మంత్రి పీతల యాత్ర.. పోలీసుల యాతన
మంత్రి పీతల యాత్ర.. పోలీసుల యాతన
Published Thu, Dec 3 2015 9:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత జన చైతన్యయాత్రలో భాగంగా చేసిన మోటార్ సైకిల్ ర్యాలీ పోలీసులకు, గన్‌మన్‌లకు ఇబ్బందిగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం మంత్రి జన చైతన్యయాత్రలో పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్, పాతబస్టాండ్, గంగానమ్మ గుడిసెంటర్, కొత్తబస్టాండ్, బోసుబొమ్మసెంటర్, జేపీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్‌మన్‌లు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరిగెడుతూ తూలి పడిపోయారు. వెనుక వచ్చిన మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement