బ్యాగ్లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే... | Peethala Sujatha detained 10 lakhs cash issue | Sakshi
Sakshi News home page

బ్యాగ్లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే...

Published Wed, Jun 3 2015 8:36 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

బ్యాగ్లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే... - Sakshi

బ్యాగ్లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే...

రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో లభించిన రూ.10 లక్షల నోట్ల కట్టల వ్యవహారం మలుపులు తిరుగుతోంది.

ఏలూరు : రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో లభించిన రూ.10 లక్షల నోట్ల కట్టల వ్యవహారం మలుపులు తిరుగుతోంది.  అయితే ఈ వ్యవహారంపై తనకేమీ సంబంధం లేదని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

దీనిపై మంత్రి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కుట్ర జరిగినట్లుగానే తనపై కూడా కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో జరిపించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆమె తెలిపారు.  ఈ వ్యవహారంపై మంత్రి ఆచితూచి మాట్లాడారు. బ్యాగులో డబ్బు కాకుండా, బాంబు పెడితే తన పరిస్థితి ఏంటని మంత్రి ఎదురు ప్రశ్న వేశారు. తన ఇంటి ఆవరణలో డబ్బు వదిలిన మహిళ ఎవరో తనకు తెలియదని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు.  ఆ మహిళకు మతిస్థిమితం లేదని మంత్రి తెలిపారు.

ఇక మంత్రి ఇంటి ఆవరణలో డబ్బుల బ్యాగ్ వదిలి పెట్టిన మహిళ పాలకొల్లు మండలం జున్నూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు  అద్దాల విష్ణువతిగా గుర్తించారు. మరోవైపు  అద్దాల విష్ణువతి ఈరోజు ఉదయం మంత్రి  నివాసంలో ప్రత్యక్షం కావటం గమనార్హం. వీడియో తీసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.

కాగా డీఎస్సీ ఫలితాలు వెలువడిన రోజే ఈ సంఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి ఆవరణలో వదిలిన బ్యాగ్లో 10 లక్షల నగదుతోపాటు తాడేపల్లిగూడెంకు చెందిన కార్ని శ్రీలక్ష్మి అనే యువతికి చెందిన డీఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. దాంతో టీచర్ పోస్ట్ కోసం పైరవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement