారని బేతాళ రమేష్, అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వద్ద వాపోయాడు. దీనిపై మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంతో బేతాళ రమేష్, అతడి వర్గీయులు తమకు న్యాయం చేసే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ మంత్రిని అడ్డుకున్నారు. దీంతో రెండో వర్గం వారు రంగంలోకి పరస్పర దూషణలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో మంత్రి స్వయంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి అరుపులు, కేకలు వేసుకోవడం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి సుజాత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈ గొడవ పెట్టించారా అంటూ కార్యకర్తలపై మంత్రి మండిపడ్డారు. గొడవ జరుగుతుండగానే మంచినీటి పథకం ప్రారంభాన్ని మమ అనిపించి వెళ్లిపోయారు. ఇసుక తరలింపునకు సంబంధించి అధికారపార్టీ నేతలైన బేతాళ రమేష్, కోట రమేష్‌ల మధ్య లావేదేవీల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం. -
ఎమ్మెల్యేకు మంత్రి పీతల ఝలక్
డ్రెయిన్ గట్టు తవ్వకాన్ని అడ్డుకున్న పీతల సుజాత మంత్రిపై మండిపడుతున్న భీమవరం ఎమ్మెల్యే భీమవరం : భీమవరంలో ఇళ్లస్థలాల పూడిక వ్యవహరంలో అడ్డగోలుగా తవ్వుతున్న గొంతేరు డ్రెయిన్ గట్టు తవ్వకానికి మంత్రి పీతల సుజాత అడ్డుకట్ట వేశారు. దీంతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తలకు బొప్పికట్టింది. ఈనెల 17న ‘గట్టు కీడు తలపెట్టెనోయ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి మంత్రి సుజాత స్పందించారు. దీంతో డ్రెయిన్ గట్టు తవ్వకం పనులను తక్షణం నిలిపివేయాలంటూ జలవనరుల శాఖ అధికారులకు ఆదివారం మౌఖిక దేశాలు ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించడానికి గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో 82 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన పులపర్తి రామాంజనేయులు ఏడేళ్ల అనంతరం ఆ భూమి పూడికతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్పలో సేకరించిన మరో 16 ఎకరాల భూమి పూడిక పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పూడికకు సీఏడీ భూముల్లో అక్రమంగా తవ్వుతున్న చెరువుల్లోని మట్టి, యనమదుర్రు, గొంతేరు డ్రెయిన్ గట్ల మట్టిని తవ్వి తర లిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో డ్రెయిన్లలో పూడిక తీసి ఆ మట్టిని గట్లుపై వేశారు. అయితే ప్రస్తుతం ఇళ్లస్థలాల పూడికకు డ్రెయిన్ల గట్ల మట్టిని తవ్వడం వల్ల భవిష్యత్తులో గట్లు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, సమీప ఇళ్లకు వరద ముప్పు పొంచి ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రెయిన్స్‌లో గుర్రపుడెక్క, తూడు కుళ్లిన మట్టితో స్థలాలను పూడ్చడం వల్ల పునాధి ఏ మేరకు పటిష్టంగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. స్థానికుల గోడును ‘సాక్షి’ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చింది. ఇదే తరుణంలో వీరవాసరం మండలంలోని డ్రెయిన్ మట్టి తరలింపును, సమస్యను అక్కడి ప్రజలు రాష్ట్రమంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సొంత మండలం కావడంతో వెంటనే స్పందించి డ్రెయిన్ గట్ల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. ఈ విషయం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దృష్టికి వెళ్లడంతో మంత్రి జోక్యంపై తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లస్థలాల పూడిక చేపడితే అభివృద్ధిని స్వయంగా మంత్రే అడ్డుకుంటున్నారని మండిపడినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి సొంత మండలమైన వీరవాసరంలో సుజాతకు ఎటువంటి విషయాలు తెలియచేయకుండా ఎమ్మెల్యే వ్యవహారాలు చేస్తున్నారని, గతంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్న సమయంలో డ్రెయిన్ల గట్టు తవ్వకం తాజాగా కొత్త వివాదానికి దారితీసిందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
'రాష్ట్రం కష్టాల్లో ఉన్నా జీతాలు పెంచాం'
విశాఖపట్నం : రాష్ట్రం కష్టాల్లో ఉన్నా అంగన్ వాడీల జీతాలు పెంచి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని మంత్రి పీతల సుజాత అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీతాల పెంపు వల్ల ఏడాదికి రూ.710కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. లక్షా నాలుగు వేల మంది ఉద్యోగులకు జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. నిజానికి కేంద్రం ఇస్తున్న వాటా భారీగా తగ్గించినా ఉద్యోగులకు మేలు చేయాలని జీతాలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అంగన్ వాడీ ఉద్యోగులు.. గర్భిణీలు, పిల్లలకు మంచి ఆహారం అందించి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. -
బాక్సైట్ అంటే ఏంటమ్మా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడిగిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలంతా బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్థానిక గిరిజనులు దీనిపై ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు బాక్సైట్ అంటే ఏమిటో తెలియక పోవడం విచిత్రం. బాక్సైట్ అంటే ఏమిటో ఓ ఎమ్మెల్యేను అడిగి మంత్రి తెలుసుకోవడం తాజాగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో చెప్పారు. బాక్సైట్ అంటే ఏంటమ్మా అని మంత్రి పీతల సుజాత తనను అడిగారని తెలిపారు. సొంత శాఖకు సంబంధించిన విషయం గురించి తెలియని మంత్రులు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రగులుతూంటే సంబంధిత మంత్రికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా
హైదరాబాద్ : విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. గరువారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పీతల సుజాత మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలు చేయడం లేదని తెలిపారు. బాక్సైట్ అనుమతులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవని ఆమె వెల్లడించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు కాల్ మనీ - సెక్స్ రాకెట్‌పై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. -
టీడీపీలో 'వర్ణ వివక్ష'!
దళిత, గిరిజన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లపై కక్ష చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో మాగంటి పెత్తనంపై టీడీపీ వర్గాల్లో అసహనం పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట నేడు పంచాయితీ! ఏలూరు : తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయి. జిల్లాలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు వర్ణ వివక్షకు గురవుతున్నారు. వివక్షను తట్టుకోలేకపోతున్న ఆయా సామాజిక వర్గాల నేతలు ఇటీవల చోటుచోసుకున్న ఘటనలను మంగళవారం జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, ఎస్టీ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కక్షపూరిత రాజకీయాలు నెరపుతున్నారనేది ఆయావర్గాల ప్రధాన ఆరోపణ. ఆ ఇద్దరే ఎందుకు ఎంపీగా మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూ రు లోక్‌సభ నియోజకవర్గ పరధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారాల జోలికి పోని ఎంపీ మాగంటి చీటికీమాటికీ చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పాలన, పార్టీ వ్యవరాహాల్లో తలదూరుస్తుంటారన్న ఆరోపణ బలంగా ఉంది. మూడురోజుల క్రితం కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎంపీ మాగంటి బాబు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను పొగుడుతూ.. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను విమర్శించడం కలకలం రేపుతోంది. గిరిజన ఎమ్మెల్యే కాబట్టే మొడియం శ్రీనివాస్‌ను ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొడియంతో కయ్యం ఎక్కడ మొదలైందంటే.. ఎంపీ మాగంటి ఆధిపత్య భావజాలాన్ని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మొదట్లో భరించినా క్రమంగా ఎదురు తిరుగుతూ వచ్చారు. దీంతో ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి ఆ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పెత్తనం మొదలుపెట్టారు. సబ్స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో ఎమ్మె ల్యే సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు రాకుండా ఎంపీ అడ్డుపడ్డారన్న వాదనలు ఉన్నాయి. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే ఆదాయం వాటాల్లోనూ ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరలేదని సమాచారం. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రూ.కోట్లు విలువైన పనులను ఎమ్మె ల్యే వర్గీయులే చేజిక్కించుకోవడంతో ఎంపీ వర్గీయులకు మింగుడు పడలేదు. మొత్తంగా ఎమ్మెల్యే మొడియం తనను లెక్కచేయడం లేదని అసహనం ప్రదర్శించిన ఎంపీ మాగంటి గత శనివారం కన్నాపురంలో ఎమ్మెల్యేపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎంపీ చేసిన వ్యాఖలపై గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు ఆందోళన చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఎంపీ వ్యవహారాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళదా మని మొడియం వర్గీయులు చెప్పడంతో గిరిజన నేతలు ఆ ప్రతిపాదన విరమించారు. మంత్రి సుజాత ఇలాకాలో.. జిల్లాకు చెందిన మహిళా మంత్రి పీతల సుజాత ప్రాతి నిధ్యం వహిస్తున్న చింతలపూడిలోనూ ఎంపీ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణ బలంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక పూర్తయి నెలలు కావస్తుండగా, ఇప్పటికీ చింతలపూడిలో మాత్రం పూర్తికాలేదు. కేవలం ఎంపీ మాగం టి అడ్డుపడటంతోనే ఎంపిక ఆగిందనేది నియోజకవర్గంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పీతల సుజాత తన వర్గానికి చెందిన చిన్నంశెట్టి సీతారామయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని భావించగా, మాగంటి బాబు వర్గీయులు కామవరపుకోటకు చెందిన కోనేరు సుబ్బారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం ఎటూతేలక పెండింగ్ పడింది. చింతలపూడి నియోజకవర్గంలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లోనూ మంత్రి పీతల సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా ఎంపీ వర్గం అడ్డుపడిందన్న వాదనలున్నాయి. కనీసం మహిళా మంత్రి అనే కనికరం కూడా లేకుండా తమ నేతను మాగంటి చిన్నచూపు చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని సుజాత వర్గీయులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొడియం శ్రీనివాస్ వర్గీయులతో కలిసి ఎంపీ మాగంటి వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి వర్గీయులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
మంత్రి పీతల యాత్ర.. పోలీసుల యాతన
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత జన చైతన్యయాత్రలో భాగంగా చేసిన మోటార్ సైకిల్ ర్యాలీ పోలీసులకు, గన్మన్లకు ఇబ్బందిగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం మంత్రి జన చైతన్యయాత్రలో పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్, పాతబస్టాండ్, గంగానమ్మ గుడిసెంటర్, కొత్తబస్టాండ్, బోసుబొమ్మసెంటర్, జేపీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్మన్లు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరిగెడుతూ తూలి పడిపోయారు. వెనుక వచ్చిన మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు. -
ప్రజలు తిరగబడి కొడతారనే..
-
'ప్రజా సమస్యలపై చర్చించడం లేదు'
-
'ప్రజా సమస్యలపై చర్చించడం లేదు'
హైదరాబాద్: గత ఐదు రోజులుగా శాసనసభా జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత అన్నారు. శాసనసభలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ... ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇరికించారని ఆరోపించారు. అవినీతి అంతానికి కంకణం కట్టుకున్న చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించి వేయగల -
అంగన్వాడీల జీతాల పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ సిబ్బందికి వేతనాలను పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రెండో భేటీలో వేతనాల పెంపునకు అంగీకరించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత పాల్గొన్నారు. అంగన్వాడీ జీతాల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గానికి సిఫారసు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 257 అంగన్వాడీ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు మొత్తం 1,04,377 మంది ఉన్నారు. వీరికి ఏడాదికి జీతాల కింద రూ.406 కోట్లు కేటాయిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్‌కు నెలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద చెల్లిస్తున్న రూ.4,200కు బదులు రూ.7,100 అందించాలని, హెల్పర్‌కు రూ.2,400కు బదులు రూ.4,600 చెల్లించాలని నిర్ణయించారు. మినీ అంగన్వాడీ వర్కర్లకు నెలకు రూ.2,950కు బదులు రూ.4,600 చెల్లించాలని సిఫార్సు చేయనున్నారు. పెరిగిన వేతనాల ప్రకారం ఏడాదికి రూ.317 కోట్లు ఆర్ధిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అంగన్వాడీలకు సెప్టెంబరు నెల నుంచి కొత్త వేతనాలు అమలయ్యేలా చూస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత పేర్కొన్నారు. సమావేశం అనంతరం సచివాలయంలో మీడియా పాయింట్లో మంత్రులిద్దరు వివరించారు. అంగన్వాడీల సమస్యలన్నింటిపై చర్చించామని, పదవీ విరమణ తర్వాత అందే ప్రయోజనాల్ని వారి పనితీరు ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అంగన్వాడీల జీతాలను పెంచామన్నారు. -
పీతల సుజాతకు చేదు అనుభవం
-
అవినీతి సుడిలో సుజాత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర గనులు.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మళ్లీ అవినీతి సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇంటి ఆవరణలో నోట్ల కట్టల వ్యవహారం వెలుగు చూడగా.. నాలుగు రోజులు ఉక్కిరిబిక్కిరై ఎలాగోలా బయటపడిన మంత్రి సుజాతకు ఇప్పుడు విజయవాడలోని సొంత శాఖ ఉద్యోగి నుంచే మరో ఉపద్రవం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది. ఆ లంచం తన కోసం తీసుకోలేదని, మంత్రి పీతల ఖర్చుల కోసమే వసూలు చేస్తున్నానని ఆమె ఏసీబీ అధికారుల విచారణలో చెప్పడం, మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన డైరీని ఏసీబీ అధికారులకు అందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మంత్రి సుజాత విజయవాడ వచ్చినప్పుడల్లా స్టార్ హొఇటల్స్లో బస ఏర్పాటు చేయాల్సి వస్తోందని.. ఆమెతోపాటు వచ్చే కుటుంబ సభ్యులకు, మందీమార్బలానికి వాహనాలతోపాటు ఖరీదైన విందులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించేవారని విచారణలో జెస్సీ ఏసీబీ అధికారులకు మొరపెట్టుకుంది. ఆ ఖర్చుల కోసమే తాను లంచం తీసుకుంటున్నానని ఆమె ఆరోపించడంతోఅవాక్కైన అధికారులు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోవాలని సూచించినట్టు తెలిసింది. కోర్టులో అదే వాంగ్మూలం ఇస్తే.. మంత్రి పీతల సుజాత ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానని జెస్సీ కోర్టులో వాంగ్మూలం ఇస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏసీబీ అధికారులు డైరీని స్వాధీనం చేసుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కాగా, జెస్సీ ఉదంతంపై మంత్రి పీతల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి చింతలపూడి, వీరవాసరం, ఏలూరులకు వచ్చివెళ్లే సందర్భంలో ఎప్పుడైనా విజయవాడలో బస కోసం ఆగినప్పుడు సంబంధిత శాఖ డీడీకి ఫోన్ చేస్తాం గానీ ఉద్యోగులతో నేరుగా ప్రొటోకాల్ విషయాలు ఎలా మాట్లాడతామని ఆమె వాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీతల మౌనం ఎలా ఉన్నా తాజాగా జెస్సీ ఆరోపణల వ్యవహారం ఎటుతిరిగి ఎటు వస్తుందోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా
- ఏసీబీకి చిక్కిన ఉద్యోగి వెల్లడి విజయవాడ సిటీ: రాష్ట్ర మంత్రి పీతల సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి, ఆమె కుటుంబ సభ్యుల ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానంటూ ఏసీబీకి పట్టుబడిన ఒక మహిళా ఉద్యోగి చెప్పడం కలకలం రేపింది. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా మహిళా, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ లంచం తన కోసం కాదని, మంత్రి పీతల ఖర్చుల కోసం వసూలుచేస్తున్నానంటూ ఏసీబీ విచారణలో చెప్పినట్లు సమాచారం. పైగా మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన ఒక డైరీని ఏసీబీ అధికారులకు చూపించారు. మంత్రి ఖర్చుల వివరాల డైరీని స్వాధీనం చేసుకుని, ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచారు. -
టీడీపీలో ఒంటరిగా మిగిలిపోయిన పీతల!
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ...టీడీపీ పార్టీలో ఒంటరి అయ్యారు. నోట్ల కట్ల వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పెదవి విప్పటం లేదు. ఈ విషయంలో పీతల సుజాతకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు వెనకంజు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పీతల సుజాత ఎపిసోడ్‌పై చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందో అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా నోట్ల కట్టల వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. మంత్రి పీతల సుజాత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మంత్రి తండ్రి బాబ్జీ సొమ్ము తీసుకుంటుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం గుర్తించే నోట్ల కట్టలను బయటకు విసిరేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హడావుడి తర్వతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఎపిసోడ్లో సొంత పార్టీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబుకు పార్టీనేతలే సీడీ పంపించారనే ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి నోట్ల కట్టల వ్యవహారం జిల్లాలో టీడీపీకి తలనొప్పిగా మారటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేపట్టారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఒప్పందం మేరకు డబ్బు అందజేసేందుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు. -
అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతల
* ఏపీ మంత్రి సుజాత ఇంట్లో నోట్ల కట్టల కలకలం * కుమార్తె ఉద్యోగం కోసం రూ.10 లక్షలిచ్చేందుకు వచ్చిన మహిళ * మంత్రి తండ్రి సొమ్ము తీసుకుంటుండగా సెల్లో చిత్రీకరణ * ఆ విషయం గుర్తించి... కట్టలు బయటకు విసిరివేత సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాబు వస్తే జాబు వస్తుందన్నారు. బాబు వచ్చి ఏడాదైనా నిరుద్యోగులకు జాబులు మాత్రం రాలేదు.వచ్చే ఒకటి రెండు సర్కారీ పోస్టులను తెలుగుదేశం నేతలు తెగనమ్ముకుంటున్నారు. డీఎస్సీ ఉద్యోగం కోసం ఓ మహిళ రూ.10 లక్షల నగదు తీసుకుని మహిళా, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఇంటికి వెళ్లడం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడే డబ్బు కట్టలు వదిలివేసి వెళ్లడం టీడీపీ నేతల బరితెగింపునకు అద్దం పట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఐదు కోట్లతో ఓ ఎమ్మెల్యే ఓటు కొనేందుకు ప్రయత్నించి జైలుపాలైన ఉదంతం మరవకముందే ఏపీ మంత్రి ఇంట్లో బయటపడ్డ నోట్లకట్టల వ్యవహారం తాజాగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించుకోవాలని విష్ణువతి సంకల్పించుకున్నారు. గతం లో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహసంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుం టారు. ఒప్పందంమేరకు డబ్బు అందజేసేం దుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు. పోలీసులకు ఫోన్ చేసి ఎవరో మతిస్థిమితం లేని మహి ళ డబ్బు కట్టలతో తమ ఇంట్లోకి వచ్చిందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుని... తమ ఇంటి వాకిట్లో డబ్బు సంచి పడి ఉందని తమ వ్యక్తిగత సహాయకుడు చికిలే సుబ్బారావుతో ఫిర్యాదు ఇప్పిం చారు. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి చేరుకున్న మంత్రి పీతల నేరుగా జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఫోన్‌చేసి విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. మంగళవారం పొద్దుపోయాక వెలుగుచూసిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. -
మంత్రి ఇంట్లో లక్షలు.. పొంతన లేని మాటలు
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన రూ. 10 లక్షల సొమ్ము విషయంలో అందరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మంత్రి ప్రకటనకు, డబ్బు తెచ్చిన మహిళ ప్రకటనకు తేడా కనిపిస్తోంది. డబ్బులు తెచ్చిన అద్దాల విష్ణువతి అనే మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె మాటలకు, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి చెప్పే మాటలకు కూడా సంబంధం ఉండట్లేదు. తన కుమార్తెకు టీచర్ ఉద్యోగం ఇప్పించాలని ఆమె అడిగిందని, అయితే తమ వాళ్లు కష్టపడి చదువుకోవాలని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారని మంత్రి సుజాత అన్నారు. కూరగాయల సంచి ఒకదాన్ని ఆమె అక్కడ పెట్టి వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, తన తమ్ముడి కూతురు పెళ్లి కోసం పాలకొల్లు స్టేట్ బ్యాంకులో డబ్బులు దాచానని, దాన్ని తీసుకుని మంత్రి సుజాత తండ్రిని కలిసేందుకు వచ్చానని అద్దాల విష్ణువతి పోలీసుల విచారణలో తెలిపారు. అప్పుడే డబ్బు సంచి మర్చిపోయి వెళ్లానన్నారు. కానీ ఆమె కుమార్తె చెప్పే విషయం వేరేలా ఉంది. భూమి కొనుగోలు కోసం పాలకొల్లు బ్యాంకు నుంచి 10 లక్షలు డ్రా చేసినట్లు శ్రీలక్ష్మి చెప్పారు. తన తల్లి ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం తీసుకెళ్లారని, తర్వాత మంత్రిని కలిసేందుకు వెళ్లి అక్కడ నగదు మర్చిపోయిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాలకొల్లు స్టేట్ బ్యాంకు నుంచి మంగళవారమే నగదు డ్రా చేసినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. 10 లక్షల నగదు లావాదేవీపై ఆదాయపన్ను శాఖ సాయం కూడా తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం విష్ణువతిని, ఆమె కుమార్తె శ్రీలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. -
రేవంత్.. సుజాత.. డబ్బు కట్టలు!
టీడీపీ నాయకులు 'కట్ట'ల పాములతో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. 'ముడుపు' కట్టి మురికి రాజకీయాలకు పాల్పడుతున్నారు. అడ్డంగా దొరికిపోయినా మీసాలు మెలేసి నిసిగ్గుగా సవాళ్లు విసురుతున్నారు. తామేం తక్కువ తినలేదని తెలుగు మహిళా పోటీ పడుతుండడం విస్తుగొల్పుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ నాయకులు కరెన్సీ కట్టలతో వార్తల్లో నిలిచారు. ఓటుకు నోటు ఇస్తూ ఒకరు దొరికిపోగా... 'పోస్టుకు నోటు'లో మరొకరు ఇరుక్కున్నారు. ప్రత్యర్థులపై కయ్యిమంటూ లేచే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను నిలువునా కొంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బాస్ ఆదేశానుసారం చీకటి వ్యవహారం జరిపి చిక్కుల్లోపడ్డారు. చేసిన పాడు పనికి పశ్చాత్తాప పడకుండా కేసీఆర్ ను గద్దె దించుతానంటూ మీసం మెలేశారు. అయ్యగారి బాగోతాన్ని ఏసీబీ దృశ్యశ్రవణ సహితంగా విడుదల చేయడంతో సైలెంట్ అయిపోయారు. తర్వాత ప్లేటు ఫిరాయించారు. కుట్ర చేసి తనను ఇరికించారని కొత్త పల్లవి అందుకున్నారు. ప్రలోభాల పర్వంలో పండిపోయిన 'బాస్'కు ముడుపుల వ్యవహారం బట్టబయలు కావడం తలనొప్పిగా మారింది. 'అలా ఎలా ఇరుక్కున్నాడు. ట్రాప్ అని ఆమాత్రం గుర్తించలేకపోయాడా' అంటూ కేబినెట్లో కయ్యిమన్నారని మీడియాలో వార్తలు షికారు చేశాయి. తన 'కుడిభుజం' కారాగారం పాలవడంతో ఖంగుతిన్న 'బాస్' తన పేరు బయటకు రాకుండా చూసేందుకు నమ్మినబంటులతో చర్లపల్లికి రాయబారం పంపారు. బాస్ పేరు లీక్ అయితే ఆయన సీఎం సీటుకు ఎసరు వస్తుందని, నోరు విప్పకుండా ఉంటే భవిష్యత్ లో 'బాగా' చూసుకుంటారని బాస్ మాటగా రేవంత్ చెవిన వేసినట్టు సమాచారం. తెలంగాణలో పడ్డ మచ్చ చెరిగిపోక ముందే ఏపీ మంత్రి పీతల సుజాత ఇంట్లో బయటపడిన రూ. 10 లక్షల నోట్ల కట్టలు 'పచ్చ' పార్టీలో కలకలం రేపాయి. తనకేం సంబంధం లేదని చెబుతూనే మహిళా మంత్రి పలు అనుమానాలు రేకిత్తించారు. టీచర్ పోస్టు కోసం తనింటికి వచ్చిన ఓ మహిళ ఈ భారీ మొత్తం తెచ్చిందని తెలిపారు. డబ్బుకు టీచర్ పోస్టు ఇప్పించమంటే కుదరదని చెప్పామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి టీచర్ల పోస్టులతో ఏం పని అన్న ప్రశ్నకు సుజాత నుంచి సమాధానం లేదు. 'కట్ట'ల పాము తన మెడకు చుట్టుకోవడంతో వదిలించుకోవడానికి మంత్రి తంటాలు పడుతున్నారు. ఇదిలావుంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో 'అవినీతి లేని రాష్టాన్ని నిర్మించుకుందాం' అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించడం కొసమెరుపు. -
పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ
ఏలూరు : బ్యాగ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలో మంత్రి పీతల సుజాత తండ్రిని కూడా విచారణ జరిపినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన బుధవారమిక్కడ చెప్పారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని, పీతల సుజాత హౌస్ కీపర్ చిల్లి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 102 సీఆర్పీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. బ్యాగ్‌లో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖపై ఎటువంటి ఒత్తిడి లేదని, నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం పాలకొల్లు ఎస్బీఐ బ్యాంకు నుంచి మంగళవారం నగదు డ్రా చేసినట్టు భూషణ్ తెలిపారు. రూ. 10 లక్షల నగదు లావాదేవీపై ఆదాయపన్నున శాఖ సాయం కూడా తీసుకుంటామన్నారు. అద్దాల విష్టువతి, శ్రీలక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. -
మంత్రి తండ్రిని కలవడానికి వచ్చా: అద్దాల విష్ణువతి
ఏలూరు: ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని పీతల సుజాత తండ్రి బాబ్జీ నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళ వదిలి వెళ్లిన నగదు బ్యాగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర స్త్రీ శిశు, గనుల శాఖామంత్రి పీతల సుజాత తెలిపారు. తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతి స్ధిమితం లేనట్టుందని.. పది లక్షలు రూపాయిలు ఎందుకు తీసుకొచ్చిందో తనకు తెలియదని ఆమె అన్నారు. ఆ మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనన్నారు. మరోవైపు మంత్రి తండ్రిని కలవడానికి వచ్చినట్లు రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ అద్దాల విష్ణువతి చెప్పటం విశేషం. తన తమ్ముడి కుమార్తె పెళ్లి కోసం డబ్బులను పాలకొల్లు ఎస్బీఐలో డ్రా చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ఆ డబ్బుల బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లినట్లు అద్దాల విష్ణువతి తెలిపింది. అయితే విష్టువతి కుమార్తె మాత్రం భూమి కొనుగోలు కోసం పాలకొల్లు ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ. 10 లక్షలు డ్రా చేసినట్టు చెప్తుతోంది. ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం విష్టువతి తీసుకెళ్లినట్టు శ్రీలక్ష్మీ తెలిపింది. మంత్రిని కలవడానికి వెళ్లిన తన తల్లి డబ్బు సంచిని మర్చిపోయిందని ఆమె చెప్పింది. టీవీలో వచ్చిన వార్తలను చూసి డబ్బు సంచిని వదిలిలేసినట్టు గుర్తుకు వచ్చిందని శ్రీలక్ష్మీ తెలిపింది. -
మంత్రి ఇంటికి ఎవరైనా, ఎలాగైనా రావచ్చా?
*మంత్రి ఇంటికి ఎవరైనా, ఎలాగైనా రావచ్చా? *మంత్రి ఇంటికి వచ్చేవారికి సెక్యూరిటీ చెకింగ్ ఉండదా ? *వచ్చేవారు బ్యాగులతో వస్తే.. నేరుగా ఇంట్లోకి పంపేస్తారా ? *బ్యాగులో డబ్బు కాకుండా ఇంకేమైనా ఉంటే పరిస్థితి ఏమిటి ? *మతి స్థిమితం లేని మహిళకు డబ్బులు తనవే అని ఎలా తెలుస్తుంది ? *మతిస్థిమితం లేని మహిళ మాటలకు విలువేంటి ? *నిన్న డబ్బుపోతే ఇప్పటివరకూ ఆ మహిళ సైలెంట్‌గా ఎందుకుంది ? * ఇంతకీ ఆ మహిళ కూతురిదేనా డీఎస్సీ హాల్‌టికెట్ ? *డబ్బుల కట్టతో మంత్రి పీతల సుజాతను ఎందుకు కలవబోయింది ? *శిశు సంక్షేమ శాఖ మంత్రికి డీఎస్సీ ఫలితాలకు లింక్ ఏమిటి ? ఏలూరు: టీడీపీ నేతల ఇళ్లల్లో లక్షల రూపాయలు బయట పడుతున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతుండగానే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా మంత్రి ఇంట్లోనే లక్షల రూపాయలతో కూడిన సంచి కనిపించింది. ఏపీలో డీఎస్సీ ఫలితాలు వచ్చిన రోజే మంత్రి ఇంటి ఆవరణలో డబ్బుల సంచి కనిపించడం ఆసక్తి కరంగా మారింది. నిన్న రాత్రి నుంచి ఇంటిలోనే ఉండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న మంత్రి పీతల సుజాత మీడియాలో తనపై వార్తలు రావడంతో ఎట్టకేలకు బుధవారం నోరు విప్పారు. నోట్ల కట్టల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని.. మంత్రి పీతల సుజాత చేతులు దులుపుకున్నారు. ఇదంతా కుట్రలో భాగమని చెప్పుకొచ్చారు. పోలీసు విచారణ అనంతరం అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. తమ ఇంట్లో నగదు బ్యాగ్ వదిలి వెళ్లిన మహిళకు మతి స్థిమితం లేదని మంత్రి చెప్పటం విశేషం. అయితే ఆ మహిళ కుమార్తె మాత్రం.. ఈ వ్యవహారంపై పొంతన లేని సమాధానం చెప్పింది. తన తల్లి.. పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ మంత్రి ఇంటి దగ్గర మర్చిపోయిందని తెలిపింది. మరోవైపు నోట్ల కట్టల ఎపిసోడ్లో కొత్తకొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. డబ్బు తెచ్చిన మహిళ అద్దాల విష్ణువతి మంత్రి ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. ఆమెను పక్కకు తీసుకెళ్లి వివరాలు సేకరించారని తెలిసింది. అనంతరం మంత్రి కూడా ఆమెతో రహస్యంగా మాట్లాడారని సమాచారం. పాలకొల్లు మండలం జున్నూరు గ్రామానికి చెందిన అద్దాల విష్ణువతి.. తన కుమార్తె కోర్నె శ్రీలక్ష్మికి డీఎస్సీలో మార్కులు తక్కువ రావడంతో సిఫార్సు చేసేందుకు వచ్చిందని.. అందుకోసమే పది లక్షలు నగదు తెచ్చిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
బ్యాగ్‌లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే...
ఏలూరు : రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో లభించిన రూ.10 లక్షల నోట్ల కట్టల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తనకేమీ సంబంధం లేదని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కుట్ర జరిగినట్లుగానే తనపై కూడా కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో జరిపించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆమె తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి ఆచితూచి మాట్లాడారు. బ్యాగులో డబ్బు కాకుండా, బాంబు పెడితే తన పరిస్థితి ఏంటని మంత్రి ఎదురు ప్రశ్న వేశారు. తన ఇంటి ఆవరణలో డబ్బు వదిలిన మహిళ ఎవరో తనకు తెలియదని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు. ఆ మహిళకు మతిస్థిమితం లేదని మంత్రి తెలిపారు. ఇక మంత్రి ఇంటి ఆవరణలో డబ్బుల బ్యాగ్ వదిలి పెట్టిన మహిళ పాలకొల్లు మండలం జున్నూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అద్దాల విష్ణువతిగా గుర్తించారు. మరోవైపు అద్దాల విష్ణువతి ఈరోజు ఉదయం మంత్రి నివాసంలో ప్రత్యక్షం కావటం గమనార్హం. వీడియో తీసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా డీఎస్సీ ఫలితాలు వెలువడిన రోజే ఈ సంఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి ఆవరణలో వదిలిన బ్యాగ్‌లో 10 లక్షల నగదుతోపాటు తాడేపల్లిగూడెంకు చెందిన కార్ని శ్రీలక్ష్మి అనే యువతికి చెందిన డీఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. దాంతో టీచర్ పోస్ట్ కోసం పైరవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టీడీపీ మంత్రి ఇంటి వద్ద నోట్లకట్టల బ్యాగు కలకలం
పశ్చిమ గోదావరి: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి.శ్యామ్‌సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి సుజాత ఇంటి కారిడార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాగ్‌ను వదిలి వెళ్లారు. ఈ విషయమై ఆ ఇంట్లో పనిచేస్తున్న చికిలే సుబ్బారావు అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాగులో 10 లక్షల నగదుతోపాటు తాడేపల్లిగూడెంకు చెందిన కార్ని శ్రీలక్ష్మి అనే యువతికి చెందిన డీఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు
-
'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు
రెండుగా వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఏకంగా తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. ఆదివారం మండల టీడీపీ సమావేశానికి హాజరైన మంత్రి పీతల సుజాత తీరును వ్యతిరేకిస్తూ ఓ వర్గానికి చెందినవారు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభసగా మారింది. మంత్రి రాజీనామా చేయాలని, మండలంలో ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దుచేసి కొత్త కమిటీని వేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ క్రమంలోనే జంగారెడ్డి గూడెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నల్ల దుస్తులు కప్పి నిరసన తెలిపారు. విభేదాల సంగతి ఎలా ఉన్నా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం తలపెట్టడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేనెప్పుడూ అహంభావంతో మాట్లాడలేదు
-
రెచ్చిపోయిన అధికారపక్ష సభ్యులు
-
'వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదు'
హైదరాబాద్: ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రాజకీయ దురుద్దేశంతోనే సభను అడ్డుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో సభను సజావుగా జరగనీయకుండా ఆ పార్టీ చూస్తుందని ఆమె విమర్శించారు. విజభన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి జీత భత్యాలు పెంపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశంపై ఆలోచిస్తున్నారని పీతల సుజాత వెల్లడించారు. నగరంలో తమ నిరసన తెలుపుతున్న అంగన్వాడీ ఉద్యోగులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ సభ్యులు శాసనసభలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీపై మంత్రి పీతల సుజాత పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదు'
-
'రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతా'
-
'రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతా'
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులంటే గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంత్రులను ఆమె వేలేత్తి దూషించారని ఆరోపించారు. శాసనసభలో ఆమె వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో సభలో మంత్రి మాట్లాడారు. సభలో రోజా ప్రవర్తనను మహిళా సభ్యులెవరూ సమర్థించరని, ఒకవేళ ఎవరైనా సమర్థిస్తే తాను రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతానని ఆవేశంగా అన్నారు. రోజాను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. నటిగా రోజాను తాను అభిమానిస్తానని చెప్పారు. -
ఎన్టీఆర్ పేరుందని కొడుకుని వదులుకుంటారా?
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎన్టీఆర్ పై అభిమానంతో తన కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు పేరు మారుస్తారా లేదా ఎన్టీఆర్ పేరుందని కుమారుడిని వదులుకుంటారా అని ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కుపెట్టినందుకు తెలుగుజాతి గర్వపడాలని ఏపీ బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
స్కిన్నెరపురం (అత్తిలి) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మండలంలో స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల్లో బుధవారం జన్మభూమి-మా ఊరు సభ జరిగింది. స్కిన్నెరపురంలో జరిగిన సభకు మంత్రి సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో రెండు, మూడు రోజుల్లో ఇసుక సమస్య తీరుతుందన్నారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయని, భవిష్యత్ అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం వేదికగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, ఐఎస్ఎల్ నిర్మాణానికి రూ.12 వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలను భాగస్వాములు చేసి, పేదరికాన్ని జయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. గర్భిణులకు సీమంతం చేసి, సారెను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దిరిశాల భీమరాజు, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్‌లు వనుం రామ కనకదుర్గ, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రికి వడ్డాణం గిప్ట్, బాబు సీరియస్!
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలే ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకగా ఇచ్చినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోదరుడు...దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరా బహుమతులు తీసుకోలేదని....ఆ వడ్డాణం కథతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా తనపై సాగుతున్న దుష్ప్రచారమని పీతల సుజాత ఆరోపించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఎలాంటి వివరణ కోరలేదని ఆమె తెలిపారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని అయితే వారు తనకు ఎలాంటి గిప్ట్‌లు ఇవ్వలేదన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
కాళ్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు వేటుకూరి శివ, కలెక్టర్ కె.భాస్కర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. మోడి గ్రామంలో హెలిఫాడ్, కలవపూడి హైస్కూల్ ప్రాంగణంలో సభా వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశా రు. శనివారం ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్‌లో మోడి గ్రామానికి వస్తారు. అక్కడ ఆయన మొగదిండి స్ట్రయిట్ కట్ డ్రెయిన్‌లో కిక్కిస కోసే యంత్రాన్ని ప్రా రంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కలవపూడి హైస్కూ ల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ నీరు-చెట్టు, స్వచ్ఛభారత్, పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొం టారు. అనంతరం పశువుల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మోడల్ స్కూల్‌గా ఎంపికైన కలవపూడి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శిస్తారు. హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. సభ అనంతరం మోడీ నుంచి హెలికాఫ్టర్‌లో పాలకొల్లు నియోజకవర్గ పర్యటనకు వెళతారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఎస్పీ కె.రఘురామిరెడ్డి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. 17 మంది డీఎస్పీలు, 49 మంది సీఐలు, 116 మంది ఎస్సైలు, 185 మంది ఏఎస్సైలు, 300 హెడ్ కానిస్టేబుళ్లు, 830 మంది కానిస్టేబుళ్లు, ఉమెన్ హెడ్ కానిస్టేబుళ్లు 100 మంది, స్పెషల్ పార్టీ 8 మంది, ఏఎఆర్ ప్లాటిన్లు 6, 30 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కలిపి మొత్తం 1500 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామనిఎస్పీ తెలిపారు. దొడ్డిపట్లలో ఏర్పాట్లు పూర్తి దొడ్డిపట్ల (యలమంచిలి) : దొడ్డిపట్లలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పరిశీలించారు. సీఎం పర్యటనకు దొడ్డిపట్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మంత్రి పీతల సుజాతతో పాటు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత విలేకరులతో మాట్లాడుతూ పేదరికంపై గెలుపే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రవాస భారతీయులను జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ద్వారా ఉత్తేజపరచి గ్రామాల్లో వారి సేవలను వినియోగించాలనే ధ్యేయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. హుదూద్ తుపాను కారణంగా జన్మభూమి కార్యక్రమం వాయిదా పడడంతో గత నెలలో పింఛన్లు ఇవ్వలేని వారికి ఈ నెలలో రెండు నెలల పింఛన్లు కలిపి ఇస్తామన్నారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ గత నెలలో గ్రామ కమిటీలు నుంచి వచ్చిన పింఛన్ అర్జీలలో 45 వేల మందికి ఈ నెల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా తరలిరావాలని కోరారు. సీఎం ఇలపకుర్రు హైస్కూల్ గ్రౌండ్లో హెలికాఫ్టర్ దిగి అక్కడి నుంచి ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరపాలెంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. దొడ్డిపట్లలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డిపట్ల హైస్కూల్ గ్రౌండ్లో జరిగే జన్మభూమి-మా ఊరు సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు. -
పారదర్శకంగా మైనింగ్ లీజులు
జంగారెడ్డిగూడెం రూరల్ : రాష్ట్రంలో మైనింగ్ లీజులను పారదర్శకంగా కేటాయిస్తామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. నవంబర్ 1 నుంచి మైనింగ్ లీజులకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇసుక రీచ్‌లు ప్రారంభించనున్నామని తెలిపారు. మైనింగ్ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందని, దీంతో ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇసుక రీచ్‌ల ద్వారా డ్వాక్రా మహిళలకు ఆదాయం చేకూరేలా అనుమతులు జారీ చేయనున్నట్టు తెలిపారు. జియోట్యాగింగ్, జీపీఎస్ సిస్టం ద్వారా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో వాటా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నారని, తమ రాష్ట్రానికి చెందినవన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మండల లక్ష్మణరావు, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 6 గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. రూ.95 లక్షలతో విద్యుదీకరణ పనులను చెపట్టినట్టు తెలిపారు. అన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఏలూరు జెడ్పీ అతిథి గృహంలో పలువురు గిరిజనులు మంత్రిని కలిసి ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆమె మాట్లాడుతూ తొలుత 6 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో జిల్లా ప్రజలు ముందున్నారన్నారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, ఉత్తరాంధ్రకు పంపించారన్నారు. -
పూర్తిస్థాయిలో తగ్గేవరకు పునరావాసం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆదివారం విస్తృతంగా పర్యటించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. తుపాను పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు భోజన సౌకర్యం కల్పించాలని సుజాత అధికారులను ఆదేశించారు. ఆదివారం తుపాను ప్రభావిత గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, కేపీ పాలెం, పేరుపాలెం ఏటిమొండి తదితర ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో నీరు ఇళ్లలోకి ప్రవేశించిందని, అటువంటి వారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో పకృతి వైపరీత్యాల సమయంలో నష్టాల నివారణకు శాశ్వత పరిష్కారంగా కోస్టల్ కారిడార్, నరసాపురంలో పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తుపాను అనంతరం గ్రామాలన్నింటిలోనూ పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని, వైద్యశిభిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు కలిగిన నష్టాలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తుపాను పూర్తిగా తగ్గేంత వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆర్డీవో పుష్పమణి, జిల్లాపరిషత్ సీఈవో ద్వారంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీలు బాలం ప్రతాప్, గుబ్బల నాగరాజు, మైల వీర్రాజు, ఎంపీడీవో యన్వీ శివప్రసాద్‌యాదవ్, తహసిల్దార్లు ఎస్ బ్రహ్మానందం, హరనాథ్ పాల్గొన్నారు. కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం లింగపాలెం : పకృతి వైపరీత్యాలను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి సుజాత తెలిపారు. ధర్మాజీగూడెంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కారిడార్ వల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ముందస్తు చర్యలను మరింత పటిష్టవంతంగా తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో 24 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 8,500 మందికి సహాయక చర్యలు అందించినట్టు చెప్పారు. -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సుజాత
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పీతల సుజాత వెల్లడించారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో శనివారం నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ... 14 ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
పశివేదల (కొవ్వూరు రూరల్) : ఏనమ్మకంతో ప్రజలు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పశివేదలలో గురువారం నిర్వహించిన జన్మభూమి మాఊరు గ్రామసభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న స్వచ్ఛా భారత్, స్వచ్ఛా అంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్టీఆర్ సుజల పథకాన్ని కొనసాగిస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఎన్నికల హామీలలో ఇప్పటికే పింఛన్ల పెంపు, ఎన్టీఆర్ సుజల పథకాలను అమలు చేశామన్నారు. ఇతర అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేశారు. 12మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు ఎంపీటీసీ రాయపాటి సుబ్బారావు పసుపు కుంకుమ, చీర అందజేశారు. తొలుత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే కేఎస్ జవహార్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, చాగల్లు, కొవ్వూరు జెడ్పీటీసీలు అల్లూరి విక్రమాదిత్య, గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వాడవెల్లి రాజ్యలక్ష్మి, సర్పంచ్ బేతిన కాశీఅన్నపూర్ణ భవాని, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే ధ్యేయం
కాళ్ల : రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. కాళ్ల మండలంలోని జక్కరం, కోపల్లె గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు గ్రామససభలలో ఆమె ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబట్టలతో పంపినట్లుగా రాష్ట్రాన్ని విడగొట్టిందన్నారు. దీంతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారన్నారు. ఎంత కష్టమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎన్టీఆర్ సేవా పథకం ద్వారా ప్రతి వ్యక్తికీ రూ.2 లక్షల 50 వేల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దాతల సహకారంతో సుజలా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 20 లీటర్ల నీరు రూ. 2లకే అందిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సభలకు సర్పంచ్‌లు పాము రూతమ్మ, నాజిన ధనాజీరావు అధ్యక్షత వహించారు. జన్మభూమి జిల్లా ప్రత్యేకాధికారి పి.లక్ష్మీనర్సింహా, నియోజకవర్గ ప్రత్యేకాధికారి డి.విజయకుమారి, ఆర్డీవో పుష్పమణి, ఆర్డ బ్ల్యూఎస్ ఎస్ఈ రమణ, ఎంపీపీ ఆరేటి వెంకటరత్నప్రసాద్, జెడ్పీటీసీ బర్రె శ్రీవెంకటరమణ, తహసిల్దార్ వి.జితేంద్ర, ఎంపీడీవో జి.పద్మ పాల్గొన్నారు. సమర్థవంతమైన పాలన అందిస్తాం పాలకోడేరు/పాలకోడేరు రూరల్ : ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ,గనుల శాఖల మంత్రి పీతాల సుజాత అన్నారు. మండలంలోని శృంగవృక్షం, పెన్నాడ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో మంత్రి మాట్లాడారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఈకార్యక్రమం ద్వారా అందే సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. శృంగవృక్షం, పెన్నాడలో మొత్తం 290 మందికి పెన్షన్లు అందజేశారు. పెన్నాడలో వాటర్ ప్లాంట్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ చలపతి, జెడ్పీటీసీ నేతల బేబి, తహ సిల్దార్ రత్నమణి, ఎంపీడీవో వెంకటరత్నం, సర్పంచ్‌లు కలిందిండి దుర్గదీప్తీ కృష్ణంరాజు, ఇట్టా సురేష్‌బాబు పాల్గొన్నారు. -
'వచ్చే ఏడాదికి ఇసుక ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం'
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం పది ఇసుక రీచ్‌లకు మాత్రమే అనుమతులున్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభిస్తామని చెప్పారు. 83 ఇసుక రీచ్‌లకు అనుమతుల కోసం కేంద్రాన్ని కోరనున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ద్వారా వచ్చే ఏడాది నాటికి రూ. వెయ్యి కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పీతల సుజాత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇసుక రీచ్‌లపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పీతల సుజాతపై విధంగా సమాధానం ఇచ్చారు. -
అడకత్తెరలో అధికారులు
‘కొత్త పిచ్చోడు పొద్దెరగడు’ అనేది ముతక సామెతే కానీ.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. అధికారం కోసం ఆవురావురమని ఎదురుచూసి.. తీరా సర్కారు కొలువుదీరిన తర్వాత ఇంకా సరిగ్గా కుదురుకోలేని పరిస్థితుల్లోనే ఉన్న టీడీపీ నేతలు ముందుగా అధికారులపై అడ్డంగా పడిపోతున్నారు. చోటామోటా నేతల నుంచి మంత్రుల వరకు ఎక్కడికక్కడ, ఎవరికి వారు తమ దర్పమంతా అధికారులపైనే చూపిస్తున్నారు. ఇక జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. మంత్రులిద్దరూ జిల్లాస్థాయి అధికారులను తమ వెంటే ఉండాలని హుకుం జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం జిల్లాలో అన్నిచోట్లా ఒకేసారి మొదలైంది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వీరవాసరం మండలం అండలూరులో జరిగిన కార్యక్రమంలో, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అధికారులంతా తాము పాల్గొనే సదస్సులోనే ఉండాలని ఇరువురు మంత్రులూ పట్టుపట్టడంతో అధికారులు నానాకష్టాలూ పడ్డారట. మొత్తం మీద వ్యవసాయ శాఖ జేడీ ఇద్దరి వద్దా హాజరు వేయించుకుని అటు కొంతమంది.. ఇటు కొంతమంది అధికారులను సర్దుబాటు చేసినా ఏలూరు మండలం చాటపర్రులో కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొనే కార్యక్రమానికి ఎవరు వెళ్లాలనే విషయమై అధికారుల నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారట. అసలే అధికారులపై చీటికీమాటికీ ఇంతెత్తున లేచే ప్రభాకర్ వద్దకు వెళ్లాలంటే తలలు పండిన అధికారులకు సైతం చెమటలు పడుతుంటాయి. అయితే జిల్లాస్థాయి ఉన్నతాధికారి అక్కడికి వెళ్లడంతో ఆ రోజుకు హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాగైతే రానున్న కాలంలో ఎన్నికష్టాలు ఎదుర్కోవాలో అంటూ అధికారులు టెన్షన్ పడుతున్నారట. మరోవైపు.. అధికారిక కార్యక్రమాల ఆహ్వానాలను తమను స్వయంగా కలిసి ఇవ్వాలని, లేదంటే వచ్చేది లేదంటూ ప్రజాప్రతినిధులు భీష్మిస్తున్నారట. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల ఇదే అం శాన్ని రాద్ధాంతం చేయడంతో ఒకటికి మూడుసార్లు అధికారులు సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయన్ను రావాల్సిందిగా బతిమిలాడారట. ఇలా అధికారులు ప్రతి చిన్న పనికి ప్రజాప్రతినిధుల దర్శనం కోసం ఇతర పనులు మానుకుని కాళ్లరిగేలా వాళ్ల ఇళ్ల చుట్టూ తిరగడానికే కాలం సరిపోతోందని అంటున్నారు. మొత్తంగా ఈ రెండు నెలల పాలన చూస్తే.. అంతకుముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలోని పోకడలే మళ్లీ మొదలయ్యాయంటూ అధికారులు ఒకరి కష్టాలను ఒకరికి చెప్పుకుంటూ గుండె బరువు దించుకుంటున్నారట. ‘పవర్’ చూపిన పోలీస్ జిల్లాకు కొత్తగా వచ్చిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు రౌడీలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారపార్టీ వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఏ అధికారైనా వచ్చిన కొత్తలో ఇటువంటి ప్రకటనలే చేస్తుంటారు. కానీ మన జిల్లాకు వచ్చిన అధికారులు చేతల్లో చేసి చూపించారు. అధికారం వచ్చిందన్న దన్నుతో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండటమన్నది అంకన్నగూడెం ఘటన సాక్షిగా ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక ఏలూరు నగరంలో టీడీపీ నేతలూ తామేం తక్కువ కాదంటూ ఇటీవల ఓ యువకుడిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ యువకుడి బంధువులు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు కావడం, ప్రస్తుత ఎస్పీ రఘురామ్‌రెడ్డి గతంలో అక్కడ పనిచేయడంతో ఉన్న పరిచయాల దృష్ట్యా నేరుగా ఆయన్ని కలిశారు. ఆయన స్పం దించడంతో పోలీసులు నగర డెఫ్యూటీ మేయర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను కేసునుంచి బయటపడేయాలని పోలీసులపై ఎంత ఒత్తిళ్లు, ఆబ్లిగేషన్స్ వచ్చినా అధికారులు లెక్క చేయలేదు. ఇరువురు ఎమ్మెల్యేలు అదే పనిగా తిరిగినా.. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను కటకటాల్లోకి తోశారు. పవర్లో ఉన్నాం.. ఏమైనా చెల్లుబాటవుతుందని విర్రవీగుతున్న వారికి అసలు ‘పవర్’ చూపించిన అధికారులు ఇదే పట్టు కొనసాగిస్తారా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పంద్రాగస్టు వేడుకలు జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య దూరం పెంచనున్నాయా.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేరుగా వీరిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేకపోయినా ప్రోటోకాల్ బాధ్యతల అప్పగింత అగాధం పెంచుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జెండా వందనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించడంపై గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో స్థానం సంపాదించిన సుజాతను పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మాణిక్యాలరావుకు ప్రోటోకాల్ హోదా కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్‌లో మూడురోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీలో స్వయంగా మంత్రి సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా.. చివరకు మాణిక్యాలరావుకే జెండా వందనం చేసే బాధ్యతను అప్పగించడంపై ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా కేంద్రంలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనకూడదని మంత్రి సుజాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. తొలుత జిల్లాలో ఉండకుండా ఆ రోజు హైదరాబాద్ వెళ్లాలని భావించిన ఆమె మనసు మార్చుకుని కర్నూలులో జరిగే రాష్ట్ర వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ‘కృష్ణా’లో ఇలా ఎందుకు జరగలేదు? స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కోసం సహజంగా ఏ మంత్రి అయినా ఎదురుచూస్తారు. జిల్లాలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా దళిత మంత్రిగా ఈసారి తనకే ఆ అవకాశం వస్తుందని సుజాత భావిం చారు. కానీ.. పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలో అధికార పార్టీ రాజకీయాల్లో చోటుచేసుకున్న కుల సమీకరణల వల్ల ఆమెకు ఇక్కడ అవకాశం దక్కలేదని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు మన జిల్లాకు చెందిన మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్. వీరిద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరికి జెండా వందనం చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు భావించారు. అయితే కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కనపెట్టి కామినేని శ్రీనివాస్‌కు ప్రొటోకాల్ హోదా ఇచ్చే ధైర్యం చేయలేకపోయిన చంద్రబాబు మన జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇచ్చారని దళిత, బహుజన సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం దళిత మహిళ కాబట్టే పీతల సుజాతపై చిన్నచూపు చూశారని ఆయా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. -
పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి అధికారం
ఇక అధికార తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పీతల సుజాతకూ ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గం చింతలపూడిలో జనసేన నేతల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇటీవల హాస్టళ్లపై సమీక్షకు ఆమె చింతలపూడి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలకు, జనసేన నాయకులకు మధ్య బహిరంగంగానే వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సుజాత జనసేన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రగడవరం గ్రామానికి చెందిన తాళ్లూరి చంద్రశేఖర్‌రెడ్డి బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న తమను పక్కనపెట్టి నిన్నకాక మొన్న వచ్చిన, ఇంకా రాజకీయ పార్టీగా ఓ రూపురేఖల్లేని జనసేన పేరు చెప్పుకు తిరుగుతున్న వారికి ఆమె పెద్దపీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు అక్కడి జనసేన అభిమానులు ఎదురుతిరిగారు. కేవలం తమ నాయకుడి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిం దంటూ వ్యాఖ్యానించారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువర్గాల పెద్దలూ సర్ధిచెప్పడంతో ఆ సమయానికి అక్కడ సద్దుమణిగినా భవిష్యత్‌లో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు టీడీపీకి చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని, నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న జనసేన కార్యకర్తలను సమన్వయం చేయడం పీతల సుజాతకు కత్తి మీద సాములా తయారైంది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు విపక్షాల నుంచి కాకుండా మిత్రపక్షాల నుంచే సమస్యలు మొదలుకావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. -
గ్రీన్‌ఫీల్డ్ నివేదిక ఆలస్యంపై మంత్రి సుజాత సీరియస్
కాకినాడ: గ్రీన్ ఫీల్డ్ ఘటన నివేదిక తయారీలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన జరిగి అయిదురోజులు అయిన ఇప్పటి వరకు నివేదిక అందజేయకపోవడంపై సదరు ఉన్నతాధికారులపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్పతో కలసి పీతల సుజాత సందర్శించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న ఎందుకు నివేదికను తయారు చేయలేదని ఈ సందర్బంగా సుజాత ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నివేదికను వెంటనే అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 18న గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో అల్లరి చేస్తున్న ముగ్గురు విద్యార్థులపై ఆ పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు తీవ్రంగా కొట్టారు. ఆ ఘటను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి మీడియాకు అందజేశారు. దాంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి సుజాత విద్యాశాఖ ఉన్నతాధికరులను ఆదేశించింది. అయితే ఆ ఘటన జరిగి అయిదు రోజులు జరిగిన ఇప్పటి వరకు నివేదిక అందజేయకపోవడంతో సదరు అధికారులపై మంత్రి పీతల సుజాత నిప్పులు చెరిగారు. -
గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదు
హైదరాబాద్ : మంత్రి పీతల సుజాత గ్రీన్‌ఫీల్డ్ ఉదంతంపై స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని ఆమె తెలిపారు. విద్యార్థులను చితకబాదిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు పీతల సుజాత తెలిపారు. ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాల నడపటం చట్టవిరుద్దమన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలోతో సమగ్ర విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పీతల సుజాత తెలిపారు. -
మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, ఏలూరు: మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.జిల్లాలోని 13 మండలాల్లో మహిళల అక్రమ రవాణా అధికంగా సాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా మండలాలతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. జువెనైల్ హోమ్‌లో చిన్నారులు వారి తల్లిదండ్రుల మధ్య ఉన్నట్లు భావించేలా సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిం చేందుకు కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఓటరుకు సెల్‌ఫోన్, పేదలకు ఉచిత విద్య, రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, నిధుల కొరతవల్ల ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 21 ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పర్యావరణ కమిటీకి ప్రతిపాదనలు పంపించామని, మరో 65 రీచ్‌లను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. -
'ఏలూరును రాజధాని చేయాలని కోరాను'
ఏలూరు : ఇసుక తవ్వకాలపై త్వరలోనే నూతన పాలసీ తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ గనులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. దీనిపై వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ఆమె బుధవారమిక్కడ పేర్కొన్నారు. పిల్ల కాలువల్లో అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని పీతల సుజాత చెప్పారు. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా అధికారికంగా ఇసుక తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పీడీపీపీ యాక్ట్, ఐపీసీ 3,7,9 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ఏలూరును రాజధాని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు పీతల సుజాత తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు
పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆదివారం సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణనీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కమిడి మృణాళిని, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు, వ్యవసాయశాఖ మంత్రిగా పత్తిపాటి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. -
మాఫీ చేస్తాం.. వేలం వేస్తాం
మంత్రి మాట రైతులు తీసుకున్న రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తాం. వాళ్లెవరూ రుణాలు చెల్లించాల్సిన పనిలేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. ఈ అంశాలపై తొలి మంత్రివర్గ సమావేశంలో చర్చించాం. - ఈనెల 13న ఏలూరు, తణుకు, ఉంగుటూరులో పర్యటించిన సందర్భంలో రాష్ట్ర మంత్రి పీతల సుజాత చేసిన ప్రకటన ఇది సాక్షి, ఏలూరు : రుణమాఫీ విషయమై రైతు లు, డ్వాక్రా మహిళలతో ప్రభుత్వం, బ్యాంకులు దోబూచులాడుతున్నాయి. రుణాలను మాఫీ చేస్తామని.. రైతులు, డ్వాక్రా మహిళలు బకాయిలను చెల్లించాల్సిన పనిలేదని మం త్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటే.. వెంటనే కట్టాలంటూ బ్యాంకర్లు వత్తిడి చేస్తున్నారు. నోటీసు లు ఇస్తున్నారు. బంగారు నగలను వేలం వేస్తామంటూ ప్రకటనలు సైతం జారీ చేస్తున్నారు. రుణమాఫీ ఖాయమని చెబుతున్న ప్రభుత్వం.. దీనిపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని నియమించినట్టు ప్రకటించింది. హామీ అమలు విషయంలో మాత్రం నాటకీయత ప్రదర్శిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రుణమాఫీ చేస్తామని చెబుతున్నా ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయూలో తెలియక రైతులు, డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా మొదలైంది...న్నికల్లో నేలవిడిచి సాము చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అధికారమే పరమావధిగా ఎన్నో హామీలు గుప్పించారు. డ్వాక్రా, వ్యవసాయ రుణాలతోపాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం రద్దు చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. బ్యాంకులకు రుణాలు కట్టొద్దని ప్రచారం చేశారు. జిల్లాలో 5,89,195 అకౌంట్ల ద్వారా బంగారం తాక ట్టు పెట్టిన రైతులు వ్యవసాయ అవసరాలకు రూ.3,204.76 కోట్లను రుణాలుగా పొందారు. వాటిలో చివరి మూడు నెలల్లో తీసుకున్న రుణాల మొత్తం రూ.1971.03 కోట్లు. గతేడాది 3,65,710 అకౌంట్ల ద్వారా రూ.2,951.78 కోట్లను బంగారం హామీపై బ్యాంకులు రుణాలు ఇచ్చారుు. ఆ మొత్తంలో దాదాపు 95శాతం రుణాలు వసూల య్యూయి. ఈ ఏడాది రుణమాఫీ అవుతుం దనే నమ్మకంతో రైతులు ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు తిరిగి కట్టలేదు. ఇప్పుడు వాటిని కట్టాల్సిందిగా బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. నోటీసులకు స్పందించని వారి నగలను వేలం వేస్తామంటూ బహిరంగ ప్రకటనలు ఇస్తున్నాయి. చంద్రబాబు మాత్రం రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని చేతులు దులిపేసుకున్నారు. దీంతో ప్రైవేటు అప్పులు చేసి నగలు దక్కించుకోవాలో? లేక వాటిని వదులుకోవాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.925 కోట్లను రుణాలుగా ఇచ్చారు. బ్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయ్ బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాల్సిందిగా రైతులకు నోటీసులు ఇవ్వాలని మేం చెప్పలేదు. మొండి బకాయిలు, వ్యవసాయేతర అవసరాలకు బంగారంపై తీసుకున్న రుణాలను వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. రుణ మాఫీకి సంబంధించి ఇప్పటివరకూ బ్యాంకులకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో బకాయిలు చెల్లించేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం బ్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. -ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాబు చెప్పారని కట్టలేదు వ్యవసాయ పెట్టుబడుల కోసం దర్భగూడెం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నాను. 2010లో బంగారం తాకట్టు పెట్టి 50వేల రూపాయలు తీసుకోగా, దీనికి వడ్డీ 25వేలు వేశారు. మొత్తం బకాయిలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతోపాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. రైతులెవరూ బకాయిలు కట్టొద్దని, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో మేం కట్టలేదు. రుణం మాఫీ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. బ్యాంకు అధికారులు బంగారాన్ని వేలం వేస్తామంటున్నారు. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. - జంగా లచ్చిరెడ్డి, రైతు, దర్భగూడెం బ్యాంకులు వత్తిడి చేస్తున్నాయి గత ఏడాది వ్యవసాయం కోసం క్రాప్ లోన్ కింద దర్భగూడెం బ్యాంకులో లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. బంగారాన్ని తాకట్టు పెట్టి 21వేల రూపాయలు అప్పు తెచ్చాను. దీనికి 6వేల రూపాయలు వడ్డీ వేశారు. మొత్తం సొమ్ము కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రుణమాఫీ అవుతుందని నమ్మకం పెట్టుకున్నాం. అయితే రుణమాఫీకి గడువు విధించడంతో అది ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. - ఏలూరి రామాంజనేయులు, రైతు, లక్ష్మీపురం రుణ బకాయిలు ఇలా జిల్లాలో 2014 జూన్ వరకు ఉన్న వ్యవసాయ రుణ బకారుులు రుణం రకం అకౌంట్ల సంఖ్య రుణ మొత్తం (రూ. కోట్లలో) పంట రుణాలు 6,34,932 3,921.92 గోల్డ్ లోన్స్ 5,89,195 3,204.76 టెర్మ్ లోన్స్ 1,64,971 2,015.95 సీసీఏటీఎల్ 55,810 597.31 ఎస్‌హెచ్‌జీ 6,45,000 925.00 పరోక్ష రుణాలు 10,122 2108.91 మొత్తం 21,000,30 12,773.85 ఇన్‌డెరైక్ట్ ఫైనాన్స్ : గోడౌన్లలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను తనఖాపెట్టి తీసుకున్న రుణాలు, చేపల చెరువులు, పొగాకు రైతులు తీసుకున్న రుణాలు సీసీఏటీఎల్ : టెర్మ్లోన్లుగా మారిన క్రాప్ లోన్లు ఎస్‌హెచ్‌జీ : స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు -
‘పోలవరం’ నిర్మించి తీరతాం
ఏలూరు : ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరతామని రాష్ట్ర గనులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు జెడ్పీ అతిథి గృహంలో ఆదివారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని చెప్పారు. తాను ఇతర ప్రజాప్రతినిధులు అక్కడ జరుగుతున్న పనుల ప్రగతిని సమీక్షిస్తామన్నారు. గోదావరి జలాలను తెలంగాణలో ఇష్టానుసారంగా ఎత్తిపోతల ద్వారా మళ్లించడంతో మన ప్రాంతం లో రబీకి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. పంటలు ఎండకుండా చూడండి మెట్ట ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ను అందించి రైతులను ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్‌ను మంత్రి సుజాత కోరారు. ఆర్డ బ్ల్యూఎస్, ఏపీడీసీఎల్ అధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సమృద్ధిగా నీరు అందక ఆయిల్‌పాం, చెరకు, పత్తి, అరటి వాణిజ్యపంటలు ఎండిపోతున్నాయన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు విస్తృతంగా పర్యటించానని ఎక్కడకు వెళ్లినా రైతులు విద్యుత్ కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారని చెప్పారు. ప్రధానంగా శివారు గ్రామాల్లో తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుజాత ఆదేశించారు. నేడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని రాక పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఏలూరు ఎంపీ మాగంటిబాబు పరిశీలిస్తారని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షిస్తారన్నారు. పోలవరం సుజల సాగర అతిథి గృహంలో ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొంటారని తెలిపారు. -
టీచరమ్మకు మంత్రి యోగం
చింతలపూడి, న్యూస్‌లైన్ :పదేళ్ల అనంతరం చింతలపూడి నియోజకవర్గానికి తిరిగి మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రి వర్గంలో స్థానం లభించింది. ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చింతలపూడిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 2004లో టీడీపీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి సుజాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆచంట నియోజకవర్గం జనరల్‌కు కేటాయించడంతో ఆమె పోటీకి దిగలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి సుజాత దూసుకు వచ్చారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆమెను బరిలోకి దింపింది. 15,156 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన సుజాత మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఉపాధ్యాయి.నిగా ప్రస్థానం ఆచంట: బెత్తం పట్టుకుని చిన్నారులకు అ ఆ..ఇ ఈలు నేర్పిన టీచరమ్మ పీతల సుజాతకు రాజకీయాల్లో ఓనమాలు తెలియకపోయినా అ నూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయ చదరంగంలో నెట్టుకొచ్చిన ఆమె ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదిగారు. పార్టీనే నమ్ముకున్న సుజాతకు అదృష్టం కూడా తోడైం ది. ఆచంట, చింతలపూడి నియోజకవర్గాల నుంచి స్థానికేతరురాలిగానే బరిలోకి దిగిన ఆమె అనూహ్యంగా విజయం సాధించారు. జిల్లాలో మహిళా కోటాతోపాటు, దళితుల కోటా కలిసి రావడంతో సీమాంధ్ర తొలి కేబినెట్లో ఆమెకు అవకాశం దక్కింది. సుజాతకు మంత్రి పదవి రావడంతో ఆమెకు రాజకీయంగా జన్మనిచ్చిన ఆచంటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. స్థానికత్వం కలసి రాకపోయి.నా... 1973 ఆగస్టు 13న వరప్రసాద్ (బాబ్జి), కృపావరం దంపతులకు జన్మించిన సుజాత ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. నరసాపురంలో కళాశాల విద్యను అభ్యసించారు. ఎంఏ బీఈడీ చదివి 2004లో ఉపాధ్యాయి.నిగా ఎంపికయ్యూరు. నరసాపురం మండలంలో పని చేశారు. ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2008లో సహ ఉపాధ్యాయుడు సురేష్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రణవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి పీతల బాబ్జి టీడీపీలో చురుకైన కార్యకర్త. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అనుచరుడు. 2004లో ఆచంట టీడీపీ సీటు కోసం బాబ్జి తన కుమార్తె పీతల సుజాతతో రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట నుంచి దరఖాస్తు చేయించారు. అయితే, తొలుత హైదరాబాద్‌కు చెందిన పీతల మహాలక్ష్మికి సీటు కేటాయించారు. మహాలక్ష్మిపై అభియోగాలు రావడంతో చివరి నిమిషంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చక్రం తిప్పి టికెట్‌ను పీతల సుజాతకు ఇప్పించారు. ఆచంట నుంచి పోటీచేసిన సుజాత 5,641 మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఆమె పలుమార్లు ప్రస్తావించారు. కానీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నేరవేర్చలేకపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల నుంచి నియోజకవర్గంలో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయినా అధైర్యపడకుండా తనదైన శైలిలో రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. 2009 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కాగా, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వెళ్లింది. దీంతో ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. 2009లో రిజర్వుడు నియోజకర్గమైన చింతలపూడి టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. ఆయినా ఆమె పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబు మూడేళ్ల క్రితం రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా నియమించారు. పార్టీపై విధేయత చూపడంతోపాటు.. సౌమ్యురాలిగా అందరి మన్నలు పొందారు. 2014 ఎన్నికలలోనూ అనూహ్యంగా చింతలపూడి టికెట్ సాధించి అనూహ్యమైన విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఎమ్మెల్యేగా గతంలో ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోయిన సుజాత మంత్రిగా ఇకపై ఆచంట అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా నుంచి ఐదో మహిళ స్వాతంత్య్రానంతరం జిల్లా రాజకీయ చరిత్రలో కేబినెట్ ర్యాంకు పదవులను దక్కించుకున్న ఐదో మహిళగా పీతల సుజాత రికార్డులకెక్కారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేబినెట్లో మన జిల్లా కోడలు ఆచంట రుక్మిణమ్మ డెప్యూటీ స్పీకర్‌గా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లాకు చెందిన చోగడం అమ్మన్నరాజా కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో డెప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అత్తిలి తొలి ఎమ్మెల్యే అమ్మన్నరాజా పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరించారు. ఈ పదవి కూడా కేబినెట్ ర్యాంకుతో కూడినదే. ఆ తరువాత కాలంలో పెనుగొండ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండుసార్లు ఎన్నికైన ప్రత్తి మణెమ్మ, కాంగ్రెస్ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి వరలక్ష్మి మంత్రి పదవులను అలకరించారు. ఆ పదవులకు వన్నె తెచ్చారు. జిల్లాకు చెందిన పీతల సుజాత సీమాంధ్ర తొలి కేబినెట్లో స్థానం సంపాదించడం ద్వారా అలనాటి మహిళామణుల సరసన నిలిచారు. -
ఇద్దరు మంత్రులు
సాక్షి, ఏలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలి వేదికపై వీరిద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా వీరి ద్దరూ మంత్రి పదవులను చేపట్టారు. అనూహ్య పరిణామాలు సుజాత, మాణిక్యాలరావు విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీటు సంపాదించడం దగ్గర నుంచి కేబినెట్ పదవులు దక్కించు కోవడం వరకూ అనూహ్య పరిణామాలు చోటు చేసు కున్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో తాడేపల్లిగూడెం స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. అప్పుడే మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చింది. సంఘ్ పరివార్ ప్రోద్బలంతో ఆయన్ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఒకానొక సమయంలో జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బీజేపీ గట్టి అభ్యర్థులను పోటీలో నిలపలేదంటూ వివాదం లేవనెత్తారు. ఆ సమయంలో మాణిక్యాలరావు టికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత విశ్వప్రయత్నం చేయడంతో ఆయన సీటు పదిలం చేసుకున్నారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి కేటాయించడం మాణిక్యాలరావుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు వెన్నుదన్నుగా నిలిచారు. భీమవరంలో మోడీ సభ, పవన్‌కల్యాణ్ ప్రచారం మాణిక్యాలరావుకు కలిసివచ్చాయి. బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ, సంఘ్ పరివార్ ఒక్కటై మాణిక్యాలరావును గెలిపించాయి. మంత్రి వర్గంలో బీజేపీకి చోటు కల్పించడం, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కింది. మహిళకు అందలం చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత కూడా అనూహ్యంగానే పదవిని దక్కించుకున్నారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఈ ఎన్నికల సమయంలో చివరి నిమిషం వరకు ఆమెకు టికెట్ ఖరారు చేయలేదు. ముందు గోపాలపురం లేదా కొవ్వూరు నుంచి ఆమెను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. చివరకు చింతలపూడి టికెట్‌ను ఆమె దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె పార్టీలో కీలకంగా మారారు. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును బలపరిచే అవకాశాన్ని దక్కించుకున్నారు. గవర్నర్‌ను కలిసిన బృం దంలోనూ ఆమె ఉన్నారు. జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైన మహిళా ఎమ్మెల్యే కావడం ఆమెకు అనుకూలంగా మారింది.