several dead
-
ఇరాన్లో జంట పేలుళ్లు.. వందకుపైగా మృతులు!
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందగా.. 170 మంది తీవ్రంగా గాయడినట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు. 2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో ఖాసీం సులేమానీ మరణించారు. బుధవారం ఖాసీం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. ఖాసీం సులేమానీ జయంతి రోజే సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెర్మాన్ ప్రావిన్స్ చెందిన అధికారులు తెలిపారు. మరోవైప మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. Pics | 73 Dead In Twin Blasts Near Grave Of Iran's Top General Qassem Soleimani https://t.co/EbzhuEE70t pic.twitter.com/x7lIs1vtjD — NDTV (@ndtv) January 3, 2024 చదవండి: అమెరికాపై ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
రైలు, బస్సు ఢీ : 20 మంది మృతి
కరాచి: పాకిస్తాన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్‌లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుక్కూర్ పోలీసు ఏఐజీ జమీల్ అహ్మద్ డాన్ అందించిన సమాచారం ప్రకారం గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న తమ సిబ్బంది హుటాహుటిన రక్షణ, హాయక చర్యలు చేపట్టారని తెలిపారు. 45 పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా, మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. మరోవైపు రైలులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదమనీ సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మహేసర్ వెల్లడించారు. రైలు మూడు భాగాలుగా విడిపోయి, దాదాపు 150-200 అడుగుల మేర బస్సును రైలు లాక్కుపోయిందని తెలిపారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 7గురి మృతి
బుద్వాన్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బుద్వాన్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం, పేలుడు కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేలుళ్లతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకు పోయింది. సంఘటా స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారులు కూడా సహాయక చర్యల్నిపర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బాధితులకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. -
విమానం కూలి 200 మంది దుర్మరణం
-
ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన విమానం
అల్జీర్స్: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్ శివారులోగల బొఫరిక్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్టు పక్కనేఉన్న జనావాసాలపై విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. స్థానిక మీడియా కథనాల మేరకు.. బొఫరిక్ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ఆర్మీ ఆధీనంలో ఉంది. అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలించే కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతూఉంటుంది. ఆ క్రమంలో బుధవారం 100 మంది సైనికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టుకు సమీపంగా కూలిపోయింది. ఈ ఘటనలో సైనికులు, విమాన సిబ్బంది అందరూ చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిన ఇళ్లలోని ప్రజలను కలుపుకుంటే మృతుల సంఖ్య 200 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీనగర్ ఉపఎన్నిక రక్తసిక్తం
-
శ్రీనగర్ ఉపఎన్నిక రక్తసిక్తం
► పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారుల బీభత్సం ► భద్రతా బలగాల కాల్పులు.. ఎనిమిది మంది మృతి ► వందమందికి పైగా జవాన్లకు గాయాలు ► పోలింగ్ కేవలం 7.14 శాతం శ్రీనగర్/జైపూర్/భోపాల్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నిక రక్తసిక్తంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది ఆందోళనకారులు మృతిచెందారు. కాగా.. ఆందోళనకారుల విధ్వంసానికి బెడిసి ఓటర్లు బయటకు రాకపోవటంతో 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. శ్రీనగర్ నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళనకారులు గుంపులు గుంపులుగా వచ్చి పోలింగ్ బూత్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబులతో బీభత్సం సృష్టించారు. దీంతో వీరిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 8 మంది ఆందోళనకారులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లతో దాడికి పాల్పడటంతో 100 మందికి పైగా జవాన్లకు గాయాలయ్యాయని ఎన్నికల అధికారి వెల్లడించారు. భద్రతాదళాల కాల్పుల్లో బుద్గాం జిల్లా చరారే షరీఫ్, బీర్వా ప్రాంతాల్లో ఇద్దరేసి చొప్పున, చదూరాలో ఒక్కరు చనిపోగా, మాగం పట్టణంలో మరొకరు చనిపోయారు. హింసాత్మక ఆందోళనల కారణంగా 70 శాతం పోలింగ్ బూత్‌లలో పనిచేసేందుకు పోలింగ్ సిబ్బంది నిరాకరించారని అధికారులు వెల్లడించారు. కాగా, ఘర్షణలు తలెత్తిన దాదాపు వంద బూత్‌లలో ఏప్రిల్ 12న రీపోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, లోయలోని మరో సున్నిత ప్రాంతం అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. లోయలో విధ్వంసం బుద్గాం జిల్లా చరారే షరీఫ్‌లో ఓ పోలింగ్ బూత్‌లోకి వందల సంఖ్యలో చొచ్చుకు వచ్చిన ఆందోళనకారులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినా లాభం లేకపోయింది. దీంతో నేరుగా ఆందోళనకారులపైనే కాల్పులు జరిపారు. ఇందులో మొహ్మద్ అబ్బాస్ (20), ఫైజాన్ అహ్మద్ (15)లు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. బీర్వా ప్రాంతంలో పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులపై కాల్పులు జరపగా ఇద్దరు యువకులు మృతిచెందారు. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, బుద్గాం, గండేర్బాల్ జిల్లాల్లోని దాదాపు 25 చోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన కేసులు నమోదయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆందోళనకర పరిస్థితులకు జడిసి జనాలు పోలింగ్‌బూత్‌లకు రాలేకపోయారన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించటంలో సీఎం మెహబూబా ముఫ్తీ విఫలమయ్యారంటూ.. ఎన్సీపీ అధ్యక్షుడు, శ్రీనగర్ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థి ఫారూఖ్ అబ్దుల్లా విమర్శించారు. అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వరకు శ్రీనగర్‌లోనూ ఇంటర్నెట్ సేవలను రద్దుచేయనున్నారు. కాగా, ఎన్నికల ఘర్షణలో యువకులు ప్రాణాలు కోల్పోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు సోమ, బుధవారాల్లో లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు. మిగిలిన చోట్ల ప్రశాంతం శ్రీనగర్, మధ్యప్రదేశ్‌లోని రెండు స్థానాలు మినహా మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజస్తాన్ రాష్ట్రంలోని ఢోల్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీగా పోలింగ్æ నమోదైంది. ఇక్కడ పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరిగిన ఇతర స్థానాల్లో కర్ణాటకలో గుండుల్పేట్, ననజనగుడ్, అస్సాం రాష్ట్రంలోని ధేమాజీ, బెంగాల్‌లోని కాంతి దక్షిణ్, ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ తదితరాలు ఉన్నాయి. శ్రీనగర్‌లో గరిష్టం 26 శాతమే! జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నికలో కేవలం 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే.. ఈ నియోజకవర్గంలో గరిష్టంగా 26 శాతం పోలింగ్ నమోదైంది. అదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే. 1999లో జరిగిన ఎన్నికల్లో 11.93 శాతం పోలింగ్ నమోదవగా.. ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా చేతిలో ప్రస్తుత సీఎం మెహబూబా ముఫ్తీ ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా.. పీడీపీ నేత తారీక్ హమీద్ కర్రా చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో కర్రా పీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ–కాంగ్రెస్ ఘర్షణ మధ్యప్రదేశ్‌లోని అటెర్, బాంధవ్‌గఢ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చాలాసేపు బూత్‌లోనే ఉండటంతో బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం తెలపటంతో గొడవ మొదలైంది. పలు చోట్ల గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. -
ఇరాక్‌లో పేలుళ్లు..13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబుతో ముష్కరుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఇరాక్ పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబర్ ట్యాంకర్‌తో దూసుకొచ్చి పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి 15 వాహనాలు దగ్దమయ్యాయి. -
హోటల్లో అగ్నిప్రమాదం: 10 మంది మృతి
-
హోటల్లో అగ్నిప్రమాదం: 10 మంది మృతి
ఆగ్నేయ చైనాలోని నాన్‌చాంగ్ నగరంలో గల నాలుగు అంతస్థుల హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. హెచ్‌ఎన్‌ఏ ప్లాటినం మిక్స్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ హోటల్ చైనాలోని జియాంగ్జి రాష్ట్ర రాజధాని అయిన నాన్‌చాంగ్ నగరంలో ఉంది. మంటల్లో కాలిపోయిన హోటల్ శిథిలాల్లో ఏడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించగా, వాళ్లలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ హోటల్ పక్కనే ఉన్న 24 అంతస్తుల అపార్టుమెంటులో 260 మందికి పైగా ఉంటారు. వాళ్లందరినీ వెంటనే ఖాళీ చేయించారు. ఈ హోటల్ యాజమాన్యానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వారిలో ఐదుగురు మహిళలున్నారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి శివకాశిలో తయారయ్యే టపాసులు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేసే తమిళనాడులోని శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఇదే తరహా ప్రమాదం జరిగింది. శివకాశి శివార్లలో భారీస్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ చేసే ఓ గోడన్లో మంటలు చెలరేగాయి. అందులో దాదాపు 30 మంది వరకు పనివాళ్లు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, 20 వరకు ద్విచక్ర వాహనాలు కూడా తగలబడిపోయాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది.. దానికి కూడా మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పెద్దస్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగినట్లు తెలుస్తోంది. -
పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి.. ఆరుగురి మృతి
-
టర్కీలో నరమేధం
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి 41 మంది మృతి ఇస్తాంబుల్: టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఇస్తాంబుల్‌లో గల అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పది గంటలకు తుపాకులు, బాంబులతో విచక్షణారహితంగా విరుచుకుపడి మారణహోమానికి తెగబడ్డారు. ఈ ఉన్మాదానికి 41 మంది అమాయక ప్రజలు బలయ్యారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థేనని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల్లో 23మంది టర్కీ పౌరులు కాగా.. 13 మంది విదేశీ జాతీయులు ఉన్నారు. వారిలో పలువురు సౌదీ పౌరులతో పాటు చైనా, ట్యునీసియా, ఉక్రెయిన్ దేశస్తులు ఒక్కొక్కరు ఉన్నారు. టర్కీలో అతిపెద్దదే కాదు, యూరప్‌లో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మూడోది, ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న అటాటర్క్ విమానాశ్రయానికి ముగ్గ్గురు ఆత్మాహుతి బాంబర్లు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ట్యాక్సీలో చేరుకుని ఈ మారణహోమానికి తెరతీశారు. వారిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో ముగ్గురూ తమను తాము పేల్చేసుకున్నారని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుంది కచ్చితంగా ఎక్కడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఎవరూ ప్రవేశమార్గం దగ్గర భద్రతా తనిఖీల ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లలేదని.. ఇద్దరు ముష్కరులు అంతర్జాతీయ ఆగమనాల ప్రాంతంలో, మరొక ఉగ్రవాది పార్కింగ్ ప్రదేశంలో పేల్చేసుకున్నారని ఒక అధికారి చెప్పారు. అయితే.. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకున్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు ఎక్స్‌రే మిషన్ల సమీపంలో కాల్పులు జరిపారని హాబర్‌టర్క్ వార్తా పత్రిక తెలిపింది. ప్రాణభయంతో పారిపోతున్న ప్రయాణికులతో కలిసి పరిగెడుతున్న ఒక ఉగ్రవాదిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపటంతో అతడు వెలుపలికి వెళ్లే ద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని, మూడో ఉగ్రవాది ఒక అంతస్తు ఎక్కి అంతర్జాతీయ నిష్ర్కమణల ప్రాంతం వరకూ వెళ్లగా పోలీసులు కాల్పులు జరపటంతో తనను తాను పేల్చివేసుకున్నాడని పేర్కొంది. విమానాశ్రయ నిఘా వీడియో దృశ్యాలను సామాజిక వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఒక వీడియోలో మరొక ఉగ్రవాది పోలీసుల కాల్పులకు నేలకొరిగి తనను తాను పేల్చేసుకోవటం కనిపించింది. అలాగే ఒక ఉగ్రవాది ఏకే47 తుపాకులతో పరుగెడుతూ కాల్పులు జరపటమూ మరొక వీడియోలో కనిపించింది. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ముష్కరుల దాడులతో భీతిల్లి పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కన్నీళ్లతో కాలం గడిపారు. బుధవారం ఉదయానికి విమానాశ్రయాన్ని శుభ్రంచేసి మళ్లీ తెరిచారు. ఈ దాడికి పాల్పడింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ అని అంచనాలు చెప్తున్నట్లు ప్రధానమంత్రి బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యం కావాలని అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చారు. అయితే.. దాడి చేసింది తామేనని ఆ సంస్థ ప్రకటించలేదు. ఏదో ప్రవక్తలా నడుస్తూ కాల్చేశాడు... ‘నేను నా లగేజీని పెడుతున్నాను. అంతలో ఒక వ్యక్తి రహస్యంగా దాచిన తుపాకీ బయటకు తీయటం చూశాను. అతడు వెంటనే కాల్పులు జరపటం మొదలు పెట్టాడు. రెండు సార్లు కాల్పులు జరిపాడు. చాలా మామూలుగా జనాన్ని కాల్చివేస్తున్నాడు.. ఏదో ప్రవక్త లాగా నడుస్తూ కాల్చివేస్తున్నాడు’ అని ఓట్ఫా మొహమద్ అబ్దుల్లా అనే మహిళ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. అమానవీయం: రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ: ఈ దాడి అమానవీయం అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసి పోరాడాలన్నారు. మృతుల్లో భారతీయులు లేరని ప్రభుత్వం తెలిపింది. టర్కీలో ఏడాదిగా ఉగ్రవాద రక్తపాతం... పశ్చిమాసియా అస్థిరత టర్కీనీకబళిస్తోంది. ప్రభుత్వంతో పోరాడుతున్న కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ఉగ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ గత ఏడాది కాలంగా రక్తపాతం సృష్టిస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఉగ్రవాదులు దాదాపు 14 భారీ దాడులకు పాల్పడి 200 మందికి పైగా సామాన్య ప్రజల ప్రాణాలను హరించాయి. గత ఏడాది అక్టోబర్‌లో అంకారాలో ఐసిస్ జరిపిన దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియా తిరుగుబాటుదారులకు మద్దతిచ్చి... ముస్లిం ప్రజాస్వామ్య దేశమైన టర్కీకి ఈ ప్రాంతంలో విశిష్ట స్థానముంది. పొరుగు ముస్లిం దేశాలకు సాయం చేయటం ద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంటుంది. సిరియాలో ఐసిస్‌పై పోరాటంలో నాటో దళాలతో కలసి పనిచేస్తోంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినపుడు.. ఆ దేశాధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుడ్ని చేయటానికి మద్దతిస్తూ సిరియా రెబల్స్‌కు సాయం చేసింది.సిరియాలో ఐసిస్‌తో పోరాడుతున్న కుర్దు రెబల్స్‌కు అమెరికా మద్దతివ్వడంపై టర్కీ ఆగ్రహంగా ఉంది. టర్కీ ఆదాయ వనరుల్లో పర్యాటకం కీలకమైనంది. దేశంలో పర్యాటకానికి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం లాంటిది. ఈ ఏడాది పర్యాటక సీజన్ ఇప్పుడే మొదలైంది. దీంతో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చేందుకుఐసిస్ ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టుపై దాడి చేసుంటుందని భావిస్తున్నారు. అంతకుముందే బయల్దేరా: హృతిక్ ముంబై: ఈ దాడి నుంచి బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ త్రుటిలో బయటపడ్డారు. దాడికి కొద్ది గంటలముందు అక్కడి నుంచి వేరే విమానంలోవెళ్లారు. ‘నేను ఇస్తాంబుల్‌లో విమానం మారాల్సి ఉంది. కానీ సమయానికి చేరుకోలేకపోయాను. తర్వాతి విమానం మరుసట్రోజు ఉండటంతో ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సివచ్చేది. అక్కడి సిబ్బంది సాయం చేశారు. టికెట్ తీసుకుని కొన్నిగంటల ముందుబయల్దేరాను. దిగ్భ్రాంతికరమైన వార్త’ అని ట్వీట్ చేశారు. హృతిక్ తన కుమారులిద్దరితో మాడ్రిడ్ నుంచి ఆఫ్రికాకు వెళ్తూ ఇస్తాంబుల్‌లో ఆగారు. -
ప్రయాణికుల్ని పిట్టల్లా కాల్చి.. పేల్చేసుకున్నారు
ఇస్తాంబుల్: ఆసియా- యూరప్ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడుల్లో మరో 150 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బుల్లెట్ల వర్షం.. ఆపై మెరుపు లాంటి పేలుడు భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. కాగా, దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ దేశీయ సంస్థే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దేశాధినేతల అత్యవసర సమావేశం.. అంతర్జాతీయ సహకారానికి పిలుపు ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి బినాలి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన తైపీ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో మరీ ప్రధానంగా ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో జరిగిన పేలుడులో ఇద్దరికి గాయాలైన సంగతి తెలిసిందే. -
బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు.. 70మంది దుర్మరణం
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందినవారి సంఖ్య సోమవారానికి 70 కి చేరగా, 100 మంది వరకు గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. బాగ్దాద్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ మార్కెట్.. రెండు బాంబు పేలుళ్ల ఘటనతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. మార్కెట్లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. -
ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి
బాగ్దాద్: ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో 59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు. మార్కెట్లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. డోరా పట్టణంలో జరిగిన మరో పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. -
గతి తప్పిన విమానాలు.. ఘోరప్రమాదాలు
- ఇండోనేసియాలో ఇంట్లోకి దూసుకెళ్లిన సైనిక విమానం.. ముగ్గురి మృతి - సైనిక విమానం కూలి నలుగురు సైనికుల దుర్మరణం మలాంగ్/ నైపిడా: ఆగ్నేయ ఆసియా దేశాలైనా ఇండోనేసియా, మయన్మార్ లలో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇరు దేశాల్లోనూ కుప్పకూలినవి సైనిక విమానాలే కావడం గమనార్హం. రెండు దేశాల్లో కలిపి ఐదుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ఇండోనేసియా జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు. మయన్మార్ ప్రమాదం: సాధారణ పరీక్షల నిమిత్తం ఐదుగురు సైనికులు ఒక చిన్న తరహా విమానంలో రాజధాని నైపిడాలోని ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగి ఎయిర్ బేస్ కు సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు సైనికుల్లో నలుగురు మంటలల్లో కాలిపోగా, ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్టు అధికారులు చెప్పారు. మయన్మార్ పూర్తిగా కొండప్రాంతం కావడంతో భూతర రవాణా సౌకర్యాలు తక్కువ. దీంతో సాధారణ ప్రయాణికులు కూడా విమాన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అక్కడ తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. -
నైట్ క్లబ్లో పేలుడు, 27 మంది మృతి
రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 27 మంది మరణించారు, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతో పాటు బాగా పొగ అలముకోవడంతో క్లబ్లో ఉన్న 400 మంది ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి విపరీతమైన తొక్కిసలాట కూడా జరిగింది. క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటల్లో క్లబ్ సీలింగ్‌తో పాటు ఒక పిల్లర్ కూడా కాలిపోయింది. తర్వాత భారీ పేలుడు సంభవించి లోపలంతా పొగ అలముకుందని తెలిపారు. బయట ఫుట్‌పాత్ మీద పడి ఉన్న అనేకమందికి కృత్రిమంగా ప్రాణవాయువు అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రయత్నించారు. ఆ పరిసరాల్లో ఎక్కడ చూసినా అంబులెన్సుల సైరన్ల మోతే వినిపించింది. తొక్కిసలాట వల్లే బాగా ఇబ్బంది పడ్డామని కాళ్లకు బూట్లు కూడా లేకుండా బయటకు వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు. ఐదు సెకండ్లలోనే మొత్తం సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయని, ఒకే డోర్ ఉండటంతో దానిగుండానే అందరం బయటపడాల్సి వచ్చిందని మరో యువతి చెప్పింది. బుకారెస్ట్‌లో ఉన్న పది ఆస్పత్రులలో బాధితులను చేర్చినట్లు హోంశాఖ డిప్యూటీ మంత్రి రయీద్ అరాఫత్ చెప్పారు.