Firecracker
-
స్నేహితుల పందెం.. బాణాసంచా డబ్బాపై కూర్చొని వ్యక్తి మృతి
స్నేహితులతో చేసిన సరదా పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. బెంగళూరులో కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్న స్నేహితుడికి ఆటో కొనిస్తామని ఆశపెట్టి అతడి మృతికి కారణమయ్యారు. దీపావళి రోజు బాణాసంచాతో నిండిన డబ్బాపై కూర్చుంటే ఆటో కొనిస్తామని ఆశపెట్టారు. అయితే అధిక మొత్తంలో బాంబులు ఒకేసారి పేలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటన బెంగళూరు- కోననకుంటెలో చోటుచేసుకుంది. కోననకుంటెలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా . శబరీష్, అతని స్నేహితులతో కలిసి టపాసులు కాల్చుతున్నారు.మద్యం మత్తులో ఉన్న శబరీష్‌ను బాణాసంచా పెట్టిన డబ్బాపై కూర్చుంటే ఆక్షా కొనిస్తామని స్నేహితులు ఆశచూపారు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న శబరీష్ కొత్త ఆటో వస్తది కదా అని అనుకొని ఆ సవాల్‌ను స్వీకరించాడు. పందెం ప్రకారం శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు.ఆ తర్వాత ఆ ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లారు.శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మరణించాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని ఆఖరికి ప్రాణాలు వదిలాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
వ్యాపారం.. వెలగని భూచక్రం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలుసెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణాసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్‌సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.సంక్షేమం లేదు.. సంక్షోభమేగత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.విక్రయాలు భారీగా తగ్గాయిఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు. – గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేటఎక్కడా కనిపించట్లేదుఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. – ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్‌పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్‌పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్‌పే యాప్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్‌క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్‌పే యాప్‌లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్‌కు భారీగా దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐ -
ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు.మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఖార్ఖోడా తాలూకాలోని రిదౌ గ్రామంలో ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని హర్యానా పోలీసులు తెలిపారు. #WATCH | Sonipat, Haryana: 3 killed and 7 injured in an explosion in a house in Ridhau village of KharkhodaSonipat ACP Jeet Singh says, "Information was regarding a blast in a house and we have found material used in firecrackers from the spot.Some people said a cylinder… pic.twitter.com/j6olCoJNCc— ANI (@ANI) September 28, 2024 సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారని సోనెపట్ ఏసీపీ జీత్ సింగ్ చెప్పారు. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. పేలుడు సంభవించిన ఇంట్లో పటాకుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి చెందిన బృందం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. -
జపాన్‌లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!
రకరకాల జాతరలలో కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం మన దేశంలో ఉంది. ఇలా నిప్పుల మీద నడిచే ఆచారం జపాన్‌లోనూ ఉంది. జపాన్ ప్రజలు జరుపుకొనే ‘హక్కాయిసాన్’ పండుగ రోజున ఆరుబయట ఏర్పాటు చేసే అగ్నిగుండాల్లోని నిప్పుల మీద ఉత్తకాళ్లతో నడిచే ఆచారం ఉంది. ఈ పండుగను ఏటా వసంత రుతువులో ఒకసారి, శరదృతువులో మరోసారి జరుపుకొంటారు. మినామియువోనుమా నగరం శివార్లలో హక్కాయి కొండ దిగువన ఒసాకీ డ్యామ్ వద్దనున్న ‘హక్కాయిసాన్ సన్’ ఆలయం ఎదుట అగ్నిగుండాలను ఏర్పాటు చేసి, ఈ వేడుకను జరుపుకొంటారు. ఈసారి శరదృతువులో నిప్పుల మీద నడిచే పండుగను అక్టోబర్ 20న జరుపుకొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రార్థనలతో మొదలయ్యే ఈ కార్యక్రమంలో మొదటగా ఆలయ పూజారి అగ్నిగుండం మీదుగా 88 అడుగులు నడిచి, ఆలయంలోకి చేరుకుంటారు. ఆయన తర్వాత మిగిలిన జనాలు కూడా ఆయననే అనుసరిస్తూ నిప్పుల మీదుగా 88 అడుగులు నడిచి ఆలయంలోకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆహార సంబరాలు కూడా జరుపుకొంటారు. నూడుల్స్‌తో తయారు చేసే ‘సోబా’, గోధుమపిండి ఆక్టోపస్‌లతో తయారు చేసే ‘టకోయాకీ’ వంటి సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. నిప్పుల మీద నడవడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, కోరికలు ఈడేరుతాయని ఇక్కడి జనాలు నమ్ముతారు. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం!) -
భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..
ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్‌లోని ఓ ప్రైవేటు గోడౌన్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..) -
వీడియో: క్రాకర్ కాల్చేందుకు ఎమ్మెల్యే తిప్పలు.. పరుగుతీసి బోర్లాపడి..
పండుగలు, పార్టీల సమయంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాణాసంచా పేలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో కొందరు టపాసులు కాల్చే తొందరలో గాయపడిన ఘటనలు ఎన్నో చూసే ఉంటాము. ఓ వేడుకలో తాజాగా అలాంటి అనుభవమే బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. టపాసులు కాలుస్తూ ఆయన.. బోర్లాపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సోనేపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్.. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయని చెప్పడానికి సంకేతంగా గ్రౌండ్లో బాణాసంచా కాల్చడానికి సిద్ధమయ్యారు. గ్రౌండ్ మధ్యలో ఓ టపాసును పెట్టి.. దాన్ని అగ్గిపుల్లలో అంటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టపాసుకు మంట అంటుకున్న వెంటనే.. పరుగు తీశారు. తాను అంటించిన టపాసు.. తనపైకే వస్తుందనుకున్నాడో ఏమో పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పడంతో బొక్కబోర్లాపడిపోయి మొహం పగలగొట్టుకున్నారు. ఇంతలో ఎమ్మెల్యే అంటించిన టపాసు.. భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Bihar वायरल वीडियो बिहार के सोनपुर जिले का है. यहां एक फुटबॉल मैच के उद्घाटन के दौरान पटाखा जला कर भागते पूर्व बीजेपी विधायक विनय सिंह गिर पड़े. #Viral #Video #BJP #MLA pic.twitter.com/Y6AfCnKzVP — Ashish Mishra (@AshishMisraRBL) October 18, 2022 -
Tamil Nadu: బాణసంచా పరిశ్రమలో పేలుడు
సాక్షి, చెన్నై: ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా బాణసంచా తయారు చేస్తుండడం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. బాణసంచా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తమిళనాడులోని సాత్తూరులో జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, పేలుడు ధాటికి ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో కుటీర పరిశ్రమగా ఇళ్లలోనే బాణసంచా తయారీ జరుగుతోంది. సాత్తూరు సమీపంలోని కయాల్పట్టి కలైంజర్ నగర్లో అన్నదమ్ముళ్లయిన సూర్య, ప్రభాకరన్, అబ్బు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంట్లోనే టపాసులు తయారుచేస్తున్నారు. సోమవారం ఉదయం ముడిసరుకు సిద్ధం చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించారు. ఓ ఇంట్లోని శివమణి(35, అతని కుమారుడు రవి(5), శిథిలాలపై పడడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కర్పగం అనే మహిళ శరీరం చిద్రమైంది. సూర్య, ప్రభాకరన్ స్వల్ప గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో సెల్వమణి మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్బులును అరెస్టు చేయగా, ప్రభాకరన్, సూర్య కోసం గాలిస్తున్నారు. మరో ఘటన కడలూరు జిల్లా పల్లడంపేటకు చెందిన సెంథిల్ ఎలాంటి అనుమతి లేకుండా ఇంట్లో టపాసుల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. సోమవారం వేకువజామున ఆ ఇంట్లో పేలుడు చోటు చేసుకుంది. నాలుగు ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పరారీలో ఉన్న సెంథిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Tamil Nadu: An explosion took place at an illegal firecracker manufacturing factory, in Thaiyilpatti near Sivakasi in Virudhunagar district. Two dead, two injured. Rescue operations underway. pic.twitter.com/bXRXwS1vRr — ANI (@ANI) June 21, 2021 -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 7గురి మృతి
బుద్వాన్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బుద్వాన్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం, పేలుడు కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేలుళ్లతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకు పోయింది. సంఘటా స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారులు కూడా సహాయక చర్యల్నిపర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బాధితులకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి
హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. టపాసులు కాల్చుతున్న సమయంలో పలువురికి గాయాలయ్యాయి. కళ్లకు గాయాలైన పలువురు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దిపావళి సందర్భంగా అయిన కంటి గాయాలతో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వరంగల్‌కు చెందిన రాజేష్, సందీప్(మెదక్), శివ(హైదరాబాద్), సాయిగౌడ్ తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. ఇంకా గాయపడిన మరికొంతమంది నగరంలోని వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. -
ఉలిక్కిపడిన సిక్కోలు
వంగర: సిక్కోలు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఆరు నెలల క్రితం జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో ఇద్దరు మృత్యువాత పడగా పలువురు గాయపడిన ఘటనను మరచిపోకముందే అలాంటి ఘటనే వంగర మండలం మరువాడ పంచాయతీ కొత్త మరువాడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఎరుకుల కులస్తులైన గేదెల పోలీస్, భాస్కరరావులు ఎలాంటి అనుమతి లేకుండా తమ ఇళ్ల వద్ద వివాహాలు, పండుగలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం బాణసంచాను తయారు చేస్తుంటారు. ఇదే క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణసంచాను తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఏమి జరిగిందో తేలియక గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. బాణసంచా పేలిందని తెలుసుకొని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయన పదార్థాలు అధిక మోతాదులో వినియోగించడం, లేదా పొగత్రాగడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఏఎస్‌ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనలో బాణసంచా తయారీదారులైన పోలీస్, భాస్కరరావులతో పాటు అదే కుటుంబానికే చెందిన గేదెల శ్రీనివాసరావు, రాములమ్మలు, అక్కడే ఉన్న పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన చెవ్వూరు దుర్గారావు, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం జనార్థనవలస గ్రామానికి చెందిన ఇరువాడ గణపతి, ఆడుకోవడానికి వెళ్లిన కొత్తమరువాడ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక పోల అపర్ణ తీవ్రంగా గాయపడ్డారు. శరీరమంతా కాలిపోవడంతో క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో గేదెల భాస్కరరావు, శ్రీనివాసరావు, గణపతిరావు, అపర్ణల శరీరం ఎక్కువ శాతం కాలిపోయాయి. మరో ముగ్గురి పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనాల్లో క్షతగాత్రులను రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కలెక్టర్ పి.నరసింహం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌కు అంబులెన్స్‌ల్లో తరలిస్తుండగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో ఇరువాడ గణపతి(35) మృతి చెందగా, చిన్నారి అపర్ణ(6) విశాఖ కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచింది. ధ్వంసమైన ఇళ్లు పేలుడు ధాటికి గేదెల పోలీస్, భాస్కరావుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా పక్కనే ఉన్న గీరసన్యాసి శ్రీను ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రెండు మోటారు వాహనాలు, టీవీలు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, నిత్యావసర సరుకులు, తిండిగింజలు, దుస్తులు, వివిధ ధ్రువీకరణ పత్రాలతోపాటు పేలుడు పదార్థాలు ధ్వంసమయ్యాయి. రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా పేలుడు పదార్థాల గుర్తింపు సంఘటన స్థలాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డులో భారీగా నిల్వ చేసి ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. ట్రైనైట్రో టోలిన్, పాస్పరస్, అమోనియం, పొటాషియం, క్లోరైట్, గన్ ఫౌడర్, గంధకం, సురాకారం తదితర పేలుడు గుణం కలిగిన పదార్థాలను కనుగొన్నారు. ఇనుప చువ్వలు, ఇనుప తివ్వలు కుప్పలు ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బాణసంచా తయారీ కేంద్రానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల ఏజెంట్లు పేలుడు పదార్థాలను వీరికి సరఫరా చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల భయాందోళన బాణసంచా పేలుడుతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దానికి చిన్నపిల్లలు సైతం సమీప పంటపొలాల్లోకి పరుగులు పెట్టారు. కాసేపటికి బాణాసంచా తయారీ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగడంతో పెద్దవాళతా అక్కడకు చేరుకొని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాలిపోయిన వారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. శరీరం రక్తసిక్తమై శరీరాలను కుటుంబీకులు రోదించారు. పోల మహేష్, కుమారిలు పొలం పనులు కోసం వెళ్లడంతో వారి ఆరేళ్ల కుమార్తె అపర్ణ బాణసంచ తయారీ కేంద్రం వద్దకు వెళ్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూయడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాణసంచా అక్రమ తయారీదారులపై చర్యలు బాణసంచా అక్రమ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. కొత్తమరువాడలో పేలుడు స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్యాస్, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించలేదన్నారు. పేలుడు పదార్థాల వద్ద పొగ త్రాగడం లేదా బాణసంచా తయారీలో పేలుడుపదార్థాలను అధికంగా ఉపయోగించడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జి.సిగడాం మండలం పెనసాంలో ఇటువంటి దుర్ఘటన జరిగిన సందర్భంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దులో ఉన్న కొత్త మరువాడ గ్రామంలోని బాణసంచా అక్రమ తయారీదారులపై 2012లో వంగర పోలీసులు కేసులు నమోదు చేయగా, బలిజి పేట పోలీసులు రూ. 1.20 లక్షలు విలువ చేసే బాణసంచాను అప్పట్లో స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ముడిపదార్థాలు, పేలుడు పదార్థాలు బొబ్బిలి, విజయనగరం ప్రాంతాల నుం చి సరఫరా జరుగుతోందన్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బాణసంచా అక్రమ తయారీ కేంద్రాలు, వాటికి ముడిసరుకును సరఫరా చేసే ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్యాస్‌సిలిండర్ లీకైనందున, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కొంత మంది స్థానికులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. పాలకొండ ఆర్డీవో సాల్మాన్రాజ్, డీఎస్పీ ఆదినారాయణతోపాటు ఐదుగురు ఎస్సైలు, ఇరవై మంది పోలీసులు, రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, వైద్యసిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాజాం ఆస్పత్రిలో క్షతగాత్రులను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం పరామర్శించారు. ‘లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ బాణసంచా తయారీ కోసం లెసెన్స్ ఇవ్వాలని గతంలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గేదెల పోలీస్ భార్య లక్ష్మి ఎస్పీ ఖాన్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఎరుకుల కులస్తులమైన తమకు బాణసంచా తయారీయే జీవనాధారమని, మరో దిక్కులేదని వాపోయింది.