బీహార్‌లో టెన్షన్‌.. ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం | Bihar Police Detained Prashant Kishor Strike In Patna | Sakshi
Sakshi News home page

బీహార్‌లో టెన్షన్‌.. ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Published Mon, Jan 6 2025 7:09 AM | Last Updated on Mon, Jan 6 2025 10:03 AM

Bihar Police Detained Prashant Kishor Strike In Patna

పాట్నా: బీహార్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ప్రశాంత్‌ కిషోర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

బీహార్‌(bihar)లో రాజకీయం మరోసారి వేడెక్కెంది. జన్‌ సురాజ్‌ పార్టీ నేత ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామునే ప్రశాంత్‌ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ నిరాకరించడంతో బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో గాంధీ మైదాన్‌ వద్ద వేదికను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో, పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. బీపీఎస్‌సీ(BPSP) వ్యవహారంలో గత నాలుగు రోజులుగా ప్రశాంత్‌ కిషోర్‌ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన గాంధీ మైదాన్‌లో దీక్షకు దిగారు. బీహార్‌లో బీపీఎస్‌సీ కంబైన్డ్ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీహార్‌లో ఆందోళనలకు దిగారు. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రశాంత్‌ కిషోర్‌ దీక్షకు దిగారు. అంతకుముందు.. అభ్యర్థుల నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న బీపీఎస్సీ పరీక్ష జరిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement