జెనీవా/వాషింగ్టన్: పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ సోకినవారి సంఖ్య దాదాపు 10వేలకు చేరువలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఈ దేశాల్లో 9,936 మందికి ఈ వైరస్ సోకగా మొత్తం 4,877 మంది మృత్యువాత పడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఎబోలా వైరస్‌ను అరికట్టే అంశంపై జరిగిన సమావేశం అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ గురువారం జెనీవాలో ఈ వివరాలు వెల్లడించింది.
ఎబోలాను అరికట్టడానికి రెండు వ్యాక్సిన్లను గుర్తించారు. ప్రస్తుతం వీటిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఎబోలా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి 200 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్టు అమెరికాకు చెందిన ఔషధ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. కాగా, అమెరికాలో ఎబోలాను నియంత్రిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబా మా ఆశాభావం వ్యక్తంచేశారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను అరికట్టేందుకు పలు దేశాలు ముందుకురావడం అభినందనీయమన్నారు.
10 వేలకు చేరువలో ఎబోలా రోగులు
Published Sat, Oct 25 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement