ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్‌లోని ఓ ప్రైవేటు గోడౌన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్‌లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు.
ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి.
భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..)
Comments
Please login to add a commentAdd a comment