మన్ననలు పొందాలి | Serve to guide the police to keep the public well | Sakshi
Sakshi News home page

మన్ననలు పొందాలి

Published Sun, Jan 12 2014 3:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Serve to guide the police to keep the public well

 పోలీస్ బాస్ ప్రసాదరావు జిల్లాల్లో శనివారం కలియదిరిగారు. మూడు పోలీస్టేషన్లను , ‘కాప్స్’ సంక్షేమనాకి పెద్దపీట వేస్తూ క్యాంటిన్‌భవనాన్నీ ప్రారంభించారు. పోలీసులకు మార్గదర్శనం చేస్తూ ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలని కోరారు. సిబ్బంది కుటుంబీకుల గోడునూ విన్నారు. పోలీసింగ్ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు.
 
 మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజల మన్ననలు పొందాలని, నేరాలను అదు పు చేసేందుకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బీ.ప్రసాదరావు సూ చించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బం ది తమ విధుల అలసత్వం వహించకూడదని, అప్పుడే నేరాలను అదుపుచేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు.
 
 శనివారం ఆయన జిల్లాలోని షాద్‌నగర్ రూరల్ , పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌లతో పాటు జిల్లాకేంద్రంలో నూతన సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)ను ప్రారంభించా రు. అలాగే పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి.నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీజీపీ మా ట్లాడుతూ..రాత్రివేళల్లో గస్తీ నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
 మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు మారాలని సూచించారు. నేరస్తులు చాలా తెలివిగా సైబ ర్‌నేరాలు, దొంగతనాలు, దోడీపీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారని, వారి ఆట కట్టించేందుకు పోలీసు యంత్రాం గం కూడా దీటుగా వ్యవహరించాలని కోరారు. బాలికలు, మహిళల పై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరి గిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యువత చెడుమార్గల వైపు దృష్టి మరల్చకుండా తల్లిదండ్రుల పెంపకం కూడా ఓ కారణమవుతుందన్నారు. పోలీసులు గ్రామీణ ప్రాంతప్రజలకు నిర్భయ, పాక్సో చట్టాలపై అవగాహన కలిగించేందుకు విసృ్తతస్థాయి ప్రచారం కల్పించాలని కోరారు.  
 
 సమస్యల ఏకరువు
 పోలీసు కుటుంబాలకు చెందిన పలువు రు మహిళలు తమ సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సతీమణి సౌ మిని ప్రత్యేకంగా వారితో  సమావేశమై స మస్యలను ఆలకించారు. పోలీసు కుటుం బాలకు ఇళ్లస్థలాల కేటాయింపు, సిబ్బం ది పిల్లల చదువులకు కావాల్సిన సౌకర్యాలు, సిబ్బందికి అందిస్తున్న టీఎల పెంపుదల వంటి వాటిని త్వరగా తీర్చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి ఇళ్లస్థలాలపై చర్చిస్తున్నామని, విద్యావైద్య సదుపాయలపై కచ్చితమైన నిర్ణయం తీసుకుని న్యాయం చేసేందుకు కృషిచేస్తామని డీజీపీ హామీఇచ్చారు.
 
 డీజీపీకి ఘన స్వాగతం
 డీజీపీ ప్రసాద్‌రావు తొలిసారి జిల్లాకేం ద్రానికి వచ్చిన సందర్భంగా పూర్ణకుంభిషేకంతో పురోహితులు ఆయనకు ఘనం గా స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, స్థానిక ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పూలబొకేలు అందించారు. పోలీసుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్టేషన్‌లోని కంప్యూటర్ సెక్షన్, అధికారుల చాంబర్‌లను ప్రా రంభించారు. గదులు, లాకప్‌లను పరిశీ లించారు. ఫిర్యాదుదారులకు ఏర్పాటుచేసిన ప్రత్యేకగది, విజిటర్స్ గదులను గమనించారు.
 
 అనంతరం ఆయన సతీమణి చేతులమీదుగా పోలీస్‌క్యాంటిన్‌ను ప్రా రంభించారు. పోలీసు కుటుంబాలకు స రసమైన ధరల్లోనే అన్నిరకాల సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణలను సమకూర్చినట్లు డీజీపీ తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆ యన కోరారు. అంతకుముందు ఆయన పీఎస్ ఆవరణలో మొక్కలునాటారు. అ నంతరం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ట్రా ఫిక్ పోలీస్‌స్టేషన్,పోలీసుకంట్రోల్‌రూం, హాంగార్డు బిల్డింగ్‌లకు శంకుస్థాపనలు చేశారు.  కార్యక్రమంలో డీఐజీ నవీన్‌చం ద్, ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డిఎస్పీ మల్లికార్జున్, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement