కంచె లేని స్థలం కన్పిస్తే.. తెల్లారేసరికి ఎవరో ఒకరు హద్దులు పాతుతారు.. హద్దులున్నా.. కూల్చేసి ఆక్రమిస్తారు.. వీరికి అండగా కంటిచూపుతో అవతలి పార్టీని బెదిరిస్తారు ఇంకొందరు.. రాజకీయ జోక్యంతో సమస్య ముదురుపాకాన పడుతుంది. ఈ క్రమంలో దాడులు.. ప్రతిదాడులు.. ఇదీ భూ కబ్జాల్లో కన్పించే వరుస. కొందరు పనిగట్టుకుని సమస్యను జఠిలం చేస్తుంటారు. పోలీసులు కల్పించుకుంటే ‘సివిల్ తగదా’ అంటారు. ఓ రకంగా చెప్పాలంటే భూకబ్జాదారులకు అడ్డూఅదుపూ కరువైంది. ఇలాంటి మదపుటేనుగులను అదుపు చేసేందుకు పోలీసులు ఓ అంకుశానికి పదును పెడుతున్నారు. అదే హిస్టరీషీట్.
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: కేసు నమోదు, రౌడీషీట్ తెరవడం.. మనం వీటినే విన్నాం. కానీ పోలీసు యంత్రాంగం కొత్తగా ‘హిస్టరీషీట్’పై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. భూ కబ్జాదారులు(ల్యాండ్‌గ్రాబర్లు)పై దీన్ని ప్రయోగిస్తారు. హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ విధానాన్ని జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి భూ సంబంధ లావాదేవిల్లో పోలీసులు అనుసరించాల్సిన ప్రత్యేక ప్రామాణిక కార్యచరణ, నిబంధనలపై డీజీపీ ప్రసాద్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
కబ్జాదారులకు కలతనిద్రే!
Published Mon, Feb 17 2014 3:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement