cycle rally
-
విశాఖ ఆర్కే బీచ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన GVMC,PCB
-
రాహుల్ ఆధ్వర్యంలో విపక్షాల సైకిల్ ర్యాలీ
-
3,200 కి.మీ.ల సైకిల్ యాత్ర.. రూ. 3.7 లక్షల విరాళాలు
లండన్: ఐదేళ్ల తెలుగు బాలుడు 3,200 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొని అక్షరాలా రూ.3.7 లక్షలు సేకరించాడు. భారత్‌లో కరోనా మహమ్మారిపై పోరాటానికి తనవంతు సాయం అందించేందుకు ఈ బాలుడు చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాల బ్రిటన్‌లోని మాంచెస్టర్ సిటీలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ‘లిటిల్ పెడలర్స్ అనీశ్ అండ్ ఫ్రెండ్స్’ పేరిట మేలో సైకిల్ క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఇందులో అతడితోపాటు 60 మంది బాలురు పాల్గొన్నారు. మొత్తం 3,200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ప్రజల నుంచి రూ.3.7 లక్షల విరాళాలు సేకరించారు. బ్రిటన్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా నేషనల్ హెల్త్ సర్వేకు సాయం చేసేందుకు క్రికెట్ చాంపియన్‌షిప్ కూడా అనీశ్వర్ ప్రారంభించాడు. ఐదేళ్ల అనీశ్వర్ యూకేలో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. -
తిరగని సైకిళ్లు
ఉరూరా తిరగాలి.. హోదా కోసం చంద్రబాబునాయుడు కృషిని వివరించాలి.. ప్రతిఒక్కరినీ కలసి హోదా కోసం టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను వివరిం చాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలి. ఇది టీడీపీ రూపొందించిన సైకిల్ యాత్ర కార్యక్రమ సారాంశం. అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియకో.. బీజీగా ఉన్నారో కానీ జిల్లాలో సైకిల్ యాత్రలు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయి. పర్యవసానంగా జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతుందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకు రోజుకో రీతిలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయు డు మొదలుకుని నియోజకవర్గ ఇన్చార్జిల వరకు అందరూ మాట్లాడారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో సష్టమైన అవగాహన ఉంది. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని నీరుగార్చారు. దీనిపై గ్రామస్థాయిలో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అధికార పార్టీ మూటగట్టుకుంది. ఈ క్రమంలో సైకిల్ యాత్ర ద్వారా అయినా జనాల్లోకి వెళ్లాలని భారీ షెడ్యూల్‌ను రూపొందించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలపై కార్యక్రమాన్ని రుద్దారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జిల్లాలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవటం పార్టీ పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో యాత్రలు సరిగా జరగకపోతే మరో వారం రోజులు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్న నేతలకు స్థానిక పరిస్థితులు కత్తిమీద సాములా మారాయి. మరోవైపు కొందరు ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు అయితే అసలు ఈ యాత్రల గోల ఏంటని నియోజకవర్గాలకే పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రజలకేం చెప్పాలి? టీడీపీ నేతల్లో ప్రజల వ్యతిరేకత భయం వెంటాడుతోంది. నాలుగేళ్లుగా ఏమీ చే యకుం డా బీజేపీతో దోస్తీ కట్టి ఇప్పుడు తప్పు అంతా బీజేపీపై రుద్ది ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందాలన్నదే సైకిల్ యాత్ర అంతిమ లక్ష్యం. ప్రజల్లోకి వెళితే వారు ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వారికి ఏం చెప్పాలి.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు నాయకులు ఈ యాత్రలు మనకొద్దని నిర్ణయించినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో ప్రారంభంకాని యాత్రలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో గత వారం రోజుల్లో సైకిల్ యాత్రలు మొక్కుబడిగా జరగ్గా, మిగిలిన మూడు నియోజకవర్గాలైన ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలిలో అసలు ప్రారంభం కాని పరిస్థితి. బిజీ షెడ్యూల్ తర్వాత మంత్రి సోమిరెడ్డి శనివారం పొదలకూరులో సైకిల్‌యాత్ర నిర్వహించారు. వెంకటగిరిలో కార్యకర్తలే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. కనీసం ఒక్కచోట కూడా ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొన్న దాఖాలాల్లేవు. నెల్లూరులో సిటీ ఇన్చార్జి శ్రీధరకృష్ణారెడ్డితో పాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయన సోదరుడు వివేకానందరెడ్డి మరణంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కావలి ఇన్చార్జిగా ఉన్న బీద మస్తానరావు వ్యాపారాల పనిమీద విదేశాల్లో బిజీగా ఉండి శనివారం స్వదేశానికి వచ్చారు. సూళ్లూరుపేట ఇన్చార్జి పరసా రత్నం ఇంతవరకు యాత్ర ఆలోచనే చేయలేదు. -
స్పీకర్ కోడెల సైకిల్ ర్యాలీలో అపశ్రుతి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్పల్పగాయమైంది. ఈ క్రమంలో స్పీకర్‌కు ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆయన సైకిల్ యాత్రను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా కోడెల శివప్రసాదరావు గురువారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. నర్సారావుపేట పట్టణంలోని స్వగృహం నుంచి యాత్ర ప్రారంభించిన ఆయన కోటప్పకొండకు బయలుదేరారు. నాలుగు గంటల్లో 15 కిలో మీటర్ల మేర ఆయన సైకిల్ యాత్ర చేశారు. అనంతరం కోడెల మాట్లాడుతూ.. ‘101 డిగ్రీల జ్వరం, 42 డిగ్రీల ఎండవేడి ఉన్నా కార్యకర్తల ఉత్సాహంతోనే సైకిల్ యాత్ర చేశాను. నా సైకిల్ యాత్ర బాబుకు సంఘీబావం కాదు. బాబుకు ఐదు కోట్ల మంది ప్రజల సంఘీభావం ఉంది. ఐదు కోట్ల ఆంధ్రుల్లో స్పీకర్ కూడా ఒకరు. కేంద్రం తీరుపై నిరసనగానే సైకిల్ యాత్ర చేశాను. దున్నపోతు మీద వాన పడిన చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో పోటీపడి హమీల వర్షం కురిపించారు. నాలుగేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ ఊరించారు. కేంద్రం మత్తు దించాలంటే ఆంధ్రుల సత్తా ఏంటో చూపించాల్సిందే. అది పోరాటాలు, ఉద్యమాల ద్వారానే సాధ్యం. తెలుగోడి సత్తా ఏంటో కేంద్రానికి తెలిపే సమయం ఆసన్నమైంది. కుల, మత పార్టీలను పక్కన పెట్టి అందురూ కలసికట్టుగా ఉద్యమించాలి. స్పీకర్‌గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ ఇప్పడు కూడా నేను రాష్ట్రం కోసం నోరెత్తకపోతే ప్రయోజనం ఉండదు. నేను ఐదు కోట్ల ఆంధ్రులలో ఒకడిగా మాట్లాడుతున్నాను. ఆంధ్రులకు చేసిన అన్యాయంపై విదేశాలలో కూడా ప్రధానికి నిరసన వ్యక్తమౌతుంది. కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది.’ అని ఆయన తెలిపారు. -
మేమున్నామని..
మహిళలపై జరుగుతున్న దాడులు.. ఇబ్బందిపెట్టే ఆత్మన్యూనత ఆలోచనలు.. వారి రక్షణకుచిత్తూరు పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్త్ర్రీలకు కొండంత భరోసానిస్తున్నాయి. ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మీ భద్రతకు మేమున్నామంటూ పోలీసు యంత్రాంగం చూపుతున్న చొరవపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. చిత్తూరు అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల రక్షణకు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అయిదు చోట్ల మహిళా విభాగాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, పుత్తూరు ప్రాంతాల్లో 20 మందితో ఏర్పాటైన ఈ విభాగంలో ప్రస్తుతం 78 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ విభాగం పనితీరును మెచ్చుకున్న రాష్ట్ర పోలీసు శాఖ రూ.లక్ష రివార్డు కూడా అందజేసింది. సైకిల్‌యాత్ర తెచ్చిన మార్పు.. చిత్తూరు జిల్లాలో మహిళా ఆత్మహత్యలు నివారించి వారికి మేమున్నామనే (పోలీసులు) భరోసా కల్పించడానికి గతేడాది అక్టోబరులో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు 56 మండలాల్లో 1200 కి.మీ దూరం సైకిల్ ర్యాలీ చేపట్టి మహిళలకు ఆత్మసై ్థర్యాన్ని నింపారు. 44 రోజులపాటు సాగిన ఈ యాత్ర జిల్లాలో మహిళల ఆత్మహత్యల శాతాన్ని తగ్గించిందని పోలీసులు చెబుతున్నారు. 2015లో జిల్లాలో 142 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే..ఈ సంఖ్య 2016లో 167కు, గతేడాది 70కు పరిమితమయ్యింది. నిర్భయ పెట్రోలింగ్... పట్టణ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడానికి నిర్భయ పెట్రోలింగ్ పేరిట చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. నాలుగు ఎలక్ట్రిక్ బ్యాటరీ సైకిళ్లతో జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ఇక్కడ పోలీసులున్నారనే వాస్తవాన్ని గుర్తించడానికి సైకిళ్లపై మహిళా కానిస్టేబుళ్లు కనిపిస్తుంటారు. మా వాళ్లు విశ్వాసంతో ఉన్నారు.. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వారి రక్షణకు మా ఎస్పీ గారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రతీ ఒక్క ప్రోగ్రామ్‌లో నాలుగు మీటింగ్‌లు పెట్టి.. రెండు మాటలు చెప్పడంతో మా బాధ్యత ముగిసిపోదు. ఫీల్డులో మహిళల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి. వాళ్లల్లో ఆత్మసై ్థర్యం నింపాలి. ఇందు కోసం ముందు మా మహిళా పోలీసు అధికా రులు, కానిస్టేబుళ్లకు కాన్ఫిడెంట్ కావాలి. వీరందరితోనూ ఇప్పటికే పలు మార్లు సమావేశమై ఎలా పనిచేయాలి..? సమస్యలు వస్తే ఎలా స్పందించాలని చెబుతుంటాను.– జిఆర్.రాధిక, ఏఎస్పీ, చిత్తూరు. మార్పు వస్తుంది.. మూడు సంవత్సరాలకు పైనే ఈ విభాగంలో పనిచేస్తున్నా. అప్పటికి, ఇప్పటికి మహిళల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చింది. పల్లెలోకి మహిళలు సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పడం, చిన్న వాటికే డిప్రెషన్లోకి వెళ్లిపోయి సూసైడ్‌కు పాల్పడవద్దని వివరిస్తా ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చేయడం వల్ల మాపై నమ్మకంగా ఉన్నారు. ఇది ఒకేసారి వచ్చే మార్పు కాదు. కొద్ది కొద్దిగా మొదలై ఒక రోజు తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. – సివి.హైమావతి,ఏఎస్ఐ, మహిళా స్టేషన్, చిత్తూరు. ఈ సారి హాకథాన్.. వచ్చేనెల జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో హాకథాన్ అనే కొత్త కార్యక్రమాన్ని చిత్తూరు పోలీసు శాఖ పరిచయం చేయబోతోంది. మహిళల ప్రతీ ఒక్క సమస్య పరిష్కారానికి విస్తృత స్థాయిలో చర్చించడమే హాకథాన్ లక్ష్యం. ఆసియాలో తొలిసారిగా మహిళా భద్రతపై హాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తీర్పు ఇవ్వండి... మహిళపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు బాధ్యత ఉన్న పౌరుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి సోషల్ మీడియా వేదికకగా చేపట్టిన మరో ప్రయత్నం ‘తీర్పుఇవ్వండి–మార్పుకోరండి’. ఠీఠీఠీ. ్చజ్చుఝట /ఛిజిజ్టీ్టౌౌటఞౌ జీఛ్ఛి అనే లింక్ ద్వారా కైజాలా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకుని ఓపీనియన్పోల్లో పౌరులు పాల్గొని అభిప్రాయాలను తెలియజేయవచ్చు. -
ఫ్లాప్ షో
నంద్యాల : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ మంగళవారం ప్రారంభించిన సైకిల్ ర్యాలీ తొలి రోజే ఫ్లాప్ షోగా ముగిసింది. పట్టణంలోని పద్మావతినగర్‌లో ర్యాలీని ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రైతునగర్, కానాల ప్రాంతాల్లో 10 కి.మీ మేర ర్యాలీ సాగింది. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా జారుకున్నారు. చివరి దశకు చేరే సరికి కనీసం 50 మంది కూడా మిగల్లేదు. -
పిల్లల్లో ఊబకాయాన్ని అధిగమిద్దాం
విజయవాడ(లబ్బీపేట) : పిల్లల్లో ఊబకాయంపై అవగాహనకు విజయవాడ ఫిజియోస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ర్యాలీని మాచవరం ఎస్ఐ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ యలమంచిలి కాంప్లెక్స్ వరకు. అక్కడి నుంచి తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఫిజియోస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు సరైన వ్యాయామం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నిద్రలేచిన వద్ద నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పుస్తకాలతోనే సరిపోతుందని చెప్పారు. పాఠశాలల్లో వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపక పోవడంతో పిల్లల్లో ఊబకాయులు పెరిగిపోతున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ఆహార అలవాట్లు ఒబెసిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని వివరించారు. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అధిగమించేందుకు వ్యాయామం తప్పనిసరి అన్నారు. సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యకరమని, ప్రతి రోజూ కనీసం గంటపాటు పిల్లలు సైకిల్ వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో సుమారు 200 మందికిపైగా ఫిజియోలు, ఫిజియో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ సుదీప్తి, డాక్టర్ కీర్తిప్రియ, డాకట్ర్ మనోజ్ పాల్గొన్నారు. -
డీపీఎస్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ ర్యాలీ
రామవరప్పాడు : నిడమానూరు ఢిల్లీపబ్లిక్‌స్కూల్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా ‘ఎకో ఫ్రెండ్లీ దీపావళి’ అంశంపై సైకిల్ ర్యాలీ శనివారం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో బాణసంచా కాల్చకుండా దీపావళి జరుపుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీను ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ కాంతి రాణా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాధ్యమయినంత వరకూ పర్యవరణానికి కీడు తలపెట్టె టపాకాయలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రవణ్ కుమార్, పాఠశాల ప్రోవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డీన్ ఎస్బీ రావు, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ బోరా పాల్గొన్నారు. -
మంత్రి పీతల యాత్ర.. పోలీసుల యాతన
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత జన చైతన్యయాత్రలో భాగంగా చేసిన మోటార్ సైకిల్ ర్యాలీ పోలీసులకు, గన్మన్లకు ఇబ్బందిగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం మంత్రి జన చైతన్యయాత్రలో పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్, పాతబస్టాండ్, గంగానమ్మ గుడిసెంటర్, కొత్తబస్టాండ్, బోసుబొమ్మసెంటర్, జేపీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్మన్లు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరిగెడుతూ తూలి పడిపోయారు. వెనుక వచ్చిన మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు. -
'కార్లు వద్దు.. సైకిళ్లు తొక్కుదాం'
న్యూఢిల్లీ: కార్లు వద్దు.. సైకిళ్లు తొక్కడమే ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన నేతృత్వంలో గురువారం ఉదయం ఢిల్లీలో సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. హస్తినలో తొలిసారి నిర్వహించిన కారు ఫ్రీ డేలో భాగంగా ఆయన సైకిలు తొక్కారు. పాత ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇండియా గేటు మీదుగా మొదటి ప్రపంచయుద్ధం స్మారకం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో దాదాపు వందమంది సైకిలిస్టులు పాల్గొన్నారు. కేజ్రీవాల్ మంత్రులు, అధికారులు కూడా ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ వాహనాల రద్దీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ రోడ్లు ఇరుకుగా మారిపోయి.. కాలుష్యం నానాటికీ పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రజలే ముందుకురావాలని కోరారు. ఢిల్లీ రోడ్లపై ప్రతిరోజూ 84 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా కాలుష్యం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా ఢిల్లీ వాసులకు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ సాధ్యమైనంతవరకు వాహనాలు పక్కనపెట్టి సైకిళ్లు తొక్కాలని, ఇది తనలాంటి డయాబెటిక్ ఉన్నవాళ్లతోపాటు అందరి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు. రిజిజుగారు దేశాన్ని విభజించకండి! ఉత్తరభారతీయులు చట్టాన్ని ఉల్లంఘించడం గర్వకారణంగా, సంతోషంగా భావిస్తారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు. 'రిజిజుగారు.. భారతీయులను దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు, హిందువులు, ముస్లింలు అని విడదీయకండి. అందరూ భారతీయులు మంచివారే. మనం మెరుగుపరుచుకోవాల్సినది రాజకీయాలనే' అంటూ కేజ్రీవాల్ గురువారం ట్వీట్ చేశారు. -
సీఎం సైకిల్ ర్యాలీ
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో గురువారం సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఎర్రకోట నుంచి ప్రారంభమైన ఈ కార్ ఫ్రీ ర్యాలీలో వివిధ మంత్రులు, ప్రభుత్వ అధికారులు సహా సుమారు వందమంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీ నరాజధాని నగరంలో వాహనాల రద్దీని అరికట్టాల్సిన అవసరం చాలా ఉందన్నారు. విష వాయువులను విడుదల చేస్తున్న కార్లను వదిలిపెట్టి పైకిళ్లను వాడాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందనీ, ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. వణికిస్తున్న వాతావరణ కాలుష్యంనుంచి కాపాడుకోవడానికి ఢిల్లీ వాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుమారు 84 లక్షల వాహనాలు ఢిల్లీ రోడ్లమీద తిరుగుతున్నాయని దీనిమూలంగా గాలి విపరీతంగా కలుషిత మవుతోందన్నారు. అందుకే సాధ్యమైనంతవరకే ప్రతి ఒక్కరు ప్రజా రవాణా వ్యవస్థ ను ఉపయోగించుకోవాలని, ఎక్కువగా సైకిళ్లను వినియోగించడానికి ముందుకు రావాలని సూచించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నాలాంటి వాళ్లకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. కానీ ఇలాంటి అవగాహనా ర్యాలీలు ఆదివారం రోజు నిర్వహిస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఊరొస్తే సైకిల్‌పై..ఊరు దాటగానే ఏసీ బస్సులో..
-
సీఎం సైకిల్ ర్యాలీ!
కాన్వాయ్ శ్రేణి.. అత్యున్నత స్థాయి భ్రదత.. అన్నింటినీ పక్కన పెట్టి ఎంచక్కా సైకిలెక్కి ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కాలుష్య నివారణా చర్యల్లో భాగంగా దేశరాజధానిలో మొట్టమొదటిసారి నిర్వహించనున్న 'కార్ ఫ్రీ డే' కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ ఫీట్ చేయనున్నారు. ఈ ర్యాలీలో సీఎం సహా సహచర కేబినెట్ మంత్రులూ కాళ్లకు పనిచెప్పనున్నారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 22న ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని, ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు కొనసాగుతుందని చెప్పారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ఆ రోజు డీటీసీ (ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్) అదనపు బస్సులు నడుపుతుందని, ఆటో డ్రైవర్లు కూడా ఉచిత సర్వీసు అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. -
బ్రీఫ్‌గా 'అమరావతి'కి చేరుకోవాలంటే..
హైదరాబాద్: అమరావతి.. ఆంధ్రప్రదేశ్ (కలల) రాజధాని. ఎల్లుండి శంకుస్థాపన జరగనున్న ఈ నగరంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. అలాంటి నగరఖ్యాతిని ఊరూరా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన ఐటీ విభాగం తెలుగు తమ్ముళ్లు కొందరు సోమవారం హైదరాబాద్ నుంచి అమరావతికి 'ఏపీ క్యాపిటల్ రైడ్' పేరుతో సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైన ఈ యాత్రకు టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అరెకెపూడి గాంధీ, మాగంటి బాబులు 'పచ్చ' జెండా ఊపారు. మోకాళ్లు, మోచేతులకు గార్డులు, కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్ లతో సైకిళ్లెక్కి రాజధానివైపు రయ్యిమన్నారు. వారీ స్పీడ్ చూస్తే ఆగకుండా అమరావతి దాకా వెళ్లేలా కనిపించారు. కానీ.. ర్యాలీ సిటీ శివారుకు చేరుకోగానే అసలు కథ మొదలైంది. అప్పటికే ఏర్పాటయిన ఓ లారీలోకి సైకిళ్లను ఎక్కించిన తెలుగు తమ్ముళ్లు.. ఎంచక్కా ఏసీ బస్సెక్కి కూర్చున్నారు! బస్సు వెనకే లారీ రాగా.. మరో ఊరు శివారులో సైకిళ్లను దించి యాత్ర చేయడం, ఊరు దాటగానే మళ్లీ బస్సెక్కడం.. అలా ఎక్కుతూ.. దిగుతూ సాగింది టీడీపీ 'సైకిల్ యాత్ర'. వీళ్ల డ్రామాలు చూసిన జనంలో కొందరు.. 'బ్రీఫ్ గా అమరావతికి చేరుకోవటం ఇలాగేనేమో!' అని ముక్కున వేలేసుకోగా మరికొందరు మాత్రం.. 'ముందు చక్రం ఎలా వెళ్తుందో... వెనక చక్రం కూడా అలానే వెళ్తుంది' అని సరిపెట్టుకున్నారు! -
ఢిల్లీ చేరిన జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలన, కాలుష్య నివారణ, జాతీయ సమైక్యత లక్ష్యంగా సెప్టెంబరు 30న హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న 12 మంది పోలీసు అధికారులు.. 1,875 కి.మీ. దూరాన్ని 18 రోజుల్లో పూర్తిచేశారు. ర్యాలీ పూర్తిచేసిన అధికారులకు రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఇండియా గేట్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. జైళ్లను అవినీతి రహితంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఉపాధిలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని జైళ్లను సందర్శించినట్లు ర్యాలీలో పాల్గొన్న మహబూబ్‌నగర్ జైల్ సూపరింటెండెంట్ సంపత్ తెలిపారు. -
సైకిల్.. సవారీ
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కనగల్, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల గుండా 65 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. సాగర్ వరకు ఎస్పీ ప్రభాకర్‌రావు స్వయంగా సైకిల్ తొక్కారు. - సాక్షి, నల్లగొండ/న్యూస్‌లైన్, హాలియా సాక్షి, నల్లగొండ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. బడికి వెళ్లాల్సిన వయస్సులో చిన్నారులు వెట్టిచాకిరీ చేయడం సమాజానికి మంచిది కాదని ఎస్పీ అన్నారు. చట్టాలెన్ని వచ్చినా ప్రజల్లో చైతన్యం లేకపోవడం కారణంగానే చిన్నారులు కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించి దేశ ప్రగతిలో పాలు పంచుకునేలా చేయాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు మనోహర్‌రెడ్డి, డి. లక్ష్మణ్, రవి పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే సైకిల్‌యాత్ర : ఎస్పీ హాలియా: బాలకార్మిక వ్యవస్థ నిర్మూల నపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే పోలీస్ శాఖ పక్షాన నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపా రు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రకారం చిన్నారులను పనికి పంపినా,పనిలో పెట్టుకున్నా చట్టరీత్యా నేరస్తులవుతారని హెచ్చరించారు. ముఖ్యంగా మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లో బడిఈడు పిల్లలను పత్తి,బత్తాయి తోటల్లో కూలీలుగా పంపుతున్నారని పేర్కొన్నారు. వారిలో చైతన్యం కలిగించేందుకే తమ వంతు కృషిగా బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించాలని కోరారు. సమావేశంలో మిర్యాలగూడెం డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, హాలియా, మిర్యాలగూడెం, హుజూన్నగర్ సీఐలు ఆనందరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బల్వంతయ్య తదితరులు ఉన్నారు.