Vinay kumar singh
-
వీడియో: క్రాకర్ కాల్చేందుకు ఎమ్మెల్యే తిప్పలు.. పరుగుతీసి బోర్లాపడి..
పండుగలు, పార్టీల సమయంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాణాసంచా పేలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో కొందరు టపాసులు కాల్చే తొందరలో గాయపడిన ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ఓ వేడుకలో తాజాగా అలాంటి అనుభవమే బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. టపాసులు కాలుస్తూ ఆయన.. బోర్లాపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సోనేపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్.. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయని చెప్పడానికి సంకేతంగా గ్రౌండ్లో బాణాసంచా కాల్చడానికి సిద్ధమయ్యారు. గ్రౌండ్ మధ్యలో ఓ టపాసును పెట్టి.. దాన్ని అగ్గిపుల్లలో అంటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టపాసుకు మంట అంటుకున్న వెంటనే.. పరుగు తీశారు. తాను అంటించిన టపాసు.. తనపైకే వస్తుందనుకున్నాడో ఏమో పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పడంతో బొక్కబోర్లాపడిపోయి మొహం పగలగొట్టుకున్నారు. ఇంతలో ఎమ్మెల్యే అంటించిన టపాసు.. భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Bihar वायरल वीडियो बिहार के सोनपुर जिले का है. यहां एक फुटबॉल मैच के उद्घाटन के दौरान पटाखा जला कर भागते पूर्व बीजेपी विधायक विनय सिंह गिर पड़े. #Viral #Video #BJP #MLA pic.twitter.com/Y6AfCnKzVP — Ashish Mishra (@AshishMisraRBL) October 18, 2022 -
‘ఆ టీవీ చానల్ చేసిన తప్పేంటి?’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. వినయ్ కుమార్ సింగ్‌కు ఎంత ధైర్యముంటే ఒక మీడియా సంస్థను కించపరుస్తూ ప్రకటన విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా హౌస్‌ను సెక్స్ వర్కర్ అని అనటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా సంస్థను అనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. యధా రాజా తథా అధికారి అన్నవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రిపోర్టర్ని వంద అడుగుల లోతుకు పాతిపెడతా అన్నారని, ఈ రోజు జైళ్ల డీజీ మీడియా సంస్థను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘హెచ్‌ఎమ్‌టీవీ చేసిన తప్పేంటి?. చంచల్ గూడ జైల్ నుంచి పట్నాకు టేకును తరలించినందుకు స్టోరీ వేసింది. నువ్వు తప్పు చేయకుంటే హెచ్‌ఎమ్‌టీవీపై ఫిర్యాదు చెయ్యి.. లేదా ఇండియన్ జర్నలిస్టు యూనియన్‌కు, ప్రెస్ కౌన్సిల్ యూనియన్‌కు ఫిర్యాదు చెయ్యి, లేక కేసు పెట్టు. వినయ్ కుమార్ సింగ్ వ్యాఖ్యలు ఒక్క హెచ్‌ఎమ్‌టీవీపైనే చేసిన వ్యాఖ్యలుగా మేము భావించటం లేదు. అన్ని మీడియా సంస్థలను వినయ్ కుమార్ సింగ్ తిట్టినట్లే మేము భావిస్తున్నాం. డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే వినయ్ కుమార్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. వినయ్ కుమార్ సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ‘ఎన్నికల సంఘానికి గులాబీ చీడ పట్టింది. రాష్ట్రంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సాక్ష్యం. మేము ఎంతగా మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదు. పోలింగ్ బూత్, బ్యాలెట్ పేపర్లకు గులాబీ రంగు కావాలని ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సంఘం ఇలా చేయటం కంటే గులాబీ పార్టీకే ఓటు వేయమని చెబితే మేలు కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాపై అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది. ఎన్నికల సంఘం గులాబీ పార్టీకి గులాంగా పనిచేస్తోంద’ని శ్రావణ్ ఆరోపించారు. -
ఢిల్లీ చేరిన జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలన, కాలుష్య నివారణ, జాతీయ సమైక్యత లక్ష్యంగా సెప్టెంబరు 30న హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల సైకిల్ ర్యాలీ శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న 12 మంది పోలీసు అధికారులు.. 1,875 కి.మీ. దూరాన్ని 18 రోజుల్లో పూర్తిచేశారు. ర్యాలీ పూర్తిచేసిన అధికారులకు రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఇండియా గేట్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. జైళ్లను అవినీతి రహితంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీలకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఉపాధిలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని జైళ్లను సందర్శించినట్లు ర్యాలీలో పాల్గొన్న మహబూబ్‌నగర్ జైల్ సూపరింటెండెంట్ సంపత్ తెలిపారు. -
ప్రజల మన్ననలు పొందాలి
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని అదనపు డీజీపీ వినయ్‌కుమార్‌సింగ్ పోలీసు సి బ్బందికి హితబోధచేశారు. పోలీసు కార్యాలయాలు రక్షణకేంద్రాలుగా, అభిమానించే ఆలయాలుగా విలసిల్లాలని ఆకాంక్షించా రు. శనివారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌తో కలి సి శాంతిభద్రతలపై సమీక్షించారు. పతి గ్రామాన్ని పోలీసు అధికారులు తమ కనుసన్నల్లో ఉంచుకుని, శాంతిభద్రతలను కా పాడేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రజలను గౌరవించడంలో, వారికి అన్యా యం అందించడంలోనూ పేద, ధనికతేడా లు అనే లేకుండా సమన్యాయంతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని కేసుల పరిశోధన అంశాలపై ఆయన అధికారులతో చర్చిస్తూ పలు సూ చనలు చేశారు. ఉత్తమసేవలకు గుర్తింపు లభిస్తుందని, ఒక కేసు పరిశోధనలో విజ యం సాధించడం, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం అందించడంలో కలిగే ఆత్మ సంతృప్తికి మించింది లేదన్నారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అదనపు డీజీపీ సం తృప్తి వ్యక్తంచేశారు. అనంతరం జిల్లాలో ప్రత్యేకంగా ఆవిష్కరించిన మహిళా రక్షణపై కరపత్రాలు, మావోయిస్టుల అరాచకాలను ఖండిస్తూ ముద్రించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అత్యంత అవసరమైన విషయాల పట్ల ప్రచారాలను నిర్వహిస్తున్న ఎస్పీని ప్రత్యేకంగా అభినందించా రు. ఇదే సందర్భంగా ఇటీవల ఇండియ న్ పోలీస్ మెడల్ పొందిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ను జిల్లా పోలీసు అధికారుల సంఘం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, ఓఎస్డీ డీఎస్పీ లు కమలాకర్‌రెడ్డి, మల్లికార్జున, గోవింద్‌రెడ్డి, ఆంథోనప్ప, శ్రీనివాసరావు, ద్రోణాచార్యులు, భరత్‌లు పాల్గొన్నారు.