Ebola virus
-
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
Corona Virus: కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా?
న్యూఢిల్లీ/పిట్స్బర్గ్/మాస్కో/లండన్: అమెరికాలోని వైద్యాధికారులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ దేశంలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్ మోడల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో గత మూడు వారాల్లో 20 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు యూకే ఆరోగ్య సంస్థ శనివారం ప్రకటించింది. కోవిడ్ నుంచి అత్యధిక ముప్పు ఉన్న వర్గాలను ఎంపిక చేసి వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. 19,740 కొత్త కరోనా కేసులు భారత్‌లో శనివారం 19,740 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643కు తగ్గింది. గత 206 రోజుల్లో ఇదే అత్యంత కనిష్ట సంఖ్య కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,48,291కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.98గా ఉంది. మరణాల శాతం 1.33గా ఉంది. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 10 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 94.62 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ జరిగింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. భారత్‌కు ప్రపంచ నలుమూలల నుంచి వ్యాక్సిన్ తయారీ ముడి పదార్థాల సరఫరా కొనసాగాలని కోరారు. భారత్‌లో వ్యాక్సిన్ల తయారీ ఊపు అందుకున్న నేపథ్యంలో కోవ్యాక్స్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి కూడా వ్యాక్సిన్లను అందించేందుకు అది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఐక్యరాజ్య సమితి ద్వారా 2021 నాలుగో త్రైమాసికంలో వ్యాక్సిన్లను అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా రష్యాలో రోజూవారీ మరణాలు శనివారం ఏకంగా 968 నమోదయ్యాయి. సెపె్టంబర్ చివరి రోజులతో పోలిస్తే 100కు పైగా అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రష్యాలో శనివారం 29 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో మరణాలు 6 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పలు బార్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. డెల్టా వైరస్ విస్తరిస్తోందన్న అనుమానాలు ఓ వైపు ఉండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగోలో ఎబోలా కేసు.. ప్రమాదకరమైన ఎబోలా వైరస్ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు. బాలున్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, అక్టోబర్ 6న కన్నుమూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించాక ఎబోలా పాజిటివ్‌గా తేలిందన్నారు. -
వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే
గినియా/కోనక్రీ: కరోనా మహమ్మారికి కళ్లెం వేయకముందే ప్రపంచం ముంగిట మరో కొత్త సమస్య ప్రవేశించింది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో మహమ్మారి తరుముకొస్తుంది. ఇది కరోనా కన్న మరింత ప్రమాదకరం అని.. ఒక్కసారి ఈ వైరస్ సోకితే మరణమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ వివరాలు.. పశ్చిమ ఆఫ్రికా గినియాలో మరో ప్రమాదకర వైరస్ వెలుగు చేసుంది. దీని పేరు మార్బర్గ్ అని.. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుందని.. దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దక్షిణ గెక్‌కెడౌ ప్రిఫెక్చర్ ప్రాంతంలో తొలి మార్బర్గ్ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్బర్గ్ వైరస్ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు. గినియాలో ఎబోలా సెకండ్ వేవ్ ముగిసిందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన రెండు నెలలకే ఈ కొత్త వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మార్బర్గ్ సాధారణంగా రౌసెట్టస్ గబ్బిలాలకు ఆవాసాలుగా మారిన గుహలు, మైన్స్‌ల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వైరస్ వ్యాప్తిలో మరణాల రేటు 88 శాతంగా ఉంటుందన్నారు. ఏంటి మార్బర్గ్ వైరస్.. మార్బర్గ్ కూడా ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన వైరసే. దాని కన్నా ఇది మరింత ప్రమాదకారి. ఈ వైరస్ సోకిన వారు రక్తస్రావ జ్వరం బారిన పడతారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్గ్రేడ్, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్బర్గ్, ప్రాంక్ఫర్ట్ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది. వైరస్ పొదిగే కాలం రెండు నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. 2008 లో, ఉగాండాలోని రౌసెట్టస్ గబ్బిలాలు నివసించే గుహను సందర్శించిన ప్రయాణికులలో రెండు స్వతంత్ర కేసులు గుర్తించారు. మార్బర్గ్ వ్యాధి లక్షణాలు... మార్బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవి ఒక వారం పాటు కొనసాగుతాయి. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు లోపలికి పోయి.. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక.. విపరీతమైన బద్ధకంగా ఉంటారు. ఇక మలేరియా, టైపాయిడ్, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినట్లు.. మార్బర్గ్ను గుర్తించడం కష్టమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్టీపీసీఆర్ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన తెలిపింది. -
గబ్బిలమే కాదు.. కోడి, కుక్క, పిల్లి కూడా ప్రమాదకరమే
నానో టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటున్న సమయంలో కంటికి కనిపించని అతి చిన్న వైరస్ మానవ మనుగడను ప్రమాదంలో పడేసింది. కరోనా వైరస్ మనిషికి ఎలా సోకిందనే దానిపై అనేక వాదనలు ఉన్నా... ఇప్పటికీ గబ్బిలం నుంచి వచ్చిందని నమ్మేవారే ఎక్కువ. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎప్పటి నుంచి ఉంది , దీన్ని అరికట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్‌డెస్క్: జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మనిషి ప్రయాణానికి సడెన్ బ్రేక్ వేసి, గట్టి జర్క్ ఇచ్చింది కరోనా వైరస్. గబ్బిలం నుంచి పాంగోలిన్ ద్వారా మనుషులకు సోకిన కరోనా రెండేళ్లుగా జన జీవనాన్ని స్థంభింపచేస్తోంది. ఒక్క గబ్బిలమనే కాదు ఎలుక, కుక్క, పంది, ఆవు, పావురం, కుందేలు ఇలా మన చుట్టూ మనతో పాటు కలిసి బతుకున్న ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమి కీటకాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు వైరస్, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వ్యాప్తి జరుగుతుంది. అదే విధంగా మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీని వల్ల ఇరువైపులా కొత్త రకం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీన్నే జూనోసిస్ అంటారు. జూనోసెస్ వ్యాధులు పురాతన కాలం నుంచి జూనోసెస్ వల్ల ఎన్నో వ్యాధులు సోకాయి. ఉదాహరణకు కుక్కల నుంచి రేబిస్, గబ్బిలం నుంచి నిఫా, పశువుల నుంచి మ్యాడ్ కౌ, కోళ్ల నుంచి ఫ్లూ తదితర రోగాలు సంక్రమించాయి. ఇప్పటి వరకు వేల కొద్ది జూనోసిస్ వ్యాధులు సంక్రమించినా... ఎక్కువ ప్రభావం చూపించినవి 156 వరకు ఉన్నాయి. అందులో రేబీస్, ప్లేగు, టీబీ, కలరా, మలేరియా, సాల్మోనెల్లా, స్కాబీస్ వంటివి ఉన్నాయి. వీటిలో చాలా వాటికి టీకాలతో ప్రమాద తీవ్రత తగ్గించగలిగారు. ఇటీవల కాలంలో సార్స్, ఎబోలా, జీకా, నిఫా, సాల్మోనెల్లా, కరోనాలు మానవాళికి ముప్పుగా మారాయి. ఇందులో కరోనా అయితే ఏకంగా ప్యాండమిక్ స్థాయికి చేరుకుంది. లూయి ప్యాక్చర్ గుర్తుగా జూనోసిస్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఎంతో కాలం శ్రమించగా చివరకు 1885 జులై 6న లూయి ప్యాక్చర్ తొలిసారిగా కుక్క నుంచి సోకిన రేబిస్కి టీకాను కనిపెట్టారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ ఏడు జులై 6న జూనోసెస్ డేను పాటిస్తున్నారు. ప్రివెంట్ ది ప్యాండెమిక్ కరోనా నేపథ్యంలో ఈ సారి జూనోసెస్ డే పట్ల ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది జీవితాలు అంతమవగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరెందరో జీవితాలు ఇరుకున పడ్డాయి. దీంతో జూనోసెస్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించాలనే నినాదం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ‘ ప్రివెంట్ ద నెక్ట్స్ ప్యాండెమిక్ : జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టూ బ్రేక్ ది చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ’ థీమ్‌తో 2021 కి సంబంధించిన జూనోసెస్ డేని నిర్వహిస్తున్నారు. లైవ్స్టాక్పై దృష్టి భూమిపై జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, పందులు, పశువులు, పక్షులు (లైవ్ స్టాక్)లతో పాటు ఇతర జీవజాలంపై ఆధారపడుతున్నాం. మాంసాహారం కోసం భారీ ఎత్తున లైవ్ స్టాక్ పెంచుతున్నాం. అయితే ఇందుకు తగ్గ జాగ్రత్తలు, మేలైన యాజమాన్య పద్దతులు అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా జంతువుల నుంచి మానవులకు వైరస్, బ్యాక్టరీయాల వ్యాప్తి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్‌పై ఫోకస్ కరోనా మహమ్మారి ఇచ్చిన చేదు అనుభవంతో లైవ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా వెటర్నిటీ, మెడికల్, ఎన్విరాన్మెంట్ మూడింటిని సమ్మిళతం చేస్తూ సరికొత్త పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. -
కాంగోను కలవరపెడుతున్న ఎబోలా
ఈక్వెటార్(కాంగో): ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనాతో విలవిల్లాడుతుంటే.. మరోసారి ఎబోలా వైరస్ పంజా విసురుతోంది. ఈక్వెటార్ ప్రాంతంలోని వంగ్తా హెల్త్ జోన్లో ఎబోలా వైరస్ వ్యాధి బయటపడినట్లు కాంగో ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వాంగ్తా ప్రాంతంలో ఆరు ఎబోలా కేసులను గుర్తించామని.. వీరిలో నలుగురు మరణించగా.. ఇద్దరికి వైద్యం చేస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వీటిలో మూడు కేసులను లాబొరేటరి పరీక్షల ద్వారా విశ్లేషించి ఎబోలాగా నిర్థారించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహోచ్ఓ) వెల్లడించింది. ఈ క్రమంలో ‘ప్రజలు కోవిడ్-19 గురించే కాక ఇతర మహమ్మారుల మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. డబ్ల్యూహెచ్ఓ ఇతర ఆరోగ్య సమస్యలని నిరంతరం పర్యవేక్షిస్తూ.. స్పందిస్తుంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించారు. కాంగోలో 1976లో మొదటి సారి ఎబోలా వైరస్‌ను గుర్తించిన తర్వాత ఇప్పటికి 11సార్లు అక్కడ వ్యాధి విజృంభించింది. ‘ఇది నిజంగా పరీక్షా సమయం. కానీ డబ్ల్యూహెచ్ఓ.. ఆఫ్రికా సీడీసీ వంటి ఇతర సంస్థలతో కలిసి అంటువ్యాధులపై పొరాడే విధంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని బలపర్చేందుకు కృషి చేస్తుంది’ అని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మస్తిడిసో మోతీ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వాలకు సాయం చేసేందుకు ఇప్పటికే వైద్య బృందాలను అక్కడకు పంపినట్లు తెలిపారు -
కరోనా కట్టడి: చిగురిస్తున్న ఆశలు
హ్యూస్టన్: ప్రాణాంతక ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిస్‌విర్ మందు కోవిడ్ రోగులపై జరగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరిన్ని ప్రయోగాలు పూర్తయితేగానీ ఈ మందును కోవిడ్ చికిత్సకు సిఫారసు చేసే అవకాశాల్లేవు. టెక్సస్‌లోని హ్యూస్టన్ మెథాడిస్ట్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించిన దాని ప్రకారం.. అప్పుడప్పుడే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి రెమిడిస్‌విర్ మందును ఇచ్చారు. రెమిడెస్‌విర్‌ను ఎబోలా వైరస్‌కు చికిత్స కల్పించేందుకు తయారు చేశారు. చైనాలో జరిగిన అధ్యయనంలోనూ ఈ మందు కోవిడ్ బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నట్లు స్పష్టమైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల ఒక పరిశోధన వ్యాసం ప్రచురిస్తూ రెమిడిస్‌విర్ తీసుకున్న కోవిడ్–19 బాధితుడు 24 గంటల్లోనే మెరుగైన ఆరోగ్య స్థితికి వెళ్లడాన్ని వివరించింది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి కోవిడ్-19కు వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ప్రకటించారు. వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. 1994 నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజా సమాచారం కరోనా బాధితుల సంఖ్య 25 లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షా 70 వేలు దాటింది. కోవిడ్ సోకి ఇప్పటివరకు 658,956 మంది కోలుకున్నారు. చదవండి: కరోనాకు ముందే దారుణ పరిస్థితులు! -
అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు పలు ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోన్న కోవిడ్-19 (కరోనా వైరస్) చైనాలోని వుహాన్‌లో బయటపడి సరిగ్గా నేటికి 41 రోజులు. ప్రాణాంతకమైన ఈ వైరస్ విస్తరించిన తీరును విశ్లేషిస్తే... ఇది మెర్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, సార్స్ వైరస్‌లకన్నా ప్రమాదకారిగా స్పష్టమవుతోందని లండన్ వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ఎబోలా బయట పడిన 41వ రోజు నాటికి 243 మందికి, మెర్స్ బయటపడిన 41వ రోజు నాటికి 182 మందికి, స్వైన్ ఫ్లూ బయట పడిన 41వ రోజు నాటికి 500 మందికి, సార్స్ బయట పడిన 41 రోజు నాటికి 3,600 మంది వైరస్ బారిన పడగా, కోవిడ్ వల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా 81,400 మందికి విస్తరించింది. అంటే, మిగతా వైరస్‌లకన్నా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని స్పష్టం అవుతోంది. సార్స్‌ను నియంత్రించిన 2004 సంవత్సరం నాటికి ఆ వైరస్ బారిన 8,098 మంది పడగా, వారిలో 774 మంది మరణించారు. అంటే ఆ వైరస్ సోకిన వారిలో దాదాపు పది శాతం మంది మత్యువాత పడ్డారు. 2019, నవంబర్ నెల నాటికి మెర్సి బారిన 2,494 మంది పడగా, వారిలో 853 మంది మరణించారు. అంటే మతుల సంఖ్య దాదాపు 34 శాతం. (కోవిడ్-19 : ఫేస్బుక్ కొరడా) కోవిడ్ వల్ల ఇప్పటి వరకు 81,400 మంది అస్వస్థులుకాగా, వారిలో 2,771 మంది మత్యువాత పడ్డారు. ఎబోలా, సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ వైరస్‌లకన్నా కోవిడ్ బాధితులే ఎక్కువగా ఉండడమే కాకుండా మృతులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్‌ను పరిశోధకులు కనుగొనలేకపోయారు. వైరస్ బాధితులకు దూరంగా ఉండడం, బయటకు వెళ్లి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించినప్పుడల్లా తప్పనిసరి చేతులను సబ్బు లేదా ఆల్కహాల్, ఇతర వైద్య శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కోవడమే ఉత్తమమని డాక్టర్ ఆల్మర్ సూచిస్తున్నారు. (కోవిడ్.. ఇక్కడ తగ్గి అక్కడ పెరుగుతోంది) -
ఇంతకూ వైరస్ల మొత్తం సంఖ్య ఎంతో తెలుసా..!!
వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఈ మధ్య గడగడలాడిపోతున్నాయి. సార్స్ నుంచి కరోనా వరకు దశాబ్దకాలంగా కనీవినీ ఎరుగని కొత్త వైరస్లు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు వివిధ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ వ్యాధులపై గట్టి పోరాటమే చేస్తోంది. ఈ వ్యాధులతో ప్రాణనష్టంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయాణాలపై ఆంక్షలు, ఎగుమతి దిగుమతులపై నియంత్రణల కారణంగా చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోతున్నాయి. ఇప్పుడు చైనాలో కరోనా వ్యాధి ప్రబలడంతో ప్రాణాంతక వైరస్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కొన్ని వైరస్‌లకు చికిత్సలు ఉండటం లేదు. నివారణ ఒక్కటే మార్గం. అసలు ఏమిటీ వైరస్లు? ఇటీవల కాలంలో వివిధ దేశాల్ని ఎలా వణికించాయి? కరోనా వైరస్‌పై పోరాటం చేయడానికి చైనా చేస్తున్నదేంటి? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... 3,20,000 రకాల వైరస్లు వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులే కానీ అత్యంత శక్తిమంతమైనవి. బ్యాక్టీరియా, ఫంగస్ కంటే ఇవి చాలా శక్తిమంతంగా దాడి చేస్తాయి. ఇవి కంటికి కనిపించవు. కొన్ని రకాల వాటిని మైక్రోస్కోప్‌ల ద్వారా చూడగలం. ఈ వైరస్లు సంతానాన్ని వాటంతట అవి సృష్టించలేవు. కణజాలం ఉంటేనే ఇవి అభివృద్ధి చెందుతాయి. అడవి జంతువులు, మొక్కల నుంచి ఈ వైరస్లు మానవ శరీరాలపై దాడి చేస్తాయి. దీంతో మానవాళిని వివిధ రకాల వ్యాధులు భయపెడుతున్నాయి. ఫ్లూ, ఎబోలా, జికా, డెంగీ, సార్స్, మెర్స్ ఇప్పుడు కరోనా వీటన్నింటికీ వైరస్‌లే కారణం. మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన శరీరంలో కూడా ఎన్నో వైరస్లు ఉన్నప్పటికీ చాలా వైరస్లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్లు ఉంటాయి. అమెరికన్ జర్నల్ సొసైటీ ఆఫ్ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్లు ఉన్నాయి. ఎబోలా... పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు మరణాల రేటు: 50% ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ) జర్వం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలతో మొదలవుతుంది. ఒక్కోసారి శరీరం వెలుపల, లోపల కూడా రక్తస్రావం అవుతుంది. చివరికి బ్రెయిన్ హెమరేజ్‌తో మనిషి ప్రాణాలే పోతాయి. మొట్టమొదటిసారి 1976లో ఆఫ్రికాలో ఈ వైరస్ బట్టబయలైంది. సూడాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల్లో ఒకేసారి వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్‌కు పెట్టారు. ఫ్రూట్ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది. గాయాలు, రక్తం, లాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అప్పట్లో ఈ వైరస్ సోకిన వారిలో 90% మంది ప్రాణాలు కోల్పోయారు. 2014–16 మధ్య మళ్లీ ఈ వ్యాధి విజృంభించింది. అయితే మొత్తం కేసుల్లో మరణాల రేటు 50 శాతంగా ఉంది. ఆ రెండేళ్లలోనే దాదాపుగా 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌కు చికిత్స కోసం మందుని కనుక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ రాకుండా వ్యాక్సినేషన్ కూడా ప్రయోగాల దశలో ఉంది. డెంగీ... పుట్టిన ప్రాంతం: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ ఎలా సంక్రమిస్తుంది: దోమలు మరణాల రేటు: 20% కొన్ని వందల ఏళ్ల క్రితమే డెంగీ వైరస్ ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు 20వ శతాబ్దంలో ఈ వైరస్ 1950లో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో తొలిసారిగా బయటకి వచ్చింది. అక్కడ్నుంచి ఆసియా పసిఫిక్, కరేబియన్ దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడెస్ దోమ కాటుతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏడెస్ వేగంగా వృద్ధి చెందుతుంది. దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది డెంగీ వ్యాధి ప్రబలే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాది డెంగీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మందికి సంక్రమిస్తుంది. వారం రోజులకు పైగా జ్వరంతో మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది. ఒక్కోసారి డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువై బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ప్రాణాలు కోల్పోతారు. ఇలా మృతి చెందేవారు ప్రపంచ దేశాల్లో ఏడాదికి 25 వేల మంది వరకు ఉంటారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా దోమల్ని అరికట్టే కార్యక్రమాలు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు చేపడుతూ ఉండటంతో డెంగీ కేసులు కాస్తయినా నివారించగలుగుతున్నారు. స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా ఎలా సంక్రమిస్తుంది: పందులు మరణాల రేటు: 10% స్వైన్‌ఫ్లూ వ్యాధి మొట్టమొదట పందుల్లో బయటపడింది. ఇది మనుషులకి సోకడం తక్కువే. 1918–19 సంవత్సరాల్లో తొలిసారిగా ఇది మనుషులకి సోకింది. అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి ఈ వైరస్ సోకిందని అంచనాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ 2009లో ఒక్కసారిగా ఈ వ్యాధి మనుషులకి సోకి తన విశ్వరూపం చూపించింది. మొత్తం 200 దేశాలకు విస్తరించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ వ్యాధితో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పితో ఈ వైరస్ లక్షణాలు బయటకొస్తాయి. జ్వరం, డయేరియా వస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతోంది. సార్స్... పుట్టిన ప్రాంతం: చైనా ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు, పిల్లులు మరణాల రేటు: 10% చైనాలో గూంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 2002లో తొలిసారిగా సివియర్ అక్యూట్ రెస్పరేటరీ డిసీజ్ (సార్స్) వైరస్ బయటపడింది. కొద్ది వారాల్లోనే ఆ వైరస్ 37 దేశాలకు పాకింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. సార్స్ వ్యాధితో చైనా, హాంకాంగ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ వైరస్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశాల్లో ఉన్న తమ పౌరుల్ని వివిధ దేశాలు వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు మొదలయ్యాయి. సార్స్ వ్యాధిని నియంత్రించడానికి చైనా, హాంకాంగ్, కెనడా, తైవాన్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడంతో ఆర్థికపరమైన నష్టాలు కూడా మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సార్స్ వ్యాధితో 2002–03లో 774 మంది మరణించారు. కొన్ని వేల మందిపై ఈ వైరస్ దాడి చేసింది. చాలా ఏళ్లుగా సార్స్‌ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేయడానికి వైద్య నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా అవి సఫలం కాలేదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధికారక వైరస్‌లకు చికిత్సలు ఉండవు. నియంత్రణే మార్గం. ఈ వైరస్ మళ్లీ విజృంభించినప్పుడల్లా డబ్ల్యూహెచ్ఓ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా... పుట్టిన ప్రాంతం: ఉగాండా ఎలా సంక్రమిస్తుంది: దోమలు మరణాల రేటు: 9% డెంగీ తరహాలోనే జికా వైరస్ కూడా ఏడెస్ దోమ ద్వారా వస్తుంది. జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కంటికి కలక, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్ కోతుల్లో కనపడింది. 1952 సంవత్సరం నాటికి ఈ వ్యాధి మనుషులకీ సంక్రమించింది. ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో ఈ వ్యాధి ప్రబలింది. 1960–80 మధ్య కాలంలో ఈ వ్యాధి అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాలకు వ్యాపించింది. 2013లో ఈ వ్యాధి ఒక్కసారిగా ఫ్రాన్స్‌లో విజృంభించింది. 30 వేల మందికి ఈ వ్యాధి సంక్రమించింది. అప్పుడే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ వైరస్ త్వరగానే అదుపులోకి వస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా కలిగి ఉండేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ. 2015లో బ్రెజిల్‌ని కూడా జికా వణికించింది. గర్భిణులకు ఈ వ్యాధి సోకి గర్భస్థ శిశువులకీ సంక్రమించడం ఆందోళన కలిగించే అంశం. జికా వ్యాధితో పుట్టిన శిశువుల్లో మెదడు సక్రమంగా ఎదగదు. 2016లో జికాని అదుపు చేయడానికి డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దోమకాటుతో పాటు, లైంగిక సంపర్కం, రక్తం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ ప్రూఫ్ కారు..! ఎన్నో రకాల వ్యాధికారక వైరస్లు చైనాలోనే బయటపడ్డాయి. సార్స్ నుంచి ఇప్పుడు కరోనా దాకా రకరకాల వైరస్‌లపై చైనా పోరాటం చేస్తూనే ఉంది. కరోనా వైరస్ దాటికి బెంబేలెత్తిన చైనా కేవలం పదంటే పది రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించింది. ఇప్పుడు వైరస్‌ని నిరోధించే కార్ల తయారీ పనిలో పడింది. జిలీ గ్రూప్ వైరస్‌లను నిరోధించే, గాలిని ప్యూరిఫై చేసే ఫిల్టర్లు ఏర్పాటు చేసేలా కార్లను అభివృద్ధి పరుస్తోంది. ఈ కార్లను ఆరోగ్యకరమైన, తెలివైన కార్లుగా ఆ కంపెనీ అభివర్ణిస్తోంది. యూరప్, అమెరికా, చైనాలో ఉన్న జిలీ ఆటోస్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్ డిజైన్ నెట్వర్క్ వాతావరణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా కార్ల డిజైన్లను తయారు చేస్తుంది. బ్యాక్టీరియా నిరోధక, వైరల్ నిరోధక సాంకేతిక వ్యవస్థను ఈ కార్లలో పొందుపరుస్తూ కొత్త కార్లను తీసుకురానుంది. ‘ఇవాళ రేపు ప్రజలు ఇళ్లలో గడిపే సమయం తర్వాత అత్యధికంగా ప్రయాణాల్లోనూ, అందులోనూ కార్లలోనే గడుపుతున్నారు. వాటిపైనే చైనా ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే కారు ప్రయాణాల్లో వారికి ఎలాంటి వైరస్లు సోకకుండా కొత్త తరహా కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ – ‘జిలీ’ అధ్యక్షుడు అన్ కాంఘై -
ఎబోలా రాకాసి విరుచుకుపడింది..
బ్రజ్జావిల్, కాంగో : అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కాంగోలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోమారు ఎబోలా మహమ్మారి వ్యాపించిందని ప్రకటించింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. బికోరో పట్టణం సమీపంలోని ఓ కుగ్రామంలో 21 మంది కొద్దిరోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారిలో 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాంగో దేశంపై ఎబోలా వైరస్ దాడి చేయడం ఇది తొమ్మిదోసారి. 1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకింది. 11,300 మంది మరణించారు. ఎబోలా వైరస్ గబ్బిలం లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపించింది. -
శృంగారంతో ఎబోలా.. నిర్ధారణ అయిందిలా..
న్యూయార్క్: గతంలో ఎబోలా బారినపడి, ఆ తరువాత కోలుకున్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం ద్వారానూ ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. యూఎస్ ఆర్మీ సైంటిస్టులు, లైబీరియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎల్ఐ బీ ఆర్)లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. పరిశోధన ఎలా సాగిందంటే.. ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ఒక 'ఎబోలా పాజిటివ్' మహిళ రక్త నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. సదరు రోగి.. వ్యాధి బారిన పడటానికి కొద్ది రోజుల ముందు ఓ వ్యక్తితో శ్రృంగారంలో పాల్గొంది. నిజానికి ఆ పురుషుడు కూడా గతంలో ఎబోలా వ్యాధిగ్రస్తుడే. అయితే పూర్తి స్థాయి చికిత్స తీసుకోవడంతో అతనికి జబ్బు నయమైంది. 2014, అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షల్లోనూ ఆ పురుషుడిలో ఎబో వైరస్ లేదని వెల్లడయింది. ఈలోపే అంటే మార్చి 27న మహిళా రోగి మరణించింది. ఆ తరువాత ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకున్న శాస్త్రవేత్తలు.. సదరు పురుషుడి వీర్యాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించగా.. దానిలో ఎబోలా వైరస్ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. 'అంటే 'ఎబో నెగటివ్' వ్యక్తిగా నిర్ధారణ అయినప్పటికీ ఆ వ్యక్తి వీర్యకణాల్లో వైరస్ పూర్తిగా చావదు. అందువల్లే వీర్యకణాల ద్వారా మహిళ రక్తకణాల్లోకి ఎబోలా నేరుగా వ్యాపించింది' అని జేసన్ లాండర్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఈ పరిశోధన ద్వారా వీర్యకణాల్లో దాగుండే ఎబోలా వైరస్ ఎంతకాలంపాటు సజీవంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడమేకాక ఎబోలా నివారణకు తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ ఆర్మీ మెడికల్ శాస్త్రవేత్త గుస్తావో పలాసియో చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఆఫ్రికాలోని గునియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాలను తీవ్రంగా, ప్రపంచమంతటినీ పాక్షికంగా కలచివేసిన ఎబోలా వ్యాధితో ఇప్పటివరకు 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 28వేల పాజిటివ్ కేసును గుర్తించారు. -
ఎన్నో దేశాలకు చేదు జ్ఞాపకాలు
పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం... 2014లో ప్రపంచ దేశాలకు ఓ పెద్ద సవాల్‌గా మిగిలింది. ఎబోలా వైరస్ వేలాది మందిని బలితీసుకున్నదీ ఈ ఏడాదిలోనే. వీటికి తోడు విమాన ప్రమాదాలు... ఇలా 2014లో ఎన్నో విషాద ఘటనలను ప్రపంచం ఎదుర్కొన్నది. ఉక్రెయిన్‌లో ప్రజాగ్రహం... తిరుగుబాటు ఉక్రెయిన్ ప్రజలు యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను ఆశిస్తుంటే, అధ్యక్ష స్థానంలో ఉన్న యానుకోవిచ్ రష్యాతో సంబంధాలను కోరుకోవడంతో సంక్షోభం రగిలింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో వంద మందికిపైగా మృతిచెందారు. యానుకోవిచ్ ఫిబ్రవరి 22న రష్యాకు పరారయ్యారు. తర్వాత రష్యన్లు 60 శాతం ఉన్న క్రిమియాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్చి 1న తమ సైన్యాన్ని ఉక్రెయిన్ చుట్టూ మోహరించి, క్రిమియాను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రిఫరెండమ్‌లో 97 శాతం క్రిమియన్లు రష్యాలో ఉండేందుకు ఓటేయడంతో అది రష్యాలో కలిసింది. విమాన విషాదాలు అత్యధిక విమాన ప్రమాదాలు జరిగిన సంవత్సరంగా 2014 చరిత్రలో నిలిచిపోనుంది. హా మార్చి 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానం గమ్యాన్ని చేరకుండానే అదృశ్యమైపోయింది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. హా జూలై 17న 298 మందితో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం-17 ఉక్రెయిన్‌లో కూల్చివేతకు గురైంది. అందరూ మృతి చెందారు. హా జూలై 24న 116 మందితో బుర్కినాఫాసో నుంచి అల్జీరియాలోని అల్జీర్స్‌కు వెళుతున్న ఎయిర్ అల్జీర్ విమానం మాలిలో కూలిపోగా ఒక్కరూ బతికి బయటపడలేదు. హా డిసెంబర్ 28న ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ వెళ్తున్న ఎయిర్ఆసియా విమానం ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎబోలా సవాల్ ఎబోలా అనే ప్రాణాంతక వైరస్ ఈ ఏడాది ప్రపంచ దేశాలను వణికించింది. 2013 డిసెంబర్లో గినియాలో కళ్లు తెరచిన ఈ మహమ్మారి ఈ ఏడాది ఆఫ్రికా దేశాలపై బలమైన పంజా విసిరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 7,645 మందిని బలితీసుకోగా, 19 వేల కేసులు నమోదయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఇరాక్, సిరియాల్లోని చిన్నచిన్న ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)గా ఏర్పడ్డాయి. ఇది తన పేరును ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా మార్చుకుంది. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంది. పలు దేశాల వారిని బందీలుగా చేసుకుని వారి తలలు నరికి ఆ వీడియోలను విడుదల చేసింది. ఐఎస్ చెరలో 39 మంది భారతీయులు ఉన్నారు. పెషావర్ మారణహోమం పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఉన్న సైనిక పాఠశాలలోకి డిసెంబర్ 16న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు చొరబడి 133 మంది విద్యార్థులను కాల్చి చంపారు. మరిన్ని ముఖ్యమైన పరిణామాలు.. హా నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు ఏప్రిల్ 14న ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి 276 మంది విద్యార్థినులను అపహరించుకుని పోయారు. హా ఇజ్రాయెల్ దాడుల్లో 2,100 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు హా బ్రిటన్‌తోనే కలిసుండాలా లేక స్వాతంత్య్రం కావాలా? అన్న అంశంపై సెప్టెంబర్‌లో స్కాట్లాండ్లో జరిగిన ఓటింగ్‌లో... బ్రిటన్‌తోనే కలసి ఉంటామంటూ మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. -
‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎబోలా ఫైటర్స్
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, సహాయకులను ఈ ఏడాదికిగానూ ఉమ్మడిగా ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసినట్లు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. చికిత్స అందించే క్రమంలో సహచర వైద్యులు వైరస్‌బారిన పడి కన్నుమూసినా ధైర్యం, కరుణతో రోగులకు సేవలు అందిస్తున్నందుకుగానూ తుది ఎనిమిది మంది జాబితాలోంచి వీరిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు మ్యాగజైన్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ తెలిపారు. -
ఆ వైరస్ ఏమిటో..?
ఎటూ తేల్చని గాంధీ వైద్యులు నైజీరియాకు చెందిన ఓ కొత్త వైరస్‌గా ప్రచారం సాధారణ వైరల్ ఫీవర్‌గా వైద్యుల వెల్లడి గాంధీ నుంచి ఎబోలా వార్డును మార్చాలని డిమాండ్ సిటీబ్యూరో: అనుమానిత వైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల బాధితునికి సోకింది ఏ వైరస్ అనేది ఇంకా స ్పష్టం కాలేదు. బాధితునికి సోకింది ఎబోలా వైరస్ కాదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాబోరేటరీ (ఎన్సీడీసీ) పరీక్షల్లో తేలడంతో ఈ వైరస్ గుర్తింపు అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఓ కొత్తరకం వైరస్ కావొచ్చని కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. బాధితుడు సాధారణ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు ఎబోలా రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ శుభాకర్ స్పష్టం చేశారు. అ ంతేకాకుండా ఆయన ఆరోగ్యపరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతోందని పేర్కొన్నారు. ఎబోలా వార్డుపై వైద్యుల అభ్యంతరం ఆస్పత్రి ఏడో అంతస్థులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఒక వేళ అటు వెళ్తే ఎక్కడ ఆ వైరస్ తమకు వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం నర్సింహులు (ట్రీటింగ్ ఫిజీషియన్), వినోద్ (ఎపిడిమియాలజిస్ట్), సత్యమూర్తి (మైక్రోబయాలజీ)లు మినహా ఇతరులెవ్వరూ వెళ్లడానికి సాహసించడం లేదు. ఆ స్పత్రిలో ఎబోలా వార్డును ఏర్పాటు చేయడంపై వైద్యులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో జనసంచారం లేని ప్రాంతంలో ఎబోలా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలంటున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే గాంధీలో దీన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్ధిపేట రమేష్‌లు ప్రశ్నించారు. కిడ్నీపై ప్రభావం... గాంధీ ఆస్పత్రి : గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుని కిడ్నీపై వైరస్ ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మూత్రం ఎరుపురంగుకు మారడంతో మూత్రం ద్వారా రక్తం బయటకు వెళ్లిపోతుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు లక్షణాల ఆధారంగా రూపాంతరం చెందిన కొత్త వైరస్ అని భావిస్తున్నారు. కిడ్నీ ప్రభావంపై నెఫ్రాలజీ వైద్య నిపుణులతో చర్చిస్తున్నామని ట్రీటింగ్ ఫిజీషియన్ నర్సింహులు తెలిపారు. పూర్తిస్థాయిలో నయం అయ్యేవరకు బాధితున్ని ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్యసేవలు అందిస్తామని ఆయన అన్నారు. రేపు గాంధీలో అవగాహన సదస్సు ఎబోలా వైరస్‌పై ఈ నెల ఐదో తేదీన గాంధీఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్ అధికారి శుభాకర్ తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబోరేటరీలు పూణే, ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలోని లెవల్-2 లాబోరేటరీలను లెవ ల్-3కి అప్‌గ్రేడేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ ఎబోలా దేశంలోకి ప్రవేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో గాంధీ, ఏపీలో కేజీహెచ్ ఆస్పత్రుల్లో ఎబోలా నోడల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
అది ఎబోలా కాదు.. మరేదో వైరస్!
-
ఎబోలా కాదు.. ఆందోళన వద్దు
తేల్చి చెప్పిన గాంధీ వైద్య నిపుణులు గాంధీ ఆస్పత్రి: అనుమానిత వైరస్‌తో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితునికి సోకింది ఎబోలా వైరస్ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లేబొరేటర్ (ఎన్సీడీసీ) నుంచి మంగళవారం రాత్రి అందిన నివేదికలో ‘ఎబోలా నెగిటివ్’అని రిపోర్టు వచ్చిందని స్పష్టం చేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసప్రసాద్ (52) అనుమానిత వైరస్‌తో సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యసేవలు అందజేస్తున్న డాక్టర్లు నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో లేబొరేటరీ నివేదికలో ఎబోలా కాదని తేలడంతో రాష్ట్ర వైద్య అధికారులు, గాంధీ ఆసుపత్రి వైద్య నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కొంటాం: నోడల్ అధికారి శుభాకర్ ఎలాంటి వైరస్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఎబోలా, స్వెన్‌ఫ్లూ వంటి వైరస్‌లపై అప్రమత్తంగా ఉండాలి తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎబోలా వ్యాధిపై రాష్ట్ర నోడల్ అధికారిగా వ్యవహరిస్తోన్న డాక్టర్ శుభాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ హెల్త్ సర్వీసెస్ డెరైక్టర్ సాంబశివరావు, గాంధీ సూపరింటెండెంట్ ధైర్యవాన్, ట్రీటింగ్ ఫిజీషియన్ నర్సింహులతో కలసి శుభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 19న నైజీరియా ఎబోలా రహిత దేశంగా ప్రకటించుకుందని గుర్తు చేశారు. 5న గాంధీలో ఎబోలాపై సదస్సు ఈనెల 5న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎబోలాపై అవగాహ న సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్ అధికారి శుభాకర్ తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 లే రేటరీలు పుణే, ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలోని లెవల్-2 లేబొరేటరీలను లెవల్-3కి అప్‌గ్రెడేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ లో గాంధీ, ఏపీలో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రులు ఎబోలా నోడల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు. -
'అనుమానంతోనే పరీక్షలు, ఎబోలా లేదు'
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు. 'నిన్న సాయంత్రం మూడు గంటలకు గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. ఈనెల 21న నైజీరియా నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాం. నైజీరియాలో ఎబోలా ప్రభావం లేదు. పేషెంట్ పేరు, ఊరు, వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు. అనుమానంతో ఢిల్లీకి శాంపిల్స్ పంపాం. కొన్ని గంటల్లో రిపోర్టు వచ్చింది. ఆ పేషెంట్‌కు ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కేవలం నైజీరియా నుంచి వచ్చారు కాబట్టి...అనుమానంతో పరీక్షలు చేస్తున్నాం' అని సూపరింటెండెంట్ తెలిపారు. ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ధైర్యవాన్ తెలిపారు. -
హైదరాబాద్‌వాసికి ఎబోలా లక్షణాలు?
-
నగరంలో అనుమానిత వైరస్?
గాంధీలో బాధితుడికి ప్రత్యేక వైద్యం నమూనాలు ఢిల్లీకి.. నేడు నివేదిక అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు నవంబర్ 21న నైజీరియా నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నవంబర్ 24న తీవ్ర జ్వరంతో నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేయగా అతనిలో అనుమానిత వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారి సూచన మేరకు అతడిని సోమవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి యంత్రాంగం వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి అతడికి ప్రత్యేక వైద్యసేవలందిస్తోంది. రోగి నుంచి సేకరించిన నమూనాలను సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ల్యాబొలేటరీకి పంపినట్లు ఆస్పత్రి వైరాలజీ విభాగం ఇంచార్జి డాక్టర్ నరసింహులు తెలిపారు. కాగా ఈ వైరస్ ఎబోలానా లేక స్వైన్ ఫ్లూ కారక వైరసా, మరొకటా నిర్ధారణ కావాల్సి ఉంది. -
ఎబోలాపై భయం అక్కర్లేదు: జేపీ నడ్డా
న్యూఢిల్లీ: దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కట్టుదిట్టమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎబోలా నియంత్రణకు సంబంధించి విమానాశ్రయాల్లోని ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎబోలా వైరస్‌కు సంబందించి దేశంలో పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనా అవసరంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లోనూ ఎబోలా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఎబోలాను గుర్తించేందుకు డీఎన్ఏ సెన్సర్!
భారత సంతతి విద్యార్థి బృందం ఆవిష్కరణ మెల్బోర్న్: ఒక చుక్క రక్తాన్ని గాజు స్లైడ్‌పై వేసి ఓ చిన్న పరికరంలో ఉంచితే చాలు.. ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఉనికిని ఇట్టే నిర్ధారించుకోవచ్చు. ఎబోలాతో పాటు ఇంకా అనేక ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాలను గుర్తించేందుకూ ఉపయోగపడే అతి చౌకైన డీఎన్ఏ సెన్సర్‌ను ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి విద్యార్థితో కూడిన బృందం ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ లేదా ఓ చిన్న పరికరంతో ఈ బయో సెన్సర్ పనిచేస్తుంది. అందుకే సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అనిరుధ్ బాలచందర్‌తో పాటు మరో ఐదుగురు విద్యార్థులు రూపొందించిన ఈ బయో సెన్సర్‌కు ‘హార్వార్డ్ బయోమాడ్ కాంపిటీషన్’లో అవార్డు దక్కింది. -
‘ఎబోలా’పై అప్రమత్తం
హైదరాబాద్: ఎబోలా వైరస్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(వేగంగా స్పందించే వైద్య బృందం) ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో జనరల్ ఫిజీషియన్, ఎపిడిమాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్‌లు ఉంటారు. ఈమేరకు ఆరోగ్యశాఖ సంచాలకుడు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో ఎబోలా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంలోని వైద్యులకు వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్కానర్‌ను ఏర్పాటు చేసినట్టు ఎబోలా వైరస్ నియంత్రణాధికారి డాక్టర్ లక్ష్మీ సౌజన్య తెలిపారు. -
ఎబోలా విరాళాలకు ఫేస్బుక్లో కొత్త ఆప్షన్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రాణాంతక ఎబోలా వ్యాధిని రూపుమాపే కార్యక్రమానికి తోడ్పాటుగా ఫేస్బుక్ వెబ్సైట్ తన యూజర్లకు ఓ కొత్త అవకాశాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. ఎబోలా నిర్మూలనకు పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు తమ వినియోగదారులు విరాళాలు సులభంగా అందించేందుకు వీలుగా ఓ కొత్త బటన్‌ను రూపొందించినట్లు ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. -
'ఎబోలా' మరింత విస్తృతమయ్యే అవకాశం
పశ్చిమాఫ్రికాను వణుకుపుట్టిస్తున్న ప్రాణాంతకమైన వైరస్ ఎబోలా. ఈ వ్యాధి మరింత విజృంభించే అవకాశాలున్నట్టు వాషింగ్టన్ పరిశోధకులు తమ పరిశోధనలో వెల్లడించారు. మే నెల నుంచి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 5వేల మంది బలైనట్టు ఇప్పటికే రుజువైందని, ఇది మరింత తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాప్తిచెందే అవకాశముందని పరిశోధక విభాగం హెచ్చరిస్తోంది. ఇటీవల వైరస్ వ్యాప్తి పెరడంతో మరణాల రేటు 70 శాతానికి చేరినట్టు ఓ కొత్త విశ్లేషణ సూచిస్తోంది. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎబోలా మరణాల రేటు 50 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరానికి ప్రభావిత ప్రాంతాల్లో ఎబోలా బాధితుల సంఖ్య పది లక్షలు దాటే అవకాశమున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఎబోలా వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
చీకటి ఖండంలో చావుకేక
ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యంకాదని మోడియన్ డల్హౌసీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరోగ్యం కోసం తల ఒక్కింటికి 8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశాల ప్రజలు కేవలం 18 శాతం. కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశాలలోనే జరుగుతోంది. రుగ్మత ఏదైనా దాని నివారణ కోసం, నిర్మూలన కోసం జరిపే పోరాటం ఎలా ఉండాలి? అది మానవ శరీర పటు త్వంపైన ఆధారపడి ఉంటుంది. ఆ దృఢత్వం ప్రభుత్వ ప్రజారోగ్య విధానాల అమలుపైన ఆధారపడి ఉంటుంది. అంతేగానీ బలహీనమైన శరీరంపైన ఆధారపడి వైద్యుడు తన వృత్తి కౌశలంతోనే బలమైన శరీరాన్ని సృష్టించలేడు. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరాన్ని నిర్మించడమన్నది మొత్తం సామాజికుల సమష్టి కృషి ఫలితంగా ఉండాలి. - షేగువేరా ఈ సత్యాన్ని నిరూపించగలిగేదీ, సామాజిక స్పృహతో పరిపూర్ణంగా సుసాధ్యం చేయగలిగేదీ ఒక్క సోషలిస్ట్ ఆర్థికవ్యవస్థ మాత్రమే. ఇది ఎబోలా మహమ్మా రితో రుజు వవుతోంది. కొద్దికాలం క్రితం ఆఫ్రికా ఖండం లో ప్రారంభమై, ఇతర ఖండాలను చుట్టబెట్టడానికి సమాయత్తమైన వ్యాధి ఎబోలా. ఈ వ్యాధిని అరికట్టడా నికి ఆరంభమైన కృషిలో సోషలిస్టు క్యూబా నిర్వహించిన పాత్రకి ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రశంసల వర్షం కురిపించాయి. క్యూబానే ఎందుకు ప్రశంసించవలసి వచ్చింది? పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియె ర్రాలియోన్లలో వేలాది మందికి సోకిన ఆ అంటువ్యాధిని ఒక రాక్షస వ్యాధిగా గుర్తించారు. ఇది ఆయా దేశాల ప్రజ లలో బయ టపడిన వెంటనే ఎబోలా వైరస్ సంహారానికి ఆగమేఘాల మీద క్యూబా విరుగుడు కనిపెట్టింది. అయినా డిసెంబర్‌కు ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి మూలం ఏది? నిజానికి ఈ వ్యాధి ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు వ్యాపించింది. ఇతర ఖండాల నుంచి ఆయా దేశాలకు రాకపోకలు సాగించే దేశాల ప్రజ లవల్ల మరికాస్త విస్తరించే అవకాశమూ లేకపోలేదని హెచ్చరికలు వెలువడుతున్నాయి. భారత్, చైనాలలో విద్య కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన ఆఫ్రికన్లు వివిధ పారి శ్రామిక వాడలలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి ఆఫ్రి కా నుంచి ఆసియాకు పాకే అవకాశాలూ ఎక్కువేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ సమయంలో దూసుకు వచ్చినదే క్యూబా మందు. ఇప్పటికే ఎబోలా వైరస్‌కు 10,000 మంది వరకు బలైనారు. చడీచప్పుడు లేకుండా కాటు వేసి, 48 గంటల లోనే ప్రాణాలను తోడేసే వ్యాధి ఎబోలా. దీని వైరస్ మూలాల గురించి నలుగురూ నాలుగు రకాల కారణాలు చెబుతున్నారు. వీటికి సంబంధించి ఈ నెల రెండో తేదీన లండన్ నుంచి వెలువడిన వార్త మరీ భయానకంగా ఉంది. ఈ వైరస్‌ను వ్యాప్తి చేయగలిగిన జీవి గబ్బిలమని కొందరు నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఎబోలాతో పాటు, వంద రకాల వైరస్‌లకు గబ్బిలమే కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలలో వెల్లడైంది. వీటిలో రాబిస్, తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే క్రిములు కూడా ఉన్నాయని తేలింది. ఇన్ని ప్రమాదకర వైరస్‌లతో జీవించే గబ్బిలాలకు ఆఫ్రికా అడవులే నిలయాలు. ఈ విషయాల తోనే వ్యాధి నిరోధకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు మార్గం కూడా దొరికింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా, దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తంగా ఉండవలసిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మన దేశం నుంచి చాలామంది ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగిస్తున్నందున ఎబోలా వ్యాపించ డానికి అవకాశాలెక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ గుర్తించారు? 38 ఏళ్లనాడు మధ్య ఆఫ్రికాలోని కాంగో రిపబ్లిక్ (పాత జైరే)కు చెందిన ఒక నర్సుకు ప్రాణాంతక వ్యాధి ఒకటి సోకి, కొన్ని గంటలలోనే కన్నుమూసింది. అప్పుడు ఆ రోగి శరీరం నుంచి స్రవించిన రక్తం, చేసుకున్న వాంతులు, విరేచనాలను పరీక్షించినపుడు బయట పడిన వ్యాధికే ఎబోలా అని పేరు పెట్టారు. ఎబోలాలో మొత్తం 20 రకా లు ఉన్నాయని కూడా అప్పుడే కనుగొన్నారు. కాంగోలోనే ఎంబుకు అనే గ్రామంలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలను గమనించారు కాబట్టి, ఆ ఊరి పేరే పెట్టారు. తరువాత ఆ గ్రామాన్నీ, వారి సంస్కృతినీ అవమానించడం ఇష్టం లేక అక్కడికి సమీపంలోనే ప్రవహిస్తున్న ఎబోలా అనే నది పేరును ఈ వైరస్‌కు తగిలించారు. దీని అర్థం - నల్ల నది. పాశ్చర్ పరిశోధనా సంస్థ (ఫ్రాన్స్)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పియరీ సురెయు ఈ పేర్లను నిర్ధారించినవారిలో ప్రముఖుడు. ఓ వ్యాధి పేరుతో ఎబోలా నది అలా ప్రపంచ ప్రజలకు పరిచయమైంది. ఇలాగే కొన్ని నదుల పేర్లు రోగాలకు ఆపాదించారు. ఎబోలాను వీటన్నిటికి మించిన ప్రాణాంతక వ్యాధిగా శాస్త్రజ్ఞులు పరిగణిస్తున్నారు. ఆధు నిక మానవుడు ఘోరమైన విపత్తును ఎదుర్కొనబోతు న్నాడని కూడా అంచనా వేస్తున్నారు. నిరంతర అప్రమత్తతే వ్యూహం ఇలాంటి మహమ్మారిని నివారించడానికి పశ్చిమాఫ్రికా దేశాలతో కలసి, చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా తన సామర్థ్యానికి మించి కృషి చేస్తున్నదని ప్రపంచ సంస్థలు శ్లాఘించాయి. అక్కడి వైద్యులకూ, నిపుణులకే కాకుండా ఇతర దేశాల వైద్య సిబ్బందికి కూడా క్యూబా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నది. ప్రపంచానికి వైద్యసేవలు అందిస్తున్న బహుకొద్ది దేశాలలో క్యూబా ఒకటి అని అపోలో ఆస్పత్రు ల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి కూడా ఉదహరించారు. 1961 నుంచి ఇప్పటి వరకు 154 దేశాలకు క్యూబా ఆరోగ్య సేవకులు వెళ్లారని లాటిన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ ఫిట్జ్ రాశాడు. సామ్రాజ్య వాద పెట్టుబడిదారి పాలక వ్యవస్థలు శతాబ్దాలుగా తమ పాత వలసను దురాక్రమిస్తూ యుద్ధాల ద్వారా, వనరుల దోపిడీ ద్వారా, బానిస వ్యాపారం ద్వారా ఆ ప్రాంతాల లోని ప్రజల ప్రతిఘటనా శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. దీనితో పాటు విషక్రిముల ద్వారా, విషపూరిత రసాయ నాల ద్వారా ఆ దేశాల పంటలను జనావాస ప్రాంతాలను కకావికలు చేస్తున్నాయి. ‘ఏజెంట్ ఆరెంజ్’ అనే విష పదార్థం సాయంతో వియత్నాం మీద అమెరికా చేసిన పని ఇదే. ఆ రసాయనాన్ని వియత్నాం మీద చల్లి అమెరికా అక్కడ పదిహేనేళ్ల పాటు ఏ పంట వేయడానికి ఆస్కారం లేకుండా చేసింది. ఆఫ్రికాలోని నిరుపేద దేశాలలో ఆరో గ్య వ్యవస్థలు కుప్పకూలిపోవడం ఇలాంటి క్రమంలో జరిగిందే. ఆ దేశాలు సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధా లకూ, నిరంతర ఘర్షణలకూ సుదీర్ఘకాలం కేంద్రంగా ఉన్న వే. ఆ దేశాలలోని ఇతర వ్యవస్థలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడం లేదా నిర్వీర్యం కావడం దీని ఫలితమే. లైబీరియా సంగతే చూద్దాం. అక్కడ 40 లక్షల జనాభాకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు కేవలం 51 మంది. సియెర్రాలియోన్‌లో 60 లక్షల జనాభాకు 136 మంది వైద్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు. అమెరికా అమానుషత్వం బడుగు దేశాల పంటలనీ, ప్రజారోగ్యాన్నీ దెబ్బతీసిన వల స, నయా వలస పాలక వ్యవస్థలే ఇప్పుడు ఎబోలా వంటి వ్యాధులకు గురి అవుతున్న వర్ధమాన దేశాల పౌరులను తమ దేశంలోకి అనుమతించడంలేదు. వీరి ప్రవేశం మీద ఆంక్షలు, నిషేధాలు పెట్టడానికి వెనకాడటం లేదు. థామస్ డంకన్ అనే లైబీరియా పౌరుడు అమెరికాలో అడు గుపెట్టినపుడు అతడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్టు గుర్తిం చారు. దీనితో అమెరికా ప్రభుత్వం, ‘కావాలనే, ఈ వ్యాధిని అమెరికాలో వ్యాపింప చేసే ఉద్దేశంతోనే’ అతడు వచ్చినట్టు చిత్రించింది. అతడు చనిపోక ముందే క్రిమినల్ నేరాలు మోపడానికి కూడా సిద్ధమైంది. ఇదే వైఖరిని తాజాగా ఆస్ట్రేలియా అనుసరిస్తున్నది. అసమానతలే అసలు వైరస్ ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరిం చడం సాధ్యంకాదని మోడియన్ డల్హౌసీ విశ్వవిద్యాల యానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభి ప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరో గ్యం కోసం తల ఒక్కింటికి 8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశా ల ప్రజలు కేవలం 18 శాతం. కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశా లలోనే జరుగుతోంది. ఇలాంటి అసమానతల వల్లనే వర్ధ మాన, బడుగు దేశాలలో ఇప్పటికీ క్షయ వ్యాధితో, ప్రసూతి సమయంలో లక్షల సంఖ్యలో మరణాలు సంభవి స్తున్నాయి. మూలిగే నక్క మీద తాడిపడినట్టు ఎబోలాలు తలెత్తేదీ ఇలాంటి చోటేనని మరచిపోరాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఎబోలా’ పై ఎయిర్‌పోర్ట్‌లలో అప్రమత్తం
హైదరాబాద్: పశ్చిమాఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో ప్రయూణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. భారత్‌కు చెందిన చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారని, వారిద్వారా ఎబోలా వైరస్ వచ్చే అవకాశముందని పేర్కొంది. గినియా, లైబీరియా, నైజీరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయూల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. ఏపీకి పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కాస్త అనుమానాస్పదంగా ఉన్న 23 మందిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, ‘ఎబోలా’కు ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై కేంద్రం రాష్ట్రానికి చెందిన నలుగురు వైద్యులకు శిక్షణ నిచ్చినట్టు ఎబోలా వైరస్ నియంత్రణ నోడల్ అధికారి డా.లక్ష్మీ సౌజన్య తెలిపారు. -
లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు
పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఎబోలా కేసుల రేటు క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. అయితే అంటువ్యాధిలా ప్రబలిన ఎబోలా వైరస్ వ్యాప్తి నిజానికి తగ్గుముఖం పట్టిన ధోరణి కనిపిస్తుందని తెలిపింది. ఎబోలా ఇన్ఫెక్షన్ తీవ్రత ప్రస్తుతం తగ్గినట్టు కనిపించినా దాని తీవ్రత చాలాకాలం వరకు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వైరస్ తీవ్రత తగ్గటం ఆశాజనకంగా ఉన్నా అది పూర్తిగా నిర్మూలన అయినట్టు భావించలేమని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూష్ ఐల్వార్డ్ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం జెనీవాలో ఎబోలా అదుపులో ఉన్న మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉందని ఐల్వార్డ్ హెచ్చరించారు. -
అప్రమత్తంగా ఉందాం..!
డాక్టర్స్ కాలమ్ జ్వరాలన్నీ ఒకటే కావు. కొన్ని ప్రమాదకరమైన జ్వరాలూ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రమాదకర వైరస్లు మొదట ప్రభావం చూపేది మహానగరాలపైనే. గతంలో స్వైన్ ఫ్లూ హైదరాబాద్‌పై పంజా విసిరింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎందరో పర్యాటకులు రోజూ హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నారు. సిటీ నుంచి వందల సంఖ్యలో వ్యాపార, ఉద్యోగ రీత్యా ఎందరో రోజూ ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎబోలా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కాంటినెంటల్ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డా.సౌజన్య చెబుతున్నారు. సాధారణ జ్వరాలకు ఉండే లక్షణాలన్నీ దీనికి కూడా ఉంటాయని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అసలైన మందు అని చెబుతున్నారామె. వ్యాధి లక్షణాలు ►మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాల తరహాలోనే ఈ వ్యాధి లక్షణాలుంటాయి. ►నోట్లో ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ►శరీరం మొత్తం విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ►శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ►ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుంది. ►కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ►శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వస్తాయి. ►వాంతులు, విరేచనాల ప్రభావం అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ►ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. ►దీనికి ప్రత్యేకంగా మందులుగానీ, టీకాలు గానీ లేవు. ఇవి ఇంకా పరీక్షా దశను దాటలేదు. ►విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్యపరీక్షలు ►పక్కాగా నిర్వహించాలి. ►ఎబోలా రోగులకు వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరం. ► కాచిన నీళ్లు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారాన్ని తీసుకోవడం ప్రాథమిక జాగ్రత్తలు ప్రజంటర్: జి.రామచంద్రారెడ్డి -
ఎబోలాకు భయపడొద్దు: ఒబామా
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు భయపడవద్దని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశం సన్నద్ధంగా ఉందని, దీనిపై గ్లోబల్ పోరుకు అమెరికా సారథ్యం వహిస్తుందని ఒబామా శనివారమిక్కడ రేడియో, వెబ్ సందేశమిచ్చారు. లైబీరియాలో ఎబోలా రోగులకు వైద్య సాయం చేసే క్రమంలో ఈ వ్యాధి బారినపడి సంపూర్ణంగా కోలుకున్న నర్సు నీనా ఫామ్‌ను ఒబామా అభినందిం చారు. ఒబామా ఆమెకు అభినందనలు చెప్పి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఎబోలాకు 2.30 కోట్ల ఏళ్లు! న్యూయార్క్: ఆఫ్రికా దేశాల్లో విజృంభించి, అమెరికాతో సహా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ 2.30 కోట్ల ఏళ్ల పురాతనమైనదట! ఫిలోవైరస్ కుటుంబానికి చెందిన ఎబోలాతో పాటు మార్బర్గ్ అనే ప్రాణాంతక వైరస్లు 16-23 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం నుంచే ఉనికిలో ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది -
10 వేలకు చేరువలో ఎబోలా రోగులు
జెనీవా/వాషింగ్టన్: పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ సోకినవారి సంఖ్య దాదాపు 10వేలకు చేరువలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఈ దేశాల్లో 9,936 మందికి ఈ వైరస్ సోకగా మొత్తం 4,877 మంది మృత్యువాత పడ్డారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఎబోలా వైరస్‌ను అరికట్టే అంశంపై జరిగిన సమావేశం అనంతరం డబ్ల్యూహెచ్ఓ గురువారం జెనీవాలో ఈ వివరాలు వెల్లడించింది. ఎబోలాను అరికట్టడానికి రెండు వ్యాక్సిన్లను గుర్తించారు. ప్రస్తుతం వీటిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఎబోలా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి 200 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్టు అమెరికాకు చెందిన ఔషధ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. కాగా, అమెరికాలో ఎబోలాను నియంత్రిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబా మా ఆశాభావం వ్యక్తంచేశారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను అరికట్టేందుకు పలు దేశాలు ముందుకురావడం అభినందనీయమన్నారు. -
ఎబోలాపై తాజా యుద్ధం
మరో రెండునెలల్లోపు ఎబోలా వైరస్‌ను నిర్మూ లించలేకపోతే మన తరంలోనే అతి పెద్ద మానవ విపత్తును ఎదుర్కోవలసి ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించిన ఎబోలా ఇప్పటికే 4,500 మందిని బలి తీసుకుంది. మానవ శరీరంలోని ద్రవపదార్థాల (రక్తం, వాంతి, విరోచనం,) ద్వారా శరవేగంగా ఇది వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో 70 శాతం మంది నిస్సహాయంగా మరణిస్తున్నారు. దీని బారినపడిన గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో వ్యాధి నివారణ కోసం అవసరమైన సైనిక సామగ్రి, ఆర్థిక సహాయం అందకపోతే అంతర్జాతీయ సమాజం తర్వాత వగచీ ప్రయోజనం లేదని అమెరికా, బ్రిటన్లు తాజాగా హెచ్చరించడం ఎబోలా తీవ్రతను సూచిస్తోంది. 60 రోజులలోపు ఎబోలా వైరస్‌ను అదుపు చేయలేకపోతే ఒక ప్పుడు పోలియో, తర్వాత హెచ్ఐవీ మహమ్మారిలా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందని అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ శనివారం హెచ్చరించారు. పశ్చిమాఫ్రికాలో ఎబోలా వైరస్ బయటపడిన తొలి దశ లో దాంతో సరిగా వ్యవహరిం చలేకపోయామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రాంతంపై దశాబ్దాలుగా ప్రభావం చలాయిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కలవరం మొదలైంది. ఎబోలా వైరస్ అదుపు వాటి సామూహిక బాధ్యతగా మారుతోంది. పశ్చిమాఫ్రికాకు పరిమితం కాకుండా విస్తరిస్తున్న ఎబోలా బారిన తాను కూడా చిక్కుకోకతప్పదని పాశ్చాత్య ప్రపంచం వేగంగానే గుర్తించింది. సరిగ్గా తుపాను కేంద్రం (కన్ను)లో పోయి పడ్డామనీ, ఎబోలా వ్యాప్తిని ఊరకే చూస్తూ చేష్టలుడిగే దశకు మనం చేరుకోకూడదనీ, పరిస్థితి విషమం కాకముందే ఉమ్మడి లక్ష్యంతో దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని పశ్చిమా ఫ్రికాలో ఎబోలా రోగులకు వైద్య సేవలందిస్తున్న ఆక్స్ ఫామ్ చారిటీ సంస్థ పేర్కొంది. వైరస్ విస్తరించిన మూడు దేశాలకు సైనిక దళాలను, వైద్యులను పంపించి, తగినన్ని నిధులు కేటాయించడంలో వెనుకబడితే యావత్ యూరప్, అమెరికా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సంస్థ సీఈఓ మార్క్ గోల్డ్ రింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎబోలా వ్యాధి అదుపుకోసం సమాజం కనీవినీ ఎరుగని రీతిలో సత్వరమే స్పందించాలన్న ఆక్స్ ఫామ్ హెచ్చరిక తనదైన ప్రభావం చూపుతోంది. అమెరికా ఇప్పటికే భారీమొత్తాన్ని ఎబోలా అదుపునకు కేటాయించగా ఇంగ్లండ్ ఇటీవలే 125 మిలియన్ పౌండ్ల సహాయం ప్రకటించింది. మరో బిలియన్ డాలర్లను సహాయం అందించడానికి ఈయూ త్వరలో సమావేశం కానుంది. పశ్చిమాఫిక్రాలోని ఎబోలా చికిత్సా కేంద్రాలలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు అవసరం. పైగా వైద్యుల మోహరింపునకు, వైద్య సామగ్రి తరలింపునకు పెద్ద ఎత్తున సైనిక దళాల అవసరం ఏర్పడింది. ఆ ప్రాంతంలో వ్యాధి నివారణలో మునిగి ఉన్న ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు ప్రధానంగా స్వచ్ఛ జలం, పారిశుధ్యం, ప్రజలను జాగరూకులను చేయడంపై దృష్టి పెడుతు న్నాయి. చికిత్స ఎంత అవసరమో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం అంత అవస రం. దీనికి నిధులు పెద్ద ఎత్తున అవసరం. ఈ తరంలోనే అతి పెద్ద విపత్తు చెలరేగుతున్నా దాంతో వ్యవహరించేందుకు ప్రపంచం ఇప్పటికీ పెద్దగా సిద్ధపడలేదని విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా 4,000 మం దిని, బ్రిటన్ 750 మంది బలగాలను పంపించాయి. ఈయూ నుంచి మరో 2 వేల మంది వైద్య సిబ్బందిని పంపించాలని బ్రిటన్ ప్రధాని ఈయూను కోరను న్నారు. సిబ్బందిని, సహాయ సామగ్రిని శరవేగంగా పంపించడం ద్వారానే పశ్చిమాఫిక్రాలో ఎబోలాను అరికట్టవచ్చు. ప్రతి 20 రోజులకు ఎబోలా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా 10 వేల కేసులు నమోదు కానున్నాయి. గణాంకాలకు సంబంధించిన ఈ భయ విహ్వల నేపథ్యం పాశ్చాత్యదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఎబోలాపై సామూహిక బాధ్యతను ఈ క్షణం చేపట్టకపోతే పశ్చిమాఫ్రికా ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక చట్రం కుప్పకూలుతుంది. అక్కడి నుంచి వ్యాపించే వ్యాధి ప్రభావం తమ పౌరులను కూడా వదిలిపెట్టదని పాశ్చాత్య సమాజం భీతిల్లుతోంది. -
ఎబోలా’ పోరుకు 300 కోట్లు: గేట్స్ ఫౌండేషన్
సియాటెల్: పశ్చిమాఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా ప్రబలిన ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించేందుకు, ఎబోలా వైరస్ నివారణ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ. 300 కోట్ల నిధులు ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన రూ.60 కోట్లకు అదనంగానే ఈ నిధులు అందించనున్నట్లు తెలిపింది. ఎబోలా నివారణకు కృషిచేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ఔషధాల పంపిణీ, టీకాల అభివృద్ధి, చికిత్సల వంటి వాటికి ఈ మొత్తం ఉపయోగించనున్నారు -
ఎబోలా వైరస్‌కు మరో టీకా!
వాషింగ్టన్: పశ్చిమాఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్‌ను నివారించే సమర్థమైన టీకాను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ఈ టీకాను ప్రయోగాత్మకంగా నాలుగు మకాక్ కోతులకు ఇచ్చి, తర్వాత అధిక మోతాదులో ఎబోలా వైరస్‌ను కూడా ఎక్కించగా.. ఆ కోతులు వైరస్‌ను పూర్తిగా తట్టుకోగలిగాయని అమెరికా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ ఆరోగ్య సంస్థలు(ఎన్ఐహెచ్)’ పరిశోధకులు వెల్లడించారు. ఎబోలా వైరస్‌కు చెందిన రెండు జన్యువులను, చింపాంజీల్లో ఉండే ‘చింప్ అడినోవైరస్ టైప్3(చాడ్3)’ని కలిపి ఈ టీకాను అభివృద్ధిపర్చారు. -
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా శాస్త్రవేత్త, ఈ అధ్యయనం సహసమన్వయకర్త గ్యారీ కోబింగర్ తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వైరస్ సోకిన కోతులకు ప్రతి మూడు రోజులకోసారి మందును అందించారు. కొన్ని కోతులకు వైరస్ సోకిన మూడు లేదా నాలుగో రోజు నుంచి చికిత్స ప్రారంభిస్తే మరికొన్ని కోతులకు ఐదో రోజున (అంటే మరణం అంచుకు చేరుకున్న సమయంలో) చికిత్స మొదలుపెట్టారు. ఈ మందులో బయటి ప్రొటీన్‌తో బంధం ఏర్పరచుకోగల 3 అణువుల యాంటీబాడీలు ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా వైరస్ లక్షణాలైన దద్దుర్లు, రక్తస్రావాన్ని పూర్తిగా తగ్గించగలిగారు. -
3 నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణ
జెనీవా: పశ్చిమ ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ మరింతగా విస్తరించకుండా మూడు నెలల్లోగా నియంత్రించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది. 6 నుంచి 9 నెలల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈలోగా ప్రస్తుతం నమోదైన 3,062 కేసుల సంఖ్య 20 వేలకుపైగా దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎబోలా వ్యాక్సిన్ పరీక్షలను వేగవంతం చేస్తున్నామని. ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్‌లైన్ లండన్‌లో ప్రకటించింది. మీరేం చేస్తున్నారు మరోవైపు మన దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటో సెప్టెంబర్ 2లోగా వివరించాలని బాంబే హైకోర్టు గురువారం పిల్ విచారణ సందర్భంగా కేంద్రం, మహారాష్ట్ర సర్కారును కోరింది. -
‘ఎబోలా’ భయంతో స్వదేశానికి 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడకు వలసవెళ్లిన భారతీయులు ప్రాణభయంతో స్వదేశానికి చేరుకుంటున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 98 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 మంది భారతీయులతోపాటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా వచ్చిన 85 మంది భారతీయులను పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. లైబీరియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్లో ఆఫ్కాన్స్ అనే కంపెనీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 112 మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఎబోలా నివారణ తేలికే: యూఎస్ ఎయిడ్ మలేరియాతో పోలిస్తే ఎబోలా వైరస్ బారినపడకుండా తప్పించుకోవడమే తేలికని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఎయిడ్) డెరైక్టర్ జెర్మీ కోన్యన్డిక్ పేర్కొన్నారు. ఎబోలా సోకిన వ్యక్తి శరీర ద్రవాలను తాకకుండా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు. 1976 నుంచి ఇప్పటివరకూ ఎబోలా మృతుల సంఖ్య 3 వేల లోపు ఉండగా మలేరియా వల్ల ప్రతి రెండు రోజులకు 3 వేల మంది మరణిస్తున్నారనే అంచనాలు ఉన్నాయన్నారు. -
అమెరికన్లకు ఎబోలా గురించి తెలియదు!!
అమెరికన్లలో చాలామందికి అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గురించి అసలు ఏమాత్రం తెలియదట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్పీహెచ్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. అమెరికాలో కూడా ఎబోలా విపరీతంగా వ్యాపిస్తుందని 39 శాతం మంది అమెరికన్లు భావిస్తుంటే, తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని 26 శాతం మంది అనుకుంటున్నారు. చదువు తక్కువగా ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ వ్యాధి అమెరికాలో వ్యాపిస్తుందని భయపడుతున్నారు. అంతేకాదు.. సర్వేలో పాల్గొన్నవాళ్లలో మూడోవంతు మంది అయితే.. ఎబోలా వ్యాధి వచ్చినవాళ్లకు దాన్ని నయం చేయడానికి అద్భుతమైన మందు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని అనుకుంటున్నారని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన గిలియన్ స్టీల్ఫిషర్ చెబుతున్నారు. వాస్తవానికి ఎబోలా గాలిలో వ్యాపించే వ్యాధి కాదు. ఇది నేరుగా శరీర స్రావాల నుంచి, అది సోకిన వస్తువుల నుంచి, జంతువుల నుంచి మాత్రమే వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యాధిని నిరోధించడానికి గానీ, వచ్చిన తర్వాత అరికట్టడానికి గానీ ఎలాంటి మందు ఇంతవరకు కనుక్కోలేదు. అయితే వచ్చినవారికి ఆక్సిజన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం, బీపీ లెవెల్ సరిగ్గా ఉండేలా చూడటం, ఫ్లూయిడ్స్ ఇవ్వడం లాంటివి చేసి జీవితకాలం పెంచుతున్నారు. -
ఎబోలాను జయించారు
వాషింగ్టన్: ప్రమాదకర ఎబోలా వైరస్ బారినపడిన ఇద్దరు అమెరికన్లు గురువారం సంపూర్ణ ఆరోగ్యంతో అట్లాం టా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో డాక్టర్ కెంట్ బ్రాంట్లీ(33), నాన్సీ రైట్బోల్ (60) లైబీరియాలో ఎబోలా బారిన పడ్డారు. వెంటనే వీరిని చికిత్స కోసం ఎమోరి యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ పూర్తిగా కోలుకోవడంతో వీరి నుంచి ప్రజలకు హానీ లేదని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జి చేసినట్టు వైద్యులు వెల్లడించారు. -
ఎబోలాతో తెలుగు వ్యక్తి మృతి?
నైరోబి: కెన్యాలో గజేంద్రరెడ్డి అనే తెలుగు వ్యక్తి మృతి చెందారు. నైరోబీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం చిటిపిరాళ్ల ప్రాంతానికి చెందిన వాడని గుర్తించారు. గజేంద్రరెడ్డి ఎబోలా వ్యాధితో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 4న గజేంద్రరెడ్డి జ్వరంతో ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరాడు. 14వ తేదీ నుంచి కోమాలోకి వెళ్లిపోయిన అతడు 18న మృతి చెందాడు. ఈ ఉదయం 10 గంటలకు గజేంద్రరెడ్డి భార్య, కుమార్తె బెంగళూరుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భయానకమైన ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. -
ఐదుగురికి ఎబోలా పాజిటివ్‌లతో సంబంధాలు
న్యూఢిల్లీ/మన్రోవియా/అబూజా: భయానకమైన ఎబోలా వైరస్ బాధిత దేశాలనుంచి గత 24గంటల్లో వివిధ విమానాశ్రయాల ద్వారా భారత్‌చేరుకున్న 145మందిలో ఐదుగురికి ఎబోలా వైరస్ పాజిటివ్ రోగులతో సంబంధం ఉన్నట్టుగా పరీక్షల్లో తేలింది. ఈ ఐదుగురు ప్రయాణికుల వివరాలను తదుపరి చర్యల కోసం వ్యాధి నిఘా పరీక్షలకు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎబోలా బాధిత దేశాలనుంచి గత 24 గంటల్లో ముంబై విమానాశ్రయంలో 49మంది, ఢిల్లీలో 53మంది, చెన్నైలో 12మంది, కోచిలో 11మంది, బెగళూరులో 14మంది, అహ్మదాబాద్‌లో ఆరుగురు దిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎబోలా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లైబీరియాలో ఎబోలా కర్ఫ్యూ విధించారు. మరో వైపు నైజీరీయాలో ఎబోలా వైరస్ సోకిన రోగికి చికిత్స అందించిన ఒక డాక్టర్ మరణించినట్టు అధికారులు ప్రకటించారు. -
ఎబోలా మృతులు 1,229
జెనీవా: పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. ఈనెల 14, 16 తేదీల మధ్యనే 84 మంది ఎబోలాతో మరణించారని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్నుంచి ఇప్పటివరకూ 2,240 కేసులు నమోదయ్యాయని, పశ్చిమాఫ్రికాలోని గినియా లో తొలుత మొదలైన ఎబోలా వైరస్ మిగతా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఎబోలాతో అస్వస్థులైనవారిని ప్రత్యేక ఏర్పాట్లతో ఆసుపత్రుల్లో చేర్చారు, వారి ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కాగా, ఎబోలాతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పదిలక్షలమంది బాధితులకు 3నెలలపాటు ఆహార పంపిణీకోసం సన్నాహాలు చేస్తున్నట్టు ఐరాస తెలిపింది. -
ఆఫ్రికన్ విటులను దూరం పెట్టండి
ఎబోలా నేపథ్యంలో కోల్‌కతా సెక్స్‌వర్కర్లకు ఓ స్వచ్ఛంద సంస్థ సూచన కోల్‌కతా: ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికన్ దేశాలలో విపరీతంగా వ్యాపిస్తున్ నేపథ్యంలో ఆ ఖండానికి చెందిన విటులను దూరం పెట్టండంటూ కోల్‌కతాలోని రెడ్‌లైట్ ప్రాంతమైన సోనాగచిలోని సెక్స్‌వర్కర్లకు ఓ స్వచ్ఛంద సంస్థ సలహా ఇచ్చింది. ఈ రెడ్‌లైట్ ఏరియాకు తరచు వచ్చేవారిలో ఆఫ్రికన్లు సైతం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సెక్స్‌వర్కర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ) అనే స్వచ్ఛంద సంస్థ వారికి ఈ సూచన చేసింది. ఎబోలా వైరస్ సోకిన వారితో శారీరకంగా కలిస్తే అది మీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందని సెక్స్‌వర్కర్లను సంస్థ హెచ్చరించింది. పశ్చిమాఫ్రికాలోని నైజీరియా, లైబీరియా, సియెర్రా లియోన్ లాంటి దేశాల్లో ఎబోలా వైరస్ సోకి వందలాది మంది మరణించడాన్ని అది ఉదహరించింది. ఎబోలా ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికన్లకు దూరంగా ఉండాలని సెక్స్‌వర్కర్లను కోరినట్లు డీఎంఎస్సీ సభ్యులొకరు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుసరించి ఎబోలా సోకిన వ్యక్తికుండే రోగ లక్షణాలను గుర్తించేందుకు వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. -
లైబీరియాలో అమెరికా డాక్టర్‌కు ఇబోలా!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వైరస్ బారిన పడిన అమెరికన్ డాక్టర్ ఒకరు పూర్తిస్థాయిలో కోటుకుంటున్నారు. త్వరలోనే తన కుటుంబ సభ్యులను కూడా కలవాలనుకుంటున్నారు. అయితే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయని డాక్టర్ కెంట్ బ్రాంట్లీ చెప్పారు. త్వరలోనే తాను మళ్లీ తన భార్య, పిల్లలు, కుటుంబాన్ని కలుస్తానని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమాఫ్రికాలో విస్తృతంగా వ్యాపించిన ఇబోలా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు బ్రాంట్లీ వచ్చారు. అప్పుడే ఆయనకు ఇబోలా సోకింది. విషయం తెలియగానే ఆయనను అట్లాంటాలోని ఎమరీ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. బ్రాంట్లీతోపాటు నాన్సీ రైట్బోల్ అనే అమెరికన్‌కు కూడా లైబీరియాలో ఉండగా ఇబోలా సోకింది. లైబిరియా ప్రాంతంలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రజలు ఇబోలా వైరస్ కారణంగా మరణించారు. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో దాదాపు రెండు వేల మంది ఇంకా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. -
‘ఎబోలా’ తగ్గేలా లేదు: డబ్ల్యూహెచ్‌వో
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అసాధారణ చర్యలు అవసరమని పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌కు పరిశోధనల స్థాయిలో ఉన్న జెడ్-మ్యాప్ అనే ఔషధం శాంపిల్ డోస్‌లను అమెరికాకు చెందిన ఓ కంపెనీ లైబీరియాకు పంపినట్లు మీడియా పేర్కొంది. -
ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ పరీక్షలు
శంషాబాద్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ భారతదేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక పరీక్షా కేంద్రాలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇంతవరకు ఈ వ్యాధి లక్షణాలు కలిగిన ప్రయాణికులు ఎవరు కూడా రాలేదని ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రాంతీయ ఉన్నత వైద్యాధికారి డాక్టర్ జూపాక మహేష్ బుధవారం తెలిపారు. ఉదయం ఇద్దరు, రాత్రి ఇద్దరు వైద్యులు విమానాశ్రయంలో అరైవల్ కేంద్రంలో పరీక్షలు చేయడానికి అందుబాటులో ఉన్నారన్నారు. వ్యాధి తీవ్రత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం విమానాశ్రయంలో ప్రయాణికులకు సూచించే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. -
అంతటా ‘ఎబోలా’ గుబులు
సాక్షి, న్యూఢిల్లీ:ఎబోలా వైరస్... ఈ పేరు వింటేనే నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. నగరంలో ఎబోలా వైరస్ వ్యాధి మేనేజ్మెంట్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిన రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రికి వస్తోన్న ఫోన్ కాల్స్ ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన హెల్ప్‌లైన్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నవారితో పాటు ఎబోలా వ్యాధి విస్తరించిన దేశాలలో తమ బంధువులు ఉన్నవారు హైల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఎబోలా లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని తెలియడంతో దగ్గు, జలుబుతో బాధపడేవారు కూడా తమను ఫోన్‌ద్వారా సంప్రదిస్తున్నారని ఆర్ఎంఎల్లో ఎబోలా వైరస్ డిసీజ్ నోడల్ అధికారి డాక్టర్ సునీల్ సక్సేనా చెప్పారు.రామ్ మనోహర్‌లోహియా ఆసుపత్రిని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి నోడల్ ఆసుపత్రిగా గుర్తించిన ప్రభుత్వం.... డాక్టర్ సునీల్ సక్సేనాను నోడల్ అధికారిగా నియమించింది. ఈ ఆసుపత్రిలో ఎబోలా వ్యాధికి కంట్రోల్ రూమ్‌తోపాటు హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేశారు. 23061469, 23063205, 23061202 నంబర్లతో హెల్ప్లైన్లు పనిచేస్తున్నాయి. వ్యాధిగ్రస్తులను విడిగా ఉంచి చికిత్స చేయడం కోసం ఆసుపత్రి పాత భవనం మొదటి అంతస్తులో ఐసోలేషన్ ఐసీయూను ఏర్పాటుచేశారు, 23404310 కలిగిన ఐసీయూ కూడా ఎబోలా వైరస్ గురించి సందేహాలకు సమాధానాలు ఇస్తోంది. ఎబోలా వైరస్ లక్షణాలున్నట్లుగా అనుమానించే వ్యక్తులను నేరుగా విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించేవిధంగా ఏర్పాట్లు చేశారు. మూడు షిఫ్టులలో రోగులకు వైద్య సేవలదించేందుకు వీలుగా వైద్య సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాల్ని నియమించారు. వ్యాధితో బాధపడతున్నట్లు గుర్తించిన కేసులకు వైద్యం అందించడం కోసం పడకలు సిద్ధంగా ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వం సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా పరీక్షలు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎబోలాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెడ్ అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు ....విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ సోకిన వారిని గుర్తించి వారిని హుటాహుటిన అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా రాష్ట్ర అత్యవసర వైద్య సేవల విభాగంకు చెందిన అంబులెన్సులు విమానాశ్రయంలో మోహరించాయి. దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఆఫ్రికా ఖండంలో పలు ప్రాంతాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. తీవ్ర జ్వరంతో ఆరంభమయ్యే ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో భారత్‌లో ఈ వైరస్ ప్రబలకుండా కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత చర్యల్లో పడింది. -
చెన్నైలో 'ఎబోలా' భయం!
చెన్నై: ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో వందల మంది ప్రాణాలను బలితీసుకుంటూ, అమెరికా వంటి దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ భయం ఇప్పుడు చెన్నైను పట్టుకుంది. ఎబోలా వైరస్ వ్యాపించిన దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలు అన్ని దేశాల వారు భయపడుతున్నారు. అలాగే ఈరోజు ఆఫ్రికా నుంచి ఓ 26 ఏళ్ల యువ ప్రయాణికుడు చెన్నై వచ్చారు. ఇంకేముందు అతనికి ఎబోలా వైరస్ సోకిందని అనుమానించారు. గినియా దేశం నుంచి ఆ యువకుడు వచ్చారు. వెంటనే అతనిని అత్యవసర వైద్య పరీక్షల కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతనికి ఎటువంటి వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఎబోలా వైరస్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు చేశామని, ఎబోలాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు అతనికి లేవని డాక్టర్ రఘునందన్ చెప్పారు. దాంతో ఇక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి
పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలూ సమన్వయంతో కృషిచేసి ఇబోలా వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించాలని డబ్ల్యుహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్' ప్రకటించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని వివరించింది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఇప్పటివరకు 1711 మందికి ఈ వైరస్ వ్యాపించిందని, 932 మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేస్తోంది. వాస్తవ సంఖ్య ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉండే ప్రమాదం లేకపోలేదు. -
ఇబోలా ఎఫెక్ట్: నైజీరియాలో అత్యవసర పరిస్థితి
నైజీరియాలో ఇబోలా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అబుజా నగరంలో ఇబోలా విజృంభణపై దేశ రాజధాని నగరంలో ఆరోగ్య అంశాలపై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఓ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓన్యెబుచి చుక్వు తెలిపారు. ఇబోలా వైరస్ సోకినట్లు నిర్ధారించిన ఆరుగురు నైజీరియన్లలో ఒకరు మంగళవారం మరణించారని, మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఇబోలా వైరస్ ముప్పు ఉందని, నైజీరియా అనుభవం ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించిందని ఆరోగ్య మంత్రి చెప్పారు. చేదుగా ఉండే కోలా వక్కలు ఈ అతి ప్రమాదకరమైన వైరస్‌ను అదుపు చేస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన తెలిపారు. గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా వచ్చిన ఈ వ్యాధి ఇప్పటివరకు 1711 మందికి సోకగా, నాలుగు పశ్చిమాఫ్రికా దేశాలలో 932 మంది ప్రాణాలను బలిగొంది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. -
భారతదేశానికీ 'ఇబోలా' ముప్పు!!
ఇబోలా.. పశ్చిమాఫ్రికాలో విపరీతంగా వ్యాపించిన ఈ వైరస్ కేవలం కొన్ని వారాల్లోనే 900కు పైగా ప్రాణాలు బలిగింది. ఇప్పటివరకు అయితే ఇది కేవలం లైబీరియా, గినియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే.. మన దేశానికి కూడా ఇది ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఎందుకంటే, ఇబోలా వైరస్ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి మరీ విషమిస్తే వీరందరినీ వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పార్లమెంటులో తెలిపారు. గినియాలో 500 మంది, లైబీరియాలో 3వేల మంది, సియెర్రా లియోన్‌లో 1200మంది భారతీయులున్నారు. నైజీరియాలో అయితే ఏకంగా 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 1603 మందికి ఇబోలా వైరస్ సోకిందని, వారిలో 887 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. భారతీయుల్లో ఎవరికైనా ఈ వైరస్ సోకి.. అది తెలియకుండా వాళ్లు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తే పరిస్థితి ఏంటని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాఫ్రికాలో చింపాంజీలు, ఇతర జంతువులతో సన్నిహితంగా ఉన్న వాళ్లలోనే ముందుగా ఈ వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చింపాంజీలు, గబ్బిలాల నుంచి మనుషులకు, తర్వతా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి చర్మం పక్కవారికి తగిలినా.. వారికి కూడా వచ్చేస్తుందని, వాతావరణం ద్వారా కూడా వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీళ్లకు చికిత్స చేస్తున్నవారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో వాళ్లకు కూడా సోకుతుందని చెబుతున్నారు. ఈ భయంతోనే నైజీరియా లాంటి ప్రాంతాల్లో వైద్యవర్గాలు ఇబోలా బాధితులకు చికిత్స చేయడానికి కూడా వెనకాడుతున్నారు. ఈ వ్యాధి భారతదేశానికి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరెవరు భారతదేశానికి వస్తున్నారు, వాళ్ల తుది గమ్యం ఎక్కడ అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటోంది. కానీ అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇబోలా బాధితులకు ఉన్న చికిత్స సదుపాయాలు మాత్రం ఇంతవరకు భారత్‌లో లేవు. అవి కూడా వస్తే తప్ప భారతీయులకు ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు చెప్పలేం. -
ఆఫ్రికాపై ‘ఎబోలా’ కోరలు..
వైరస్‌తో మూడు దేశాల్లో 932 మంది మృత్యువాత వైరస్ ప్రభావిత దేశాల నుంచివచ్చేవారికి వైద్య పరీక్షలు నాలుగు వారాలపాటుపర్యవేక్షణకూ భారత్ నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో భయానకంగా పరిణమించిన ఎబోలా వైరస్ బారినపడి గత మూడురోజుల్లోనే 932 మంది మత్యువాతపడటంతో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల వద్ద క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయిం చింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ఇప్పటిదాకా 1,711 మంది వైరస్ బారిన పడిన నేపథ్యంలో అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం నైజీరియాలో 40 వేల మంది, మిగతా దేశాల్లో మరో 5 వేల మంది భారతీయులు ఉన్నారని, పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చితే వారు వెనక్కి వచ్చే అవకాశముందని ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. వైరస్‌బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆమోదించారని హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌కు ఈ వైరస్ ముప్పు తక్కువగానే ఉన్నా.. అన్నిరకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నాలుగు వారాల పాటు పర్యవేక్షించనున్నట్లు కూడా తెలిపారు. వైరస్ ప్రబలిన దేశాలలో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1,500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌కు సరైన చికిత్స సైతం లేకపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇప్పుడు గగ్గోలు పుడుతోంది. నివారణ.. కుటుంబసభ్యులు, వైద్యులు, అంత్యక్రియలు చేసేవారికే సంక్రమించే ప్రమాదం ఎక్కువ. గ్లౌవ్స్, ముక్కు, నోరుకు ముసుగు, కళ్లద్దాలు, ఒంటినిండా వస్త్రాలను ధరిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. చికిత్స.. ఇప్పటిదాకా ప్రామాణిక చికిత్స లేదు. రోగిని ఒంటరిగా ఉంచడం, ద్రవాలు, ఆక్సిజన్ ఎక్కించడం, ఇతర ఇన్ఫెక్షన్లకు చికిత్సతోప్రాణాలు కాపాడే అవకాశం కొద్దిగా ఉంటుంది. అయితే లైబీరియాలో ఎబోలా బాధితులకు చికిత్స చేస్తున్న ఇద్దరు అమెరికా వైద్యులకు వైరస్ సోకిందని, వారికి ‘జడ్ మాప్’ అనే రహస్య ఔషధాన్ని ఇవ్వగా ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. కానీ ఈ ఔషధం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ► ప్రాణాంతకం.. ఎబోలా వైరస్ ► మనిషికి అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటి ► మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో కనిపించింది. ► అందుకే దీనికి ఎబోలా అని పేరుపెట్టారు. ► వీటిలో ఐదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి ► 100 మందికి సోకితే దాదాపు 90 మంది చనిపోతారు ► 1979 నుంచి ఇప్పటిదాకా 2,200 మందికి సంక్రమించగా.. 1,500 మంది చనిపోయారు ► గబ్బిలాల ద్వారా ఇది జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. మనుషులపై ప్రభావం ఇలా... సంక్రమణ: రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో సంక్రమిస్తుంది. మొదటిదశలో: జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతు నొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో: వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు. మూడోదశలో: వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి చనిపోతాడు. ఈ మూడుదశలూ 2-21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50-90% మంది 10 రోజుల్లోనే చనిపోతారు. ► ఎబోలా వైరస్ సహజ అతిథేయులు గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్) ► 1979 నుంచి మనుషులకు వైరస్ వ్యాపించిన ప్రాంతాలు ► జంతువుల్లో వైరస్ క నిపించిన ప్రాంతాలు ► ప్రస్తుతం వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న దేశాలు గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ -
ప్రాణాలు తీస్తున్న కొత్త వైరస్
-
అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!
మొన్నా మధ్య సార్స్.. ఆ తర్వాత హెచ్1ఎన్1.. ఇప్పుడు ఇబోలా! అగ్రరాజ్యాలకు వైరస్ భయాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. తాజాగా ఇబోలా వైరస్‌ను చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఈ వైరస్ నియంత్రణకు వందలాది మంది దళాలను మోహరించారు. ఇప్పటికే 887 మంది ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్యవర్గాలు దీనిపై ఇప్పటికే చేతులెత్తేశాయి. సియెర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో ఇబోలా వైరస్‌ను అదుపు చేసేందుకు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ వైరస్‌ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గత వారం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్ బారిన పడి 61 మంది మరణించారు. ముందుగా గినియాలోని అడవుల్లో గత ఫిబ్రవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఈ వైరస్ పాకింది. నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా వైరస్ సోకింది!! దీంతో అసలు ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికే ఆరోగ్యబృందాలు భయపడిపోయాయి. పలు దేశాల్లో ఈ వైరస్‌కు భయపడి అసలు పాఠశాలలు తెరవడం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియెర్రా లియోన్ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ చేసనట్టు ప్రకటించి, అక్కడినుంచి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా పక్డ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. లైబీరియా లాంటి దేశాల్లో దాదాపు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు అయ్యింది. పరిస్థితి మెరుగయ్యేలోపే మరింత దారుణంగా తయారవుతోందని లైబీరియా సమాచార శాఖ మంత్రి లూయిస్ బ్రౌన్ వాపోయారు. సమస్య పరిష్కారం ఎలా? పెద్దపెద్ద ఫార్మా దిగ్గజాలన్నీ ఈ వైరస్‌ను అదుపు చేయలేక మల్లగుల్లాలు పడుతుంటే, అమెరికాలో చిన్న ఔషధ సంస్థ మాత్రం ఓ సీరమ్‌ను తయారుచేసింది. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న దీన్ని ఇద్దరు అమెరికన్లపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలను అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ఇది కొంత వరకు పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, పేద దేశాలకు ఇది ఎంతవరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.