మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని అదనపు డీజీపీ వినయ్‌కుమార్‌సింగ్ పోలీసు సి బ్బందికి హితబోధచేశారు. పోలీసు కార్యాలయాలు రక్షణకేంద్రాలుగా, అభిమానించే ఆలయాలుగా విలసిల్లాలని ఆకాంక్షించా రు. శనివారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌తో కలి సి శాంతిభద్రతలపై సమీక్షించారు.
పతి గ్రామాన్ని పోలీసు అధికారులు తమ కనుసన్నల్లో ఉంచుకుని, శాంతిభద్రతలను కా పాడేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రజలను గౌరవించడంలో, వారికి అన్యా యం అందించడంలోనూ పేద, ధనికతేడా లు అనే లేకుండా సమన్యాయంతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని కేసుల పరిశోధన అంశాలపై ఆయన అధికారులతో చర్చిస్తూ పలు సూ చనలు చేశారు. ఉత్తమసేవలకు గుర్తింపు లభిస్తుందని, ఒక కేసు పరిశోధనలో విజ యం సాధించడం, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం అందించడంలో కలిగే ఆత్మ సంతృప్తికి మించింది లేదన్నారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అదనపు డీజీపీ సం తృప్తి వ్యక్తంచేశారు.
అనంతరం జిల్లాలో ప్రత్యేకంగా ఆవిష్కరించిన మహిళా రక్షణపై కరపత్రాలు, మావోయిస్టుల అరాచకాలను ఖండిస్తూ ముద్రించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అత్యంత అవసరమైన విషయాల పట్ల ప్రచారాలను నిర్వహిస్తున్న ఎస్పీని ప్రత్యేకంగా అభినందించా రు. ఇదే సందర్భంగా ఇటీవల ఇండియ న్ పోలీస్ మెడల్ పొందిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ను జిల్లా పోలీసు అధికారుల సంఘం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, ఓఎస్‌డీ డీఎస్పీ లు కమలాకర్‌రెడ్డి, మల్లికార్జున, గోవింద్‌రెడ్డి, ఆంథోనప్ప, శ్రీనివాసరావు, ద్రోణాచార్యులు, భరత్‌లు పాల్గొన్నారు.
ప్రజల మన్ననలు పొందాలి
Published Sun, Feb 2 2014 4:03 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement