
కరాచి: పాకిస్తాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్‌లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుక్కూర్ పోలీసు ఏఐజీ జమీల్ అహ్మద్ డాన్ అందించిన సమాచారం ప్రకారం గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న తమ సిబ్బంది హుటాహుటిన రక్షణ, హాయక చర్యలు చేపట్టారని తెలిపారు. 45 పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా, మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. మరోవైపు రైలులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఇది చాలా భయంకరమైన ప్రమాదమనీ సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మహేసర్ వెల్లడించారు. రైలు మూడు భాగాలుగా విడిపోయి, దాదాపు 150-200 అడుగుల మేర బస్సును రైలు లాక్కుపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment