cheating in exams
-
ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు ప్రియురాలిగా వేషం వేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడియం ఎంబొప్ (22), గంగ్యూ డియోమ్ (19) ప్రేమికులు. తన ప్రియురాలు గంగ్యూ వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే ప్రతిసారి ఆమెకు ఇంగ్లీశ్ అంతగా రాదు. ఆ పరీక్షలో వరుసగా తప్పుతోంది. దీంతో రంగంలోకి తన ప్రియుడు కడియాన్ని దింపింది. తన మాదిరి వేషధారణ వేసుకుని వెళ్లమని చెప్పడంతో మనోడు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రేయసి మాదిరి మేకప్ వేసుకున్నాడు. డ్రెస్, స్కాఫ్, తలపై మరో స్కాఫ్ చుట్టేసుకున్నాడు. విగ్ పెట్టుకుని హొయలు ఒలుకుతూ సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలోని గ్యాస్టన్ బర్గర్ విశ్వవిద్యాలయంలో పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇలా మూడు పరీక్షలు రాశాడు. ఇక నాలుగో రోజు ఇతగాడి ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగింది. దీంతో లేపి పరిశీలించి వివరాలు అడగ్గా ఈ నాటకం బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు పట్టించారు. ప్రేమ కోసం వెళ్లి కటకటాలపాలైన ఆ యువకుడిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి.. -
స్కూల్ టీచర్ వికృత చర్య..
మెక్సికో : విద్యార్థులు పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఓ టీచర్ అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చేలా ఉంది. విద్యార్థులు పరీక్షలో చీటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు టీచర్ వారి తలలపై అట్ట పెట్టెలను ఉంచారు. ఈ భయానక ఘటన సెంట్రల్ మెక్సికోలోని బాచిల్లెరెస్ 01 ఎల్ సబినల్ స్కూల్లో చోటుచేసుకంది. ఈ వికృత చర్యకు పాల్పడిన టీచర్‌ను లూయిస్ జ్యూరెజ్ టెక్సిస్గా గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీచర్ తన విద్యార్థులను ఇలా అవమానపరచడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే లూయిస్ జ్యూరెజ్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు అట్ట పెట్టలు పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. విద్యార్ధుల మానసిక పరివర్తనకు ఇది ఒక వ్యాయామం లాంటిదని తెలిపింది. విద్యార్థులు ఈ వ్యాయామానికి ముందే అంగీకరించారని చెప్పింది. తాము ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని పేర్కొంది. అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. -
పరీక్షల్లో అక్రమాలపై సీఎం సీరియస్
నిన్న మొన్నటి వరకు యాంటీ రోమియో స్క్వాడ్లతో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు పరీక్షల్లో అక్రమాల మీద దృష్టిపెట్టారు. యూపీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అక్రమాలకు పాల్పడుతున్న కేసులు బయట పడుతుండటంతో ఆయన సీరియస్‌గా స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పరీక్ష కేంద్రాలు, 111 మంది సెంటర్ డైరెక్టర్లు, 178 మంది ఇన్విజిలేటర్లు, 70 మంది విద్యార్థులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అలాగే 57 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించగా, 54 కేంద్రాల్లో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేసేశారు. పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నడుంకట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ముందుగా విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి వాళ్లకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేయడానికి మూడు రోజుల ముందే పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల హామీలను శరవేగంగా నెరవేర్చడంలో భాగంగా ముందుగా ఆయన అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేశారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలలో ఒక్కరు కూడా కాపీ కొట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరిగే రాష్ట్రాలుగా యూపీ, బిహార్‌లకు ఎప్పటినుంచో పేరుంది. బిహార్‌లో గత సంవత్సరం అక్రమ మార్గాలలో టాప్ ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. -
అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్లపై నిషేధం
అల్జీరియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హైస్కూల్ ఎగ్జామ్ పేపర్లను ఆన్ లైన్లలో పోస్టు చేస్తుండటంతో వీటిని అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కోసం సోషల్ మీడియాను అక్కడ బ్లాక్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసే తప్పుడు పేపర్ల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండటానికి నిషేధం విధించామని అధికారులు వెల్లడించారు. 3జీ మొబైల్ నెట్ వర్క్ ద్వారా యాక్సెస్ అయ్యే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ప్రశ్నాపత్రాల పేపర్ల చీటింగ్ దేశంలో ఎక్కువగా జరుగుతుండటంతో ప్రభుత్వానికి వాటిని నిరోధించడం కష్టతరంగా మారుతోంది. ఈ నెల మొదట్లో పేపర్లను లీక్ చేసిన కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసులకు, ఫ్రింటర్లకు సంబంధించిన వారు ఉన్నారు. 2016 హైస్కూల్ ఎగ్జామ్స్ పేపర్లు సోషల్ మీడియాలో లీక్ పై విచారణ కొనసాగుతోంది.