మహిళే సమిధ | small reasons attempting the suicide... | Sakshi
Sakshi News home page

మహిళే సమిధ

Published Sat, Dec 21 2013 3:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

small reasons attempting the suicide...

ఏడడుగుల వివాహ బంధం.. చిన్న చిన్న కారణాలతో ఛిద్రమవుతోంది. ఆలూమగల మధ్య స్పర్ధలు పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఈ తగాదాల్లో ఎక్కువగా మహిళలే సమిధలుగా మిగులుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. ఏడాదిలో 245 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
 మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలతోనే తమ బంధాలను తెంచేసుకుంటున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలే ఇం దుకు కారణంగా కనిపిస్తోంది. పేదరికం, నిరక్ష్యరాస్యత, చుట్టుముట్టిన సమస్యలను పరి ష్కరించుకోలేకపోవడం..తమకు ఎవరూ లేర నే భావన మహిళలను ఆత్మహత్యలవైపు పురి గొల్పుతోంది. మద్యపానమూ కాపురాల్లో చిచ్చుపెడుతోంది. చాలా మంది దంపతులు తమ సమస్యలు నాలుగుగోడల మధ్య పరిష్కరించుకోలేక పోలీసుస్టేషన్ల గుమ్మం తొక్కుతున్నారు. న్యాయస్థానాల తలుపుతడుతున్నారు. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకుం టున్నారు. సర్దుకుపోలేక హత్యలు, ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల వీటి సంఖ్య పెరిగింది.
 
 వి విధ పోలీసు స్టేషన్లు ఫరిధిలో 70 శాతం కేసు లు కేవలం కుటుంబ తగాదాలవే నమోదవుతున్నాయి. జిల్లాలో భార్యభర్తల గొడవలకు సంబంధించి ఏడాదికి 800కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది భర్త, అత్తిం టి వారి వేధింపులకు తాళలేక 108 మంది మహిళలు బలవన్మరణాలకు  పాల్పడ్డారు. గ త సెప్టెంబర్ వరకు పోలీసు రికార్డులను పరి శీలిస్తే వరకట్నం కోసం 18 మంది వివాహిత లు హత్యకు గురయ్యారు. మరో 28 మంది అ దనపు కట్నం ఇచ్చుకోలేక ఆత్మహత్యలకు పా ల్పడ్డారు. వరకట్న వేధింపులతో 108 మంది ఆత్మహత్యలు జరిగాయి. జిల్లా ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 245 మంది వివిధ ప్రాంతలకు చెందిన మహిళలు మృతి చెందారు. వీరంతా కుటుంబ కల హాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డవారే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement