పట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్.. ‘జన్ సురాజ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం పట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీ ‘జన్ సూరాజ్ పార్టీ’ని ప్రారంభించారు. మరోవైపు.. జన్ సురాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ కిషోర్ బుధవారం వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ‘‘కార్యకర్తలు, ప్రజలు, అభిమానులంతా ‘జై బీహార్’ అని గట్టిగా నినాదించాలి. ఇకనుంచి మిమ్మల్ని మీ పిల్లలను ఎవరూ ‘బీహారీ’ అని పిలవరు. అలా పిలవటం దుర్భాషలాగా అనిపిస్తుంది. మీ వినిపించే గళం ఢిల్లీకి చేరాలి. బీహార్‌కు చెందిన విద్యార్థులను దాడి చేసిన బెంగాల్‌కు కూడా మీ గళం చేరుకోవాలి. బీహారీ పిల్లలను ఎక్కడ వేధించినా, దాడి చేసినా.. అది తమిళనాడు, ఢిల్లీ, బొంబాయికి ఎక్కడికైనా మీ గళం అక్కడికి చేరాలి’ అని అన్నారు.
ఇటీవల బెంగాల్‌లోని సిలిగురికి పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు బిహార్ యువకులను వేధించిన ఘటనలో ఇద్దరు బెంగాల్ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ గత 25 నుంచి 30 ఏళ్లలో లాలూ ప్రసాద్‌కు భయపడి బీజేపీకి ఓట్లు వేసిన రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే ‘జన్ సూరాజ్’ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దీని కోసం బీహార్ ప్రజలు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యామ్నాయం బిహార్ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేయాలనుకునే పార్టీగా ఉండాలి’ అని అన్నారు.
చదవండి: బద్లాపూర్ ఎన్‌కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment