బుద్వాన్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బుద్వాన్ జిల్లాలోని ఫ్యాక‍్టరీలో పేలుడు ఘటన జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం, పేలుడు కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది.
ఫ్యాక్టరీలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేలుళ్లతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకు పోయింది. సంఘటా స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారులు కూడా సహాయక చర్యల్నిపర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ ఎస్‌పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బాధితులకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment