ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఇటీవల బిహార్‌లో జనసూరజ్ పార్టీని స్థాపించి పూర్తి రాజకీయ నేతగా అవతరించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టారు.
ఈ సందర్భంగా బెలగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొట్టారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదని అన్నారు.తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక్క ఎన్నికల సమయంలో ఒక్క రాజకీయ పార్టీకి సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటాననిప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
ఇది స్టార్టింగ్ మాత్రమేనని, తన పనిని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే.. ఆ డబ్బుతో రాబోయే రెండేళ్లపాటు తన పార్టీ ప్రచారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.
‘నా ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవని, సరిపోదని అనుకుంటున్నారా? నేను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా? బీహార్‌లోనే కాదు నా ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదు. నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే వసూలు చేశాను. అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగలుగుతున్నాను.
కాగా బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచికిరణ్ సింగ్ ఉన్నారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment