west Africa
-
బంగారు గనిలో ఘోర ప్రమాదం..42 మంది దుర్మరణం
బమాకో:పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఓ బంగారు గని కుప్ప కూలి 42మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అనేకమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చైనాకు చెందిన కంపెనీ నిర్వహిస్తున్న బంగారు గనిలో శనివారం(ఫిబ్రవరి 15) కొండచరియలు విరిగిపడ్డాయి.ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 42మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తేలింది. అయితే గనిని చట్టబద్ధంగా నడుపుతున్నారా లేదా అనేదానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఈ తరహా ప్రమాదం ఇది రెండవది కావడం గమనార్హం. జనవరి 29న కౌలికోరో అనే ప్రాంతంలో బంగారు గని కూలడంతో చాలా మంది కార్మికులు దుర్మరణం చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు కావడం విషాదం. మాలి జనాభాలో 20 లక్షల మంది(పది శాతం)కిపైనే మైనింగ్ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆఫ్రికాలో మూడో అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో తరచు గని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
భయానక ఘటన.. గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత
బుర్కినా ఫాసో: కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని దారుణంగా కాల్చి చంపిన అత్యంత భయానక ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్, మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ జెఎన్ఐఎం దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన -
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది!
కొన్ని ఘటనలు అంత తేలిగ్గా మర్చిపోం. ఎందుకంటే అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా భీతావహంగా మారితే జీర్ణించుకోవడం అంత ఈజీ కాదు. అందులోకి మొత్తం ఊరు మొత్తం చనిపోయి..వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ అంత ఇంత కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఎందువల్ల జనాలు పిట్టలా రాలిపోయారనేది ఇప్పటికి అంతుతేలని మిస్టరీలా ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్. అస్సలు ఊహించలేదు వారంతా అదే తమకు చివరి రాత్రి అని. ఏమైందో ఏమో సడెన్‌గా పశువులు, జంతువులు మనుషులు ఎక్కడివాళ్లు అక్కడే విగతజీవుల్లా మారిపోయారు. ఎందుకు అంతా అలా చనిపోతున్నారు, ఏం జరుగుతుందని తేరుకునేలోపు అంతా అయిపోయింది. వేళ్లపై లెక్కపెట్టేంత మందే బతికారు. ఆయా వ్యక్తులు తమ వాళ్లంతా చనిపోతే ఆ శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఆ గ్రామం అంతా అత్యంత నిశబ్దంలోకి వెళ్లిపోయింది. ఆ అనూహ్య ఘటనతో ఓ మహిళ ఏడుస్తూ పిచ్చి పట్టినట్లుగా బట్టలు చింపుకుని వింతగా ప్రవర్తించింది. హలీమా అనే మహిళ, కొందరూ వ్యక్తులు తప్ప అంత నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. అంతమంది ఒకేసారి చనిపోయిన ఎవ్వరిపై ఒక్క ఈగ కూడా వాల్లేదు. ఇది అత్యంత ఆసక్తి రేపే కీలక అంశం. కనీసం కీటకాలు గానీ ఏవిలేవు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అందరూ ఒక్కొక్కరిగా చనిపోయినట్లు నాటి భయనక ఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ వ్యక్తులు. ఈ ఘటన 1986లో జరిగింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. మొత్తం గ్రామమే తుడిచిపెట్టుకుపోవడం అక్కడ ఓ వింత ఘటనగా చర్చనీయాంశంగా మారిపోయింది. నాటి ఘటనలో దాదాపు 1,746 మంది దాక చనిపోగా సుమారు 3,500 వ్యవసాయ జంతువులు చనిపోయినట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆ గ్రామం సమీపంలో న్యాస్ అనే సరస్సు ఉందని, దానిలోంచి కార్బన్ డయాక్సైడ్ ఫ్రీక్ ఫ్లూమ్ పెరగడంతోనే అందరూ మరణించినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం 1.6 మిలియనల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని, సరిగ్గా లోయకు సమీపంలోని వ్యక్తులంతా పీల్చడంతోనే చనిపోయారని అన్నారు. ఐతే ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చినట్లు చెప్పారు. మరికొంత మంది ఈ ఘటన తరువాత రోజు ఒక్కొక్కరుగా చనిపోయారు కూడా. అలాగే ఆ న్యాస్ నది జలాలు కూడా ఆ రోజు నీలిరంగుకు బదులు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇలాంటి భయానక ఘటనలు యూఎస్‌లో చాలా జరిగాయి కూడా. ఐతే శాస్త్రవేత్తలు వీటిని అంతుపట్టని సహజ మరణాలుగా తేల్చారు. వాస్తవికంగా ఏం జరింగిందనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలా ఉండిపోయాయి. పలువురు శాస్త్రవేత్తలు ఆ సరస్సు వల్ల అని, విషవాయువుల వల్ల అని రకరకాలుగా చెప్పారే తప్ప ఏం జరిగిందనేది? ఎవ్వరూ నిర్థారించలేకపోయారు. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
మాలిలో దుండగుల కాల్పులు
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు. -
సైన్యం చెరలో నైజర్
అగ్రరాజ్యాల చంపుడు పందెంలో దశాబ్దాలుగా చిక్కిశల్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ నీడలోనే ఇప్పటికీ బతుకీడుస్తున్నాయని నైజర్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు నిరూపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ బజూమ్‌ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్ ఒమర్ చియానీ పీఠం అధిష్ఠించాడు. అతనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుందని అంటున్నారు. అవిద్య, ఆకలి, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్నచోట నియంతలదే పైచేయి అవుతుందని చరిత్రలో తరచు రుజువవుతున్న సత్యమే. తూర్పున ఎర్ర సముద్ర తీరంలోని సూడాన్‌తో మొదలుపెట్టి, పడమట అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి చేరువలో వుండే గినియా బిసావూ మధ్య వరసగా కొలువుదీరిన ఎనిమిది దేశాలున్న ప్రాంతాన్ని సహేల్ ప్రాంతం అంటారు. వీటిల్లో మిగిలినవన్నీ సైనిక పాలకుల పరం కాగా... తాజాగా నైజర్ సైతం ఆ ఖాతాలో చేరింది. తన అండదండలు పుష్కలంగా ఉన్న బజూమ్ ఉన్నట్టుండి అదృశ్యం కావటం, రెండురోజుల తర్వాత తిరుగుబాటు ప్రకటన రావటం అమెరికాకు మింగుడు పడని అంశం. పశ్చిమాసియా, దక్షిణాసియాలతో పోల్చినా జీహాదిస్టుల బెడదను అధికంగా ఎదుర్కొంటూ నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతం సహేల్ ఆఫ్రికా. అత్యంత వెనకబడిన ప్రాంతం కావటం వల్ల అక్కడి మరణాలు మీడియాకు పట్టవుగానీ... నిరుడు ఉగ్రవాదుల హింసాకాండకు ప్రపంచ వ్యాప్తంగా బలైన 6,701 మంది అభాగ్యుల్లో 43 శాతం మంది అక్కడివారే! సహేల్ ప్రాంతం గురించి ఐక్యరాజ్యసమితి వెబ్సైట్ వెతికితే దాన్ని ‘అవకాశాల గడ్డ’గా అభివర్ణిస్తుంది. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న ప్రాంతమని చెబుతుంది. ఆ ప్రాంతానికి చినుకు గగనం కావొచ్చు. అక్కడి నేలపై పంటలు పెద్దగా పండకపోవచ్చు. కానీ దాని లోలోపల యురేనియంతో సహా అపురూపమైన ఖనిజాలున్నాయి. విస్తృతంగా జలాశయాలున్నాయి. పునరు త్పాదక ఇంధన వనరులకు అది నిలయం. జనాభాలో 64.5 శాతం మంది ఇరౖవై అయిదేళ్లలోపువారే. ఇవన్నీ సహేల్ ప్రాంతానికి శాపంగా కూడా మారాయి. అమెరికా, ఫ్రాన్స్‌లు ఈ ప్రాంతంపై పట్టుబిగించేందుకు బాహాటంగా ప్రయత్నిస్తుంటే జర్మనీ, ఇటలీ, చైనా వంటివి చడీచప్పుడూ లేకుండా ఆ పని చేస్తుంటాయి. తిరుగుబాటు జరిగే సమయానికి నైజర్‌లో 1,100 మంది అమెరికా సైనికులున్నారు. అవసరాన్నిబట్టి డ్రోన్ దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరం ఉంది. కానీ తన మద్దతుదారును అది కాపాడుకోలేకపోయింది. నిజానికి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే బజూమ్ సైనిక జనరళ్లకు లక్ష్యంగా మారారు. కానీ అప్పట్లో ఆయన్ను వ్యక్తిగత భద్రతా బలగాలు కాపాడాయి. ఇప్పుడు ఆ బలగాలే అదును చూసి కాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియెట్ యూనియన్ల మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల వనరులను చేజిక్కించుకునేందుకు సాగిన పోటీతో సగటున ప్రతి 55 రోజులకూ ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని, అందులో చాలా భాగం విజయవంతమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. తమ ప్రయోజనాలు నెరవేరే వరకూ స్థానికంగా ఏ పాలకులున్నా, వారు ఎలా పాలిస్తున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోవు. ఆ ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం సైనిక నియంత లను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య మంత్రాన్ని పఠిస్తాయి. అంతక్రితం దశాబ్దాలపాటు అగ్రరాజ్యాల చెరలో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి చేరువైనా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల పడగనీడలోనే ఆ ప్రభుత్వాలు కొనసాగటం వల్ల స్థానికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పేరుకు ఎన్నికలేగానీ పెత్తనమంతా స్థానికంగా ఉండే సాయుధ ముఠా లదే! ఆ ముఠాల ప్రాపకంతోనే ఏ పాలకులైనా ఎన్నికల్లో గద్దెనెక్కుతారు. కూడు, గూడు, విద్య, వైద్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధి చూపటంలోనూ ఆ పాల కులు ఘోరంగా విఫలం కావటం తరచు కనబడేదే! ప్రజల్లో ఆ పాలకుల పట్ల ఉండే అసంతృప్తిని సైన్యంలోని ఉన్నతాధికారవర్గం సాకుగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పర్యవ సానంగా ముందో వెనకో ఆ దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైనిక కుట్రలకు తలవంచాయి. సహేల్ ప్రాంతంలో తిరుగుబాట్లు చేసినప్పుడల్లా సైనిక నియంతలు చెప్పే మొదటి కారణం అవినీతి. ఇప్పుడు నైజర్‌లో గద్దెనెక్కిన ఒమర్ చియానీ దానికి ఉగ్రవాద బెడదను కూడా జోడించాడు. దేశంలో ఉగ్రవాదం ముప్పు పెరగటం వల్ల సైన్యం జోక్యం తప్పనిసరైందని ప్రకటించాడు. నిజానికి వేరే దేశాల ‘ప్రజాస్వామ్య’ పాలకులతో పోలిస్తే బజూమ్ ఎంతో నయం. అల్ కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల దాడులను పూర్తిగా అదుపు చేయలేకపోయినా, వాటిని చాలా మేరకు నియంత్రించారు. పాశ్చాత్య దేశాల మద్దతు పుష్కలంగా ఉండటంతో నిధులు కూడా దండిగానే వచ్చాయి. విద్య, వైద్యంతో పాటు ఉపాధి కల్పన చర్యలు ప్రారంభమయ్యాయి. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. బజూమ్‌కు సైన్యం మద్దతు దండిగా ఉన్నదని, దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అందరూ అనుకుంటుండగానే చియానీ రూపంలో సైనిక నియంత అవతరించాడు. సహేల్ ప్రాంతంలోని వేరే దేశాల్లో ఉగ్రవాద బూచిని చూపి, పాలకుల భద్రతకు పూచీపడుతూ పబ్బం గడుపుకుంటున్న కిరాయి సైనిక ముఠా నాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు నైజర్‌ను ఉద్ధరిస్తానని ముందుకొస్తున్నాడు. అమెరికా, రష్యాల మధ్య సైతం మున్ముందు ఇక్కడ ఘర్షణ రాజుకునే ప్రమాదం ఉంది. ఇన్నిటిమధ్య నైజర్ మనుగడ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే! -
ఆఫ్రికా దేశం నైగర్‌లో సైనిక కుట్ర
నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో సైనిక కుట్ర జరిగింది. బుధవారం ఉదయం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ నివాసాన్ని చుట్టుముట్టారు. బజౌమ్‌ను, ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ టీవీ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుని, తమను తాము నేషనల్ కౌన్సిల్‌గా గురువారం ప్రకటించుకున్నారు. శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్మీయే దేశ రక్షణ బాధ్యత వహిస్తుందని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ స్పందించారు. ‘సైనిక కుట్ర జరిగింది. కానీ, మేం దానిని అంగీకరించం. అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి. తిరుగుబాటును ప్రజలు తిప్పికొట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఈయన్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బజౌమ్ ప్రయత్నించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తిరుగుబాటుకు సైన్యం కూడా మద్దతు ప్రకటించింది. ఇలా ఉండగా పొరుగుదేశం బెనిన్ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్‌కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. ఎట్టకేలకు 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్‌ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్-ఎక్స్' గా నామకరణం చేసింది. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మందు లేదు.. డిసీజ్-ఎక్స్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై.. -
ఆంధ్రప్రదేశ్‌కు 'క్యూ'
సాక్షి, అమరావతి: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రసాయన రహిత ఉత్పత్తుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధానంలో మన రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఈనెల 19 నుంచి వారం రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతోపాటు రైతులు, రైతుసాధికార సంస్థ ప్రతినిధులతో జిల్లాల వారీగా సమావేశమై ప్రకృతి సాగు పద్ధతులను అధ్యయనం చేస్తుంది. ప్రకృతి సాగులో దేశానికే ఆదర్శం జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బీఎన్ఎఫ్) కింద 2016లో శ్రీకారం చుట్టిన ప్రకృతి సాగు ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. ప్రస్తుతం వరితో పాటు వేరుశనగ, కంది, మినుము, పెసర, పప్పుశనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటలను ఈ విధానంలో సాగుచేస్తున్నారు. 2016లో 700 గ్రామాల్లో 40 వేల మందితో ప్రారంభమైన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 7.30 లక్షల మంది రైతులు ఆచరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో మరో 530 గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతుల ద్వారా 4.25 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు.. గాలిలో కర్బన శాతాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఈ సాగు ఇతోధికంగా దోహదపడుతోంది. దీంతో.. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నాయి. గ్రాండ్స్‌వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో.. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు 15 లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్‌కు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శిస్తోంది. అమెరికాకు చెందిన గ్రౌండ్స్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న ఈ బృందం రాయలసీమ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు క్షేత్రాలను పరిశీలిస్తుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా సారథ్యంలో నెదర్లాండ్స్, కొలంబియా, నేపాల్, బ్రెజిల్, మెక్సికో, మాలి, ఘన, సెనెగల్ తదితర దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయ రంగ నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఇక ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్న మహిళా సంఘాల పాత్ర, సాగు విధానాలు, టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహం, భాగస్వామ్య సంస్థల సహకారం, అమలులో కీలకపాత్ర పోషిస్తున్న సామాజిక సిబ్బంది సేవలు, మార్కెటింగ్ విధానాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అంతేకాక.. రైతులు, మహిళా సంఘాలతోపాటు రైతు సాధికార సంస్థ జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో బృంద సభ్యులు భేటీ అవుతారు. అనంతరం.. ఈ సాగు అమలు ప్రణాళిక, లక్ష్యాలు, సాధించవలసిన ప్రగతిపై చర్చించి ప్రణాళిక రూపొందిస్తారు. ఏపీకి దక్కిన అరుదైన గౌరవం ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు మన విధానాలను మోడల్‌గా తీసుకుని వారివారి రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు వివిధ దేశాలు కూడా మనవైపు చూస్తున్నాయి. ఒకేసారి 15 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వస్తుండడం మనకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
ఇదేం పెళ్లి?
సాధారణంగా పెళ్లంటే ఎవరు వచ్చినా రాకున్నా వధూవరులైతే పెళ్లిపీటలెక్కుతారు. కానీ తన పెళ్లికి పెళ్లికొడుకే గైర్హాజరైతే..?! అయినా పెళ్లి ప్రక్రియ నిరాటంకంగా జరిగిపోతే! పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ఇటీవల ఇదే విచిత్రం చోటుచేసుకుంది. చైనా ఫుట్‌బాల్ లీగ్ నుంచి స్వీడన్‌కు చెందిన మాల్మో ఎఫ్‌సీ అనే పుట్‌బాల్ క్లబ్లో ఇటీవల చేరిన మొహమ్మద్ బుయా టురే అనే 26 ఏళ్ల ఫుట్‌బాలర్ తన ప్రేయసితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే పెళ్లి రోజునే తొలి మ్యాచ్ ఆడేందుకు వీలుగా ప్రాక్టీస్ సెషన్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ చివరి నిమిషంలో క్లబ్ నిర్వాహకుల నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇక చేసేదేమీ లేకపోవడంతో టురే తన సోదరుడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి స్వీడెన్ వెళ్లిపోయాడు! దీంతో పెళ్లి దుస్తులు ధరించడం దగ్గర్నుంచి వధువుతో కలిసి కేక్ కటింగ్ చేయడం వరకు అతనే పెళ్లి తంతునంతా కానిచ్చాడు. పెళ్లి ఫొటోలు, వీడియోల్లో దర్జాగా భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చాడు!! ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో టురే స్పందించాడు. పెళ్లికి ముందు రోజే తామిద్దరం పెళ్లి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు దిగామంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అయితే మ్యాచ్‌ల కారణంగా ఇంతవరకు తన ‘భార్య’ను కలుసుకోవడం వీలుకాలేదని.. త్వరలోనే ఆమెను స్వీడన్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే టురే చేసిన ‘పని’ని కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అసలైన ‘వృత్తి ధర్మం’ అంటూ అతన్ని వెనకేసుకొస్తున్నారు. -
ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు ప్రియురాలిగా వేషం వేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడియం ఎంబొప్ (22), గంగ్యూ డియోమ్ (19) ప్రేమికులు. తన ప్రియురాలు గంగ్యూ వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే ప్రతిసారి ఆమెకు ఇంగ్లీశ్ అంతగా రాదు. ఆ పరీక్షలో వరుసగా తప్పుతోంది. దీంతో రంగంలోకి తన ప్రియుడు కడియాన్ని దింపింది. తన మాదిరి వేషధారణ వేసుకుని వెళ్లమని చెప్పడంతో మనోడు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రేయసి మాదిరి మేకప్ వేసుకున్నాడు. డ్రెస్, స్కాఫ్, తలపై మరో స్కాఫ్ చుట్టేసుకున్నాడు. విగ్ పెట్టుకుని హొయలు ఒలుకుతూ సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలోని గ్యాస్టన్ బర్గర్ విశ్వవిద్యాలయంలో పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇలా మూడు పరీక్షలు రాశాడు. ఇక నాలుగో రోజు ఇతగాడి ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగింది. దీంతో లేపి పరిశీలించి వివరాలు అడగ్గా ఈ నాటకం బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు పట్టించారు. ప్రేమ కోసం వెళ్లి కటకటాలపాలైన ఆ యువకుడిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి.. -
మాలిలో మూడేళ్ల పాటు సైనిక పాలనే : జుంటా
మాలి : అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా.. సైనిక నేతృత్వంలోనే మూడేళ్లపాటు పరిపాలన కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇందుకు బదులుగా అపహరణకు గురైన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతాను విడుదల చేయడానికి అంగీకరించినట్లు ప్రతినిధుల బృందం తెలిపింది. మాలిలో మూడేళ్లపాటు సైనిక నేతృత్వంలోని ఒక సంస్థ నాయకత్వం వహిస్తుందని అతనే దేశాధినేతగా కొనసాగుతాడు అని జుంటా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా తిరుగుబాటు జండా ఎగరవేస్తున్న.. జుంటా పలువురు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో కీతాను విడుదల చేస్తామని అంతేకాకుండా అతను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లవచ్చునని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు) ఇక దేశంలో నిరసనసెగలు వెల్లువెత్తుతున్న వేళ ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని బౌబౌ సిస్సేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బౌబాకర్ కీతను అదుపులోకి తీసుకోవడంతో సిస్పేకు భయం పట్టుకుందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. జుంటా చర్యకు మద్ధతుగా ప్రతిపక్ష నేతలు సంబురాలు జరుపుకున్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో మాలిలో నాయకత్వంపై తిరుగుబాటు జరగడం ఇది రెండోసారి. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ఏమీ చేయలేని అసమర్థ అధ్యక్షుడు కీత రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై తిరుగుబాటు పెరగడంతో ప్రజల కోసమే జుంటా పనిచేస్తుందని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో తగిన సమయంలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసింది. రాజ్యాంగ సంక్షేమమే లక్ష్యంగా జుంటా పనిచేస్తుందని తెలిపింది. అయితే కొందరు మద్దతుదారులు మాత్రం కీతానే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్.. సోదరికి అధ్యక్ష బాధ్యతలు!) -
బుర్కినా ఫాసోలో దాడి.. 37 మంది మృతి
ఔగాడోగ్: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫోలో పనిచేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 37 మంది మరణించగా.. 60 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం సెమాఫో కంపెనీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సప్లయర్స్‌తో వెళ్తున్న ఐదు బస్సులను సాయు«ధులు అడ్డుకుని కాల్పులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో జిహాదీలు పాల్పడుతున్న హింసలో 700 మంది మృతి చెందారు. -
రాష్ట్రపతికి గునియా అత్యున్నత పురస్కారం
గునియా : పశ్చిమ ఆఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేసింది. గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డు అందుకున్నారు. అవార్డును అందుకున్న సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్–గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు, పరస్పర విశ్వాసం, ఆత్మస్థైర్యానికి పెంచేందుకు, ఆ దిశగా పరస్పరం కలిసి పనిచేసేందుకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుందని కోవింద్ అభిప్రాయపడ్డారు. -
కారు బాంబు పేలుళ్లు.. 20 మంది మృతి
-
కొత్త అడుగు
సుదీర్ఘకాలం ‘ఫ్రెంచ్ సుడాన్’ పేరిట ఫ్రెంచ్ పాలనలో ఉంది పశ్చిమ ఆఫ్రికాలోని మాలి. 1959లో ఫ్రెంచ్ సుడాన్, సెనెగల్లు ‘మాలి ఫెడరేషన్’గా ఏర్పడ్డాయి. 20 జూన్ 1960లో ఈ ‘మాలి ఫెడరేషన్’ ఫ్రాన్సు నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే 20 ఆగస్ట్, 1960లో సెనెగల్ ‘మాలి ఫెడరేషన్’ నుంచి విడిపోయి ‘రిప్లబిక్ ఆఫ్ సెనెగల్’గా ఏర్పడింది. 22 సెప్టెంబర్ 1960లో ‘రిపబ్లిక్ ఆఫ్ మాలి’ ఏర్పడింది. మాలిలో ఒకానొక కాలంలో సువర్ణయుగం నడిచింది. గణితం, ఖగోళశాస్త్రం, సాహిత్యం, చిత్రకళ గొప్పగా వెలిగిపోయాయి. 19వ శతాబ్దంలో మాలి సామ్రాజ్యం ‘ఫ్రెంచ్ సుడాన్’లో భాగంగా ఉండి ఉండకపోయి ఉన్నట్లయితే... ఆ రాజ్యం తనదైన ప్రత్యేకతతో విలసిల్లి ఉండేది. ‘ఒకే జాతి, ఒకే లక్ష్యం, ఒకే విశ్వాసం’ అనే నినాదంతో కొనసాగిన మాలిలో చాలా కాలం పాటు ఏక పార్టీ పాలన సాగింది. 1991లో మాలి నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. బహుళపార్టీ వ్యవస్థ ఏర్పడింది. సహజవరులకు ప్రసిద్ధిగాంచిన మాలి ఆఫ్రికా చరిత్రలో ముఖ్యమైన పాత్రను నిర్వహించింది. -
అమ్మో.. బొమ్మ..
ఈ బొమ్మలను చూశారా? ఇవి మామూలు బొమ్మలు కావు.. ఎందుకంటే.. ఇవి తింటాయి.. స్నానం చేస్తాయి.. చివరకు తమ తోబుట్టువులతో కలసి స్కూల్‌కు కూడా వెళ్తాయి. అదెలా.. ఇదిగో ఇలా.. పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌లో ఫాన్ అనే గిరిజన తెగ. ఈ తెగలో కవలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారికి అనేక శక్తులుంటాయని నమ్ముతారు. అదే సమయంలో ఈ తెగలో కవలల పుట్టుక కూడా ఎక్కువే. ప్రతి 20 కాన్పుల్లో ఒకరికి కవలలే. అదే సమయంలో చిన్నవయసులో వచ్చే వ్యాధులు, మలేరియా వల్ల శిశు మరణాల రేటు కూడా ఎక్కువే. అయితే.. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. చిన్నవయసులో కవలలు మరణించినప్పుడు ఇలా వారి బొమ్మలు తయారుచేస్తారు. అంతేకాదు.. వాళ్లు నిజంగానే బతికున్నట్లు భావిస్తూ.. ఆ బొమ్మలను పెంచుతారు. వాటికి స్నానం చేయిస్తారు.. ఆహారం పెడతారు.. చివరకు స్కూల్‌కు కూడా పంపుతారు. ఎందుకంటే.. ఆ బొమ్మల్లో చనిపోయిన కవలల తాలూకు ఆత్మలు ఉంటాయని వారు నమ్ముతారు. బొమ్మలను సరిగా చూసుకోకపోతే.. ఆ కుటుంబానికి నష్టం చేస్తాయని.. బాగా చూసుకుంటే అదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. వాటిని ఏనాడు బొమ్మలుగా భావించరు. బొమ్మలతో ఆటలాడరు. పైగా.. తాము దూరప్రాంతం వెళ్లాల్సి వస్తే.. వాటిని చక్కగా చూసుకోవడానికి స్థానికంగా ‘నర్సరీ’ వంటి ఏర్పాటు కూడా ఉంటుంది. కవలలు మగ పిల్లలు అయితే.. వారిని జిన్సౌ అని, ఆడపిల్లలు అయితే జిన్హౌ అని పిలుస్తారు. ఈ సంప్రదాయం నిజంగానే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది కదూ.. -
‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎబోలా ఫైటర్స్
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, సహాయకులను ఈ ఏడాదికిగానూ ఉమ్మడిగా ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసినట్లు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. చికిత్స అందించే క్రమంలో సహచర వైద్యులు వైరస్‌బారిన పడి కన్నుమూసినా ధైర్యం, కరుణతో రోగులకు సేవలు అందిస్తున్నందుకుగానూ తుది ఎనిమిది మంది జాబితాలోంచి వీరిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు మ్యాగజైన్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ తెలిపారు. -
లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు
పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఎబోలా కేసుల రేటు క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. అయితే అంటువ్యాధిలా ప్రబలిన ఎబోలా వైరస్ వ్యాప్తి నిజానికి తగ్గుముఖం పట్టిన ధోరణి కనిపిస్తుందని తెలిపింది. ఎబోలా ఇన్ఫెక్షన్ తీవ్రత ప్రస్తుతం తగ్గినట్టు కనిపించినా దాని తీవ్రత చాలాకాలం వరకు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వైరస్ తీవ్రత తగ్గటం ఆశాజనకంగా ఉన్నా అది పూర్తిగా నిర్మూలన అయినట్టు భావించలేమని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూష్ ఐల్వార్డ్ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం జెనీవాలో ఎబోలా అదుపులో ఉన్న మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉందని ఐల్వార్డ్ హెచ్చరించారు. -
ఎల్లలెరుగని ఎబోలా!
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాలు ఈ వ్యాధితో అల్లాడుతున్నాయి. నిర్ధారిత వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని ప్రస్తుత స్థితే కొనసాగితే డిసెంబర్‌కల్లా మరో 10,000మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాదు, ఇది యూరప్, అమెరికా, ఇతర దేశాలకు కూడా విస్తరించవచ్చునని వారు అంచనావేస్తున్నారు. యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, లైబీరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్న అంచనాలు ఇంతకన్నా భయంగొలిపేవిగా ఉన్నాయి. డిసెంబర్ మధ్యకల్లా ఒక్క లైబీరియాలోనే 90,000 మంది మరణించే ప్రమాదమున్నదని వారు చెబుతున్నారు. వ్యాధి పుట్టి విస్తరిస్తున్నది ఇప్పటికైతే మారుమూలనున్న నిరుపేద దేశాల్లో గనుక సంపన్న దేశాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని, మాటలు చెప్పినంత స్థాయిలో వాటి చేతలు ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వంద కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,000 కోట్లు) అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి వేసిన అంచనాలో ఇంతవరకూ నాలుగో వంతు కూడా సమకూరలేదంటే ఈ ఆరోపణల్లో వాస్తవమున్నదని అనుకోవాల్సి వస్తున్నది. ఒకపక్క ఉగ్రవాదంపై పోరాటమంటూ వేలకోట్ల డాలర్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తున్న పాశ్చాత్య దేశాలు అంతకు మించి ఎన్నోరెట్లు ప్రమాదకరమైన ఎబోలాను విస్మరించడం ఆందోళనకరం. డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించిన వ్యాధి విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షంతవ్యంకాని నేరం. ప్రపంచీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఏ దేశమూ వ్యాధిబారిన పడకుండా... కనీసం దాని ప్రభావమైనా పడకుండా సురక్షితంగా ఉండే అవకాశం లేదు. వ్యాపారం కోసం, బతుకుదెరువు కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎబోలా వ్యాధి విస్తరణకు హద్దులుండవు. భిన్న రంగాలపై అది కలగజేసే ప్రభావమూ ఎక్కువగానే ఉంటుంది. వ్యాధిగ్రస్త దేశాల్లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) క్షీణ దశలో ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాల్లో ఆర్థిక వనరులన్నీ ఎబోలా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రీకరించాల్సివస్తున్నది. అంతేకాదు, సామాన్యులు ఈ వ్యాధిబారిన పడటంవల్ల వారు వేతనాలు కోల్పోవడమే కాదు... ఉత్పాదకత మందగిస్తున్నది. కాఫీ, కోకో, పామాయిల్, రబ్బర్ వంటి ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. నిర్మాణ రంగమైతే పూర్తిగా పడకేసింది. పర్యాటకరంగంపైనే ప్రధానంగా ఆధారపడే దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి శాపంలా మారింది. ఇది కేవలం వ్యాధిగ్రస్త దేశాలకు మాత్రమే పరిమితమయ్యే ఇబ్బంది కాదు. ఆ దేశాలతో ఆర్థికబంధం ఉండే దేశాలన్నిటికీ దీని సెగ తగులుతుంది. వ్యాధిని అరికట్టడానికి చురుగ్గా చర్యలు తీసుకోనట్టయితే విపత్కర పరిణామాలు ఏర్పడటం ఖాయమని ప్రపంచబ్యాంకు తాజాగా హెచ్చరిస్తున్నది. ఇంతటి ప్రాణాంతక వ్యాధి విషయంలో సంపన్న దేశాల నిరాసక్తత కేవలం ఆర్థిక సాయం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా కూడా కనిపిస్తున్నది. 1976లో ఈ వ్యాధి తొలిసారి బయటపడినప్పుడు అమెరికా, కెనడా వంటి దేశాల్లో పరిశోధనలపై దృష్టిపడింది. ఆ రంగంలో కృషిచేసిన శాస్త్రవేత్తలు దశాబ్దంక్రితం ఎబోలాకు ఔషధాన్ని కనుగొన్నామని, దాన్ని వానరాలపై ప్రయోగించి చూశాక అది వంద శాతం వ్యాధి కారక వైరస్‌ను అరికట్టగలదని తేలిందని ప్రకటించారు. కానీ, అటు తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రగతీ లేదు. వ్యాధిపై పరిశోధనకయ్యే వ్యయం కంటే మనుషులపై ఔషధాన్ని ప్రయోగించడానికి, అనంతరం దాన్ని ఉత్పత్తి చేయడానికి అనేక రె ట్లు ఎక్కువ ఖర్చవుతుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వ్యాపార సంస్థలు...వ్యాధి ఆచూకీ కనిపించని పరిస్థితుల్లో ఆ ఔషధంపై భారీయెత్తున ఖర్చుచేయడానికి సుముఖంగా ఉండవు. కనుకనే ప్రాణాంతక ఎబోలా తిరిగి తలెత్తిన సమయానికి ఔషధమే లేకుండా పోయింది. మూడు దేశాల్లోనూ ఆ ఔషధాన్ని వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి చూడటానికి ఇంకో నెలన్నర సమయం పడుతుందని, అటు తర్వాత వచ్చే ఏడాది జూన్‌కల్లా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నది. అయితే, ఈ వ్యాధి విషయంలో కేవలం అల్లోపతి వైద్య విధానంలో మాత్రమేకాక ఇతరత్రా మార్గాల్లో అరికట్టడానికి వీలుంటుందేమో చూడాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్ఓపై ఉన్నది. ఔషధం అందుబాటులోకి రావడానికి ఏడెనిమిది నెలల సమయం పడుతుందని ఆ సంస్థ చెబుతున్నది గనుక ఇది అవసరం. ఎబోలా వ్యాధిని అరికట్టడానికి నిర్దిష్టమైన ఔషధం లేదు గనుక ఆ వ్యాధిగ్రస్తుల్లో కనబడుతున్న భిన్న లక్షణాలకు వేర్వేరు మందులు అందజేస్తున్నారు. ఆ వరసలోనే ఇతరత్రా వైద్య విధానాలను అనుసరించడంలో తప్పేమీలేదు. గతంలో మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికున్గున్యావంటివి తలెత్తినప్పుడు హోమియో ఔషధాలను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టిన సందర్భాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోణం నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నదో అర్ధంకాని విషయం. ఎబోలా వైరస్‌కంటే దాన్ని అరికట్టడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించలేని అశక్తత భయంకరమైనవి. ముందు వీటినుంచి విముక్తి సాధిస్తేనే ప్రాణాంతక ఎబోలావంటివి పలాయనం చిత్తగిస్తాయి. -
10 వేలకు చేరువలో ఎబోలా రోగులు
జెనీవా/వాషింగ్టన్: పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ సోకినవారి సంఖ్య దాదాపు 10వేలకు చేరువలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఈ దేశాల్లో 9,936 మందికి ఈ వైరస్ సోకగా మొత్తం 4,877 మంది మృత్యువాత పడ్డారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఎబోలా వైరస్‌ను అరికట్టే అంశంపై జరిగిన సమావేశం అనంతరం డబ్ల్యూహెచ్ఓ గురువారం జెనీవాలో ఈ వివరాలు వెల్లడించింది. ఎబోలాను అరికట్టడానికి రెండు వ్యాక్సిన్లను గుర్తించారు. ప్రస్తుతం వీటిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఎబోలా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి 200 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్టు అమెరికాకు చెందిన ఔషధ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. కాగా, అమెరికాలో ఎబోలాను నియంత్రిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబా మా ఆశాభావం వ్యక్తంచేశారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను అరికట్టేందుకు పలు దేశాలు ముందుకురావడం అభినందనీయమన్నారు. -
ఎబోలా’ పోరుకు 300 కోట్లు: గేట్స్ ఫౌండేషన్
సియాటెల్: పశ్చిమాఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా ప్రబలిన ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించేందుకు, ఎబోలా వైరస్ నివారణ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ. 300 కోట్ల నిధులు ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన రూ.60 కోట్లకు అదనంగానే ఈ నిధులు అందించనున్నట్లు తెలిపింది. ఎబోలా నివారణకు కృషిచేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ఔషధాల పంపిణీ, టీకాల అభివృద్ధి, చికిత్సల వంటి వాటికి ఈ మొత్తం ఉపయోగించనున్నారు -
ఎబోలా వైరస్‌కు మరో టీకా!
వాషింగ్టన్: పశ్చిమాఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్‌ను నివారించే సమర్థమైన టీకాను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ఈ టీకాను ప్రయోగాత్మకంగా నాలుగు మకాక్ కోతులకు ఇచ్చి, తర్వాత అధిక మోతాదులో ఎబోలా వైరస్‌ను కూడా ఎక్కించగా.. ఆ కోతులు వైరస్‌ను పూర్తిగా తట్టుకోగలిగాయని అమెరికా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ ఆరోగ్య సంస్థలు(ఎన్ఐహెచ్)’ పరిశోధకులు వెల్లడించారు. ఎబోలా వైరస్‌కు చెందిన రెండు జన్యువులను, చింపాంజీల్లో ఉండే ‘చింప్ అడినోవైరస్ టైప్3(చాడ్3)’ని కలిపి ఈ టీకాను అభివృద్ధిపర్చారు. -
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా శాస్త్రవేత్త, ఈ అధ్యయనం సహసమన్వయకర్త గ్యారీ కోబింగర్ తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వైరస్ సోకిన కోతులకు ప్రతి మూడు రోజులకోసారి మందును అందించారు. కొన్ని కోతులకు వైరస్ సోకిన మూడు లేదా నాలుగో రోజు నుంచి చికిత్స ప్రారంభిస్తే మరికొన్ని కోతులకు ఐదో రోజున (అంటే మరణం అంచుకు చేరుకున్న సమయంలో) చికిత్స మొదలుపెట్టారు. ఈ మందులో బయటి ప్రొటీన్‌తో బంధం ఏర్పరచుకోగల 3 అణువుల యాంటీబాడీలు ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా వైరస్ లక్షణాలైన దద్దుర్లు, రక్తస్రావాన్ని పూర్తిగా తగ్గించగలిగారు. -
3 నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణ
జెనీవా: పశ్చిమ ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ మరింతగా విస్తరించకుండా మూడు నెలల్లోగా నియంత్రించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది. 6 నుంచి 9 నెలల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈలోగా ప్రస్తుతం నమోదైన 3,062 కేసుల సంఖ్య 20 వేలకుపైగా దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎబోలా వ్యాక్సిన్ పరీక్షలను వేగవంతం చేస్తున్నామని. ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్‌లైన్ లండన్‌లో ప్రకటించింది. మీరేం చేస్తున్నారు మరోవైపు మన దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటో సెప్టెంబర్ 2లోగా వివరించాలని బాంబే హైకోర్టు గురువారం పిల్ విచారణ సందర్భంగా కేంద్రం, మహారాష్ట్ర సర్కారును కోరింది. -
‘ఎబోలా’ భయంతో స్వదేశానికి 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడకు వలసవెళ్లిన భారతీయులు ప్రాణభయంతో స్వదేశానికి చేరుకుంటున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 98 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 మంది భారతీయులతోపాటు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా వచ్చిన 85 మంది భారతీయులను పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. లైబీరియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్లో ఆఫ్కాన్స్ అనే కంపెనీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 112 మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఎబోలా నివారణ తేలికే: యూఎస్ ఎయిడ్ మలేరియాతో పోలిస్తే ఎబోలా వైరస్ బారినపడకుండా తప్పించుకోవడమే తేలికని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఎయిడ్) డెరైక్టర్ జెర్మీ కోన్యన్డిక్ పేర్కొన్నారు. ఎబోలా సోకిన వ్యక్తి శరీర ద్రవాలను తాకకుండా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు. 1976 నుంచి ఇప్పటివరకూ ఎబోలా మృతుల సంఖ్య 3 వేల లోపు ఉండగా మలేరియా వల్ల ప్రతి రెండు రోజులకు 3 వేల మంది మరణిస్తున్నారనే అంచనాలు ఉన్నాయన్నారు. -
ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి
పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలూ సమన్వయంతో కృషిచేసి ఇబోలా వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించాలని డబ్ల్యుహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్' ప్రకటించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని వివరించింది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఇప్పటివరకు 1711 మందికి ఈ వైరస్ వ్యాపించిందని, 932 మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేస్తోంది. వాస్తవ సంఖ్య ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉండే ప్రమాదం లేకపోలేదు.