ఢిల్లీ చేరిన జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ | jail department cycle rally reached delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరిన జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ

Published Sun, Oct 18 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

jail department cycle rally reached delhi

సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలన, కాలుష్య నివారణ, జాతీయ సమైక్యత లక్ష్యంగా సెప్టెంబరు 30న హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న 12 మంది పోలీసు అధికారులు.. 1,875 కి.మీ. దూరాన్ని 18 రోజుల్లో పూర్తిచేశారు. ర్యాలీ పూర్తిచేసిన అధికారులకు రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఇండియా గేట్ వద్ద స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. జైళ్లను అవినీతి రహితంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఉపాధిలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని జైళ్లను సందర్శించినట్లు ర్యాలీలో పాల్గొన్న మహబూబ్‌నగర్ జైల్ సూపరింటెండెంట్ సంపత్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement