Prasad rao
-
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
సిక్కోలు పొద్దుపొడుపు వంగపండు
సిక్కోలు సమరాన ధిక్కార స్వరమొకటి విశాఖ ఉక్కయిన ఆంధ్రుల హక్కొకటి ఎడతెగని సంద్రాన ఎదురెల్లె నావొకటి అడిగాయిలే నిన్ను వంగపండూ– నీ కలము నుండి జారి పడుకుంటూ జానెడు కడుపునకై దారబోసిన చెమట దేహమే కంజరయి ధన ధన సప్పుడట కాళ్లగజ్జెలు ఘల్లు నెమలితో పోటీపడి చేతి అందెల మోగె వంగపండు– నీ గుండె చప్పుడును వినుకుంటూ ఏం పిల్లడోయని ఎలుగెత్తి పాడినా ఎల్దమస్తవంటు రమ్మని అడిగినా యంత్రాల పాటతో మంత్రముగ్దుల జేసె కథ జెప్తవా వింటాను వంగపండు– నా రెండు కండ్లు జూస్తె చాలకుండూ ఎవరు దోసుకు పోని ఆటపాటల మూట ఆస్తులుగ పిల్లలకు పంచిపోయావంట సీమల దండులో సిలుకలా గుంపులో సాగిపోతివ నీవు వంగపండు వంగె పొద్దులో వర్ణాలు జూసుకుంటూ కాలమే కడుపుతో కన్నకవులెందరో మేరిమి కొండల్లో మెరుపులింకెందరో జముకు జనరాగంగా అందియలు మోగంగ ఉర్రూతలూగెనట ఉత్తరాంధ్ర– నీ చరితనే దేశము చదువుతుండా సలాములే నీకు వంగపండు – పాట సలాములె నీకు వంగపండు లాల్సలాములే నీకు వంగపండు– ఆట సలాములే నీకు వంగపండు – మిత్ర (నేడు విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి) -
‘విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు. -
మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత
-
‘పుర’ జనులది కూడా గ్రామీణుల బాటే!
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టనున్నారన్న విషయం సుస్పష్టమయింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు జరగనున్న ఎన్నికల్లోనూ వైసీపీనే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విపక్షాలు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే మట్టికరిచాయి. అన్ని సామాజిక వర్గాల్లోని పేదలూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలన్నింటిలో వైఎస్ జగన్ నాయకత్వమే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శరణ్యమని ప్రజల్లో గట్టి నమ్మకంగా నిలిచింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ టీడీపీ చేపట్టిన అమరావతి ఉద్యమం బూటకమని, దీనికి ప్రజామద్దతు లభించలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అమరావతిలోనూ 80 శాతానికి పైగా పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించడం నిజం. ప్రభుత్వమంటే కాగితాల మీద పంచరంగుల సింగపూర్, మలేషియా చిత్రాలతో మాయ చేయడం కాదని, ప్రజల్ని పంచప్రాణాలుగా పరిరక్షించుకుంటున్న జగన్ పాలనే నిజమైన ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారు. లక్షలాది మంది పట్టణ పేదలకోసం ప్రభుత్వం సంక్షేమపథకాలు అమలుచేస్తోంది. వీటిలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్ కానుక, కాపునేస్తం, పేదలందరికీ ఇల్లు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతిదీవెన, చేయూత, వాహనమిత్ర, విద్యాకానుక, జీవక్రాంతి పథకాలు, డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా, విద్యా, వైద్య సంస్థల్లో ‘నాడునేడు’ పథకం ద్వారా అభివృద్ధి పనులు వంటి వాటితోపాటు ఇప్పుడు అగ్రకుల పేద మహిళలకు సైతం ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించనుంది. అభివృద్ధి పనులను విమర్శించడం తప్ప ప్రజలకు ముఖం చూపించలేకపోతున్న టీడీపీ నాయకులు ఇక పుర ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగగలరనే ప్రశ్నగా మిగులుతుంది. పుర ఎన్నికల సందర్భంగా టీడీపీనేత లోకేష్ తన ఎన్నికల మేని ఫెస్టో ప్రకటించారు. దీనిలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తామని పేర్కొన్నారు. నేటి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులు తీసుకెళ్ళి అందజేస్తుంటే దీనిని కోట్లాది రూపాయల దుబారా ఖర్చుగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఫలహారాలు, భోజనాలు ఉచితంగా సంతర్పణ చేయడం దుబారా ఖర్చు కిందకు ఎందుకు రాదో వారు గుర్తించగలగాలి. ఆటో డ్రైవర్లకు తమ వాహనాలను బాగుచేసుకోమని పదివేల రూపాయల సహాయాన్ని అందిస్తే విచ్చలవిడిగా డబ్బు విసిరేస్తున్నారని ఎద్దేవా చేసిన టీడీపీనేతలు ఇప్పుడు శాశ్వత ఆటో స్టాండ్లు నిర్మిస్తామనే విషయాన్ని తెరమీదకు తీసుకురావడం విడ్డూరం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకు అందించిన సున్నావడ్డీ రుణాలు, పట్టణపేదలకు టీడ్కో ఇళ్లని లోకేష్ తన మేనిఫెస్టోలో పేర్కోవడం హాస్యాస్పదం. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో అవిశ్రాంతమైన సేవలందించిన పారి శుధ్య కార్మికులకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, అధికారులతో అభినందన కార్యక్రమాలు నిర్వహించింది జగన్ ప్రభుత్వం. అంతేగాక వారికి బీమాతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు లోకేష్ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామనడం చాలా వింతగా వుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. అభాగ్యులకు అన్నక్యాంటీన్లు, ఆడపడుచులకు పసుపు, కుంకుమ సౌభాగ్యంగా అందించినా గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది టీడీపీ. పారదర్శకంగా అమలు జరుగుతున్న పేదల సంక్షేమం మీద దుష్ప్రచారం చేయడం దినచర్యగా టీడీపీ నేతలు ఆచరిస్తున్నట్టు కనిపిస్తోంది. నిరంతరం నిరాధారమైన, నీతిలేని విమర్శలు కొనసాగిస్తూనే వున్నారు. పురఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టనున్న అఖండ విజయాన్ని కూడా కళ్ళారా చూసిన తర్వాతైనా వాళ్ళ వైఖరి మారుతుందేమో వేచిచూడాలి. డా. జీకేడీ ప్రసాద్‌రావు వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఏయూ, విశాఖపట్నం మొబైల్ : 93931 11740 -
వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలింపు
-
ప్రక్షాళన చేస్తాం
కడప అర్బన్: రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ప్రక్షాళనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జాయింట్ కమిషనర్ (జేటీసీ) ఎస్ఏవీ ప్రసాద్‌రావు తెలిపారు. కడప డీటీసీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఐదు లక్షల గల్లంతు సంఘటనపై విచారణ జరిపేందుకు సోమవారం ఆయన స్థానిక డీటీసీ కార్యాలయానికి వచ్చారు. పలు రికార్డులను పరిశీలించడంతో పాటు డీటీసీ శ్రీకృష్ణవేణితో పాటు ఏఓ ఇక్బాల్ అహ్మద్‌ను, సిబ్బందిని విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీటీసీ కార్యాలయంలో అసిస్టెంట్ల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయానికి నేరుగా వాహనదారులు వచ్చి తమకు కావాల్సిన సేవలను పొందవచ్చన్నారు. స్థానికంగా ఏదైనా పొరపాటు జరిగితే మార్పులు, చేర్పుల కోసం హైదరాబాదులోని ప్రధాన కార్యాలయంలో ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ సర్వీసు (పీఎంఎస్) విభాగాన్ని ఈ ఏడాది ప్రారంభించామన్నారు. ఈ విభాగాన్ని అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేశామన్నారు. అధికారులందరూ తమకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చట్టపరమైన చ ర్యలు తప్పవన్నారు. రూ. 5 లక్షల గల్లంతుపై సమగ్ర విచారణ డీటీసీ కార్యాలయంలో అకౌంటెంట్ చక్రపాణి తన బీరువాలో ఉంచి వెళ్లిన రూ. 5 లక్షలు గల్లంతైన సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని జాయింట్ కమిషనర్ ప్రసాద్‌రావు తెలిపారు. రూ. 5 లక్షలు ఏ విధంగా మాయమైంది? ఎలా జమ చేసింది? చక్రపాణి పాత్ర ఏ మేరకు ఉంది? అనే విషయాలపై తాము సమగ్రంగా విచారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ శ్రీకృష్ణవేణి, కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్రమణ్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
నేరాలు, చోరీలకు చెక్
జగిత్యాల/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: వివిధ రకాలైన నేరాలతో పాటు బ్యాంకుల్లో, వ్యాపార సంస్థల్లో జరుగుతున్న చోరీలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. ఈమధ్య కాలంలో బ్యాంకులు, నగల దుకాణాల్లో జరుగుతున్న చోరీల్లో స్థానిక పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి కొత్తగా పబ్లిక్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్యాంకు లు, వ్యాపార సముదాయాల్లో సంఘటనలు జరిగినప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అలారం మోగే ప్రక్రియకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. దీనికితోడు స్థానికంగా సెక్యూరిటీ విభాగాల్ని ప్రైవేట్, పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నారు. వీటన్నింటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. జగిత్యా ల, గొల్లపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాలను ప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం పోలీస్హెడ్కార్వర్స్లో కంట్రోల్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ ఆయన సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో హెలిక్యాప్టర్ ద్వారా జాయింట్ ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది పోలీసు సిబ్బంది భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దశలవారీగా నియామకాలు జరుగుతాయని అన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై సేవాదృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించాలన్నారు. బాధితుడికి న్యాయం చేయడమే పోలీసుల కర్తవ్యం కావాలన్నారు. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. ఒకవేళ తలదూర్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చెందాలి తాను పనిచేసినప్పటికీ, ఇప్పటికీ కరీంనగర్ జిల్లా బాగా ప్రగతి సాధించిందని డీజీపీ అన్నారు. వ్యవసాయ రంగంలో జిల్లా బాగా అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులున్న కరీంనగర్ ఇండస్ట్రీయల్ హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యేల ఎల్.రమణ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ రవిగుప్తా, డీఐజీ భీమానాయక్, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల డీఎస్పీలు పరమేశ్వరెడ్డి, దామెర నర్సయ్య, సీఐ నరేష్కుమార్ తదితరులున్నారు. ఎస్పీ కృషి భేష్ డీజీపీ ప్రశంస టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: ఆధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎస్పీ శివకుమార్ కృషి ప్రశంసనీయమని డీజీపీ బి.ప్రసాద్‌రావు అన్నారు. ప్రజలకు మరింత చేరువై సేవలందించడంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. కరీంనగర్ పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్, ఈ-శోధన టెక్నాలజీని ఆదివారం ఆయన ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల అదుపు కోసం మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అవాంఛనీయ సంఘటనలు జరిగి నప్పుడు వాటి రికార్డులు నేర పరిశోధనకు తోడ్పడుతాయన్నారు. ఈ-శోధన టెక్నాలజీలో పోలీసు సమాచారాన్ని పొందుపరచి, వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయడం వల్ల వివిధ రకాల సేవలు సత్వరం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కోర్టు కేసులు, పోలీసుల పనితీరు, ఆన్లైన్ వెరిఫికేషన్, పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ, స్టేషన్ల రిపోర్టును ఎప్పటికప్పుడు సరిచూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో అరవై రక్ష క్ పెట్రోలింగ్ వాహనాలుండగా, జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాటిని అనుసంధానం చేయడం జరిగిందన్నారు. -
ఏసీబీ డీఎస్పీగా నంజుండప్ప
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా నంజుండప్పను నియమిస్తూ డీజీపీ ప్రసాద్‌రావు ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావును విశాఖ రూరల్ ఓఎస్డీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌లో ఉన్న 1985వ బ్యాచ్‌కు చెందిన నంజుండప్పను నియమించారు. గతంలో తిరుమల డీఎస్పీగా ఆయన పని చేశారు. -
కబ్జాదారులకు కలతనిద్రే!
కంచె లేని స్థలం కన్పిస్తే.. తెల్లారేసరికి ఎవరో ఒకరు హద్దులు పాతుతారు.. హద్దులున్నా.. కూల్చేసి ఆక్రమిస్తారు.. వీరికి అండగా కంటిచూపుతో అవతలి పార్టీని బెదిరిస్తారు ఇంకొందరు.. రాజకీయ జోక్యంతో సమస్య ముదురుపాకాన పడుతుంది. ఈ క్రమంలో దాడులు.. ప్రతిదాడులు.. ఇదీ భూ కబ్జాల్లో కన్పించే వరుస. కొందరు పనిగట్టుకుని సమస్యను జఠిలం చేస్తుంటారు. పోలీసులు కల్పించుకుంటే ‘సివిల్ తగదా’ అంటారు. ఓ రకంగా చెప్పాలంటే భూకబ్జాదారులకు అడ్డూఅదుపూ కరువైంది. ఇలాంటి మదపుటేనుగులను అదుపు చేసేందుకు పోలీసులు ఓ అంకుశానికి పదును పెడుతున్నారు. అదే హిస్టరీషీట్. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: కేసు నమోదు, రౌడీషీట్ తెరవడం.. మనం వీటినే విన్నాం. కానీ పోలీసు యంత్రాంగం కొత్తగా ‘హిస్టరీషీట్’పై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. భూ కబ్జాదారులు(ల్యాండ్గ్రాబర్లు)పై దీన్ని ప్రయోగిస్తారు. హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ విధానాన్ని జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి భూ సంబంధ లావాదేవిల్లో పోలీసులు అనుసరించాల్సిన ప్రత్యేక ప్రామాణిక కార్యచరణ, నిబంధనలపై డీజీపీ ప్రసాద్‌రావు ఆదేశాలు జారీ చేశారు. -
వైభవంగా ధ్వజారోహణం
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని శ్రీవిజయదుర్గాదేవి ఆలయ ద్వాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి మూలమూర్తికి వేదయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకారం చేశారు. వేదపండితులు రాయపెద్ది సుబ్బరాయశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఫణిభూషణశర్మల బృందం ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్‌రావు, తమ కుటుంబ సభ్యులు, భక్తులతో కలిసి మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం వాస్తుపూజ నిర్వహించారు. ఉదయం 11గంటలకు ధ్వజస్థంభం వద్ద పూజలు నిర్వహించి సింహం చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా ధ్వజపూజలో వినియోగించిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు కొడిముద్దలుగా అందజేశారు. అనంతరం యాగశాలలో చండీహోమం, నవావరణ శ్రీచక్రార్చన నిర్వహించారు. రాత్రి అమ్మవారిని సింహవాహనంపై అలంకరించి ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు చర్యలు : డీజీపీ
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించేందకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. డీజీపీ తిరుపతి నుంచి రోడ్డుమార్గాన శనివారం సా యంత్రం 5.45 గంటలకు నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుం టూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, విజిలెన్స్ అధికారులు, పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసు కవాతుమైదానంలో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల తీరు, తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కాప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 175 కిలోమీటర్ల మేర జాతీయరహదారి విస్తరించి ఉందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయన్నారు. వాటిని నియంత్రించేందుకు హైవేపై పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికే పోలీసు సిబ్బంది విసృ్తత తనిఖీలు, దాడులు నిర్వహించి స్మగ్లర్ల భరతం పడుతున్నారన్నారు. పూర్తిస్థాయిలో స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా యూనిక్ నంబర్‌ను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రిటైర్డ్ సిబ్బందిని పర్యవేక్షణ అధికారులుగా నియమించి వారి సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.సివిల్ వివాదాల్లో తలదూర్చరాదని, అలాంటి సమస్యలు వస్తే లోక్‌అదాలత్‌కు పంపాలని అధికారులను ఆదేశించామన్నారు. వైట్‌కాలర్ నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా సిబ్బంది లేరన్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 35 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. జిల్లా తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్న సంకేతాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అందులో భాగంగానే ఇస్కపల్లి, దుగ్గరజాపట్నం, శ్రీహరికోటల్లో మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. క్యాప్ సందర్శన డీజీపీ బి.ప్రసాద్‌రావు తన సతీమణి బి.సౌమిణితో కలిసి కొండాయపాళెం గేటు సమీపంలోని పోలీసు అండ్ ైచె ల్డ్ ప్రాజెక్ట్(క్యాప్)ను శనివారం రాత్రి సందర్శించారు. పోలీసు హాస్టల్లోని విద్యార్థులకు కంప్యూటర్లు, మంచాలు, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, నగర, రూరల్ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు. -
బదిలీల వేళ
సాక్షి, నల్లగొండ: జిల్లాలో అధికారుల బదిలీల వాతావరణం వేడెక్కింది. దీర్ఘకాలి కంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న క్రమంలో సీట్లలో పాతుకపోయిన, స్థానిక అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధముండే ఆయా శాఖ లకు బదిలీల సెగ తాకింది. మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికార యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు జరుగుతోంది.సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్, ఎంపీడీఓలకూ స్థానచలనం ఉండేలా జాబితా రూపుదిద్దుకుంటోంది. ఈ బాధ్యతలను ఆయా ఆర్డీఓలకు జిల్లా యంత్రాంగం అప్పజెప్పింది. అలాగే పోలీసు శాఖలో సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్లు)లు, ఎస్ఐ (సబ్ ఇన్స్పెక్టర్ల)ల జాబితా తయారు చేస్తున్నారు. ఈ జాబితాలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదముద్ర పడడ మే తరువాయి బదిలీలు జరుగుతాయి. అయితే ఓటర్ల తుది జాబితా వెలువడే వరకు బదిలీలకు అవకాశం లేదు. ఈ మేరకు నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా బదిలీ ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. బదిలీ అయిన అధికారులు ఫిబ్రవరి 11వ తే దీన కొత్తస్థానాల్లో ఆసీనులవుతారు. ఎంపీడీఓలకూ..? ఎన్నికల వేళ అధికారులు సొంత జిల్లాలో పనిచేస్తే పక్షపాతంగా వ్యవహరిస్తారన్న ఉద్దేశంతో ప్రతి రెవెన్యూ, పోలీస్ అధికారులను ఈసీ బదిలీ చేస్తుంది. ఈసారీ అందుకు తగ్గట్టుగానే రంగం సిద్ధమవుతోంది. త్వర లో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి బదిలీల జాబితాలోకి ఎంపీడీఓలు చేరే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సంఖ్య సరిపోరని భావిస్తే ఇతర అధికారుల అవసరం ఏర్పడనుంది. అప్పుడు ఎంపీడీఓలకు బదిలీ తప్పదు. వీరికీ స్థానచలనం... జిల్లాలో 18 మంది డిప్యూటీ, స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదుగురికి స్థానచలనం లభించనున్నట్లు సమచారం. భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మధుకర్‌రెడ్డి, సీతారామరాజు, శేఖర్‌రెడ్డి జిల్లాకు చెందిన వారే. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ నాటికి కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదరావు జిల్లాలో విధులు నిర్వహించడం మూడేళ్లు పూర్తవుతుంది. ఈయనా బదిలీ కావొచ్చు. జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేసిన తహసీల్దార్ల సంఖ్య బాగానే ఉంది. వీరికి తోడు ఇదే జిల్లాకు చెందిన వారు స్థానికంగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. ఇలా దాదాపు 40మంది వరకు తహసీల్దార్లు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీడీఓల అవసరం ఏర్పడితే.. ఇంచుమించుగా వారుఉ కూడా అంతే సంఖ్యలో బదిలీ అవుతారు. మరోవైపు పోలీస్ శాఖలోనూ పెద్దఎత్తున బదిలీలు జరగనున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలు, సీఐలకు స్థానచలనం తథ్యం. మొత్తం మీద పోలీసుశాఖలో 40 మందికిపైగానే బదిలీ కానున్నట్లు తెలిసింది. -
విద్యార్థుల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని నింపాలి
-
అద్వితీయం
-
మన్ననలు పొందాలి
పోలీస్ బాస్ ప్రసాదరావు జిల్లాల్లో శనివారం కలియదిరిగారు. మూడు పోలీస్టేషన్లను , ‘కాప్స్’ సంక్షేమనాకి పెద్దపీట వేస్తూ క్యాంటిన్‌భవనాన్నీ ప్రారంభించారు. పోలీసులకు మార్గదర్శనం చేస్తూ ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలని కోరారు. సిబ్బంది కుటుంబీకుల గోడునూ విన్నారు. పోలీసింగ్ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజల మన్ననలు పొందాలని, నేరాలను అదు పు చేసేందుకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బీ.ప్రసాదరావు సూ చించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బం ది తమ విధుల అలసత్వం వహించకూడదని, అప్పుడే నేరాలను అదుపుచేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు. శనివారం ఆయన జిల్లాలోని షాద్‌నగర్ రూరల్ , పెద్దమందడి పోలీస్స్టేషన్లతో పాటు జిల్లాకేంద్రంలో నూతన సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)ను ప్రారంభించా రు. అలాగే పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి.నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీజీపీ మా ట్లాడుతూ..రాత్రివేళల్లో గస్తీ నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు మారాలని సూచించారు. నేరస్తులు చాలా తెలివిగా సైబ ర్‌నేరాలు, దొంగతనాలు, దోడీపీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారని, వారి ఆట కట్టించేందుకు పోలీసు యంత్రాం గం కూడా దీటుగా వ్యవహరించాలని కోరారు. బాలికలు, మహిళల పై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరి గిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యువత చెడుమార్గల వైపు దృష్టి మరల్చకుండా తల్లిదండ్రుల పెంపకం కూడా ఓ కారణమవుతుందన్నారు. పోలీసులు గ్రామీణ ప్రాంతప్రజలకు నిర్భయ, పాక్సో చట్టాలపై అవగాహన కలిగించేందుకు విసృ్తతస్థాయి ప్రచారం కల్పించాలని కోరారు. సమస్యల ఏకరువు పోలీసు కుటుంబాలకు చెందిన పలువు రు మహిళలు తమ సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సతీమణి సౌ మిని ప్రత్యేకంగా వారితో సమావేశమై స మస్యలను ఆలకించారు. పోలీసు కుటుం బాలకు ఇళ్లస్థలాల కేటాయింపు, సిబ్బం ది పిల్లల చదువులకు కావాల్సిన సౌకర్యాలు, సిబ్బందికి అందిస్తున్న టీఎల పెంపుదల వంటి వాటిని త్వరగా తీర్చాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి ఇళ్లస్థలాలపై చర్చిస్తున్నామని, విద్యావైద్య సదుపాయలపై కచ్చితమైన నిర్ణయం తీసుకుని న్యాయం చేసేందుకు కృషిచేస్తామని డీజీపీ హామీఇచ్చారు. డీజీపీకి ఘన స్వాగతం డీజీపీ ప్రసాద్‌రావు తొలిసారి జిల్లాకేం ద్రానికి వచ్చిన సందర్భంగా పూర్ణకుంభిషేకంతో పురోహితులు ఆయనకు ఘనం గా స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, స్థానిక ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పూలబొకేలు అందించారు. పోలీసుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్టేషన్‌లోని కంప్యూటర్ సెక్షన్, అధికారుల చాంబర్లను ప్రా రంభించారు. గదులు, లాకప్‌లను పరిశీ లించారు. ఫిర్యాదుదారులకు ఏర్పాటుచేసిన ప్రత్యేకగది, విజిటర్స్ గదులను గమనించారు. అనంతరం ఆయన సతీమణి చేతులమీదుగా పోలీస్క్యాంటిన్ను ప్రా రంభించారు. పోలీసు కుటుంబాలకు స రసమైన ధరల్లోనే అన్నిరకాల సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణలను సమకూర్చినట్లు డీజీపీ తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆ యన కోరారు. అంతకుముందు ఆయన పీఎస్ ఆవరణలో మొక్కలునాటారు. అ నంతరం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ట్రా ఫిక్ పోలీస్‌స్టేషన్,పోలీసుకంట్రోల్రూం, హాంగార్డు బిల్డింగ్‌లకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డీఐజీ నవీన్చం ద్, ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డిఎస్పీ మల్లికార్జున్, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సడలని సంకల్పం సమైక్య దీక్షలు ప్రారంభం
కర్నూలు, న్యూస్‌లైన్: తెలుగుజాతిని విడదీయవద్దంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరశిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సమైక్యవాదుల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. 7వ తేదీ నుంచి 10 వరకు తాలుకా కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి. ఆలూరు అంబేద్కర్ సర్కిల్ ఆవరణలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, బీసీ సెల్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ప్రారంభించారు. పది మంది దీక్షల్లో పాల్గొన్నారు. ఆదోని బీమా సర్కిల్లో దీక్షలను స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, విశ్వనాథగౌడ్ ప్రారంభించారు. మహిళా విభాగం కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో బీవీ.రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు. డోన్ పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద మండల మాజీ అధ్యక్షుడు శ్రీరాములు ప్రారంభించిన దీక్షల్లో ఐదుగురు నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. కోడుమూరు పాతబస్టాండ్‌లో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టగా 11 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో మండల కన్వీనర్ బసిరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో గోనెగండ్ల మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజే వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. -
ఆర్సీఐలో ఘనంగా ‘డీఆర్డీవో డే ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)లో బుధవారం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీజీపీ తన పరిశోధన ‘వ్యతికరణం, వివర్తనం-ఓ కొత్త సిద్ధాంతం’పై ఈ సందర్భంగా సాంకేతిక ప్రదర్శన ఇచ్చారు. ఆర్సీఐ డెరైక్టర్ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే శాస్త్ర పరిశోధనలు నిర్వహిస్తున్నందుకు డీజీపీ ని అభినందించారు. సమష్టి కృషితో ఆర్సీఐని ప్రపంచస్థా యి ప్రయోగశాలగా నిలబెట్టగలమన్నారు. సమస్యలను సమష్టిగా అధిగమిద్దాం శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సమష్టిగా కృషి చే యాలని డీజీపీ పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బం దితో పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆందోళనల వల్ల సిబ్బంది తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పటికీ సమర్ధవంతంగా పనిచేశారని డీజీపీ ప్రశంసించారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీస్‌కే కౌముది, అదనపు డీజీలు ఏఆర్ అనురాధ, సురేంద్రబాబు, వీకే సింగ్, గోపికృష్ణ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. -
సీమాంధ్రలో భద్రత పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో భద్రతాచర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కేటాయిస్తూ డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, రీజియన్ ఐజీలు ఉన్నప్పటికీ సీనియర్ అధికారులను జిల్లాలకు పంపారు. రీజియన్ ఐజీలు ఖచ్చితంగా ఆ రీజియన్‌లోనే ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు ఆయా జిల్లాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతారనే సమాచారం నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. 12వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంకానున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, విద్యార్ధి, యువజన జేఏసీలు ఆందోళనలకు ప్రణాళికను ప్రకటించాయి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి హోంమంత్రి చిదంబరంచేసిన ప్రకటనకు నిరసనగా 9వ తేదీని విద్రోహ దినంగా ప్రకటించాలని ఇప్పటికే అన్ని జేఏసీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే 24 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే. -
ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం: డీజీపీ
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటామని డీజీపీ ప్రసాద రావు అన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన డీజీపీల సదస్సులో పాల్గొన్న ప్రసాద రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. డీజీపీల సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్చించామని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించినట్టు ప్రసాద రావు తెలిపారు. ఎలాంటి సమస్యనయినా క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం వచ్చిందని వెల్లడించారు. కాగా ఇదే సమావేశంలో పాల్గొన్న ఐబీ చీఫ్ ఆసిఫ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల భద్రతకు సవాల్ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
బస్సు యజమానులపై చర్యలు: మంత్రి బొత్స
సాక్షి, హైదరాబాద్: వోల్వో బస్సు ప్రమాద కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బస్సు యాజమాన్యంపైన కేసులు నమోదు చేస్తామని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సంయుక్త రవాణా కమిషనర్ ప్రసాద్‌రావు సమర్పించే ప్రాథమిక నివేదిక ఆధారంగా, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం వాహనం ఎవరి పేరుతో రిజిస్టర్ అయి ఉంటే వారిపైనే కేసులు ఉంటాయన్నారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. దివాకర్ ట్రావెల్స్‌పై కేసులు పెడతారా అన్న ప్రశ్నకు కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం వాహన యజమానిపైనే చర్యలు తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, రెండవ డ్రైవర్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా బస్సులో ఎక్కువమందిని ఎక్కించుకోవడం వంటి ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. సీఎంవీ రూల్స్ ప్రకారమేగాక ప్రయాణికుల మరణానికి కారకులైన వారందరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని తెలిపారు. ఈ సంఘటనపై కర్ణాటక అధికారులు సైతం దర్యాఫ్తు ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో వెళ్లవద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే పయనించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 బస్సులు స్వాధీనం: కాగా తాజా బస్సు దుర్ఘటనతో కళ్లు తెరిచిన రవాణాశాఖ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విజయనగరం, నెల్లూరు, కడప, ఖమ్మం, తదితర జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు. 25 బస్సుల ను స్వాధీనం చేసుకున్నారు. -
అంకితభావం అలవర్చుకోవాలి: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బాధితులలో ధైర్యాన్ని నింపి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కొత్త డీఎస్పీలకు గవర్నర్ నరసింహన్ సూచించారు. అంకి త భావం, పారదర్శకత అలవరచుకోవాలని కోరా రు. 9వ బ్యాచ్‌కు చెందిన 59 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి సవాల్‌గా మారిన ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులకు సంబంధించిన నేరాలను శిక్షణలో తొలిసారిగా భాగస్వామ్యం చేయడాన్ని గవర్నర్ ప్రశంసించారు. పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు అన్నారు. గడచిన ఏడాది కాలంలో వెయ్యి మంది ఎస్ఐలకు శిక్షణ ఇచ్చామని అప్పా డెరైక్టర్ మాలకొండయ్య తెలిపారు. అప్పాలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ తొలి పోలీసు కమిషనర్ రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి విగ్రహాన్ని గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కాగా, శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు డీఎస్పీలకు గవర్నర్ ట్రోఫీలు అందించారు. క్రిమినాలజీలో డాక్టర్ జి.ప్రేమ్ కాజల్, ఫైరింగ్‌లో జి.చక్రవర్తి, అవుట్ డోర్ విభాగంలో జి.వెంకటరాముడు ట్రోఫీలు అందుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రావణి పలు ట్రోఫీలతో పాటు సీఎం రివాల్వర్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు పాల్గొన్నారు. -
పొదుపుతోనే అభివృద్ధి
కడపసిటీ, న్యూస్‌లైన్: ప్రజలు పొదుపు చేయడం ద్వారానే అభివృద్ధి పథంలో పయనించగలరని సిండికేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ప్రసాద్‌రావు తెలిపారు. నగర శివార్లలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం సిండికేట్ బ్యాంక్ 88వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార ఈ సందర్భంగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రజలు పొదుపు చేస్తూనే తమవంతు రుణాలు కూడా పొందవచ్చన్నారు. స్విస్ట్ ఛెర్మైన్ రాజోలు వీరారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సెక్యూరిటీ లేకున్నా రుణాలు అందించాలని కోరారు. మాజీ జెడ్పీ వైస్‌ఛెర్మైన్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలు విరివిగా రుణాలు పొందగలుగుతున్నారన్నారు. సిండికేట్ బ్యాంక్ ఏజీఎం నాగమల్లేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డి, రవిశంకర్, రాంప్రసాద్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్విస్ట్ విద్యార్థులు రక్తదానం చేశారు. -
పదోన్నతుల కోసం పోలీసుల నిరీక్షణ
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితితో తీవ్ర జాప్యం ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం! సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ లో ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు పదోన్నతుల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి పంపినా ఆయన ఫైళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన డీజీపీ ప్రసాదరావు అయినా తమ పదోన్నతులపై స్పందిస్తారని వారు ఆశిస్తున్నారు. 1989 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు.. ప్రస్తుతం ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తుండగా వారికి డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ఈ బ్యాచ్‌కి చెందిన కొంతమందికి ఇప్పటికే పదోన్నతి లభించగా.. మరో వంద మందికి డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం లేద ని వారు వాపోతున్నారు. సీనియారిటీ లిస్టు తయారీలో జాప్యం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తిందనే వాదన ఉంది. సీనియారిటీ జాబితాలో ఇబ్బందులను తొలగించేందుకు ఐచ్చిక జాబితాను తయారు చేయాలని హైకోర్టు 2009లో పోలీసు శాఖను ఆదేశించింది. ఒకే బ్యాచ్ వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేంజ్‌లలో ఒకేసారి పదోన్నతి కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ ఐచ్చిక సినియారిటీ జాబితా తయారుచేయకుండానే ఈ ఏడాది వరకూ పదోన్నతులు కల్పించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది మార్చిలో ఐచ్ఛిక సినియారిటీ జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తేనే ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సుమారు 40 డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరితోపాటు, అన్ని విభాగాలలో సుమారు 45 అదనపు ఎస్పీ పోస్టులు, మరో 30 నాన్ కేడర్ ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.