![Dressed Up Like Lover For Exams In Senegal - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/18/Dressed-up-Like-Lover-For-E.jpg.webp?itok=e6qSFciz)
అమ్మాయిగా మారిన అబ్బాయి
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు ప్రియురాలిగా వేషం వేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కడియం ఎంబొప్ (22), గంగ్యూ డియోమ్ (19) ప్రేమికులు. తన ప్రియురాలు గంగ్యూ వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే ప్రతిసారి ఆమెకు ఇంగ్లీశ్ అంతగా రాదు. ఆ పరీక్షలో వరుసగా తప్పుతోంది. దీంతో రంగంలోకి తన ప్రియుడు కడియాన్ని దింపింది. తన మాదిరి వేషధారణ వేసుకుని వెళ్లమని చెప్పడంతో మనోడు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రేయసి మాదిరి మేకప్ వేసుకున్నాడు.
డ్రెస్, స్కాఫ్, తలపై మరో స్కాఫ్ చుట్టేసుకున్నాడు. విగ్ పెట్టుకుని హొయలు ఒలుకుతూ సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలోని గ్యాస్టన్ బర్గర్ విశ్వవిద్యాలయంలో పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇలా మూడు పరీక్షలు రాశాడు. ఇక నాలుగో రోజు ఇతగాడి ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగింది. దీంతో లేపి పరిశీలించి వివరాలు అడగ్గా ఈ నాటకం బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు పట్టించారు. ప్రేమ కోసం వెళ్లి కటకటాలపాలైన ఆ యువకుడిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి.
చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి..
Comments
Please login to add a commentAdd a comment