బుర్కినా ఫాసో: కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని దారుణంగా కాల్చి చంపిన అత్యంత భయానక ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్, మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ జెఎన్‌ఐఎం దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన
Comments
Please login to add a commentAdd a comment