కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు రిలే దీక్షలను బుధవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలను చేయనున్నారు.
హైదరాబాద్: కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు రిలే దీక్షలను బుధవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలను చేయనున్నారు.
సుమారు 50 మంది బాధితులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలతో అరెస్టైన మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.