
పండుగలు, పార్టీల సమయంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాణాసంచా పేలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో కొందరు టపాసులు కాల్చే తొందరలో గాయపడిన ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ఓ వేడుకలో తాజాగా అలాంటి అనుభవమే బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. టపాసులు కాలుస్తూ ఆయన.. బోర్లాపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని సోనేపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్.. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయని చెప్పడానికి సంకేతంగా గ్రౌండ్‌లో బాణాసంచా కాల్చడానికి సిద్ధమయ్యారు. గ్రౌండ్ మధ్యలో ఓ టపాసును పెట్టి.. దాన్ని అగ్గిపుల్లలో అంటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టపాసుకు మంట అంటుకున్న వెంటనే.. పరుగు తీశారు.
తాను అంటించిన టపాసు.. తనపైకే వస్తుందనుకున్నాడో ఏమో పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పడంతో బొక్కబోర్లాపడిపోయి మొహం పగలగొట్టుకున్నారు. ఇంతలో ఎమ్మెల్యే అంటించిన టపాసు.. భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
#Bihar
— Ashish Mishra (@AshishMisraRBL) October 18, 2022
वायरल वीडियो बिहार के सोनपुर जिले का है. यहां एक फुटबॉल मैच के उद्घाटन के दौरान पटाखा जला कर भागते पूर्व बीजेपी विधायक विनय सिंह गिर पड़े. #Viral #Video #BJP #MLA pic.twitter.com/Y6AfCnKzVP
Comments
Please login to add a commentAdd a comment