ఎబోలాపై భయం అక్కర్లేదు: జేపీ నడ్డా
న్యూఢిల్లీ: దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కట్టుదిట్టమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎబోలా నియంత్రణకు సంబంధించి విమానాశ్రయాల్లోని ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎబోలా వైరస్‌కు సంబందించి దేశంలో పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనా అవసరంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లోనూ ఎబోలా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.