
కరీంనగర్‌క్రైం: ఎంబీబీఎస్ చదవడం కష్టంగా ఉందని మానసిక ఒత్తిడికి గురైన ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కోమళ్ల ప్రహ్లాదరావు–పద్మజ దంపతులు నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు.
కూతురు కోమళ్ల శిరీష(20) కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువు కష్టంగా ఉందని పలుమార్లు శీరీష తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శిరీష శనివారం ఉద యం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
తల్లి పద్మజ మధ్యా హ్నం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరేసుకొని ఉండటాన్ని చూసి ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment