Liberia
-
15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’
సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ హైజాక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఎంవీ లీలా నార్ఫోక్(MV LILA NORFOLK) అనే లైబీరియన్ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న భారత నేవి అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు పేర్కొన్నారు. హైజాక్ అయిన షిప్, అక్కడి పరిస్థితులకు తెలుసుకోవడానికి కమ్మూనికేషన్ లింక్‌ను సృష్టించామని తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఇండియన్ నేవి పేర్కొంది. లైబీరియాన్ షిప్ హైజాక్ అయినట్లు గురువారం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్( UKMTO)కు సందేశం వచ్చిందని ఇండియాన్ నేవి తెలిపింది. ఆ షిప్లో ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు ఉన్నట్లు పోర్టల్‌కు వచ్చిన సందేశంలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ నేని.. ఎయిర్ క్రాఫ్ట్తో పర్యవేక్షిస్తూ ఐఎన్ఎస్ చెన్నైను సోమలియా సముద్ర తీరానికి పంపినట్లు తెలిపింది. చదవండి: అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు -
ఆయిల్ ట్యాంకర్ పేలి.. 40 మంది మృతి
మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్
లిబేరియా ఫుట్‌బాలర్ మహమ్మద్ అగోగో బారీ తన గర్ల్‌ఫ్రెండ్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం(జూన్ 6న) లిబేరియాలోని మోంట్సెరాడో కౌంటీ టౌన్లో జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బారీ తన ప్రియురాలి హత్య చేయడం వెనుక ఉన్న కారణాన్ని ఒక లెటర్ ద్వారా రివీల్ చేశాడు. తాను ఎంతగానో ప్రేమించిన లైమాస్(బారీ గర్ల్‌ఫ్రెండ్) వేరొకరితో సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు లెటర్లో పేర్కొన్నాడు. 'నా కుటుంబసభ్యులు, మిత్రులు చాలాసార్లు లైమాస్ విషయంలో హెచ్చరించినప్పటికి ఖాతరు చేయలేదు.ప్రాణం కన్నా ఎక్కువగా లైమాస్ను ప్రేమించాను. తాను మాత్రం వేరొకరితో అక్రమం సంబంధం పెట్టుకొని నన్ను దారుణంగా మోసం చేసింది. నా కెరీర్‌ను, జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అందుకే ఆమెను చంపి నా ప్రేమను సమాధి చేశాను. మీ మాట వినకుండా లైమాస్ను ప్రేమించి తప్పు చేసినందుకు క్షమించండి. నా జీవితంలో అన్ని కోల్పోయాను.'అంటూ పేర్కొన్నాడు. కాగా గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన అగోగో బారీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం లైమాస్ అంకుల్ గదిలోకి వచ్చి చూడగా ఆమె అప్పటికే విగతజీవిగా పడి ఉంది. కాగా ఆమె బాడీపై బారీ రాసిన లెటర్ కనిపించింది. లైమాస్ అంకుల్ ఆ లెటర్ చదివి తన కోడలిని హత్య చేసిందని బారీ అని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి లైమాస్ శరీరాన్ని పోస్టమార్టంకు తరలించారు. ఇక అగోగో బారీని పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
రోడ్డు పక్కన డబ్బుల సంచి.. కుర్రాడు చేసిన పనికి ఫిదా!
మనది కాని సొమ్ముపై మందికి ఆశ ఎక్కువ!. అయితే పేదరికంలో ఉన్నా ఆ యువకుడు నిజాయితీగా వ్యవహరించాడు. రోడ్డు పక్కన దొరికిన డబ్బుల బ్యాగ్‌ను.. ఎవరిదో వాళ్లకు అప్పగించేదాకా ఊరుకోలేదు. ఇందుకుగానూ అతను అందుకున్న ప్రతిఫలం.. బహుశా ప్రపంచంలో ఎవరూ అందుకోనంత విలువైనదేమో! ఆఫ్రికా దేశం లైబీరియాలో ఇమ్మాన్యుయెల్ టులోయి అనే 19 ఏళ్ల కుర్రాడు జీవిస్తున్నాడు. పేదరికం, తండ్రి చావు కారణాలతో.. తొమ్మిదేళ్ల వయసులో చదువు ఆపేశాడటను. డొక్కు మోటర్ సైకిల్‌ను ట్యాక్సీ సర్వీస్‌గా ఉపయోగించుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. వచ్చేది కొద్ది మొత్తమే కావడంతో పూట గడవడం అతనికి కష్టంగానే ఉంటుంది మరి. ఇలాంటి టైంలో.. ఓరోజు రోడ్డు పక్కన ప్లాస్టిక్ బ్యాగులో లైబెరియన్, అమెరికా కరెన్సీ నిండిన ఓ సంచి ఇమ్మాన్యుయెల్ కంట పడింది. దానిని అలాగే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి.. ఆపై వాళ్లు ఓనర్‌కు అప్పగించేదాకా అక్కడే ఉండిపోయాడు. అతని నిజాయితీకి మెచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే.. తినడానికి సరుకులు ఇవ్వమంటూ కోరాడు ఆ కుర్రాడు. దీంతో 1500 డాలర్ల విలువైన సరుకులను అతని కుటుంబానికి అప్పగించాడు ఆ డబ్బు ఓనర్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్స్‌తో పాటు దేశ అధ్యక్షుడు జార్జ్ వీ గేవ్ కూడా ఫిదా అయిపోయాడు. ప్రభుత్వం తరపునే కాదు.. స్థానిక మీడియా ఒకటి అతనికి ఆర్థిక సాయం అందించింది. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా?.. లైబీరియాలో ప్రతిష్టాత్మకమైన రిక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కూల్లో చేరాడు. అది సెకండరీ ఎడ్యుకేషన్ కోసం. చదువు అతనికి ఇష్టం. అందుకే.. పిల్లల మధ్య మొహమాటం లేకుండా కూర్చుంటున్నాడు. మరో ఆరేళ్లు చదివితేనే అతని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేది. కిందటి ఏడాది ఈ ఘటన జరగ్గా.. అతను స్కూల్లో చేరి చదువుకుంటున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
భారతీయులకు కృతజ్ఞతలు
కరోనా లాక్డౌన్ ఎక్కడి వాళ్లను అక్కడే ఆపేసింది. కరోనా వికటాట్టహాసాన్ని ఏ మాత్రం ఊహించని ప్రపంచం తన క్యాలెండర్‌ను తాను డిసైడ్ చేసుకుంది. ఆ క్యాలెండర్‌ను గోడ మీద నుంచి తీసి అటక మీద పెట్టమని డిక్లేర్ చేసింది కోవిడ్ 19. ఎటూ కదలకుండా ఉన్న చోటనే ఉండమని కాళ్లకు బంధనాలు వేసింది. కరోనా చెప్పినట్లే లైబీరియాకు చెందిన ఈ తల్లీబిడ్డలు ఉన్న చోటనే ఉన్నారు. ఆ ఉన్న చోటు వాళ్ల దేశం కాదు, మనదేశం. హార్ట్‌ఫుల్ ఆపరేషన్ రెండున్నర ఏళ్ల జిన్‌కు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. కొడుకుకి వైద్యం చేయించడానికి మార్చి రెండవ తేదీన ఇండియాకి తీసుకు వచ్చింది జెన్నీ పేయీ. అప్పటికి లాక్డౌన్ లేదు. కేరళ రాష్ట్రం, కొచ్చిలోని లిజీ హాస్పిటల్లో ఆపరేషన్. మార్చి 12వ తేదీ ఓపెర్ హార్ట్ సర్జరీ చేశారు. జిన్ ఆరోగ్యం మెరుగైంది. ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లడానికి ఏప్రిల్ రెండవ తేదీకి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చింది జెన్నీ. ఆ తేదీ నాటికి లాక్డౌన్లో చిక్కుకోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇరవై ఆరేళ్ల జెన్నీ పేయీ, రెండున్నరేళ్ల కొడుకు జిన్‌తో కలిసి ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉంది. ఆమె భర్త పీటర్ లైబీరియాలో ఉండిపోయాడు. బిడ్డకు గుండె ఆపరేషన్ చేస్తుంటే రావాలని లేని కఠినాత్ముడు కాదు పీటర్. ఆ దంపతులకు రెండోబిడ్డ జిన్. మొదటి బిడ్డను చూసుకుంటూ అతడు లైబీరియాలో ఉండిపోయాడు. అంతే కాదు, జిన్‌కు ఆపరేషన్ చేయించడానికి లైబీరియాలో వాళ్లు ఉంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు పీటర్. భార్యాబిడ్డలను ఇండియాకు పంపించడానికి అతడు ఓటీలు చేసి డబ్బు కూడబెట్టాడు. ఇప్పుడు కూడా అతడు అక్కడ అప్పు తీర్చడం కోసం ఎక్కువ గంటలు పని చేస్తూ ఉన్నాడు. కడుపులో పెట్టుకుని... జెన్నీ, జిన్లను లిజీ హాస్పిటల్ అతిథుల్లా చూసుకుంటోంది. వారు హాస్పిటల్ గదిలోనే ఉన్నారిప్పటికీ. ఆ గదికి చార్జ్ చేయకుండా ఉచిత బస కల్పించింది లిజీ హాస్పిటల్. భోజనం కూడా పెడుతోంది. వైద్య సిబ్బంది జెన్నీని, జిన్ను ఆదరంగా పలకరిస్తున్నారు. ‘‘వైద్యం కోసం వచ్చి మనదేశంలో చిక్కుకుపోయిన తల్లీబిడ్డల సంరక్షణ బాధ్యత మనదే. ఇంకా ఏమైనా కావాలంటే ఏర్పాటు చేయండి’’ అని స్థానికులు డబ్బు విరాళంగా ఇస్తున్నారు. లైబీరియా కాన్సులేట్ పర్యవేక్షిస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ మా దేశానికి వెళ్లేదెప్పుడు అని ఆందోళన పడుతోంది జెన్నీ. సహాయం చేయమని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటూ వీడియో సందేశం విడుదల చేసింది. లైబీరియా నుంచి పీటర్ కూడా అదే అభ్యర్థన చేస్తూ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో పీటర్ ‘తన భార్యాబిడ్డలను కన్నవాళ్లలా కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది ఇండియా’ అంటూ ఆర్ద్రంగా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇది ఆసియా– ఆఫ్రికా ఖండాల మధ్య లాక్డౌన్ సృష్టించిన అనుబంధం. -
26 మంది చిన్నారుల సజీవదహనం
మోన్రోవియా: లైబీరియా రాజధాని మోన్‌రోవియాలోని ఖురానిక్ స్కూల్లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు సజీవ దహనమయ్యారు. మొత్తం 28 మంది మృతి చెందారని దేశ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. ఘటనా స్థలాన్ని అధ్యక్షుడు సందర్శించారు. -
గుండెల్ని కాల్చి తిన్నాడు..!
వాషింగ్టన్: చేసిన పాపం ఊరికే పోదంటారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడి విషయంలో అదే రుజువైంది. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ మొహమ్మద్ జబ్బతెహ్(51) గతాన్ని వెలికితీసిన అమెరికా అధికారులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని పేర్కొన్నారు. లైబీరియాలోని ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్ అధికారులకు వెల్లడించలేదు. 2013లో జబ్బతెహ్ గతాన్ని గుర్తించిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.. అప్పట్లో జరిగిన మారణహోమం బాధితుల్ని సాక్షులుగా ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పలువురు సాక్షుల్ని విచారించిన ధర్మాసనం.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో జబ్బతెహ్‌ను గతేడాది అక్టోబర్‌లో దోషిగా తేల్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జబ్బతెహ్‌కు 30 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముందనీ, అలాగే అతణ్ని వెంటనే స్వదేశానికి పంపేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో గురువారం ఇక్కడి కోర్టు జబ్బతెహ్‌కు శిక్ష ఖరారు చేయనుంది. -
వాణిజ్య నౌకను ఢీకొన్న అమెరికా యుద్ధనౌక
సింగపూర్: దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా యుద్ధనౌక సోమవారం తెల్లవారుజామున ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతవగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికన్ నేవీ ఓ ప్రకటనను విడుదల చేసింది. సింగపూర్ లోని ఓడరేవుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు చెప్పింది. 30 వేల టన్నుల బరువుతో వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో తమ యుద్ధనౌక భారీగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఘటన జరిగిన వెంటనే రెస్య్కూ బోట్లు, ఓ హెలికాప్టర్ సాయం అందించేందుకు అక్కడికి హుటాహుటిన చేరుకున్నట్లు చెప్పింది. ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించింది. -
అమెరికాలో పైసా ఇవ్వరు
వివిధ దేశాల్లో ప్రసూతి సెలవుల తీరుతెన్నులు మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో ఈ సెలవులు మరీ దారుణం. అక్కడ 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా, పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. ⇒ స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు. ⇒ ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు. ⇒ తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. ⇒ దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. -
ఎబోలా’ పై ఎయిర్‌పోర్ట్‌లలో అప్రమత్తం
హైదరాబాద్: పశ్చిమాఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో ప్రయూణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. భారత్‌కు చెందిన చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారని, వారిద్వారా ఎబోలా వైరస్ వచ్చే అవకాశముందని పేర్కొంది. గినియా, లైబీరియా, నైజీరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయూల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. ఏపీకి పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కాస్త అనుమానాస్పదంగా ఉన్న 23 మందిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, ‘ఎబోలా’కు ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై కేంద్రం రాష్ట్రానికి చెందిన నలుగురు వైద్యులకు శిక్షణ నిచ్చినట్టు ఎబోలా వైరస్ నియంత్రణ నోడల్ అధికారి డా.లక్ష్మీ సౌజన్య తెలిపారు. -
'ఎబోలా’ భయంతో భారత్‌కు పయనం
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజంభిస్తుండటంతో అక్కడకు వలస వెళ్లిన భారతీయులు క్రమంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 91 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆరుగురు ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వారిని అధికారులు పరీక్షల నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా చేరుకున్న 85 మంది ప్రయాణికులను ఎయిర్పోర్ట్ ఆరోగ్య సంస్థ పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించింది. కాగా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాల వల్ల తలెత్తిన దుర్భర పరిస్థితులు ఈ వైరస్ విస్తరించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాయని బెల్జియం శాస్త్రవేత్త పీటర్ పయట్ అభిప్రాయపడ్డారు. ఎబోలా వైరస్‌ను 1976లో పీటర్ పయట్ గుర్తించారు. -
ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు
మొన్రోవియా(లైబీరియా): ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి లైబీరియా, సియోర్రాలిన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను మూసేస్తున్నారు. గనులు కూడా మూతపడుతున్నాయి. కూలీలు పొలాలకు వెళ్లకపోవడంతో పంటలు పొలాల్లోనే నాశనమవుతున్నాయి. కాగా, సియెర్రా లియోన్‌లోని ఒక బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణుడికి ఎబోలా సోకింది. -
లైబీరియాలో అమెరికా డాక్టర్‌కు ఇబోలా!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వైరస్ బారిన పడిన అమెరికన్ డాక్టర్ ఒకరు పూర్తిస్థాయిలో కోటుకుంటున్నారు. త్వరలోనే తన కుటుంబ సభ్యులను కూడా కలవాలనుకుంటున్నారు. అయితే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయని డాక్టర్ కెంట్ బ్రాంట్లీ చెప్పారు. త్వరలోనే తాను మళ్లీ తన భార్య, పిల్లలు, కుటుంబాన్ని కలుస్తానని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమాఫ్రికాలో విస్తృతంగా వ్యాపించిన ఇబోలా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు బ్రాంట్లీ వచ్చారు. అప్పుడే ఆయనకు ఇబోలా సోకింది. విషయం తెలియగానే ఆయనను అట్లాంటాలోని ఎమరీ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. బ్రాంట్లీతోపాటు నాన్సీ రైట్బోల్ అనే అమెరికన్‌కు కూడా లైబీరియాలో ఉండగా ఇబోలా సోకింది. లైబిరియా ప్రాంతంలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రజలు ఇబోలా వైరస్ కారణంగా మరణించారు. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో దాదాపు రెండు వేల మంది ఇంకా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారి..
‘ఎబోలా’.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి! దీని ముప్పును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత దేశాలకు సహాయసహకారాలు అందజేయాలంటూ ప్రపంచ దేశాలకు సూచించింది... ప్రస్తుతం ఎబోలా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజా వ్యాధి వ్యాప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో తొలి కేసును గుర్తించారు. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. 2009 మార్చిలో మెక్సికోలో కనిపించిన స్వైన్ ఫ్లూ.. తర్వాత యావత్ ప్రపంచానికి వ్యాపించింది. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్).. తొలుత ఆసియాలో కలకలం సృష్టించి, తర్వాత ప్రపంచం మొత్తానికి విస్తరించింది. ఈ రెండు సంఘటనల్లో కొన్ని వందల మరణాలు సంభవించాయి. ప్రస్తుత ఎబోలా వ్యాధితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమాఫ్రికా దేశాలకే పరిమితమైనప్పటికీ, మున్ముందు మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎబోలా 1,779 మందికి సంక్రమించగా, దాదాపు వెయ్యి మంది మరణించారు. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్‌కు ఆశ్రయమిచ్చే గబ్బిలాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా వైరస్ వ్యాధి (ఉఛౌ్చ గజీటఠట ఈజీట్ఛ్చట్ఛఉగఈ) లేదా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ (ఉఏఊ) బారినపడిన వారిలో 80 శాతం మంది మరణిస్తారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షాధార అడవులకు దగ్గరున్న సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంటుంది. వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య వ్యాధి విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలాను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు. ఎబోలా వైరస్.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్ అని కూడా అంటారు. ఎబోలా వైరస్ ప్రజాతిలో ఐదు భిన్న జాతులుంటాయి. అవి.. బుండిబుగ్యో ఎబోలా వైరస్ (బీడీబీవీ); జైర్ ఎబోలా వైరస్ (ఈబీఓవీ); రెస్టాన్ ఎబోలా వైరస్ (ఆర్‌ఈఎస్టీవీ); సూడాన్ ఎబోలా వైరస్(ఎస్‌యూడీవీ); టాయి ఫారెస్ట్ ఎబోలా వైరస్ (టీఏఎఫ్వీ). వీటిలో బీడీబీవీ, ఈబీఓవీ, ఎస్‌యూడీవీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఫిలిప్పీన్స్, చైనాలో గుర్తించిన ఆర్‌ఈఎస్టీవీ రకం మనుషులకు సోకినా, పెద్దగా ప్రభావం చూపించదు. వ్యాప్తి.. విజృంభణ: ఎబోలా వ్యాధి బారిన పడిన జంతువుల రక్తం, ఇతర శరీర స్రావాల నుంచి వైరస్ మనిషికి వ్యాపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి దుప్పిలు వ్యాధికి గురై మరణించినప్పుడు, వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ ఒకసారి మనిషిలోకి చేరితే వెంటనే ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధి బారినపడిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. సరైన రక్షణ లేకపోతే ఎబోలా రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ఇది వ్యాపిస్తుంది. మృతదేహాల ఖననం సందర్భంలోనూ బంధువులకు వ్యాపించే ప్రమాదముంది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏడు వారాల వరకు వీర్యంలో వైరస్ కనిపిస్తుంది. మృత్యు ఒడికి.. వైరస్ సోకిన తర్వాత రక్తపీడనం పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినటం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పొదిగే కాలం (శరీరంలోకి వ్యాధి కారకం ప్రవేశించిన దగ్గర నుంచి లక్షణాలు బయటపడేందుకు పట్టే సమయం) వారం రోజులు. తొలుత కనిపించే లక్షణాలు.. జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి. వీటితో పాటు వెన్నునొప్పి, కీళ్లవాపు, నీళ్ల విరేచనాలు, గొంతు తడి ఆరిపోవడం వంటివి కనిపిస్తాయి. శరీరంలో వ్యాధి విజృంభిస్తే నోరు, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. జననాంగాల్లో వాపు, కళ్ల కలకలు, నోరు పైభాగం ఎర్రగా కందడం, శరీరమంతా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్ర రక్తస్రావం సంభవిస్తుంది. తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికల సంఖ్య క్షీణతతో పాటు కాలేయంలో ఎంజైముల స్థాయి పెరుగుతుంది. సత్వర చికిత్స అందిస్తేనే వ్యక్తి బతుకుతాడు. లేకుంటే 90 శాతం మృతి చెందే అవకాశముంటుంది. టీకా అందుబాటులో లేదు: ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాత ఎబోలా పరీక్ష నిర్వహించాలి. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్, కణ వర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారించాలి. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలు చాలా ప్రమాదకరమైనవి. శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులేవీ లేవు. అందువల్ల లక్షణాలకు చికిత్స (డఝఞ్టౌఝ్చ్టజీఛి ఖీట్ఛ్చ్టఝ్ఛ్ట) అందించాలి. ఎబోలా వ్యాధి నివారణకు టీకా అందుబాటులో లేదు. ఈ తరుణంలో ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రభావిత దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులున్నట్లు అంచనా. ఒక్క లైబీరియాలోనే వెయ్యి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరందరూ ఇప్పుడు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. అందువల్ల భారత్ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారిని, అనుమానిత లక్షణాలు ప్రదర్శించే వారిని విమానాశ్రయాల వద్ద క్వారంటైన్లను ఏర్పాటు చేసి, పరీక్షించాలి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఐరోపా యూనియన్, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తదితర సంస్థలు ఎబోలా వ్యాప్తిపై దృష్టి సారించాయి. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు: కేవలం ఆఫ్రికాలోనే కాకుండా చైనా, ఫిలిప్పీన్స్‌లోనూ ఎబోలా వైరస్ ఇతర జాతులు వ్యాప్తిలో ఉన్నాయి. అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని (బుష్ మీట్) బాగా ఇష్టపడతారు. చింపాంజీ, గబ్బిలాలు తదితరాల మాంసాన్ని తింటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జంతువులను తాకినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జంతువుల మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చేతులకు పొడవాటి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న తీరునుబట్టి పరిస్థితి విషమంగా ఉందని, ఇది అదుపుతప్పి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందున ప్రపంచ దేశాలు సహాయం అందించాలని సంస్థ డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. ఇప్పటి వరకు భారత్‌లో ఎక్కడా ఎబోలా కేసును గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే గినియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు అనుమానం ఉండటంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని లేదని తేలింది. అయినా ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రత్యేక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏమాత్రం ఉపేక్షించినా అపార ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. -
అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!
మొన్నా మధ్య సార్స్.. ఆ తర్వాత హెచ్1ఎన్1.. ఇప్పుడు ఇబోలా! అగ్రరాజ్యాలకు వైరస్ భయాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. తాజాగా ఇబోలా వైరస్‌ను చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఈ వైరస్ నియంత్రణకు వందలాది మంది దళాలను మోహరించారు. ఇప్పటికే 887 మంది ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్యవర్గాలు దీనిపై ఇప్పటికే చేతులెత్తేశాయి. సియెర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో ఇబోలా వైరస్‌ను అదుపు చేసేందుకు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ వైరస్‌ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గత వారం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్ బారిన పడి 61 మంది మరణించారు. ముందుగా గినియాలోని అడవుల్లో గత ఫిబ్రవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఈ వైరస్ పాకింది. నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా వైరస్ సోకింది!! దీంతో అసలు ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికే ఆరోగ్యబృందాలు భయపడిపోయాయి. పలు దేశాల్లో ఈ వైరస్‌కు భయపడి అసలు పాఠశాలలు తెరవడం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియెర్రా లియోన్ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ చేసనట్టు ప్రకటించి, అక్కడినుంచి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా పక్డ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. లైబీరియా లాంటి దేశాల్లో దాదాపు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు అయ్యింది. పరిస్థితి మెరుగయ్యేలోపే మరింత దారుణంగా తయారవుతోందని లైబీరియా సమాచార శాఖ మంత్రి లూయిస్ బ్రౌన్ వాపోయారు. సమస్య పరిష్కారం ఎలా? పెద్దపెద్ద ఫార్మా దిగ్గజాలన్నీ ఈ వైరస్‌ను అదుపు చేయలేక మల్లగుల్లాలు పడుతుంటే, అమెరికాలో చిన్న ఔషధ సంస్థ మాత్రం ఓ సీరమ్‌ను తయారుచేసింది. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న దీన్ని ఇద్దరు అమెరికన్లపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలను అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ఇది కొంత వరకు పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, పేద దేశాలకు ఇది ఎంతవరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.