లైబీరియాలో అమెరికా డాక్టర్కు ఇబోలా! | US doctor with Ebola recovering | Sakshi
Sakshi News home page

లైబీరియాలో అమెరికా డాక్టర్కు ఇబోలా!

Published Sat, Aug 16 2014 9:28 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

లైబీరియాలో అమెరికా డాక్టర్కు ఇబోలా! - Sakshi

లైబీరియాలో అమెరికా డాక్టర్కు ఇబోలా!

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వైరస్ బారిన పడిన అమెరికన్ డాక్టర్ ఒకరు పూర్తిస్థాయిలో కోటుకుంటున్నారు. త్వరలోనే తన కుటుంబ సభ్యులను కూడా కలవాలనుకుంటున్నారు. అయితే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయని డాక్టర్ కెంట్ బ్రాంట్లీ చెప్పారు. త్వరలోనే తాను మళ్లీ తన భార్య, పిల్లలు, కుటుంబాన్ని కలుస్తానని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమాఫ్రికాలో విస్తృతంగా వ్యాపించిన ఇబోలా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు బ్రాంట్లీ వచ్చారు. అప్పుడే ఆయనకు ఇబోలా సోకింది.

విషయం తెలియగానే ఆయనను అట్లాంటాలోని ఎమరీ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. బ్రాంట్లీతోపాటు నాన్సీ రైట్బోల్ అనే అమెరికన్కు కూడా లైబీరియాలో ఉండగా ఇబోలా సోకింది. లైబిరియా ప్రాంతంలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రజలు ఇబోలా వైరస్ కారణంగా మరణించారు. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో దాదాపు రెండు వేల మంది ఇంకా ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement