స్కూల్‌ టీచర్‌ వికృత చర్య.. | Mexican Teacher Putting Cardboard Boxes On Students Heads To Stop Cheating In Exams | Sakshi
Sakshi News home page

స్కూల్‌ టీచర్‌ వికృత చర్య..

Published Thu, Sep 5 2019 11:02 AM | Last Updated on Thu, Sep 5 2019 2:17 PM

Mexican Teacher Putting Cardboard Boxes On Students Heads To Stop Cheating In Exams - Sakshi

మెక్సికో : విద్యార్థులు పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఓ టీచర్‌ అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చేలా ఉంది. విద్యార్థులు పరీక్షలో చీటింగ్‌కు  పాల్పడకుండా ఉండేందుకు టీచర్‌ వారి తలలపై అట్ట పెట్టెలను ఉంచారు. ఈ భయానక ఘటన సెంట్రల్‌ మెక్సికోలోని బాచిల్లెరెస్ 01 ఎల్ సబినల్ స్కూల్‌లో చోటుచేసుకంది. ఈ వికృత చర్యకు పాల్పడిన టీచర్‌ను లూయిస్ జ్యూరెజ్‌ టెక్సిస్‌గా గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీచర్‌ తన విద్యార్థులను ఇలా అవమానపరచడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే లూయిస్‌ జ్యూరెజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు అట్ట పెట్టలు పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్కూల్‌ యాజమాన్యం స్పందించింది. విద్యార్ధుల మానసిక పరివర్తనకు ఇది ఒక వ్యాయామం లాంటిదని తెలిపింది. విద్యార్థులు ఈ వ్యాయామానికి ముందే అంగీకరించారని చెప్పింది. తాము ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని పేర్కొంది.  అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement