![Stampede at Liberia church gathering kills 29 - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/21/Stampede.jpg.webp?itok=LX3Hi4Lf)
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment