
ఔగాడోగ్: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫోలో పనిచేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 37 మంది మరణించగా.. 60 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం సెమాఫో కంపెనీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సప్లయర్స్‌తో వెళ్తున్న ఐదు బస్సులను సాయు«ధులు అడ్డుకుని కాల్పులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో జిహాదీలు పాల్పడుతున్న హింసలో 700 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment