Prashant Kishor
-
విజయ్-పీకే జోడి.. హిట్టయ్యేనా? (చిత్రాలు)
-
కేజ్రీవాల్ ఓటమికి అదే ముఖ్య కారణం: ప్రశాంత్ కిషోర్
పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ ఓటమిపై జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన చేసిన పెద్ద తప్పిదం అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ రాజీనామా పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు.జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా రెండో కారణం. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది.అలాగే, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారింది. ఇండియా కూటమిపై ఆయన నిర్ణయాలు కొంత దెబ్బతిశాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కూటమితో కాకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఆప్ పనితీరుపై ప్రభావం చూపించింది. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ప్రజలు ఎత్తి చూపించినా ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆప్ రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే. ఇక, ఎంతో కష్టపడితే కానీ, కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. -
బీహార్‌లో టెన్షన్.. ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
పాట్నా: బీహార్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ప్రశాంత్ కిషోర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.బీహార్(bihar)లో రాజకీయం మరోసారి వేడెక్కెంది. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామునే ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించడంతో బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో గాంధీ మైదాన్ వద్ద వేదికను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో, పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR— ANI (@ANI) January 6, 2025ఇదిలా ఉండగా.. బీపీఎస్సీ(BPSP) వ్యవహారంలో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిషోర్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన గాంధీ మైదాన్‌లో దీక్షకు దిగారు. బీహార్‌లో బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్‌లో ఆందోళనలకు దిగారు. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. అంతకుముందు.. అభ్యర్థుల నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న బీపీఎస్సీ పరీక్ష జరిగింది.#WATCH | Bihar | A clash broke out between Patna Police and supporters of Jan Suraaj chief Prashant KishorPrashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan, was detained by the police pic.twitter.com/2RwVVtYcYU— ANI (@ANI) January 6, 2025 -
నా ఫీజు రూ. 100 కోట్లు: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఇటీవల బిహార్‌లో జనసూరజ్ పార్టీని స్థాపించి పూర్తి రాజకీయ నేతగా అవతరించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టారు.ఈ సందర్భంగా బెలగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొట్టారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదని అన్నారు.తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక్క ఎన్నికల సమయంలో ఒక్క రాజకీయ పార్టీకి సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటాననిప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనని, తన పనిని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే.. ఆ డబ్బుతో రాబోయే రెండేళ్లపాటు తన పార్టీ ప్రచారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.‘నా ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవని, సరిపోదని అనుకుంటున్నారా? నేను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా? బీహార్లోనే కాదు నా ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదు. నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే వసూలు చేశాను. అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగలుగుతున్నాను.కాగా బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచికిరణ్ సింగ్ ఉన్నారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. -
ప్రశాంత్ కిశోర్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు
గయ: బీహార్‌లోని గయలో జన్ సూరజ్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పిలుపు మేరకు సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు గలాటా సృష్టించారు. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. వివరాల్లోకి వెళితే గయలోని బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు పీకే గతంలో ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఈ సమావేశంలో ఈ స్థానానికి టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు తొలుత తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనిని గమనించిన ప్రశాంత్ కిషోర్ స్టేజి మీద నుంచి వారిని వారించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాటలను అక్కడున్నవారెవరూ పట్టించుకోలేదు. పైగా కుర్చీలు విసురుకుంటూ ఎవరికి దొరికిన దాన్ని వారు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.దీనికి ముందు తొలుత బెలగంజ్ ఉప ఎన్నిక కోసం నాలుగు పేర్లను ప్రతిపాదించారు. వీరిలో అమ్జద్ హసన్, ప్రొ. ఖిలాఫత్ హుస్సేన్, డానిష్ ముఖియా, ప్రొ. సర్ఫరాజ్ ఖాన్లున్నారు. ఈ సమావేశంలో, అమ్జద్ హసన్‌కు మద్దతు పలుకుతూ డానిష్ ముఖియా తన పేరును ఉపసంహరించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. దీంతో అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల పేర్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బెలగంజ్ టిక్కెట్‌ను ఖిలాఫత్ హుస్సేన్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మాట వినగానే అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల మద్దతుదారులు కుమ్ముటాటకు దిగారు.ఇది కూడా చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ -
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్!
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్! -
ప్రశాంత్ కిశోర్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
పట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్.. ‘జన్ సురాజ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం పట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీ ‘జన్ సూరాజ్ పార్టీ’ని ప్రారంభించారు. మరోవైపు.. జన్ సురాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ కిషోర్ బుధవారం వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ‘‘కార్యకర్తలు, ప్రజలు, అభిమానులంతా ‘జై బీహార్’ అని గట్టిగా నినాదించాలి. ఇకనుంచి మిమ్మల్ని మీ పిల్లలను ఎవరూ ‘బీహారీ’ అని పిలవరు. అలా పిలవటం దుర్భాషలాగా అనిపిస్తుంది. మీ వినిపించే గళం ఢిల్లీకి చేరాలి. బీహార్‌కు చెందిన విద్యార్థులను దాడి చేసిన బెంగాల్‌కు కూడా మీ గళం చేరుకోవాలి. బీహారీ పిల్లలను ఎక్కడ వేధించినా, దాడి చేసినా.. అది తమిళనాడు, ఢిల్లీ, బొంబాయికి ఎక్కడికైనా మీ గళం అక్కడికి చేరాలి’ అని అన్నారు. ఇటీవల బెంగాల్‌లోని సిలిగురికి పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు బిహార్ యువకులను వేధించిన ఘటనలో ఇద్దరు బెంగాల్ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ గత 25 నుంచి 30 ఏళ్లలో లాలూ ప్రసాద్‌కు భయపడి బీజేపీకి ఓట్లు వేసిన రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే ‘జన్ సూరాజ్’ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దీని కోసం బీహార్ ప్రజలు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యామ్నాయం బిహార్ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేయాలనుకునే పార్టీగా ఉండాలి’ అని అన్నారు.చదవండి: బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం -
బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ప్రశాంత్ కిశోర్
పట్నా: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో బీహార్‌లో ప్రభుత్వాన్ని తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కూడా తమ పార్టీకి చెందినవారేనని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన్ సూరజ్‌తో బరిలోకి దిగనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వర్గానికి చెందిన 40 మందిని అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పోరాటం ఆర్జేడీతో కాదని ఎన్డేతోనేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'వక్ఫ్ సవరణ బిల్లు-2024'ను లోక్‌సభలో ప్రవేశపెట్టారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనికి మద్దతు తెలిపారన్నారు.తమ లాంటివారు రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని, జేపీసీలో చర్చ జరుగుతోందన్నారు. అయితే భవిష్యత్‌లో నితీష్ కుమార్ తిరిగి మహాకూటమిలోకి వస్తారని, ముస్లింల గురించి మాట్లాడే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలను వీటన్నింటినీ గమనిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విజయవాడ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీ లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు.‘ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పాం. ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు. రాష్ట్ర విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాం. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్ విదేశాలికు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిభయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్ అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినాా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు. -
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
‘ఆ మాట చెప్పడానికి నువ్వెవరయ్యా?’
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కోసం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం మరో వేషం కట్టారు. ఇప్పటిదాకా టీడీపీ అనుకూల స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్న ఈ పచ్చ చిలుక.. ఇప్పుడు స్వయంగా ఏపీ రాజకీయాల్లోకి దిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ పార్టీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే ఇక్కడే పీకేకు ఘోరమైన భంగపాటు కలిగింది. కూటమి పేరుతో టికెట్ల డ్రామా ఆడించిన చంద్రబాబు.. ఆ పార్టీ సీనియర్లకు, గత ఐదేళ్లుగా కష్టపడ్డవాళ్లకు మొండి చేయి చూపించారు. కార్యకర్తల మద్దతు కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని, సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా టికెట్లు ఇవ్వకపోవడం దారుణమంటూ బహిరంగంగానే కొందరు అసంతృప్తి వెల్లగక్కారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఆ పార్టీ నేతలు రెబల్స్‌గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో(ఏప్రిల్ 29).. బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి వీళ్ల విషయంలో టీడీపీ అధిష్టానం మొదటి నుంచే బుజ్జగింపులు చేస్తోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి వాళ్లతో చర్చలు జరిపారు. కొందరు వెనక్కితగ్గగా.. మరికొందరు మెత్తబడుతూ వస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం నేరుగా తగ్గబోమంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో చివరి అస్త్రంగా ఈ ఎన్నికల్లో తమకు పని చేస్తున్న పీకేతో.. ఆ రెబల్స్‌కు చంద్రబాబు ఫోన్లు చేయిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టంగా ఉందని, పోటీ నుంచి తప్పుకుని కాస్తైనా పార్టీకి సహకరించాలని పీకే ఇప్పుడు వాళ్లను బతిమాలుతున్నట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అవసరమైతే పదవులు కూడా ఇస్తుందని పీకే టీడీపీ రెబల్స్‌తో చెబుతున్నారట. అయితే.. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి పీకేకు దిమ్మతిరిగే సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు టీడీపీ అధిష్టానం బదులుగా ఫోన్లు చేయడానికి మీరెవరంటూ ప్రశాంత్ కిషోర్‌ను వాళ్లు నిలదీస్తున్నారట. అంతేకాదు.. టీడీపీ ఇంకా అధికారంలోకే రాలేదని, అధికారంలోకి వచ్చేది అనుమానాలు ఉన్నప్పుడు పదవులు ఇస్తామని మీరెలా చెబుతున్నారంటూ నిలదీశారట. దీంతో భంగపడ్డ పీకే.. ఆ ఫోన్ సంభాషణల సారాంశాన్ని చంద్రబాబుకు చెప్పుకుని ఫీలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ టీడీపీ కోసం ఎలాగైనా వాళ్లను ఒప్పించాలని చంద్రబాబు బతిమాలడంతో.. వాళ్లకు ప్రత్యామ్నాయ ఆశలు కలిగించేందుకు మరోసారి ఫోన్లలో మాట్లాడేందుకు పీకే సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ గుట్టు విప్పిన మమతా బెనర్జీ
సాక్షి, అమరావతి: ప్రశాంత్‌కిశోర్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ప్రశాంత్ కిశోర్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని చేయకున్నా.. చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్‌కిశోర్ తెర వెనక పనిచేస్తున్నారని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్‌కిశోర్‌కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయన్నారు. "బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు" మమతా. ప్రశాంత్ కిశోర్ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, మోదీనేనని తెలిపారు. డామిట్ కథ అడ్డం తిరిగింది పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ సంస్థ నుంచి తప్పుకుని.. బీహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశాడు పీకే. తొలుత బీహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. వివాదాల పీకే సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా నేలకు దిగివచ్చాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న సంబంధాలన్ని తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్ బ్రోకర్‌గా మారాడన్న ఆరోపణలు ఢిల్లీలో వెల్లువెత్తాయి. కరకట్ట ఇంట్లో ప్యాకేజీ చర్చలు ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్‌ను విజయవాడకు తీసుకువచ్చిన లోకేష్.. నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. ఏపీలో కూటమి గెలుస్తుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు పీకే. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కానీ, లాజిక్ గానీ చూపించకుండా.. తన పాత బ్రాండ్‌ను వాడుకుని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు. అయితే విశ్వసనీయత కోల్పోవడంతో పీకే మాటలు ఎవరూ పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. "నోటు" మాటలు ప్యాకేజీ ఎంత ముట్టిందో గానీ, బాకా ఊదడంలో పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ అసలు రంగును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టడం.. పీకే వ్యాఖ్యల డొల్లతనం బయటపడ్డట్టయింది. -
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
ప్యాకేజీ కి బాబు పల్లకి మోస్తున్న పీకేలు
-
బాబు గూట్లో బిహారీ బాబు
బాబు గ్రాఫ్ దిగజారింది.. పెయిడ్ క్యాంపెయినర్లు దిగిపోయారు పెన్షన్ల ఇష్యూతో పాతాళానికి పడిపోయిన బాబు గ్రాఫ్ వెంటనే రంగంలోకి పెయిడ్ క్యాంపెయినర్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ పచ్చగూటి చిలుకగా మారిపోయాడా ? పేమెంట్ కు తగ్గట్టుగా పెర్ఫామెన్స్ చూపిస్తున్నాడా ? బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంతమాత్రం. అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటేం.. గ్రాఫ్ పడిపోక.. పరుగులు పెడుతుంందా ఏంటి ? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా.. పచ్చగూటిలో ఆ చిలుక ఎవరో..! పేరు ప్రశాంత్ కిషోర్. బిహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి.. బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశంమొత్తం తిరుగుతున్నాడు. బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో.. అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు.. చంద్రబాబును ఆయన గ్రాఫ్ ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు.. సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్ర్కిప్ట్ ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్లు ఎవ్వరూ లేరు. అయినా ఒక టీమ్ లేదు.. సర్వేలు చేయడం లేదు.. ఒక స్ట్రాటజిస్ట్ కాడు.. ఒక రాజకీయ నాయకుడు కాదు.. అలాగని విశ్లేషకుడు కాదు.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో.. అందుతున్న సంక్షేమం ఎంతో.. అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కార్ పై విషం చిమ్ముతున్న మిస్టర్ బిహారీ బాబు నువ్వు బాబు గూటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ పది ప్రశ్నలు అడుగుతున్నారు.. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు.. లేదా బీహారీలో చెప్పు.. ట్రాన్స్ లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం...! 1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దింపుతాడు.. అందులో భాగమే నువ్వు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలకగా మారిపోయావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 4. 2024 మార్చి 3న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కార్ పై విషం చిమ్మావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కాక్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు.. నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 9. నీకంటూ టీమ్ లేదు.. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలియదు.. అయినా స్ట్రాటజిస్ట్ లా మాట్లాడుతావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే బిగ్ క్వశ్చన్ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు.. -
ప్రశాంత్ కిషోర్ ను ఏకిపారేసిన మంత్రి బొత్స
-
పీకేకు బాబు భారీ ప్యాకేజీ
-
ప్రశాంత్ కిషోర్‌ను ఏకిపారేసిన ఏపీ మంత్రి బొత్స
-
ప్రశాంత్ కిషోర్‌ను ఏకిపారేసిన ఏపీ మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్నింటా ముందజలోనే ఏపీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదేళ్లల్లో అన్నిరంగాల్లోనూ ముందుంది. గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఇలా అన్నిరంగాల్లోనూ చేపట్టి విప్లవాత్మక సంస్కరణల ఫలితం రాష్ట్ర అభివృద్ధి సూచికలను నిర్దేశిస్తున్నాయి. నీతి అయోగ్ విశ్లేషణ, కేంద్ర నివేదికలు, జీడీపీలోనూ ఎందులో చూసినా, గతంలో 17 నుంచి 18 స్థానాల్లో ఉండే రేటింగ్ ఇప్పుడు 4, 5 స్థానాలకు వచ్చింది. గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనాతీరే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ఫోకస్డ్గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల ఇవన్నీ రాష్ట్ర పురోగతి సూచికలను తెలియజేస్తున్నాయి. జగన్ రియల్ లీడర్.. బాబు ప్రొవైడర్ ప్రశాంత్ కిశోర్ (పీకే) అనే రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చిపట్టినట్టు మాట్లాడారని ఇవాళ పత్రికల్లో చూశాను. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఒక లీడర్. కాగా.. లీడర్‌కు, ప్రొవైడర్కూ తెలియని వ్యక్తి పీకే. లీడర్, ప్రొవైడర్‌కు తేడా అంటే ఏంటో నన్నడిగితే నేను సమాధానమిస్తా పీకే..?. ప్రజలకు సంబంధించిన అంశాలను దీర్ఘకాలికమైన వ్యూహంతో ఆలోచన చేసి విప్లవాత్మక సంస్కరణలతో అమలు చేసేవాడిని లీడర్ అంటారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్రెడ్డి నూటికి నూరుపాళ్లూ చేస్తున్నది అదే. అందుకే, ఆయన్ను లీడర్‌గా ప్రజలంతా ఆరాధిస్తున్నారు. అదే పీకే చెబుతున్న ప్రొవైడర్ ఎవరంటే, అది చంద్రబాబు నాయుడు. ఆయన తన హయాంలో చేసిందంతా మేనేజ్మెంట్. బ్రోకరిజం. అలాంటి పనులు చేసేవాడ్ని ప్రొవైడర్ అంటారు. కాబట్టే, గత ఐదేళ్లకు ముందున్న అభివృద్ధి పారామీటర్స్ కంటే ఈ ఐదేళ్లలో మారిన పారామీటర్లే ఇందుకు నిదర్శనం. పావర్టీలైన్, జీడీపీ ఏం చెప్పాయో చూడు పీకే..? చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పేదరిక శాతం ఎంత..? ఇప్పుడెంత ఉంది..? పావర్టీలైన్ తెలుసుకో..విద్యలో ఇవాళ ఏపీ కేరళ రాష్ట్రాన్ని అధిగమించిన సంగతి వాస్తవమా..?కాదా..? జీడీపీ అంశం తీసుకుంటే 16వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది నిజం కాదా..? నిజమైన అభివృద్ధి జరగకపోతే, ఇవన్నీ ఎలా వస్తాయి..? పాతాళభైరవి సినిమాలో మాదిరిగా మంత్రం వేస్తే వస్తాయా..?. పీకే.. నువ్వు చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకో.. మాకేంటి అభ్యంతరం..? ఆయన్ను ఇంద్రుడు చంద్రుడని పొగుడుకో.. కానీ, నీ భాష మీద మాత్రం పట్టుండాలని తెలుసుకో.. లీడర్‌కూ ప్రొవైడర్‌కు తేడా తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు. పీకేవి.. ప్యాకేజీ మాటలు పీకేకు మీడియా ద్వారా చెబుతున్నదేమంటే, నీకు చంద్రబాబు మీద అభిమానం ఉంటే నీ తాళం, బాజాభజంత్రీలు బహిరంగంగా వాయించుకో.. అంతేగానీ, వారి అసమర్ధతను మా నాయకుడిపై రుద్దితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు గారు సహించరు. నీ మాటల్ని ఖండిస్తున్నాం. చంద్రబాబులా అక్కడా ఇక్కడా మధ్యవర్తిత్వం చేసి మేనేజ్మెంట్లతో పొత్తులు పెట్టుకునే దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఆయన రియల్ లీడర్. అందుకే, అంత ధైర్యంగా, మీకు మంచి జరిగితేనే.. భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటేనే నన్ను మరోసారి దీవించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. నువ్వు ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబుకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలని, నువ్వెంత ఆరాటపడినా.. దుష్ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులేమీ కాదు. బీహార్ ప్రజలు నిన్నెందుకు తరిమారు..? అసలు, ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నావు..? నీ ఉద్దేశంలో నీకు ప్యాకేజీ ఇచ్చినోడే నీకు ఇంద్రుడు.. చంద్రుడా..? నువ్వు బీహార్‌ను పరిపాలిస్తానని పాదయాత్ర చేశావుగా.. నిన్నెందుకు పనికిరావని అక్కడి ప్రజలు పక్కకు తరిమారు..? నీలాంటి బ్రోకర్లును పెట్టుకుని నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రజలేం అమాయకులనుకుంటున్నావా..? బీహార్ నుంచి నిన్నెందుకు తరిమేశారో సమాధానం చెప్పు. చంద్రబాబు లాగా అన్ని పోసుకోలు మాటలు మాట్లాడటం పరిపాలన కాదు. మేనేజ్మెంట్ చేసేవాళ్లను, బ్రోకర్లను ప్రజలు భరించలేరు గనుకే ఓడించి ఇంటికి పంపుతారు. మాటిచ్చి నిలుపుకోవడమే జగన్ నాయకత్వ లక్షణం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గానీ.. ప్రజల సంక్షేమం గురించైనా వాగ్దానాలు చేయడం ఈజీనే. అమలు చేయడమే చాలా కష్టం. మాట ఇవ్వడం ఈజీనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆచరణలో చూపడమే చాలా కష్టం. అదే మా జగన్మోహన్రెడ్డి గారు ఏదైతే చెబుతారో.. దాన్ని చేసి చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు గనుకే ప్రజా నాయకుడయ్యారు. అదే, జగన్ గారి నాయకత్వంలో ఉన్న ముఖ్య లక్షణం. అదే ఆయనలో ఉన్న బ్యూటీ ఆఫ్ సీక్రెట్. కాబట్టే.. ఇవాళ రాష్ట్రంలో ఏ రంగం చూసినా, పురోగతి బాటలో నడుస్తూ కనిపిస్తోంది. ఏపీపై ఎవడో వాగితే మీడియాలో ప్రధాన శీర్షికలా..? ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవడుబడితే వాడు వాగడం.. వాటిని పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించడం.. ఏంటీ ఈ నాన్సెన్స్..? పాత్రికేయ సోదరులకూ, ఆయా పత్రికల యాజమాన్యాలకూ రాష్ట్ర జీడీపీ, పావర్టీలైన్, విద్య, వైద్యం, వ్యవసాయంపై నీతిఅయోగ్ నివేదికలు ఇవన్నీ తెలియవా ..? అవన్నీ అధికారికంగా కనిపించే అంశాలే కదా..? వాటిని ఎవరు తారుమారు చేసి ప్రచారం చేసుకుంటారు...? కనుక, ఎవడో వాగిన వాంతిని పత్రికల్లో ప్రధాన శీర్షికలతో పెట్టి దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబు..? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని భావిస్తున్నాను. ప్రజలకు భరోసానిచ్చే లీడర్ జగన్ లీడర్ అంటే ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఓటేసే ఓటరుకు ఒక భరోసా.. అది ఈ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి గారు కల్పించారు. అదే లీడర్ అంటే ఒక మాయ, ఒక మేనేజ్మెంట్, ఒక మోసం, ఒక వెన్నుపోటు కాదు. అవన్నీ చేసే బ్రోకర్ చంద్రబాబు నాయుడు. సో, అందరూ వీరిద్దరి మధ్య తేడా ఏంటనేది ఆలోచించాలి. ఆయా వ్యక్తుల పరిపాలనా తాలూకూ వాస్తవాలే వారేంటో చెబుతాయి..? చంద్రబాబు హయాంలో అభివృద్ధి సూచికలు ఎలా ఉన్నాయి..? దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో ఎలా ఉన్నాయి..? ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఎలా ఉన్నాయో తేడా చూసుకోమనండి..? వాస్తవాల ఆధారంగా మాట్లాడితే ఏపీకి నిజమైన నాయకుడు ఎవరనేది తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం ధర్మమా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బుర్రను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారా...? లేక ఆమెనే స్వంతంగా ఆలోచించి పిచ్చిపనులు చేస్తుందా..? రాష్ట్రంలో 22 మంది ఐపీఎస్‌లపై అవినీతి బురద జల్లి వారిని మార్చాలం టూ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తుందా..? బుద్ధుందా..? పూర్తి అసత్య నిరాధారమైన ఆరోపణలతో అంతమంది ఐపీఎస్‌లను చిన్నబుచ్చడం సంస్కారమేనా..? మొన్నటిదాకా వాలంటీర్లపై టార్గెట్ పెట్టి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి నోటికొచ్చిందల్లా వాగడం.. ఎల్లోమీడియా వాటిని హైలెట్ చేయడం, వారిపై లేఖలు రాయడం జరిగింది. మొత్తానికి పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి ఆ మూడు పార్టీలు గోతిలో పడ్డాయి. ప్రజాగ్రహం దెబ్బకు తాము చేసిన తప్పిదానికి చెంపలు వాయించుకోలేక, ఇప్పటికీ వారి ఎల్లోమీడియాలో ఏవేవో సాకులు రాయించుకుంటున్నారు. సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లంటే జగన్ గారి హయాంలో నియామకమైనోళ్లు కాబట్టి మీరు హడావిడి చేశారనుకుందాం. మరి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను టార్గెట్ చేస్తున్నారంటే.. వారు కూడా జగన్మోన్రెడ్డి గారి హయాంలోనే అపాయింట్మెంట్లు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా..? వాళ్ల సర్వీసులో చాలామంది చంద్రబాబు హయాంలోనూ పనిచేసిన వారే కదా..? మరి, మీ పట్ల అంత అంకితభావం లేకుండా.. జగన్‌గారి పట్ల అంకితభావం ఉండటానికి గల కారణమేంటి..? ఒక ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను చులకనగా చూడటం భావ్యమా..? దానికి కొన్ని పత్రికలు పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయడం ధర్మమా..?అది ఆ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కాదా..? ఎన్నికల నిర్వహణ మార్గదర్శి మేనేజర్లకు అప్పగించాలని లేఖ రాసుకోండి ఈనాడు యాజమాన్యానికి నేను చెప్పినట్టు, నాదొక సలహా చెప్పండి. చంద్రబాబు, పురందేశ్వరిల చేత ఎలక్షన్ కమిషన్‌కు ఓ లేఖ రాయించుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ, ప్రభుత్వ సర్వీసు అధికారులపై మాకు నమ్మకం లేదు. కనుక, ఎన్నికల ప్రక్రియను మాకోసం ఈనాడు, మార్గదర్శి మేనేజర్లతోనే నిర్వహించమని కోరండి. ఒక్కో జిల్లా ఎన్నికల బాధ్యతను ఒక్కో మేనేజర్‌కు అప్పగించి జరుపుకోండి. బూత్‌లలో ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి కొట్టి బయట పారేస్తారు. ఎన్నికలంటే, చంద్రబాబు, పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతికి అంత ఆటలుగా ఉందా..? ప్రజాస్వామ్యంలో ఎన్నికల యంత్రాంగం పట్ల మీరు మరీ అంత నమ్మకం లేకుండా ఉండటం సరికాదు. అదే మా నాయకుడు జగన్‌గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులపై, వ్యవస్థలపై, ప్రజలపై నమ్మకం ఉంది. గౌరవం ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరితో ఎల్లోమీడియా ఇప్పటికైనా తాము చేస్తున్న తప్పులేంటో తెలుసుకుని ఐపీఎస్‌లు, ఐపీఎస్లుకూ, ప్రజలకు క్షమాపణలు చెప్పి, ఇకనైనా బుద్ధిగా నడుచుకోవడం మేలు... అని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
పీకే స్క్వేర్.. అట్లుంటది బాబు చెత్తరాజకీయంతోని!
ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల వ్యూహకర్త. ఆయన స్కెచ్ వేశాడంటే.. ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే!. ఒక పార్టీకో, ఒక కూటమికో అనుకూలం అని కాకుండా.. పరిస్థితుల్ని బట్టి ఆ సమయానికి ఐ-ప్యాక్(Indian Political Action Committee) అనే రాజకీయ వ్యవహారాల విభాగంతో ఫలానా పార్టీకి పని చేసి విజయాల్ని అందిస్తూ వచ్చిన వ్యక్తి. కానీ, ఇదంతా గతం. ఇప్పుడాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు. దిగితే ఫర్వాలేదు.. చంద్రబాబు లాంటి వాళ్లతో చేతులు కలిపి మకిలి అంటించుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కొన్ని నెలల కిందట.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ గంటన్నరకు పైగా భేటీ అయ్యాడు. ఆ చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గత ఎన్నికలకు వైఎస్సార్సీపీ కోసం, వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం పని చేసిన పీకే.. ఈసారి చంద్రబాబు కోసం పని చేయబోతున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ అనుకూల వెబ్సైట్లు బిల్డప్పులు అల్లేసి తెగ రాసేశాయి. ఆ ఊకదంపుడు మీడియా రాతల్ని ఐ-టీడీపీ పేజీలు, జనసేన సోషల్ మీడియా విభాగాలు తెగ ప్రచారం చేశాయి. చివరకు తాను చంద్రబాబుకి పని చేయబోవడం లేదంటూ పీకే క్లారిటీ ఇచ్చేదాకా ఆ ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే ఆ తర్వాతి నుంచే పీకే ఇక్కడి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తున్నాడు. ‘‘చంద్రబాబు ఎప్పటి నుంచో నన్ను కలవాలని అనుకుంటున్నారట. ఓ కామన్ ఫ్రెండ్ పదే పదే ఒత్తిడి చేయడంతో వెళ్లి కలిశాను. ఈసారి జరగబోయే ఎన్నికలకు నన్ను పనిచేయమని అడిగారు. కానీ, నేను ఇప్పుడు అలాంటి పనులు(ఎన్నికల వ్యూహకర్త) చేయడం లేదని చెప్పాను’’ అని ప్రశాంత్ కిషోర్ పచ్చ మీడియా అల్లిన కథలకు చెక్ పెట్టాడు. అయితే.. ఇద్దరు పీకేలతో చంద్రబాబు ఆడిస్తున్న చెత్త రాజకీయ డ్రామాలు ఇప్పుడు ఎల్లో మీడియా సాక్షిగా బయటపడింది. ఐ-ప్యాక్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయ వ్యూహాలకు దూరమైన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ రొంపిలోకి దిగి కుట్రలను మాత్రం అలవర్చుకున్నట్లు అవగతమవుతోంది. బీహార్ రాజకీయాల్లో జన సూరాజ్ పేరిట ఆయన చేసిన హడావిడినే అందుకు నిదర్శనం. రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగాయి నైరాశంలో ఉండిపోయాడు. అయితే అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో.. ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే.. పలు పార్టీలకు అనుకూలంగా ప్రైవేట్ ఇంటర్వ్యూలలో స్టేట్మెంట్లు ఇవ్వడం!. తాను రాజకీయ వ్యూహాలకు శాశ్వతంగా దూరమైనట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించుకున్నారు. కానీ, వరుస పెట్టి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మాత్రం ఆయన ఆ హోదాతోనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ వ్యాఖ్యలనే ఆయా పార్టీల అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుతోనూ ‘ఏదో’ డీల్ కుదిరినట్లు ఆయన వరుసగా ఏపీ రాజకీయాలపై ఇస్తున్న ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు.. అప్పటికే ఉన్న దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ టీడీపీ కోసం ఎంతలా పని చేస్తున్నాడో చూస్తూన్నదే. కూటమి పేరిట బీజేపీ, టీడీపీని చేర్చే క్రమంలో జనసేన తరఫున పవన్ ఎన్నో త్యాగాలు చేశాడట. చివరకు బాబులాంటి వాడితో పొత్తు కోసం నీ రాయబారం ఏంటయ్యా? అని బీజేపీతోనూ తిట్లు తిన్నాడట. స్వయంగా ఈ ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్.. అయినా సరే బాబుకు ఊడిగం చేయడంలో ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేశాడు. నమ్ముకున్నవాళ్లను, పదేళ్లుగా పార్టీ వెంట నడుస్తున్న వాళ్లకు వెన్నుపోటు పొడుస్తూ.. 21 సీట్లతో సర్దిపుచ్చుకుని ప్యాకేజీకి న్యాయం చేయడంలో సార్థక నామధేయుడిగా నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో తాను, తన పార్టీ, కూటమిగా వచ్చినా గెలవలేదనే విషయం చంద్రబాబుకు అర్థమైంది. ఒకవైపు పవన్ కల్యాణ్ సినీ గ్లామర్‌ను మరోసారి వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ఓడిపోతారంటూ పీకే ద్వారా నాలుగు మాటలు చెప్పిస్తున్నాడు. మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పించాడు. తాజాగా పీటీఐ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం కష్టమంటూ ప్రశాంత్ కిషోర్ ఓ ప్రకటన ఇచ్చాడు. ఇంకేం.. ఎల్లో మీడియా సంబురాలు చేసుకుంటోంది. ఆ ఇంటర్వ్యూను ఎగ్గొట్టి దిగ్గొట్టి రకరకాలుగా కథనాలు ఇస్తోంది. గతంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన పీకే.. ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి. అదీ.. చంద్రబాబును కలిశాకే. కొత్తగా @ncbn నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో అలా అంటున్నావు కానీ రాష్ట్రాభివృద్ధికి ఎవరేం చేశారన్నది కేంద్ర గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి ప్రశాంత్ కిషోర్. విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో వృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఏపీ సీఎం వైయస్… pic.twitter.com/T5GL7SKi2q — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 అయినా ఒకప్పుడు ప్యాకేజీలు తీసుకుని పార్టీల కోసం సలహాలు, సూచనలు ఇచ్చిన వ్యూహకర్త.. ఇప్పుడు పొలిటీషియన్‌గా జెన్యూన్ స్టేట్మెంట్లు ఇస్తారని అనుకోగలమా?. పైగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు ఎలాంటి సర్వేలు చేయడం లేదు. పైగా ఆయన వేస్తున్న అంచనాలు ఘోరంగా తప్పుతున్నాయి. ఉదాహరణకు.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుస్తుందని చెప్పిన అంచనా బోల్తా కొట్టింది. కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా అనుభవం, కాస్త పైత్యాన్ని రంగరించే వరుస ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి పదే పదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఏపీ రాజకీయాలపై ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే.. ఎల్లో మీడియా కూడా ఆ కథనాలనే ప్రముఖంగా ప్రచురిస్తుంటే ఏపీ ప్రజలుప్రజలు అర్థం చేసుకోలేరా?.. పైగా కరకట్ట నివాసం భేటీ తర్వాతే పీకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే అనుమానాలు రావా?.. ఇద్దరు పీకేలు, ఇద్దరూ ప్యాకేజీ స్టార్లతో యాంటీ జగన్ వేవ్‌ను సృష్టించేందుకు నడుస్తున్న పచ్చ కుట్రలను అర్థం చేసుకోలేరా?.. అసలు చంద్రబాబు నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని.. అది ఎన్నికల సమయంలో ఆశించడం అత్యాశే అవుతుందేమో కదా!. -
బయటపడ్డ ప్రశాంత్ కిషోర్ కుట్ర కోణం..!
-
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్
-
నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ చేస్తాం: విజయసాయిరెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాలుగు సంవత్సరాల పదినెలల కాలంలో ప్రజలకు అందించిన సుపరిపాలనే కారణమని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయ కర్త వి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు పట్టణంలో రామ్మూర్తి నగర్ లో బుధవారం క్యాంపు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను నెల్లూరులో పుట్టానని, ఇక్కడే పెరిగానని, విద్యాభ్యాసం చేసానని తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరుకు రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నప్పటికీ ఎయిర్ కనెక్టివిటీ లేదని, ఇక్కడ పరిశ్రమలు, అక్వా రంగం, వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఎయిర్ కనెక్టివిటీ సదుపాయం కల్పించడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. తాను పార్లమెంటులో టూరిజం, ట్రాన్స్ పోర్టు, కల్చర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నందున దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణానికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నెల్లూరు జిల్లా వాసిగా ఇక్కడి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే తన ప్రణాళిక వెల్లడిస్తానని అన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ మేరకు కందుకూరు నుంచి నెల్లూరు వరకు దారి పొడవునా ప్రజలు చూపించిన అభిమానమే ఇందుకు నిదర్శనమని అన్నారు. చదవండి: ‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’ సంక్షేమంలో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం అభివృద్దిలో వెనుకబడిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గత చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలనతో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగిందని సూచికలు చెబుతున్నాయని అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి జీవన ప్రమాణాలు పెంచారని అన్నారు. సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మేనిఫెస్టో అన్ని అంశాల్లోనూ సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి ఫేస్‌తో తాము ఎన్నికలకు సిద్దమని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చేస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల అనుభవంతో రెట్టింపు సంక్షేమ పాలన 2019నుంచి 2024వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలన, అన్ని వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఐదేళ్ల అనుభవంతో రానున్న ఐదేళ్లలో రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందిస్తారని అందుకు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా ప్రశాంత్ కిషోర్ అబిప్రాయం ప్రశాంత్ కిషోర్ వెల్లడించిన అభిప్రాయానికి ఏమాత్రం లాజిక్ లేదని, స్వార్థ ప్రయోజనాలతో వ్యక్తపరిచిన స్వంత అభిప్రాయం మాత్రమేనని, ఆయన అభిప్రాయాలకు లాజికల్ ఆధారాలేవీ లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ అతని మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని అందుకు సీఎం జగన్‌పై చూపిస్తున్న అభిమానమే సాక్ష్యమని అన్నారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,నెల్లూరు మేయర్ స్రవంతి, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన అనంతరం బుధవారం నెల్లూరుకు చేరుకున్న ఎంపీ విజయసాయి రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం ఉలవపాడు జాతీయ రహదారి వద్ద కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త బుర్రా మధుసూదన్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి వాహనాలతో ర్యాలీగా తరలివచ్చారు. అలాగే కావలి నియోజకవర్గం రుద్రకోట వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం వద్ద ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం కోవూరు నియోజకవర్గం రాజుపాలెం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన అనంతరం నెల్లూరు నగర పరిధిలోని అయ్యప్ప దేవాలయం వద్ద పూజ నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో విజయసాయి రెడ్డి ఇతర నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. -
Babu - PK : బాబుకు దొరికిన కొత్త పావు పీకే
'బీహారు రాజకీయ నేత, ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత కిషోర్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయ్యారా? ఆయన ఏపీలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి అప్ డేట్ అవకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా మాట్లాడారా? సర్వేలు చేయడమే మానుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ జోస్యం చెప్పడంలో కుట్ర కోణం కనిపించడం లేదా?' చంద్రబాబు తనను బీహారు డెకాయిట్ అని గతంలో దూషించిన సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఆయనతో రహస్య ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? ఇలాంటి అనేక సందేహాలు వస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం సహజంగానే కలకలం రేపుతుంది. హైదరాబాద్‌లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో కీలకమైనది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రాజకీయ జోస్యం. ఆయన చిత్తశుద్దితో ఏపీలో పర్యటనలు చేసి, లేదా తన మనుషులతో ప్రజాభిప్రాయం తెలుసుకుని ఏమైనా వ్యాఖ్యానించి ఉంటే అది వేరే సంగతి. అప్పుడు ఆయన అభిప్రాయంపై విభేదించవచ్చు. లేదా సపోర్టు చేయవచ్చు.కానీ ఆయన అలా కాకుండా బీహారు నుంచి ఒక రోజు కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చి, ఏపీపై మాట్లాడడం కాస్త అసహజంగానే ఉంటుంది. కొంతకాలం క్రితం ప్రశాంత కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. అదేదో కామన్ మిత్రుడు ఒత్తిడి చేస్తే వెళ్లి కలిశానని చెప్పారు. చంద్రబాబుకు ఉండే నెట్ వర్క్ అలాంటిదన్నమాట. ఎవరినైనా ట్రాప్ చేయగల సత్తా ఆయన సొంతం. చంద్రబాబు నివాసంలో కలిసిన తర్వాత ఏమి రాజకీయ చర్చలు జరిగాయో కానీ, రోజువారిగా టీడీపీ చేసే విమర్శలనే ఆయన మాట్లాడినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ తర్వాత ప్రశాంత కిషోర్ వాటి గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు సడన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షమై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను వ్యతిరేకంగా మాట్లాడి ఏపీలోని పెత్తందారుల కూటమిలో ఆయన కూడా జాయిన్ అయ్యారన్న అభిప్రాయాన్ని కలిగించారు. కరకట్ట ఇంటికి ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొచ్చేందుకు నారా లోకేష్ ఏకంగా ఓ ప్రత్యేక విమానాన్నే తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఏపీ ప్రజలెవరూ మరిచిపోలేదు. ఇదే ప్రశాంత కిషోర్‌పై 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసింది అందరికి తెలుసు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్ గొప్పవాడికింద ఈ మీడియా ప్రొజెక్టు చేసే పనిలో పడింది. ఆయన చెబితే అన్నీ జరిగిపోతాయన్నట్లుగా పిక్చర్ ఇస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రశాంత కిషోర్ చేసిన రాజకీయ జోస్యాలన్నీ విఫలం అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందని కిషోర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. చత్తీస్ గడ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2022 లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవదని చెబితే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత కిషోర్ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం అవుతున్నారని తెలిసిపోతుంది. ఆయన ఐ పాక్ అనే సర్వే సంస్థ గతంలో ఉండేది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థతో అన్ని బంధాలు వదులుకున్నానని పలుమార్లు చెప్పారు. దాంతో ఏపీకి ఆయనకు కాంటాక్ట్ పోయినట్లయింది. అయినా పర్వాలేదు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల బలబలాలను పరిశీలించి పోల్చి విశ్లేషణ ఇస్తే పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. ఆయన అలా చేయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి చెప్పిన ఆయన చేసిన వాదన అర్ధరహితంగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కితేనే ఓట్లు పడవని అన్నారు. కాసేపు ఆయన చెప్పింది నిజమే అనుకుందాం! వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న స్కీములకు సుమారు ఏభైవేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతోంది. దానికి మూడు నుంచి నాలుగు రెట్ల మేర అంటే ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లను తాను బటన్ నొక్కుతానని చంద్రబాబు అంటున్నారు కదా! చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీములను ఎద్దేవ చేసి ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఆరోపించేవి. అదే చంద్రబాబు మూడు రెట్లు డబ్బు పంచుతానని అంటుంటే మాత్రం వీరు ఆహా, ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. అంతే తప్ప చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తే మూడు లేదా నాలుగు శ్రీలంకలు అవుతుందని చెప్పడం లేదు. పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు శరాలను వదలుతున్నాడని పచ్చ మీడియా సంబరపడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల గురించి ఏమంటారు? ప్రజలు వాటికి ఎందుకు ఆకర్షితులయ్యారు? ఈ విషయాలను ప్రశాంత కిషోర్ పరిగణనలోకి తీసుకున్నారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా సంక్షోభ సమయం రెండేళ్లలో ఎలాంటి కార్యాచరణ అమలు చేసింది ప్రశాంత కిషోర్ ఎన్నడైనా గమనించారా? ఈ ఐదేళ్లలో ఏపీలో ఎన్ని కొత్త వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చింది ఆయన తెలుసుకున్నారా? వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించడం వాస్తవం కాదా! గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ చేయలేదా? రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇలా అనేక మార్పులు వచ్చింది ఆయన చూడలేదా! వృద్దులకు పెన్షన్లను ఇళ్లవద్దకే తీసుకువెళుతున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాదా! స్కూళ్లు బాగు చేయడం అభివృద్ది కాదా! స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్ తీసుకు వస్తున్నది నిజం కాదా? అలాగే, ఆస్పత్రులను బాగు చేసి ప్రజలకు ఆరోగ్య సురక్ష క్యాంపులను పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన తప్పేమిటి? అభివృద్ది విషయానికి వస్తే వీటన్నిటిలో అభివృద్ది కనిపించడం లేదా? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 800 గ్రామాలకు నీటి పథకం, నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు మెడికల్ కాలేజీలు, విజయవాడ వద్ద వరద రాకుండా పెద్ద గోడ నిర్మాణం, వెలిగొండ టెన్నెల్ పూర్తి, అవుకు రెండో టన్నెల్ పూర్తి, కుప్పంకు నీరు, ఓర్వకల్ వద్ద గ్రీన్ కో ప్లాంట్, కొప్పర్తి పారిశ్రామికవాడ, రామాయంపట్నం వద్ద కొత్త పరిశ్రమలకు ఏర్పాట్లు, విశాఖ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తదితర ఐటి కంపెనీలు, నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్శిటీ మొదలైనవీ ఏవీ అభివృద్ది కాదని ప్రశాంత కిషోర్ అనుకుంటున్నారా! ఏదో ఒక చోట ఒక భారీ భవంతి కడితేనే అభివృద్ది.. గ్రామాలలో ఏభైవేల భవనాలు కడితే అభివృద్ది కాదని ఈయన కూడా అనుకుంటున్నారా? ఇలా.. అసలు ఏపిలో తిరగకుండానే, పేదల, దిగువ మధ్య తరగతి ప్రజల మనో భావాలు తెలుసుకోకుండా ప్రశాంత కిషోర్ ఎలా మాట్లాడతారు? పోనీ వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు టైమ్ లో జరిగాయా? నిజంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం ఎందుకు తహతహలాడారు?అది చాలదన్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నట్లుగా పెత్తందారుల కూటమిలో ఈయన కూడా చేరారా? బీహారులో సొంత పార్టీ పెట్టి పాదయాత్రలు చేసినా ఎందుకు ప్రజాదరణ పొందలేకపోతున్నారు? ఇవన్ని పరిశీలిస్తే ప్రశాంత కిషోర్ ఏదో రహస్య ఎజెండాతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డికు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన సలహాదారుగా పనిచేశారు. అప్పుడు రూపొందించిన నవరత్నాల కార్యక్రమంలో ఈయనకు కూడా బాగస్వామ్యం ఉంది కదా! దానినే ఇప్పుడు తప్పు పడుతూ ఎలా మాట్లాడతారు? అంటే ఇది కపటత్వం కాదా? ప్రజలు వీటన్నిటిని గమనించకుండా ఉండరు. కృత్రిమమైన వ్యతిరేకత సృష్టించడానికి ఈయన వ్యాఖ్యలను టీడీపీ, ఎల్లోమీడియా ప్రచారం చేయవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టడం కూడా పెద్ద కష్టం కాదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఐప్యాక్‌కి పీకేకు సంబంధం లేదు: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రశాంత్ కిషోర్‌కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. .. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
ప్రశాంత్ కిషోర్ సర్వేకి కొమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
-
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కేశినేని ఫైర్
-
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్
-
పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్ గుండె బద్దలు
సాక్షి, హైదరాబాద్: నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని యెల్లో బ్యాచ్ గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేశారాయన. చంద్రబాబు, లోకేష్‌తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది యెల్లో మీడియా. ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు అల్లుకుంటూ వస్తోంది. అయితే తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారాయన. డిసెంబర్ చివరి వారంలో ఒకే ఫ్లైట్‌లో నారా లోకేష్‌తో కలిసి విజయవాడకు వెళ్లిన విషయాన్ని యాంకర్ ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబును కలవడానికే తాను విజయవాడకు వెళ్లానని చెప్పారాయన. అయితే చంద్రబాబుకి తనకు కామన్ స్నేహితుడైన ఓ పెద్ద నేత.. చంద్రబాబు తనను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే విజయవాడకు చంద్రబాబును కలవడానికి మాత్రమే వెళ్లానని చెప్పారాయన. గతంలో తాను వైఎస్సార్సీపీ జగన్మోహన్రెడ్డికి మద్ధతుగా పని చేశానని, ఈసారి తమ కోసం కోసం పని చేయాలని ఆ మీటింగ్‌లో చంద్రబాబు తనను కోరారని పీకే వివరించారు. అయితే అందుకు తాను కుదరని స్పష్టం చేశానని పీకే వివరించారు. అంతేకాదు ఈసారి ఏపీలో అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రతిపక్షానికి ఏ పార్టీకి తాను పని చేయబోనని క్లారిటీ ఇచ్చారాయన. తాను ఎన్నికల వ్యూహకర్త పనికి దూరంగా ఉంటున్న విషయాన్నే తమ కామన్ స్నేహితుడికి చెప్పానని.. అయితే అదే విషయాన్ని చంద్రబాబుని స్వయంగా కలిసి చెప్పాలని ఆయన సూచించారని.. అందుకే తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని పీకే స్పష్టత ఇచ్చారు. దీంతో ఇంతకాలం గంపెడు ఆశలు పెట్టుకున్న యెల్లో బ్యాచ్ ఢీలా పడిపోతోంది. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG — Actual India (@ActualIndia) January 23, 2024 Video Credits:Actual India ఇదీ చదవండి: కష్టం... నేనిప్పుడు ఏమీ చేయలేను -
సీఎం జగన్‌కు ఒక రకంగా లాభమే.. కారణం ఇదే..
ఏపీలో ఎలా విజయం సాధించాలో తెలియక తెలుగుదేశం పార్టీ అనేక తంటాలు పడుతోంది. తాజాగా తాను బీహారు డకాయిట్ అని విమర్శించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ను తెచ్చుకుని సంప్రదింపులు జరిపిన తీరు చూస్తే, ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తానే పెద్ద వ్యూహకర్తనని భావించేవారు. ఆయన వ్యూహంతోనే తన మామ ఎన్ టి రామారావును పదవిచ్యుతుడిని చేశారని , ఆ తర్వాత 1999లో భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్లి విజయం సాధించారని టీడీపీ నేతలు చెబుతుండేవారు. తదుపరి 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తులోకి వెళ్లి సఫలం కాకపోయినా, 2014 నాటికి మళ్లీ నరేంద్ర మోదీతో ఎలాగొలా స్నేహం చేసి తిరిగి బీజేపీతో కూటమి కట్టుకుని, అలాగే పవన్ కళ్యాణ్‌ను తనదారిలోకి తెచ్చుకుని ,రైతు రుణమాఫీ హామీని ఇచ్చి మళ్లీ అధికారంలోకి రాగలిగారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ✍️అప్పట్లో కేవలం ఎస్.వి.యూనివర్శిటీకి చెందిన ఒక ఫ్రొఫెసర్ నాయకత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని సర్వేలు చేయించుకుని రాజకీయం చేసేవారు. మరి అప్పటి వ్యూహ నైపుణ్యత ఏమైందో? లేక ఆయన కుమారుడు లోకేష్ ఈయనను పాత చింతకాయ పచ్చడి కింద భావిస్తున్నారేమో తెలియదు కాని ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారు. వీరెవరూ చాలరని ప్రశాంత కిషోర్ ను లోకేష్ ప్రత్యేక విమానంలో ఎక్కించుకుని వచ్చారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆద్వర్యంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత కిషోర్ కీలకంగా ఉన్నారని భావిస్తారు. ఆ తర్వాత కాలంలో కిషోర్ ఈ వ్యాపకానికి దూరంగా బీహారు రాజకీయాలు చేసుకుంటున్నారు. అయినా అప్పుడప్పుడూ ఈ రంగంలోకి వస్తుండవచ్చు. ✍️కాని నలభైఐదేళ్ల సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వీరిపై ఆదారపడవలసి రావడంతో ఆయన లో వ్యూహరచన నైపుణ్యం తగ్గిందని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల నుంచే చంద్రబాబు ఏమని అనేవారు. తనను ఓడించినందుకు ప్రజలంతా బాదపడుతున్నారని చెబుతుండేవారు. కొందరు మహిళలను పెట్టుకుని వచ్చి వారంతా ఏడుస్తున్నట్లు కూడా డ్రామాలు ఆడించారు. అయినా జనం పెద్దగా పట్టించుకోలేదు. తదుపరి స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఆయన చెప్పే డాంబికాలను ప్రజలు నమ్మడం లేదని అర్ధం అయింది.ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రేమ లేఖలు పంపుతున్నట్లు మాట్లాడేవారు. బీజేపీతో పొత్తులో ఉన్న ఆయనను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. నిజానికి పవన్ ను చంద్రబాబే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్ డి ఏ లోకి పంపారని అంటారు. ✍️అది వేరే సంగతి. ఆ తర్వాత కాలంలో జనసేన, టీడీపీ కలుస్తాయని ప్రకటించగానే, ఇంకేముంది.. వైఎస్సార్సీపీ పని అయిపోయింది అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి మీడియా సైతం ఆహా, ఓహోఅంటూ ప్రచారం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేసి , ఆ వెంటనే పొత్తు ప్రకటించారు. దాంతో ఏపీ ప్రజలంతా తమ కూటమివైపే ఉన్నారని చెప్పడం ఆరంభించారు. ఈలోగానే రాబిన్ శర్మ అనే వ్యూహకర్త సేవలను వాడుకున్నారు. అలాగే సునీల్ కనుగోలు వంటి మరికొందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ,కర్నాటక లో అమలు చేసిన గ్యారంటీ స్కీములను, అమ్మ ఒడి వంటి జగన్ స్కీములను కూడా కాపీ కొట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించారు. దాంతో వైఎస్సార్సీపీ ఓడిపోతుందని బీరాలు పోయేవారు. ఇన్ని చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు చివరికి ప్రశాంత కిషోర్ ను కూడా శరణు చొచ్చారు. అంటే ఏమిటి దీని అర్ధం. ✍️ తెలుగుదేశం ఇంతగా కృషి చేస్తున్నా బలపడడం లేదనే కదా! పవన్ కళ్యాణ్‌ను లొంగదీసుకున్నా ప్రయోజనం ఆశించిన రీతిలో రావడం లేదనే కదా! కమ్మ, కాపు సామాజికవర్గాల కాంబినేషన్ అని చెప్పుకున్నా, ఆయా వర్గాలు విశ్వసించడం లేదనే కదా! ఇప్పటికే ఇద్దరు వ్యూహకర్తలను కోట్ల రూపాయల వ్యయంతో నియమించుకున్నా ఫలితం రావడం లేదనే కదా! జనంలో మార్పు కనిపించడం లేదనే కదా! ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాదాకృష్ణ , టివి 5 నాయుడు వంటివారు అబద్దాలు ఊదరగొడుతున్నా జనం పట్టించుకోవడం లేదనే కదా! ప్రశాంత కిషోర్ ఉండవల్లిలో చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత కేవలం సీనియర్ నేత కనుక మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కాని ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు రోజూ చేసే ప్రసంగాలన్నిటిని ప్రశాంత్ కిషోర్ నోటిలో పెట్టి , అవన్ని ఆయనే అన్నట్లుగా రాసేశాయి. ప్రచారం చేసేశాయి.జగన్ ప్రభుత్వంపై ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుగుదేశం మీడియా చెబుతోంది. ✍️ ఇందులో నిజం ఉంటే కిషోర్ భేటీ తర్వాత బయటకు రాగానే చెప్పి ఉండాలి కదా! అలా ఏమీ చేయలేదంటేనే ఎల్లో మీడియా ఎప్పటి మాదిరి కల్పిత కధనాలను ఇచ్చిందని అర్దం చేసుకోవచ్చు. మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్యచేశారు. మెటీరియల్ ఉంటేనే కదా మేస్రీ పనిచేయగలిగేది అని అన్నారు. అందులో వాస్తవం ఉంది. కేవలం వ్యూహకర్తల వల్లే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు. కాకపోతే ఆ పార్టీ విదానాలు , అధినేత తీరుతెన్నులు, ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జరిగే కృషి మొదలైనవాటిపై ఆదారపడి ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే అవన్ని సానుకూలంగా ఉంటే వ్యూహకర్తల ఐడియాలు కూడా కొంత పనిచేస్తాయి. ఇందులో నాయకుడి చిత్తశుద్ది కూడా ముఖ్యం. ఉదాహరణకు వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తారు అని అభిప్రాయం సర్వత్రా ఉంది. ✍️ దానికి కారణం ఆయన 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేశారు కనుక. ఆయన తీసుకు వచ్చిన సంస్కరణలు,చేస్తున్న అభివృద్ది, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగని విదంగా చేస్తుండడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. అయినా ప్రభుత్వం అన్నాక కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. కాని ప్రభుత్వం చేసిన మంచి పనులతో పోల్చితే ఈ లోటుపాట్లు తక్కువగా ఉంటే జనం పెద్దగా పట్టించుకోరు. జగన్ కనుక తాను చెప్పిన హామీలను అమలు చేయకుండా ఉంటే ఈ పాటికి బదనాం అయి ఉండేవారు.ఏ వ్యూహకర్త ఏమి చేసినా ఇబ్బంది వచ్చేది. జగన్ అలాకాకుండా అన్నీ చేశారు కనుకే ఇంత బలంగా ఉన్నారు నుకోవాలి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పనికట్టుకుని ప్రశాంత కిషోర్‌ను తీసుకు వచ్చారన్న అభిప్రాయం ఉంది. ✍️నిజంగా చంద్రబాబుకు ఇష్టమయ్యే ఇలా చేశారా? లేదా లోకేష్ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియదు .కాని జరిగిన హడావుడి చూస్తే ఇదంతా లోకేష్ చేసిన హడావుడినేనని భావిస్తున్నారు. అందువల్లే బహుశా పవన్ కళ్యాణ్ ను కూడా పిలవకుండా వీరు ముగ్గురే భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇదే ప్రశాంత కిషోర్ ను బీహారు డెకాయిటీ అని, కుల చిచ్చు పెడతారని, బీహారు రాజకీయాలు ఇక్కడ నడవవని, ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబు దూషించారు. ✍️అయినా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో నేర్పరి అయిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్‌తో సిగ్గుపడకుండా మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఇది టీడీపీ బలహీనతను చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు రావడం ద్వారా తెలుగుదేశం, జనసేన కూటమికన్నా వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నది తెలిసిందని చెప్పవచ్చు. ఇది కూడా జగన్ కు ఒకరకంగా మంచిదే! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆటలో అరటిపండు అయ్యిందెవరు..?
-
ప్రశాంత్ కిషోర్ ఒక ఈవెంట్ మేనేజర్: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్ కిషోర్ ఒక ఈవెంట్ మేనేజర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 మంది ఎమ్మెల్యేల కంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌కు ముఖ్యం. నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. బీఫామ్ ఇచేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరేనేది నిర్థారణ కాదు. అవసరం అనుకుంటే ఎవరినైనా మార్చవచ్చు. సీటు ఇవ్వలేదని ఇంట్లో కూర్చోం.. పార్టీ జెండా మోస్తాం’’అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నారన్న విషయం నాకు తెలియదు. పార్టీ మారితే స్వయం కృపారాధమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయంటారు అది ఆ ఎమ్మెల్సీ విషయంలో నిజమవుతుంది’’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఈయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది? -
ఈయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది?
‘అబ్బయ్యా పీకే.. నేనెవురో తెలుసునా? నెల్లూరు పెద్దారెడ్డిని! అంటే ఎవురో తెలుసునా? ఆ మటుకు తెలీకుండా నువ్వు వూరూ వాడా ఎగిరెగిరి తిరగతా రాజకీయం ఎట్టాజేస్తండావబ్బా? నెల్లూరు టౌన్లోకొచ్చి ‘అయ్యా పెద్దారెడ్డి గారంటే ఎవరు?’ అని అడిగిసూడు.. పసి పిలకాయగూడా సిటికెలో నీ సెయ్యి బట్టుకోని బరబరా ఈడ్సుకోనొచ్చి నా కాడ నిలబెట్టకపోతే అప్పుడడుగు.. అబయా.. నువ్వేదో వొంటిసేత్తో మాయ జేస్తావని ఎలచ్చన్లలో ఎవురినైనా సరే యిట్టే గెలిపించేస్తావని నీకోసం ఎగబడతా వుంటారంట గదా.. నెల్లూరు కాడికొస్తే.. నీకు మించిన ఫాలోయింగు వుండాదబ్బయ్యా నాకు! పెద్దారెడ్డి యేందంటే.. అదే చెల్లతాది యీడంతా గూడా! అద్సరే గానీ.. అబ్బయ్యా పీకే.. ఏందీ సెంద్రబాబు నిన్నేదో పిలిపించుకోని గుసగుసగా మాట్టాడినాడని జనమంతా చెప్పుకుంటావుండారే. ఏముండాదిలేగానీ.. ఈ ఎలచ్చన్లలో ఎట్టాగైనా సరే.. గెలిసేలా సూడు సామీ అని అడిగుంటాడు అంతే గదా! అవును గానీ అబ్బయ్యా.. నాకో అనుమానం.. ఇయ్యేందో వ్యూహాలూ గట్రా అంటారే.. ఆటిలో ఆయన్ని మించినోడు ఎవుడుండాడబ్బా? అప్పుడెప్పుడో.. మామ కొంప ముంచడానికి ఆ పచ్చ పార్టీలో అడుగుపెట్టడానికి ముందు ఆయన కాంగ్రేసులో ఉండగా ఏం జరిగిందో నీకు తెలుసునా అబ్బయ్యా?. కాంగ్రెసు పార్టీ వోళ్లు పెట్టిన కేండేటునే ఓడించడానికి ఈ యెన్నుపోట్ల యీరాసామి.. అదేనబ్బా.. సెంద్రబాబుకు నేను పెట్టుకున్న ముద్దుపేరులే! ఆయన ఏం జేసినాడో తెలుసునా? సిత్తూరు జడ్పీ చైర్మనుకు ఓట్లెయ్యాల్సినోళ్లందరినీ పట్టకపొయ్యి క్యాంపు బెట్టినాడు. ఆళ్లెక్కడుండారో ఎవ్వుడికీ పోపిడి తెలియనియ్యలా? నడిమద్దెలో.. గుట్టుసప్పుడు కాకుండా కారేసుకోని కేరళకి పొయినాడు. ఓటెయ్యాల్సిన ఒక పెద్దమడిసి అక్కడేదో కేరళోల్ల వైద్యం చేయించుకుంటావుంటే.. ఆయన్ని దువ్వి.. ఇంకో కారులో సరిగ్గా ఓటేసే టయానికి ఆయన వొచ్చేలాగా ఎరేంజిమెంటు జేసినాడు. ఏదైతే ఏంది.. సొంత పార్టీ కాంగిరేసునే ఓడించి.. తన ముఠాని నెగ్గించుకున్నాడు. సెంద్రబాబునాయుడు అంత ముదురు తెలివితేటలు సూపించేనాటికి నువు పుట్టినావో లేదోలే పీకే అబ్బయ్యా. రామారావుకు యెన్నుపోటు యెట్టా పొడిసినాడో ఆ కత యీ నడమ కాలం నాటిదే గదా.. నువ్వు యినేవుంటావులే! యీ దేసెంలో రాజకీయం జెయ్యాలనుకున్న పెతి ఒక్కడూ గూడా.. కుర్సీ ఎక్కాలంటే యెన్ని రకాల అడ్డతోవలుంటాయో తెలుసుకోటానికి జరూరుగా చదవాల్సిన పాటం లాంటిది గదబ్బయ్యా అదంతా! హోటల్లో పట్టుమని పదిమంది లేకపోయినా.. ఓయబ్బో ఎమ్మెల్యేలంతా సెంద్రబాబు గూట్లోనే ఉండారని ఊదరగొట్టేసి.. బయటుండేవోళ్లని బయంలోకి నెట్టేసి.. ఆడకి పరుగెత్తుకొచ్చేలాగా జేసేసి.. ఆపట్నే ఆడ్నించి కదల్నీకుండా కూసోబెట్టేసి.. సివరాకరికి ఎన్టీవోడు వొస్తే.. ఆయన మీద సెప్పులేయించి.. నానా రచ్చా జేసినాడు గదా..! అంతకంటె గొప్ప వ్యూహాలు నువు చెప్పబోతావా నాయినా పీకే అబ్బయ్యా!?. ఆయనకి తెలీని డ్రామాలు, తెలీని కుట్రలు, కొత్త వ్యూహాలు నీబోటోడి వోడికి తెలుస్తాయా సామీ. మొన్నటికి మొన్న ఆయన ఇల్లాలిని యెవురో యేదో తప్పుడు కూత అన్నారే అనుకో.! అలిగినాడు.. ఓకే. అరిసినాడు.. డబలు ఓకే. అంతటితో ఊరుకున్నాడా? అన్నవాడెవడో ఒకమారు అంటే.. ఈ పెద్దమడిసి ఊరూరా తిరిగి వందల తూర్లు జనం ముందర అదే మాట అనుకుంటా తన యింటామె పరువు బజార్లో పెట్టేసిండ్లా? ఎందుకు నాయినా.. అద్ది నాయినా వ్యూహం అంటే.. జనం నించి సింపతీ, జాలి కొట్టేసే కిరికిరి అన్నమాట. అంతకంటె గొప్ప ప్లాన్లు జెప్పబోతావా పీకే అబ్బయ్యా!. ఊరూరా తిరిగేది.. నేను ముసిలోణ్నయిపొయినానూ.. నాకు యీసారి సివరాకరి చాన్సు యియ్యండి.. మిగిలిందీ సగిలిందీ యేమైనా వుంటే అది గూడా దోసుకోని తొంగుంటానూ.. అని పాచిపాటే పాడతా ఉండేది..! చూసినావా పీకే నాయినా! యీన ముసిలోడు అయిపోతే యేందబ్బా..? ముసిలోళ్లకి సివరాకరి చాన్సు ఇయ్యాలని రాజ్యాంగంలో రాసుండాదా యెట్టా? ముసిలోళ్లకి జనం ఎగబడి ఓట్లెయ్యాల్నా యెట్టా? అట్టాగేం లేదు గదా! అయినాసరే, సింపతీకోసం ముసిలి డ్రామా అన్నమాట. ముసిలోడు అయిపోతే.. కిష్ణా రామా అనుకుంటా యింట్లో మనవడితో ఆడుకుంటా ఉండొచ్చు గదా? రాజకీయం కొడుకు చేతికియ్యొచ్చు గదా! నలబైనాలుగేళ్ల ఇండస్ట్రీ అంటాడే.. కొడుకుని చేతగాని దద్దమ్మగా తయారుజేసిన పెద్దమడిసి, తాను తప్పుకోని కొడుకు సేతిలో పార్టీని పెట్టాలంటే జడుసుకునే పెద్దమడిసి.. ఆయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది? యిట్టాగ ఆయనకి తెలియని అయిడియాలు ఏముంటాయి సామీ. నువ్వు ఇప్పుడు ఈ ముసిలాయన సరసకొచ్చి ఏం జెయ్యబోతావు?. అయినా పీకే అబ్బయ్యా.. నిన్ను యెతుక్కుంటా వాకిటకు వచ్చిన బేరాన్ని కాలదన్నుకోటం ఎందుగ్గానీ.. సక్కంగా వాడుకో సామీ! రెండు మూడొందల కోట్లయినా నీ నట్టింట్లో కురవకపోతాయా? లచ్చిందేవి ఎవురికైనా చేదవతాదా? లేదు గదా? కాబట్టి కుమ్మేసుకో! యిక సెంద్రబాబుని సీఎం జేసే సంగతంటావా.. నీకెందుకు రంధి.. జగనన్న యింటి బిడ్డ మాదిరిగా జూసుకునే జెనం తేల్చుకుంటారులే! ఉంటా!!. ✍️:::పెద్దారెడ్డి -
ఇద్దరు పీకేలు...పీకేది ఏమీ లేదు..
-
చంద్రబాబూ.. నువ్వు భయపడుతున్నావ్!
బీహార్ వాడికి ఇక్కడ పనేంటి అంటూ ప్రశాంత్ కిషోర్‌పై గత ఎన్నికల సమయంలో నానా రకాలుగా తూలనాడిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమవడం చర్చనీయాంశమైంది. వ్యక్తులను, పార్టీలను, సంస్థలను అవసరమైనప్పుడు అక్కున చేర్చుకోవడం, అవసరం తీరాక గిరాటెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. విషయం వీక్ అయినప్పుడు.. ప్రచారం పీక్‌లో ఉండాలని నమ్మేవాడు బాబూ.. అంటూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక పీకే సరిపోడు, ఇద్దరు పీకేలు కావాలంటున్నారు బాబు..ఒక వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ జాకీలు పెట్టి లేపితే కానీ కనీస పోటీ ఇవ్వలేమని బాబు ఫీలింగ్. ప్రశాంత్ కిషోర్‌ను బీహార్ డెకాయిట్ అని రకరకాలుగా అనరాని మాటలు అన్న బాబు, లోకేష్‌లు.. ఇదే ప్రశాంత్ కిషోర్ కోసం "పాహిమాం" అంటున్నారంటే జగన్ ఎంత బలంగా ఉన్నారో తెలియడం లేదా?. ప్రశాంత్ కిషోర్ టీంలో ఒకరయిన రాబిన్ శర్మ బాబు కోసం పని చేస్తుంటే ఇంకొకరు రిషి రాజ్ సింగ్ జగన్ కోసం పని చేస్తున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు. కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొని ఇద్దరు పీకేలతో కలసి జగన్‌పై యుద్దానికి వెళ్లాలని వెన్నుపోటు నాయుడు ప్లాన్. అంతే కాకుండా టీడీపీ గెలుస్తుంది అని రోజూ పేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు.. 3,500 మందితో మౌత్ క్యాంపెయిన్ చేయిస్తున్నాడు బాబు.. కులం కోసం బట్టలు చింపుకొనే ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎలానూ ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం.. కోస్తాలో వైఎస్సార్సీపీకి 50 శాతం, టీడీపీకి 35-36 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మిగిలిన 3 -4 శాతం మద్దతు ఉంది. పవన్‌కు 20 సీట్లకు ముంచి ఇవ్వలేమని తేల్చి చెప్పాడు బాబు. దీంతో పవన్ మింగలేక కక్కలేక ఉన్నాడని మొన్న విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగేజ్‌ను చూస్తే తెలుస్తుంది. సీఎం పదవి షేరింగ్ లేకుండా, 60 సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదని కాపు సంఘాలు, కాపు యువత భగ్గుమంటున్నాయి. ఇంకో వైపు సైలెంట్‌గా జగన్ పని చేసుకునిపోతున్నారు. ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ...!! ఇదీ చదవండి: టీడీపీలో వణుకు -
తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం
పాట్నా: సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్ధించడాన్ని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుబట్టారు. తేజస్వీ యాదవ్ పాఠశాలకు ఎప్పుడూ వెళ్లలేదని, కనీసం తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల తేజస్వీ యాదవ్‌కు ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు. తేజస్వీ యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లారో బయటకు వెళ్లడించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఎక్కడ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ను నేర్చుకున్నారో? బహిర్గతం చేయాలని కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినంత అసభ్యకరమైన భాషలో పాఠశాలల్లో లైంగిక విద్య బోధించరని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించిన తీరు ఆయనకు జ్ఞానం లేనివాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న తేజస్వీ యాదవ్.. నితీష్ వ్యాఖ్యలను సెక్స్ ఎడ్యుకేషన్‌గా పేర్కొంటూ.. పాఠశాలల్లో కూడా చర్చిస్తారని అన్నారు. అయితే.. బీజేపీ, మహిళా సంఘాల ఆందోళనలతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. ఇదీ చదవండి: సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు -
వన్ నేషన్-వన్ ఎలక్షన్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే?
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది సభ్యులతో హైలెవల్ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం జమిలీ ఎన్నికల నిర్ణయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిర్ణయం మంచిదైతే ఓకే.. తాజాగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు తన మద్దతు ఉంటుదన్నారు. అయితే, ఇది సరైన ఉద్దేశంతో చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకువస్తే మంచిది అని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ వంటి అతిపెద్ద దేశాలలో సంవత్సరానికి 25 శాతం మంది ఎన్నికలకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఒకే ఎలక్షన్ విధానం తీసుకువస్తే ఇది ఒకటి రెండుసార్లు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించడంతో పాటుగా, ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. బిల్లును ప్రవేశపెట్టనివ్వండి.. ఇదే సమయంలో అసలు ఇది ఏ ఉద్దేశంతో తీసుకువస్తున్నారన్నదే ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రి పరివర్తన తీసుకురావాలని భావిస్తే అది తీవ్ర సమస్యగా మారుతుందన్నారు. ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుంది కాబట్టి, ఆ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశానికి మేలు జరిగే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 వరకు 18 సంవత్సరాల పాటు దేశంలో ఒకేసారి ఎన్నికలు ఎలా జరిగాయో తెలిపారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు అనుకూలంగా పనిచేసే కారణాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. #WATCH | On 'One Nation, One Election', Prashant Kishor says, "If this is done with the correct intentions and there be a transition phase of 4-5 years, then it is in the interest of the country. This was once in effect in the country for 17-18 years. Secondly, in a country as… pic.twitter.com/beTAZqf0Gl — ANI (@ANI) September 4, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) నేత సెంథామిళన్ సీమన్పై తమిళనాడు ఈరోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్పై కేసు నమోదు చేశారు. All those who used fake videos to incite hate & violence must be dealt with as per the law. But this doesn’t absolve those who’re openly calling for violence against #Hindi speaking people in #TN Why no action against likes of @SeemanOfficial for their vitriolic utterances? pic.twitter.com/vyu2EkjBQu — Prashant Kishor (@PrashantKishor) March 10, 2023 కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
'బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ'
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. అదానీ అంశం పార్లమెంటు లో చర్చకు వస్తుందనే కమలం పార్టీ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కాంను బయటకు తీసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అదానీ ఆంశం వల్ల బీజేపికి నష్టం జరుగుతుందనే ఈ చర్చకు తెరలేపారని విమర్శించారు. బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధికోసమే లిక్కర్ స్కాంపై చర్చ జరిగేలా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ మూడోసారి అధికారంలో ఉండాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించాలనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయిని రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ కు కట్టు బానిసలని ఎద్దేవా చేశారు. చిన్నపిల్లాడిని కుక్కులు చంపేస్తే పట్టించుకోలేదు, మహిళలపై దాడులు జరిగితే స్పందిచరు, కానీ కవిత లిక్కర్ స్కాం పై మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్లారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయయని, కవిత అరెస్టు.. తర్వాత రోడుపైకి వచ్చి గొడవలు ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! -
భాయ్ సాహెబ్ ప్రజల గోడు పట్టదా.. తేజస్వీపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు!
బీహార్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. భాయ్ సాహెబ్‌కు ప్రజల గోడు వినే సమయం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి నితీశ్ కుమార్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని రాఘోపూర్ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయాలని నిరసనలకు దిగారు. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కాగా, తమ గ్రామం మీదుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గోడు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ కాన్వాయ్కి లైన్ క్లియర్ చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై నిరసనలు తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో, తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ఆపిన తేజ్వసీ.. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కానీ, రోడ్డు నిర్మాణం గురించి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటూ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. గ్రామస్తుల నిరసనలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాఘోపూర్ ప్రజలు గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో పిల్లలు స్కూల్స్‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద, వరద నీరు నిండిన రోడ్డు మీదుగా బడికి వెళ్లాల్సి వస్తోందన్నారుఉ. రోడ్డు విషయంపై మేమంతా స్థానిక నేతలకు ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ, ఫలితం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. बिहार के CM के बाद अब उनके Deputy की बारी। महोदय के अपने क्षेत्र राघोपुर में पिछले 34 वर्षों से सड़क नहीं बनने से नाराज़ लोग उनके क़ाफ़िले के सामने सड़कों पर लेट गए! काम की बात तो छोड़ दीजिए, भाई साहेब ने गाड़ी से उतर कर लोगों से मिलना तक ज़रूरी नहीं समझा। pic.twitter.com/eyVmlprcHV — Prashant Kishor (@PrashantKishor) January 26, 2023 -
'2025 వరకు ఆగడం ఎందుకు.. ఆయనను ఇప్పుడే సీఎం చేయండి'
పాట్నా: బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ను తేజస్వీ యాదవే ముందుండి నడిపిస్తారని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న ఎన్నికల్లో తేజస్వీ సీఎం అభ్యర్థి అని స్పష్టమైంది. అయితే నితీశ్ వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 2025 దాకా వేచి చూడటం ఎందుకు తేజస్వీకి ఇప్పుడే సీఎంగా బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని నితీశ్‌కు సూచించారు. తేజస్వీ యాదవ్‌ను ఇప్పుడే సీఎం చేస్తే ఆయన పాలనా సామర్థ్యం గురించి ప్రజలందరికీ తెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2025 ఎన్నికల్లో ప్రజలు తమకు ఎవరు కావాలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినందున తేజస్వీని సీఎం చేయడంలో తప్పేం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్ కోమాలో ఉంది : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
బీజేపీతో సంబంధాలపై నితీశ్‌కు పీకే ఛాలెంజ్
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు మంచి మిత్రులు. ఇద్దరు జేడీయూలో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం బద్దశత్రువులుగా మారారు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నితీశ్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్‌లోనే ఉన్నారని పీకే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నితీశ్ తనదైన శైలిలో వీటిని తిప్పికొట్టారు. ఆయన పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడరతారని సెటైర్లు వేశారు. తాజాగా నితీశ్‌కు మరో సవాల్ విసిరారు పీకే. నిజంగా ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలిగినప్పుడు ఆయన మాత్రం ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదని ట్వీట్ చేశారు. ఎప్పుడూ రెండు దారులు ఉండవు నితీశ్ జీ అంటూ సెటైర్లు వేశారు. #NitishKumar ji if you have nothing to do with BJP / NDA then ask your MP to quit the post of Deputy Chairman of Rajya Sabha. You can’t have both ways all the time. — Prashant Kishor (@PrashantKishor) October 22, 2022 నితీశ్ కుమార్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని పీకే అన్నారు. రాజ్యడిప్యూటీ ఛైర్మనే అందుకు నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తానని నితీశ్ చెబుతున్నపటికీ ఆయనను నమ్మలేమని పేర్కొన్నారు. నితీశ్ 17 ఏళ్లు బిహార్ సీఎంగా ఉంటే.. అందులో 14 ఏళ్లు బీజేపీతోనే ప్రభుత్వాన్నిఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ -
బీజేపీతో ఇంకా టచ్‌లోనే.. ఇదే సాక్ష్యం!
పాట్నా: బీజేపీతో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ త్వరలో మళ్లీ బీజేపీ పంచన చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతో కలవనని నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ తాజాగా కౌంటర్ వేశారు. బిహార్‌లోని పశ్చిమచంపారన్ జిల్లాలో పాదయాత్రలో మద్దతుదారులను ఉద్దేశిస్తూ పీకే ప్రసంగించారు.‘బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు!. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ, అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్ ద్వారా నితీశ్ ఇంకా బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు’ అని ప్రశాంత్ పేర్కొన్నారు.‘ప్రశాంత్ ఏం చేయగలడనేది దేశవ్యాప్తంగా సీనియర్ రాజకీయనేతలందరికీ తెలుసు. అదే ఎన్నికల్లో గెలిపించడం ’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గతంలో జేడీ-యూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు అందుకున్న ప్రశాంత్ కిషోర్‌ను.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే కారణంతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత సొంత వేదికతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్న ప్రశాంత్ కిషోర్.. నితీశ్‌పై సూటి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో నితీశ్ సైతం పీకేకు కౌంటర్లు ఇస్తున్నారు. #WATCH | As far as I know, Nitish Kumar is surely with Mahagathbandhan but hasn't closed his channels with BJP, biggest proof is that RS Dy Chairman-JDU MP Harivansh neither resigned from his post nor party asked him to do so: P Kishor (Source: Self-made video by Kishor to ANI) pic.twitter.com/DmMVMZvU84 — ANI (@ANI) October 20, 2022 -
నితీశ్‌కు వయసుమీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు
జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిశోర్ గతంలో తనకు సలహా ఇచ్చాడని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌కు వయసు మీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడు భ్రమలో ఉన్నారని, ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాననే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. 'నితీశ్ మొదట నేను బీజేపీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్‌ను విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారు. ఒకవేళ నేను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఎందుకు చెప్తా?. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తా? ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? నితీశ్ కుమార్ చెప్పిన రెండు విషయాలకు పొంతన లేదు. మీడియాతో ఒకటి చెప్పబోయి ఇంకేదో చెబుతున్నారు. ఆయన చుట్టూ విశ్వాసపాత్రులు ఎవరూ లేరు. అందుకే భ్రమలో ఉన్నారు.' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. చదవండి: మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట -
ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర.. అదే లక్ష్యం!
పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్ జిల్లా నుంచి ఆదివారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో సాగనున్న ఈ పాదయాత్ర.. దేశంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించనున్నారని, సుమారు 12-18 నెలల పాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ యాత్ర సన్నాహంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి బ్రేక్ లేకుండా యాత్రను కొనసాగించేలా ప్రణాళికలు రచించినట్లు పార్టీ తెలిపింది. తూర్పు చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం భిటిహర్వా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు ప్రశాంత్ కిషోర్. అక్కడి నుంచే 1917లో మహాత్ముడు తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ యాత్రను ముఖ్యంగా మూడు లక్ష్యాలతో చేపడుతున్నట్లు పార్టీ తెలిపింది. అందులో క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించటం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావటం, వివిధ రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసుల దాడి.. ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్చ ఇదేనా అంటూ.. -
నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహీర్ సీఎం నితీశ్ కుమార్‌తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. నితీశ్ సర్కార్ బిహార్‌లో ఒక్క ఏడాదిలో 10 లక్షల ముందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలా అయితేనే మహాఘట్బంధన్లో తాను కూడా చేరతానని చెప్పారు. అంతేకాదు రెండో రోజుల క్రితం నితీశ్‌తో తాను భేటీ అయినట్లు ప్రశాంత్ కిశోర్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయినట్లు నితీశ్ బుధవారమే వెల్లడించారు. అయితే ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగానే సమావేశమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరి భేటీని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రశాంత్ కిశోర్‌తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, పాత స్నేహితుడే అని నితీశ్ వ్యాఖ్యానించడం మళ్లీ వీరిద్దరూ జతకడతారా? అనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు పీకే రియాక్షన్ చూస్తుంటే ఇది వాస్తవరూపం దాల్చే సూచనలే కన్పిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఏన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటను వెళ్లి కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడే పీకేతో భేటీ కావడం చూస్తుంటే.. నితీశ్ పెద్ద ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్ -
పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ
పాట్నా: బీహార్ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా పీకే.. నితీశ్ ప్రభుత్వాన్ని, పాలనను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లద్దరు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’ భేటీ అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వీళ్లు మళ్లీ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. అయితే భేటీ సాధారణమైందేనని, ఎలాంటి రాజకీయాల ప్రస్తావన లేదని బయటకు వచ్చాక నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అందుకే కలుసుకున్నాము. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం సాధారణ విషయాలు.. మనం ఇది చేయాలి, అలా చేయాలి అని చర్చించాం. అయినా మేం కలవడం వల్ల నష్టం ఏమిటి?.. ఇంకేమైనా ఉంటే ఆయన్నే అడగండి అంటూ మీడియాకు వివరణ ఇచ్చారు నితీశ్. పనిలో పనిగా ఓ ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు అని సమాధానం ఇచ్చారు. జేడీయూ మాజీ నేత పవన్ వర్మ నితీశ్-పీకే భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. బుధవారం సాయంత్ర పాట్నాలో దాదాపు 45 నిమిషాలపాటు వీళ్లిద్దరి భేటీ జరిగింది. పవన్ వర్మ రెండేళ్ల కిందట జేడీయూకు గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామంతో ఆయన మళ్లీ చేరతారా? లేదంటే పీకే వెంట ఉంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక పీకేతోనూ రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు నితీశ్. ఈ క్రమంలో జన్ సురాజ్ పేరిట ఓ విభాగం ప్రారంభించిన పీకే.. బీహార్‌లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు కూడా. ఇదీ చదవండి: పళనిస్వామికి బిగ్ షాక్ -
TRS Party: పీకే సర్వేతో గులాబీ నేతల్లో గుబులు.. సీఎం కేసీఆర్ హామీతో..
సాక్షి, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈశ్వర్ 2014 నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
నితీశ్ సర్కార్‌కు పీకే బంపరాఫర్
పాట్నా: జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ప్రకటన చేశారు. బీహార్ ప్రజలకు ఇచ్చిన ఒక హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్ క్యాంపెయిన్‌ను ఆపేస్తానని, నితీశ్ సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తానని పేర్కొన్నారాయన. సమస్తిపూర్‌లో బుధవారం తన మద్దతుదారులతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. మహాగట్బంధన్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికల్ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టూరా తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీహార్ యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నితీశ్ కుమార్ కూడా మొన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించారు. ఈ ఇద్దరూ రాబోయే ఏడాది, రెండేళ్లలో తమ తమ హామీని నెరవేరిస్తే చాలూ.. నా జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేస్తా. అంతేకాదు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తా అని మీడియా ముఖంగా తెలిపారు పీకే. ప్రత్యక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపెట్టడం లాంటివి చేస్తుందని జన్ సురాజ్ అభియాన్‌పై గతంలోనే పీకే ఒక స్పష్టత ఇచ్చారు. అయితే నితీశ్ కుమార్‌కు మాత్రం జేఎస్ఏ గుబులు పుట్టిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు! -
2024 ఎన్నికలు: ప్రధాని రేసులో నితీష్ కుమార్.. పీకే హాట్ కామెంట్స్
Prashant Kishor Comments.. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని జేడీయూ చీఫ్ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, నితీష్ కుమార్ వ్యవహారంపై ఎట్టకేలకు జేడీయూ మాజీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ స్పందించారు. బీహార్‌లో గత 10 పదేళ్లుగా రాజకీయ అస్థిరత యుగం కొనసాగుతోందని, ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంతోషంగా కనిపించలేదని తాజాగా బాంబు పేల్చారు. బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఒకరి రాజకీయ లేదా పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయాని అన్నారు. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. అయితే, 2015 కూటమి ప్రభుత్వం , ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం పూర్తిగా వేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొత్త ప్రభుత్వం బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, బీహార్ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానట్టు స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం యువనేత తేజస్వి యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తారని తాను అనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌కు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Next chapter of political instability has started in Bihar: Prashant Kishor on Mahagathbandhan 2.0 https://t.co/TpfqCGGnFM — MSN India (@msnindia) August 10, 2022 ఇది కూడా చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
Prashant Kishor-KCR: కేసిఆర్‌కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలేంటీ?
రాజకీయాల్లో ఎప్పుడు తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు... చివరి బంతి పడేవరకు గెలుపు ఓటముల గురించి ఎవరూ ఊహించలేరు.. ఇది సాధారణంగా రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాటలు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటాబయటా బాగానే చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? దీనిపై అందరి దృష్టి నెలకొంది. ఎవరేమి చెప్పినా అంతిమంగా తాను అనుకునేది చేస్తారనేది కేసీఆర్‌కు మొదటి నుంచి ఉన్న ఇమేజ్. అయితే ప్రశాంత్ కిషోర్ తీరు మరోలా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ అధినేతలకు వ్యూహకర్తగా వ్యవహరించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలంగాణలో ఎలాంటి పాత్రను ఎంతవరకు పోషించబోతున్నారన్న దానిపై రకరకాల అంచనాలున్నాయి. పీకే టీం ఇచ్చే రిపోర్టులను, సలహాలను కేసీఆర్ పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది టిఆర్ఎస్ లో ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారా? అన్నదానిపై భారీగా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ నివేదిక అని ప్రచారంలో ఉన్న అంశాలేంటీ? * కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలి * పార్టీకన్నా ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఎక్కువ * ప్రజలకు అందుబాటులో లేని వాళ్లకు టికెట్లు వద్దు * కొత్త ముఖాలను తీసుకురావాలి * ఇతర రంగాల్లో సక్సెస్ అయి.. ప్రజలకు సుపరిచితులయిన వారి పేర్లను పరిశీలించాలి దుబ్బాక ఎన్నికల నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్పై భారీగా విమర్శలు చేస్తోన్న కమలం నేతలు.. టీఆర్ఎస్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్నది బిజెపి, కాంగ్రెస్ పదేపదే చేస్తున్న ప్రచారం. కర్ణాటక అసెంబ్లీ తో పాటే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తాము ముందస్తు కు వెళ్లే అవకాశం లేదని టిఆర్ఎస్ అధినాయకత్వం చెప్తున్నా ఎక్కడో ఓ మూల ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆ అభిప్రాయం ఇంకా పోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజ్‌భవన్ వర్గాలు గానీ, కేంద్రం గానీ ముందస్తుకు సుముఖంగా లేరన్నది ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రచారం. ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ అసెంబ్లీ రద్దు. ముందస్తు వచ్చినా రాకపోయినా... సాధారణ ఎన్నికలు కూడా అంత దూరంలో ఏమి లేవు. ఈ నేపథ్యంలోనే టికెట్ల అంశంపై ప్రశాంత్ కిషోర్ సర్వేలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తున్న మాట వాస్తవమేనని కేసీఆర్ కూడా ఇప్పటికే అంగీకరించారు. పార్టీ పనితీరు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సర్వేల వివరాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు పై జరుగుతున్న సర్వేలపై మాత్రం ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. కొత్తగా తమ నియోజకవర్గ పరిధిలోకి ఎవరు వచ్చినా సర్వేల పేరిట ఎక్కడైనా సమాచారం ఉన్నా వెంటనే ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తమకు అనుకూలంగా సర్వేలు వచ్చేందుకు నానా తంటాలు కూడా పడుతున్నారు. * ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉంటున్నారా? * ఎమ్మెల్యేకు సమస్యలు చెబితే ఎప్పటిలోగా పరిష్కరిస్తున్నారు? * ఈ సారి ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే గెలుస్తారా? * ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది? ఈ అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సక్సెసైన కేసీఆర్ అప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మెజార్టీ సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఈసారి కూడా అదే ఫార్ములాను అవలంబిస్తారా లేదా అన్నది పార్టీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి జిల్లాలయిన వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాదులలో మార్పులు చేర్పులకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి ఎదురయింది. దెబ్బతిన్న ఈ సెగ్మెంట్ల పై అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఫిర్యాదులు కూడా అందాయి. ప్రశాంత్ కిషోర్ టీం ప్రస్తుతం చేస్తున్న సర్వేల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న కేసీఆర్, కనీసం 30 పైగా సీట్లలో మార్పులు చేస్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 30 మంది ఎవరు అనే విషయం కేసీఆర్‌కు తప్ప మిగతా ఎవరికీ క్లారిటీ లేదని చెబుతున్నారు. కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. పీకే 30 మందికి పైగా సిట్టింగులకు టికెట్ ఇవ్వకూడదని అంటే యధావిధిగా దానిని అమలు చేస్తారా లేక ప్రతికూల పరిణామాలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి. గత రెండు ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు ఎంత అవసరమో ఈసారి ఎన్నికల్లో గెలుపు అంతకన్నా ముఖ్యమైనది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలన్న వాదన చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది. ఈసారి మంచి మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తారన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఇవన్నీ కేసీఆర్ అనుకున్న రీతిలో జరగాలంటే ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న రిపోర్టులు కీలకమనే విషయాన్ని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. -అప్పరసు నరసింహారావు, పొలిటికల్ బ్యూరో చీఫ్, సాక్షి టీవీ -
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్‌లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
పీకే తో సీఎం కేసీఆర్ కీలక చర్చలు
-
ఏం చేద్దాం: పీకేతో సీఎం కేసీఆర్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నారు. -
Prashant Kishor: 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యర్థి పారీ్టల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాలవారీగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్ పరిధిలోని ఇతర ముఖ్య నేతల పనితీరు, గుణగణాలపై టీఆర్ఎస్ లోతుగా వివరాలు సేకరిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం ఈ మేరకు నివేదికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు చేరాయి. మరో 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల 20లోగా తుది రూపు వచ్చే అవకాశముంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మీడియా సంబంధాలపైనా విశ్లేషణ ప్రధాన మీడియా, వాటి ప్రతినిధులతో పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐ ప్యాక్ బృందాలు అంచనా వేస్తున్నాయి. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్ (అంశాలు) అవసరమనే కోణంలోనూ మదింపు జరుగుతోంది. మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారి భాషా పరిజ్ఞానం తదితరాలను కూడా ఐ ప్యాక్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఆ పారీ్టకి ఉన్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల నివేదికలు అందజేసింది. అన్ని వైపుల నుంచీ ఆరా.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐ ప్యాక్ బృందం సేకరిస్తోంది. వైవాహిక స్థితి, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా, ఏయే పదవుల్లో ఉన్నారు? ఎలాంటి పనితీరు కనపరుస్తున్నారు? వంటి కోణాల్లో బృందాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, నేతల ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు?, పార్టీ, సామాజిక కార్యక్రమాల్లో ఎంత మేర చురుగ్గా పనిచేస్తున్నారు? తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలోనూ సమాచార సేకరణ జరుగుతోంది. పార్టీలో అంతర్గత గ్రూపులు, వీటి వెనుక ఉన్న కీలక నేతలు, పార్టీ యంత్రాంగంపై గ్రూపు రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. ఇలావుండగా ఇతర పారీ్టల నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు లేదా ఇతర పారీ్టల్లో బలమైన నేతల వివరాలు కూడా ఈ నివేదికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలను కూడా అంచనా వేస్తున్న ఐ ప్యాక్ బృందాలు ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. -
Sakshi Cartoon: తనింకా పార్టీలో చేరకుండానే ట్రాక్ రికార్డు పాడయిందంటే... మన పరిస్థితి
తనింకా పార్టీలో చేరకుండానే ట్రాక్ రికార్డు పాడయిందంటే... మన పరిస్థితి ఏంటో.. అర్థం కావడం లేదు! -
వామ్మో కాంగ్రెస్.. దానికో దండం: పీకే
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. పాఠాలు నేర్చుకోవడం, తప్పులను దిద్దుకోవడం ఆ పార్టీ చరిత్రలోనే లేదు. అది రాజకీయంగా మట్టికరవడం ఖాయం. వెంటున్న అందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఆ పార్టీ బాసులు తాము మునగడమే గాక అందరినీ ముంచేస్తారు. కాంగ్రెస్‌లో చేరితే నేనూ మునగడం ఖాయం’’ అంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానెప్పటికీ కాంగ్రెస్‌లో చేరబోనంటూ నాటకీయంగా చేతులు జోడించి(దణ్ణం పెట్టి) మరీ చెప్పారు. మంగళవారం బిహార్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో బిహార్ నుంచి పంజాబ్ దాకా కనీసం 11 ఎన్నికల్లో ఎన్నో పార్టీలతో పని చేశాం. ఎక్కడా ఓటమి లేని మా ట్రాక్ రికార్డుకు 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం గండికొట్టింది. అందుకే ఆ పార్టీతో ఇంకెప్పుడూ కలిసి పని చేయొద్దని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో ఇటీవలి చింతన్ శిబిర్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పునరుత్థానానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ పెద్దలకు కొద్ది వారాల క్రితం పీకే ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన పార్టీలో చేరతారంటూ వార్తలు రావడం, అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించడం తెలిసిందే. -
Sakshi Cartoon: చింతన్ శిబిర్ మరొకసారి అవసరం పడుతుందేమో!
చింతన్ శిబిర్ మరొకసారి అవసరం పడుతుందేమో సార్..! -
కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ‘పీకే’ ఆసక్తికర వ్యాఖ్యలు
సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల చింతన్ శిబిర్ నిర్వహించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా మూడు రోజుల పాటు ఈ భేటి జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాహుల్ గాంధీ పాదయాత్రతో సహా ఎన్నికలపై ఫోకస్పెట్టింది. కాగా, కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. పీకే.. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అదో విఫల చింతన్ శిబిర్ అంటూ సటైర్లు వేశారు. ఈ శిబిర్ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు సంభవించవు. ఎప్పటిలాగే అదే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చెందే వరకూ కాంగ్రెస్‌లో ఈ యథాతథ స్థితి ఇలాగే వుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు హ్యాండ్ ఇచ్చారు. గుజరాత్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ సహా మరికొందరు నేతలు హస్తం పార్టీని వీడారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP! — Prashant Kishor (@PrashantKishor) May 20, 2022 ఇది కూడా చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! -
ప్రశాంత్ కిశోర్ కామెంట్‌పై నితీశ్ కుమార్ కౌంటర్
పట్నా: తన పరిపాలనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం తమకు అవసరం లేదని, తమ పాలన గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బిహార్‌లో మేం మేలు చేశామా, లేదా అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. వాస్తవం ఒక్కటే ముఖ్యం. మా పని ప్రజలకు తెలుసు. మా పని తీరు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మీకు తెలుసు కాబట్టి, మీరే సమాధానం ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, మేము వ్యాఖ్యలకు ప్రతిస్పందించాలి. అయితే ఈ సందర్భంలో వాస్తవికత ఏమిటో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాన’ని నితీశ్ కుమార్ అన్నారు. బిహార్‌లో మార్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ప్రారంభిస్తున్నట్టు ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ పాలనలో బిహార్ అంతగా అభివృద్ధి సాధించలేదని అన్నారు. బిహార్‌లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. (క్లిక్: ‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్) నితీశ్ కుమార్‌ను కలవకుండా తప్పించుకోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నితీశ్ కుమార్‌తో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాలు వేరు. కలిసి పనిచేయడం వేరు. ఒక వేళ నితీష్ కుమార్ నన్ను సమావేశానికి పిలిస్తే తప్పకుండా వెళ్తాను. దీని అర్థం అన్ని విషయాల్లో ఆయనతో ఏకీభవిస్తానని కాదు. నితీష్ జీ నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నంత మాత్రాన నాకు ప్రత్యేక రాజకీయ పంథా ఉండకూడదని ఏమీ లేదు కదా’ అని ప్రశాంత్ కిశోర్ సమాధానిమచ్చారు. (క్లిక్: బగ్గా అరెస్ట్.. మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’) -
‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్ సురాజ్ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్ కావడం వల్లనే భవిష్యత్ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్ -
కొత్త ట్విస్ట్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపుగా సంకేతాలిచ్చిన ఆయన.. అవసరమైతే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఒక ట్వీట్ చేశారు. పదేళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణం తర్వాత.. అంటూ ట్వీట్ చేశారు. ఇంతకాలం ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించినట్లు ట్వీట్ చేసిన ఆయన.. ఇక నుంచి జన్ సురాజ్.. (ప్రజలకు సుపరిపాలన) దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ట్వీట్‌తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపు ఖరారు కాగా.. బీహార్ నుంచి తన ప్రయాణం మొదలుపెడుతున్నట్లు తెలిపారు. My quest to be a meaningful participant in democracy & help shape pro-people policy led to a 10yr rollercoaster ride! As I turn the page, time to go to the Real Masters, THE PEOPLE,to better understand the issues & the path to “जन सुराज”-Peoples Good Governance शुरुआत #बिहार से — Prashant Kishor (@PrashantKishor) May 2, 2022 ఇదిలా ఉంటే.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం పెద్ద ఎతున్న నడిచింది. అయితే ఆఖర్లో కీలక పదవికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి విముఖత వ్యక్తం కావడం, ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్ ఆయనకు ఆఫర్ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన చేయడం గమనార్హం. చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం చెప్పిన పీకే -
థర్డ్ ఫ్రంట్‌పై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిలీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ థర్డ్ ఫ్రంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ బీజేపీని ఓడించలేవని అన్నారు. కమలదళాన్ని గద్దెదించాలనుకునే ఏ పార్టీ అయినా.. రెండో ఫ్రంట్‌గా అవతరించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ఫస్ట్ ఫ్రంట్ అనుకుంటే.. వారిని ఎదుర్కొనేందుకు రెండో ఫ్రంట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడో ఫ్రంట్‌గా రూపుదిద్దుకునేందుకు సహకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు పీకే జవాబిచ్చారు. మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. కాంగ్రెస్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఆజ్‌తక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు తన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆ పార్టీ పెద్దలతో కలిసి సమాలోచనలు చేశామని అన్నారు. ఆ పార్టీలో ఎందరో తలపండిన నేతలున్నారని.. సంస్కరణలు వారే సొంతంగా చేపట్టాలని పీకే పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించినప్పటికీ తిరస్కరించానని చెప్పారు. పార్టీ మేలు ఏమేం చేస్తే బాగుంటుందో.. ముందుగా అనుకున్న బ్లూ ప్రింట్ కార్యరూపం దాల్చాలని ఆయన ఆకాక్షించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదని పీకే వ్యాఖ్యానించారు. అయితే, పార్టీ బలోపేతానికి భారీ మార్పులు మాత్రం అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేది ఎవరో తెలియదని, రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని చెప్పారు. -
Sakshi Cartoon: మనవాళ్లకు ధైర్యం లేకనే కదా..!
మనవాళ్లకు ధైర్యం లేకనే కదా ఆయనను తీసుకోమన్నది! -
Prashant Kishor: పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు
ఢిల్లీ: జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ.. కథనాలు జాతీయ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వం గురించి ప్రతిపాదనేం చేయలేదని చిదంబరం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. చాలా నెలలు కష్టపడి ఆయన(పీకేను ఉద్దేశిస్తూ) డాటా సేకరించారు. దానిపై ఆయన విశ్లేషణ.. ఆకట్టుకునేలా ఉంది. ఆ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా ఆచరించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కూడా’ ఆయన చిదంబరం స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై పీకే తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించలేదు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రియాంక పేరు ప్రతిపాదించిన విషయం నేను వినలేదు. అది నిజం కాదు కూడా. ఓ వర్గం మీడియా దానిని తెర పైకి తీసుకొచ్చింది. నాయకత్వ సమస్య పార్టీ అంతర్గత విషయం. ఏఐసీసీనే దానిని పరిష్కరిస్తుంది. ఆగష్టు చివరినాటికి ఎన్నికలతో ఆ సమస్య పరిష్కారం కావొచ్చు అని చెప్పారు. ఇక పార్టీ చేసిన ప్రతిపాదనను నిరాకరించిన విషయంపై పీకేను మళ్లీ వివరణ ఏమీ కోరలేదని, బహుశా ఆయన రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాడేమోనని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఐ-పీఏసీ(Indian Political Action Committee)(ప్రశాంత్ కిషోర్ స్థాపించిన కన్సల్టెన్సీ) చేసుకున్న ఒప్పందం వల్లే పీకే, కాంగ్రెస్‌లో చేరలేదన్న వాదనలో అర్థం లేదని చిదంబరం పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే- ప్రశాంత్ కిషోర్ -
ప్రశాంత్ కిషోర్ సేవలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు. మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారు. రేపు టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదం. మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నాం. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళా భాగస్వామ్యం అత్యధికం. ప్రజలు టీడీపీ చేసే నిరసనలు నమ్మరు' అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (టీడీపీలో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు కలకలం) -
అందుకే కాంగ్రెస్‌లో చేరడం లేదు: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. పార్టీలో చేరి బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అందించిన ఆఫర్‌ను పీకే తిరస్కరించారు. కాంగ్రెస్‌లో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024 సభ్యుడిగా చేరి, ఎన్నికలకు బాధ్యత వహించాలనే ప్రతిపాదనకు కూడా ఆయన నో చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చే ప్రత్యేక బాధ్యతలు తనకొద్దని, వాళ్ల చట్రంలో తాను ఇమడలేనని అన్నారు. ఈ మేరకు పీకే ట్విటర్లో స్పందించారు. వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తనకన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో తాను చేరడం, చేరకపోవడం అంత ముఖ్యం కాదని, కాంగ్రెస్‌లో పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగడం ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదని అన్నారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు తెలిపారు. చదవండి👉 ఎంపీ నవనీత్‌కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్ I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections. In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms. — Prashant Kishor (@PrashantKishor) April 26, 2022 -
కాంగ్రెస్‌కు బిగ్ షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్‌ను పీకే నిరాకరించారు. తాను పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్రువీకరించారు. పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల పీకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అంతేగాక కాంగ్రెస్‌లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు. Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party. — Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022 -
Sakshi Cartoon: పీకే టీమ్
-
ఏమవుతోందో ఏమో!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం నేప థ్యంలో రాష్ట్రానికి వచ్చిన పీకే రెండురోజుల పాటు సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరపడం, టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు రావడంతో ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. పీకే కాంగ్రెస్‌లో చేరి ఆయనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే రా ష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తేలేవరకూ టెన్షనే.. పీకే, టీఆర్ఎస్ల మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో ధ్రువీకరణ అయ్యేవరకు నమ్మే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి కేడర్ భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఈ విషయంలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేయరని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలు పు కోసమే ఆయన పనిచేస్తారని కొందరు నేత లు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇది టీఆర్ఎస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనమని అంటూనే పీకే విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని మీడియాతో చెప్పారు. రాష్ట్ర స్థాయి నేతలు పైకి ఏం చెబుతున్నా లోలోపల మాత్రం వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోందనేది బహిరంగ రహస్యం. ఏమీ అర్ధం కావడం లేదు.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికీ ఏమీ అంతుపట్టడం లేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ఢిల్లీలో సమావేశమైనప్పటికీ పీకే చేరే అంశంపై ఏమీ తేల్చకుండా సమావేశం ముగించడం గందరగోళాన్ని మరింత పెంచింది. ఏది ఏమైనా వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పే విధానాన్ని బట్టి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. -
కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఓకేనా..? సీనియర్ల షరతులేంటి?
సాక్షి, న్యూడిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో 12మందికిపైగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై విస్తృతస్థాయిలో చర్చించారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి, సమస్యల పరిష్కానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024 అనే కమిటీని సోనియా ఏర్పాటు చేశారు. సోనియా నివాసంలో మూడుగంటలపాటు జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ పార్టీలో చేరితే, ఏం బాధ్యతలు అప్పగించాలనే విషయంపైనా చర్చ జరిగింది. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై మెజార్టీ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని కాంగ్రెస్ సీనియర్లు షరతులు పెట్టారట. దీనిపై తుదినిర్ణయం సోనియాగాంధీదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై ఇప్పటికే రచ్చ మొదలైంది. చదవండి👉 పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి రాష్ట్రాల ఇంఛార్జ్‌లుగా ఉన్న కొందరు జనరల్ సెక్రటరీలు పీకే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులపై ప్రశాంత్ కిశోర్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రాల్లో ఇంఛార్జ్‌లుగా ఉన్నవారు కొందరికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కుండబద్దలు కొట్టారంట పీకే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైందని దీనిని బట్టి తెలుస్తోంది. ఇదిలాఉండగా.. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిరం జరగనుంది. దేశవ్యాప్తంగా 400మంది కాంగ్రెస్ నేతలు ఈ భేటీకి హాజరవుతారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, అధ్యక్ష ఎన్నికలు సహా వివిధ అంశాలపై చింతన్ శిబిరంలో చర్చిస్తారు. చింతన్ శిబిరానికి తేదీలు ఖరారైన నేపథ్యంలో ఈ లోపే పార్టీలో పీకే చేరికపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి కాంగ్రెస్ షరతులకు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. చదవండి👉 పీకే టీమ్‌కు ఓకే.. -
టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ టెన్షన్
న్యూఢిల్లీ: టీఆర్ఎస్తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేయడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్‌కు స్నేహం హస్తం అందిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్తో పనిచేయడానికి పీకే సుముఖత వ్యక్తం చేయడం టీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. దీనిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ చెప్పిందే శిరోధార్యమని చెబుతున్నప్పటికీ పీకే విషయం మాత్రం వారికి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటామని టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే స్పష్టం చేయగా,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీఆర్ఎస్తో పీకే కలయికను ఉద్దేశించి ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ‘నీ యొక్క శత్రువుతో ఎవరైతే స్నేహం చేస్తారో వారిని ఎప్పుడూ నమ్మలేం’, అని ఒక ట్వీట్లో పేర్కొనగా, ‘ఆశ వదులుకోవద్దు’ అంటూ మరొక ట్వీట్ చేశారు. మరొకవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సోనియా నివాసంలో జరిగే భేటీకి పీకే హాజరుకానున్నారు. కాంగ్రెస్‌లో పీకే చేరిక, నిర్వర్తించాల్సిన బాధ్యతపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీకే ప్రతిపాదనల్లో భాగంగా నియమించిన కమిటీతో కూడా సోనియా సమావేశం కానున్నారు. ఈ భేటీ కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం పాల్గొననున్నారు. చదవండి👉: పీకే టీమ్‌కు ఓకే.. -
పీకే టీమ్‌కు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్)’తో టీఆర్ఎస్ కలిసి పనిచేయడం ఖాయమైంది. ఐప్యాక్ సేవలు పొందేందుకు అవసరమైన అంశాలపై లోతుగా చర్చించిన టీఆర్ఎస్ పెద్దలు, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్.. ఒప్పందంపై ఆదివారం సంతకాలు చేశాయి. రెండేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ త్వరలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై కేసీఆర్, పీకే మధ్య లోతుగా చర్చ జరిగినట్టు తెలిసింది. రెండు రోజులుగా.. శనివారం ఉదయమే ప్రగతిభవన్‌కు చేరుకున్న ప్రశాంత్ కిషోర్.. ఆ రోజంతా కేసీఆర్‌తో చర్చించారు. రాత్రికి ప్రగతిభవన్లోనే బస చేశారు. ఆదివారం ఉదయం నుంచీ తిరిగి చర్చలు జరిగాయి. ఇందులో కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరినా ఐప్యాక్ బృందం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్కు అవసరమైన సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఐప్యాక్‌కు దూరంగా ఉంటారని తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకు ముందు సీఎం కేసీఆర్ కూడా.. పీకే తనకు ఏడెనిమిదేళ్లుగా మిత్రుడని, ఆయన డబ్బు తీసుకుని పనిచేయరని, దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అని కితాబునిచ్చారు కూడా. వ్యవస్థాపక దినోత్సవం నుంచి మొదలు ప్రగతిభవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించారు. ప్రధానంగా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్, పీకే చర్చించినట్టు తెలిసింది. గతంలో ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో రెండు రోజుల పాటు బసచేసిన ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ నుంచి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఇన్పుట్స్ తీసుకున్నారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలు, నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ బలం, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు తదితరాలను ఐప్యాక్ మదింపు చేసి నివేదిక రూపొందించింది. ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, ప్రతిపాదనలను ఈనెల 27న జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి అమలుచేసే దిశగా కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రగతిభవన్‌లో చర్చలు ముగిశాక ఆదివారం సాయంత్రం పీకే ఢిల్లీకి బయలుదేరగా.. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పార్టీ నుంచి వివరణ లేదు పీకే అంశంపై పార్టీ నుంచి మాకు ఏ వివరణ అందలేదు. ఊహాగానాలపై చర్చ అవసరం లేదు. మీడియా కథనాలపై స్పందించలేం. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం. – విలేకరులతో ఉత్తమ్, భట్టి మా పరిధిలోకి రాదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అంశం మా పరిధిలోకి రాదు. కానీ కాంగ్రెస్‌లో చేరతానని చెప్పిన పీకే.. టీఆర్ఎస్ నేతలతో కలవడం వల్ల సహజంగానే కొన్ని అనుమానాలు వస్తాయి. పీకే విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అందులో గందరగోళం లేదు. – జగ్గారెడ్డి -
కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) సేవలు తీసుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనా కూడా.. ఐప్యాక్ సేవలను టీఆర్ఎస్ వినియోగించుకోబోతోంది. ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలు సూచనలు, ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ రాతపూర్వక ఒప్పందం చేసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 ‘టీఆర్ఎస్ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’ కేసీఆర్– పీకే.. సుదీర్ఘంగా భేటీ: ప్రశాంత్ కిశోర్ శనివారం ఉదయం 9.30 గం. ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారు రోజంతా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య ఒప్పందం జరిగాక.. ఆదివారం సాయం త్రం లేదా సోమవారం ప్రశాంత్ కిశోర్ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్టు తెలిసింది. ప్రచారం, సర్వేలతో.. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థకు సర్వేలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా వ్యూహరచన అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. దీనికితోడు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల పనితీరుపై విశ్లేషణలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన, రాష్ట్రంలో వివిధ పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఐప్యాక్ శాస్త్రీయ సమాచారాన్ని, విశ్లేషణలను అందిస్తుందన్న ఉద్దేశంతో పీకేతో ఒప్పందానికి టీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఒప్పందం తర్వాత ఐప్యాక్ బృందం నేరుగా టీఆర్ఎస్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి👉🏼 నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్ -
నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్
సనత్‌నగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనకు చెప్పినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. టీఆర్ఎస్ అధికారానికి దూరమవుతుందనే కేసీఆర్ చెంత నుంచి ‘పీకే’జారుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ 2008లో కేసీఆర్ తనను కలిసి తెలంగాణకు మద్దతు కోరగా ఇచ్చానని చెప్పారు. చదవండి👉🏾 వరంగల్ నుంచే కేసీఆర్ చీడ వదిలిద్దాం కానీ టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్తా ప్రస్తుతం రూ. 4.12 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని పాల్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కుల, మత, కుట్ర రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి మార్పు తీసుకొద్దామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని.. చారిటీ నుంచి రూ. 7,500 కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేస్తాన్నారు. చదవండి👉🏻 ‘బీజేపీ బుల్డోజర్’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్ -
600 స్లయిడ్‌లతో ‘పీకే’ ప్రణాళిక
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వరుస ఓటములతో కుదేలైన హస్తం పార్టీకి జవసత్వాలు తొడిగేందుకు ఆయన తనదైన ప్రణాళిక రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకులతో వరుస మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు వారాల్లో మూడో పర్యాయం సోనియా గాంధీతో భేటీలు నిర్వహించారు. బేషరతుగా ఆయన తమ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ 2.0 ప్రణాళికను పీకే టీమ్ తయారు చేసినట్టు తెలుస్తోంది. 600 స్లయిడ్‌లతో కూడిన ఈ ప్రణాళికను ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలెవరూ చూడలేదని.. సోనియా కుటుంబ సభ్యులకు మాత్రమే సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రణాళికలో ఏయే అంశాలు పొందుపరిచారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే గతంలో ప్రతిపాదించిన అంశాలే కాంగ్రెస్ 2.0 ప్రణాళికలోనూ ఉండే అవకాశముందని పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 1984 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పతనాన్ని ప్రస్తావిస్తూ, అందుకు గల కారణాలను ప్రణాళికలో పేర్కొన్నట్టు సమాచారం. వారసత్వ ముద్ర, వ్యవస్థాగత లోపాలు, ప్రజలకు చేరువకాలేకపోవడం, విజయాలను నిలబెట్టుకోలేకపోవడం వంటి అంశాలను ప్రధానంగా స్పృశించినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వ ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగాలని.. రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా నియమించాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ నాయకత్వం నిర్దేశించిన విధంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయడానికి గాంధీయేతర కుటుంబానికి చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ చేయాలని పేర్కొన్నారు. పార్టీ పదవులన్నింటికీ నిర్ణీత పదవీ కాలం ఉండాలన్నారు. (క్లిక్: జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత) పొత్తులపై స్పష్టమైన వైఖరి, పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడటం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో బలమైన సంస్థాగత సైన్యం, మీడియా, డిజిటల్ ప్రచారానికి పటిష్టమైన యంత్రాంగం కావాలని ప్రణాళికలో సూచించినట్టు సమాచారం. వారసత్వ రాజకీయాలను నియంత్రించడానికి ‘ఒక కుటుంబం, ఒక టికెట్’ విధానం అమలు చేయాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 2.0 ప్రణాళికలో ఇవే అంశాలు ఉంటాయా, ఇంకా ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది తొందరలోనే తెలిసే అవకాశముంది. (క్లిక్: ప్రశాంత్ కిషోర్ అంటేనే ఓ బ్రాండ్) -
Sakshi Cartoon: ...ప్రశాంత్ కిశోర్లోకి కాంగ్రెస్ కాదయ్యా!!
...ప్రశాంత్ కిశోర్లోకి కాంగ్రెస్ కాదయ్యా!! -
Prashant Kishor: టార్గెట్ 370! కాంగ్రెస్ ముందు పీకే బ్లూప్రింట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వరుస ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కాలూచెయ్యీ కూడదీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే నేతలతో వరుస భేటీలు జరుపుతూ వారి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కాంగ్రెస్ అధిష్టానం శనివారం కీలక సమావేశం జరిపింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా 370 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగాలని, మిగతా చోట్ల పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవస్థాగతంగా చేసుకోవాల్సిన మార్పుచేర్పులతో కూడిన బ్లూ ప్రింట్‌ను నేతల ముందు ప్రజెంట్ చేశారు. దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. పీకే సూచనల్లోని సాధ్యాసాధ్యలపై వారం రోజుల్లో తుది నివేదిక అందించాలని ఆదేశించారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పీకేను ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు సమాచారం. అందుకాయన సానుకూలంగా స్పందించారని, త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. పీకే ‘కలి’విడి’ వ్యూహం సోనియా–పీకే భేటీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్‌సింగ్, అంబికా సోని, అజయ్‌మాకెన్ కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పట్నుంచే దూకుడుగా సిద్ధం కావాలని పీకే చెప్పారు. ‘‘ఇందుకోసం 365 నుంచి 370 లోక్‌సభ స్థానాలపై పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. వాటిలో ఒంటరిగానే పోటీ చేయాలి. మిగతా చోట్ల గెలిచే పార్టీలతో స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిషాల్లో ఒంటరిగా బరిలో దిగాలి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో పొత్తులతో ముందుకు పోవాలి’’ అన్న సూచనలకు రాహుల్ సహా నేతలంతా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పీకే ప్రజెంట్ చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం సాధించే మార్గాలపై నిర్మాణాత్మక సూచనలు చేశారు. చదవండి: ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు ‘కమ్యూనికేషన్’ సమూలంగా మారాలి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధిష్టానానికి పీకే సూచించారు. ‘‘కమ్యూనికేషన్ విభాగంలో సమూల మార్పులు అవసరం. కమ్యునికేషన్ వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి’’ అని చెప్పడంతో పాటు కొత్త పంథాలో ప్రజలకు చేర్చే వ్యూహాలనూ వివరించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా సోనియా సహా ముఖ్య నేతలంతా ఈ సందర్భంగా పీకేను కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్సల్టెంట్‌గా కాకుండా పార్టీలో చేరి నేతగా పని చేయాలని కోరగా పీకే సానుకూలంగా స్పందించారని నేతలంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై పీకే సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని వేణుగోపాల్ చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. అది వారంలో నివేదిక ఇస్తుంది’’ అని వివరించారు. పీకేను కాంగ్రెస్ చేరాల్సిందిగా కోరిన మాట నిజమేనా అని ప్రశ్నించగా వారంలో అన్నీ తెలుస్తాయని వేణుగోపాల్ బదులిచ్చారు. పీకే బ్లూప్రింట్‌పై రాజస్తాన్‌లో జరిగే కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లోనూ చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. 2020లో జేడీ (యూ)లో చేరిన పీకే, పౌరసత్వ (సవరణ) చట్టంపై పార్టీ వైఖరితో విభేదించి బహిష్కరణకు గురవడం తెలిసిందే. చదవండి: పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త.. -
Sakshi Cartoon: పర్మినెంటుగా పార్టీలోనే పెట్టుకుందాం మేడం!
పర్మినెంటుగా పార్టీలోనే పెట్టుకుందాం మేడం! అలా అయితేనే అధికారం చేపట్టగలం! -
ప్రశాంత్ కిషోర్‌తో తమిళ స్టార్ హీరో భేటీ.. పోలిటికల్ ఎంట్రీకీ సంకేతమా?
దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? సాధ్యాసాధ్యాలను బేరిజువేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారా ? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. రానున్న (2024) లోక్‌సభ ఎన్నికల్లోగా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని, పార్టీని స్థాపించాలని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్న తరుణంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో నటుడు విజయ్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని నటుడు విజయ్‌కు ఎంతోకాలంగా ఉంది. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కూడా ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే ‘ ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయడం, కుమారుడి ఒత్తిడితో ఉప సంహరించడం కూడా జరిగిపోయింది. తన రాజకీయ ప్రవేశంపై తండ్రి ప్రదర్శిస్తు న్న దూకుడు సినీ జీవితాన్ని దెబ్బతీస్తుందనే కారణంగా ఆ ప్రయత్నాలకు విజయ్ అడ్డుకట్టవేశారు. అయితే, ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్ మక్కల్ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. వారందరినీ విజయ్ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. ఈ తరుణంలోనే విజయ్ మదిలో క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలు తలెత్తాయి. (చదవండి: Allu Arjun - Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో బన్ని..! ) ప్రశాంత్ కిషోర్‌తో భేటీ హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్, ప్రశాంత్ కిషోర్ రహస్యంగా సమావేశమై రాజకీయ చర్చలు సాగించడం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై విజయ్ సన్నిహితుడు మాట్లాడుతూ.. ‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడింది, ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది. కరుణానిధిపై ధ్వేషం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ భవిష్యత్తు ఏంటోనని అన్నాడీఎంకే నేతలు కలతచెందుతున్నారు. అలాగని డీఎంకేలో చేరేందుకు వారు ఇష్టపడటం లేదు. బీజేపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెడితే అన్నాడీఎంకే శ్రేణులు కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు రజనీకాంత్ పార్టీ ఏర్పాటు అటకెక్కడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు, అభిమానులు డీఎంకేలో చేరారు. మరికొందరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి బరిలోకి దిగితే కనీసం 10 శాతం ఓట్లు సాధించి డీఎంకే, అన్నాడీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ నాయకత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను విజయ్ కలుసుకున్నారు. మక్కల్ ఇయక్కం కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా గమనిస్తున్నాయి. విదేశీ కారు దిగుమతికి సంబంధించి కోర్టులో విజయ్ వేసిన పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వం స్పందించడంతోపాటు జరిమానా విధించి కేసును కొట్టివేయాల్సిందిగా వాదించింది. విజయ్ ప్రతిష్టను దెబ్బతీసేలా డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి విజయ్ వస్తున్నట్లు ఉదయనిధి అనుచరవర్గం, డీఎంకే ఆందోళన చెందుతోందని తాము భావిస్తున్నట్లు’ వివరించారు. కాగా పార్టీ ఏర్పాటుపై విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి పి.ఆనంద్ కార్యాచరణలోకి దిగినట్లు తెలుస్తోంది. విజయ్ మరో రజనీకాంత్ అయితే తమిళ సినీపరిశ్రమలోని వారు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ స్థాపనలో విజయ్ మరో రజనీకాంత్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వందశాతం విజయం సాధించగలమనే నమ్మకం ఉంటేనే రాజకీయాల్లోకి వెళ్లాలి, లేకుంటే ఈ ప్రచారాలను సినిమాకు వాడుకోవచ్చని నటుడు రజనీకాంత్ లాగే విజయ్ కూడా భావించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్, విజయ్‌ల భేటీ అని సినీ వర్గాలు చమత్కరిస్తున్నాయి. -
Sakshi Cartoon: అసలు యుద్ధం 2024లో
ఇదే ఇంత ఎఫెక్ట్‌గా ఉంటే అప్పుడెలా ఉంటుందో సార్! -
దేశవ్యాప్తంగా ‘తెలంగాణ మోడల్’
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడుమ శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరిగాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు శనివారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్ ప్రాజెక్టు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించిన పీకే, ఆ తర్వాత కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తిరిగి ఆదివారం ఉదయం కూడా ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రితో పీకే భేటీ కొనసాగినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ‘గుజరాత్ మోడల్’అంటూ అక్కడి అభివృద్ధిపై చేసిన విస్తృత ప్రచారం మోదీ, బీజేపీకి దేశవ్యాప్తంగా మేలు చేసిన విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో గుజరాత్‌ను మించి, దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో వాటిని ప్రచారం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘తెలంగాణ మోడల్’పేరిట ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో దేశంలో ‘తెలంగాణ మోడల్’ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు. దిద్దుబాటుపైనా పీకే సూచనలు టీఆర్ఎస్ పార్టీతో జట్టు కట్టిన ప్రశాంత్ కిషోర్ బృందం కొద్దిరోజులుగా రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, సంస్థాగతంగా టీఆర్ఎస్ పరిస్థితిని మదింపు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చేసిన సర్వేల వివరాలు, చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై తన అభిప్రాయాలను సీఎంతో పీకే పంచుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్కు ప్రాచుర్యం కల్పించడానికి (ప్రొజెక్ట్ చేయడం) మరికొన్ని సూచనలు కూడా పీకే చేశారు. కాగా రాబోయే రోజుల్లోనూ వ్యూహరచనకు అవసరమైన సమాచారం కోసం ప్రశాంత్ కిషోర్ క్షేత్ర స్థాయిలో అడపాదడపా పర్యటించే అవకాశముందని సమాచారం. ఇటీవలి ముంబై పర్యటనలో కేసీఆర్ వెంట ఉన్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా పీకే, సీఎం సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: టీఆర్ఎస్ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది! -
ప్రశాంత్ కిషోర్ సర్వేతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మొదలైన గుబులు
-
బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఐదు నెలలపాటు చర్చలు జరిపానని, కానీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. ఒక సంస్థగా కాంగ్రెస్ పట్ల తనకు గౌరవభావం ఉందన్నారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యం కాదని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్‌కు అంత శక్తి లేదని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో పునర్వ్యవస్థీకరణ అవసరమని చెప్పారు. కాంగ్రెస్‌లో తాను చేరాలనుకోవడం కేవలం ఏదో ఒక ఎన్నికల కోసం కాదని, పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని తాను భావించానని చెప్పారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో చేరికపై దాదాపు రెండేళ్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆ సమయంలో చాలామంది తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననే భావించారన్నారు. కానీ ఇందుకు ఇరు పక్షాలు పరస్పర విశ్వాసంతో ఒకడుగు ముందుకు వేయాల్సిఉందని, కాంగ్రెస్‌తో అలా జరగలేదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తనకు చేదు అనుభవమని, అప్పటినుంచి కాంగ్రెస్‌లో చేరడంపై సందేహంగానే ఉన్నానని చెప్పారు. అలాగే తాను పూర్తిస్థాయిలో విశ్వాసపాత్రుడిగా ఉండనని కాంగ్రెస్ భావించిఉండవచ్చన్నారు. (చదవండి: బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల) ఇలా సాధ్యం.. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, 2024లో ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. 2024లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించేందుకు తాను సాయం చేయాలని భావించానని చెప్పారు. అయితే ఇందుకు ప్రస్తుత పార్టీలు, నాయకత్వాలు, కూటములు పనికిరావని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పార్టీలు కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు చేసుకుంటే బీజేపీని ఓడించవచ్చని, ఇందుకోసం కొత్తగా ఒక జాతీయస్థాయి పార్టీ పుట్టుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. దాదాపు 200 సీట్లున్న బీహార్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి దక్కినవి కేవలం 50 సీట్లేనని గుర్తు చేశారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లోని 350 సీట్లలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని, అందుకే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు సర్దుబాట్లు, వ్యూహాలతో వ్యవహరించి పైన చెప్పిన 200 సీట్లలో 100 సీట్లను కొల్లగొడితే ఇప్పుడున్న సీట్లతో కలిపి ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 200– 250ని చేరుతుందన్నారు. అప్పుడు బీజేపీని ఓడించేందుకు ఉత్తరాన లేదా పశ్చిమాన మరో 100 సీట్లు గెలిస్తేచాలన్నారు. ఈ వ్యూహంతో 2024లో ప్రతిపక్షాలకు సాయం చేయాలని తాను భావించానని ప్రశాంత్ చెప్పారు. ఆ మూడే బలం.. హిందుత్వ, అతి జాతీయవాదం, సంక్షేమాన్ని జతకలిపి బీజేపీ బలమైన ఆయుధం తయారు చేసుకుందని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. వీటిలో కనీసం రెండిటి విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు నమ్మకం కలిగిం చాల్సిఉందన్నారు. ఇది చేయకుండా మహా కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిపొత్తులు పెట్టుకున్నా ఉపయోగం ఉండదన్నారు. దేశంలోని ఎంపీ సీట్లలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్– బీజేపీ మధ్యనే పోటీ ఉందని, వీటిలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ దాదాపు 95 శాతం సీట్లు గెలుస్తోందని గుర్తు చేశారు. రాబోయే రాష్ట్రాల ఎన్నికలను 2024కు సూచికగా పరిగణించాల్సిన అవస రం లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవచ్చని చెప్పారు. యూపీలో బీజేపీపై గెలవాలంటే సోషల్ బేస్‌ను విస్తరించుకోవాలని సూచించారు. బీజేపీని ఓడించాలనుకునే పార్టీ లేదా నాయకుడికి కనీసం 5– 10ఏళ్లకు సరిపడా వ్యూహరచన ఉండాలని, ఐదు నెలల్లో అద్భుతాలు జరగవని చెప్పారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నదే తన అభిమతమన్నారు. టీఎంసీకి సాయం చేయడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, కాంగ్రెస్‌పై కక్షతో టీఎంసీకి సాయం చేశాననడం సరికాదని తెలిపారు. ఒక బడా పార్టీపై కక్ష కట్టే శక్తి తనకు లేదని, తను చాల చిన్న వ్యక్తినని చమత్కరించారు. (చదవండి: స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’) -
కాంగ్రెస్‌లో ప్రతిఒక్కరం ప్రశాంత్‌కిశోర్‌లమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్‌కిశోర్ అవసరమే లేదని, గాంధీభవన్‌కు వచ్చి చూస్తే అక్కడ ఎంతమంది ప్రశాంత్‌కిశోర్‌లు ఉన్నారో తెలుస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియాహాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రశాంత్‌కిశోర్‌తో సమానమన్నారు. ప్రశాంత్‌కిశోర్ కనీస పరిజ్ఞానం లేకుండా తమ పార్టీ నేత రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీది మూడోస్థానమేనని అన్నారు. బీజేపీనే కాదు బీఎస్పీ కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాలెలా ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు దోస్తానా ఉండదని, ఉండేది కొట్లాటేనని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో 230 ఓట్లున్న తమను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని, అందుకే తామేదో చేస్తున్నామంటూ ఫిర్యాదు చేస్తోందని అన్నారు. -
కాంగ్రెస్‌కు రాహులే పెద్ద సమస్య
పనాజీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీరును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయనే పెద్ద సమస్యగా మారారని చెప్పారు. రాహుల్ భావిస్తున్నట్లుగా అధికార బీజేపీకి, నరేంద్ర మోదీ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చిచెప్పారు. గోవా రాజధాని పనాజీలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ వీడియో దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌కు, ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి అవగతమవుతోంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు సీనియర్లు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లపాటు కాంగ్రెస్ హవా చెలాయించినట్లుగా... బీజేపీ సైతం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు దేశ రాజకీయ యవనికపై కచ్చితంగా కేంద్ర స్థానంలో కొనసాగుతుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం రాహుల్ గాంధీకి మాత్రం అర్థం కావడం లేదని, అదే ఆయనతో సమస్య అని చెప్పారు. ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 30 శాతానికిపైగా ఓట్లు దక్కించుకునే పార్టీకి అప్పటికప్పుడు వచ్చే ప్రమాదమేదీ ఉండదని వివరించారు. అందుకే ప్రధాని మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు పదవీ గండం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఒకవేళ ప్రజలు మోదీని పదవి నుంచి దించేసినా, బీజేపీ రాబోయే కొన్ని దశాబ్దాలపాటు అధికారం కోసం ఎన్నికల్లో పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ‘‘నరేంద్ర మోదీ బలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయనను ఓడించడం సాధ్యం కాదు’’అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు. Eventually, Prashant Kishor acknowledged that BJP will continue to be a force to reckon with in Indian politics for decades to come. That's what @amitshai Ji declared way too earlier. pic.twitter.com/wqrqC3xzaZ — Ajay Sehrawat (@IamAjaySehrawat) October 28, 2021 -
ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం
చండీగఢ్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఇన్నాళ్లు ప్రధాన సలహాదారు (ప్రిన్సిపల్ అడ్వైజర్)గా కొనసాగగా తాజాగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘తాత్కాలికంగా ప్రజా జీవితానికి విరామం ఇస్తున్నా’ అని పేర్కొంటూ గురువారం రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. ఈ పరిణామం జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ‘నా భవిష్యత్ చర్యల కోసం ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగలేకపోతున్నా. ఈ విషయం మీకు కూడా తెలుసు. తాత్కాలికంగా ప్రజా జీవితం నుంచి కొంత విరామం కోరుకుంటున్నా. సలహాదారు పదవిని స్వీకరించలేను. అన్యథా భావించకుండా నా విజ్ఞప్తిని పరిశీలించి ఆ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలి’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు. ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో సీఎంకు తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పీకే చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పలుమార్లు రాహుల్, ప్రియాంకగాంధీలతో పీకే సమావేశమయ్యారు. పంజాబ్ సీఎం సలహాదారుగా ఈ ఏడాది మార్చిలో పీకే నియమితులయ్యారు. ప్రశాంత్ కిశోర్ రాజీనామా వెనకాల వేరే ప్రణాళిక ఉందని సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు పార్టీలో చేరితే కాంగ్రెస్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక పదవిలోనే ఉండాలని ఉండడంతో ఈ రాజీనామా చేశారని చర్చ కొనసాగుతోంది. తాజాగా ఈ పదవి నుంచి వైదొలగడంతో ఆయన రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. -
త్రిపురలో ఐప్యాక్ బృందం నిర్బంధం
అగర్తలా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సభ్యులు 23 మందిని త్రిపుర పోలీసులు ఒక హోటల్లో హౌస్ అరెస్టు చేశారు. 2023లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐప్యాక్ బృందం వారం రోజుల కిందట అగర్తలాకు చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి త్రిపుర పోలీసులు వీరిని హోటల్ నుంచి బయటికి రానివ్వడం లేదు. ‘తృణమూల్ ఇంకా త్రిపురలో అడుగుపెట్టకముందే బీజేపీ భయపడుతోంది. 23 మంది ఐప్యాక్ ఉద్యోగులను గృహనిర్భందంలో పెట్టారు. బీజేపీ అరాచక పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే పదేపదే ఖూనీ అవుతోంది’ అని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. బయటినుంచి వచ్చినందున వారికి కరోనా పరీక్షలు చేశామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అయిదు సార్లు ఫోన్లు మార్చా..అయినా వదల్లే: పీకే
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అటు లోక్సభలోకూడా తీవ్ర దుమారాన్ని రాజేసాయి. తాజాగా ఈ సెగ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా తాకింది. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉండటం గమనార్హం. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను కేంద్రం హ్యాక్ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రచార వ్యూహకర్తగా కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలకే పనిచేస్తూ వచ్చారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో పీకే కృషి చాలా ఉంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎన్ఎస్ఓ గ్రూప్, పెగాసస్ మాలావేర్ క్లయింట్ల జాబితాలో ఉన్న పది దేశాలలో భారతదేశం ఒకటి -
రాహుల్ గాంధీతో పీకే కీలక భేటీ..
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసంలో మంగళవారం వీరు భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్-నవజోత్ సింగ్ సిద్ధుల మధ్య సయోధ్య గురించి ఈ భేటీలో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, హరీష్ రావత్ హాజరయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రియాంక గాంధీ మంగళవారం లక్నోలో పర్యటించాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పీకేతో భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. మోదీకి ధీటైన, బలమైన ప్రధాని అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశం అయ్యారు. మిషన్ 2024 లక్ష్యంగా మూడో కూటమి ఏర్పాటు కోసమే వీరు భేటీ అయినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండానే సమావేశం కొనసాగింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో కూటమి ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్-పీకేల భేటీపై సర్వత్రా ఆసక్తి నేలకొంది. ఈ సమావేశంలో వీరు థర్డ్ ఫ్రంట్‌పై చర్చించనున్నారా లేక వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తున్నారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. -
థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కసరత్తు జరుగుతోందన్న వాదనలకు ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహ రచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను దూరంగా పెడుతూ... మిగతా విపక్షాలతో మూడోకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టార్గెట్ 2024! ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. 15 రాజకీయ పక్షాలకు ఆహ్వానాలు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తర్వాత శరద్ పవార్ మంగళవారం పలువురు విపక్ష పార్టీల నేతలు, ప్రముఖ వ్యక్తులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని పవార్ నివాసంలో మంగళవారం కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మంచ్ తరపున 15 రాజకీయ పక్షాలకు, సమాజంలోని కీలక వ్యక్తులకు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరుతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో శరద్ పవార్‌తో పాటు ఫరూక్ అబ్లుల్లా, యశ్వంత్ సిన్హా, పవన్ వర్మ, సంజయ్ సింగ్, డి.రాజా, జస్టిస్ ఏపీ సింగ్, జావేద్ అక్తర్, కేటీఎస్ తులసి, కరణ్ థాపర్, అశుతోష్, న్యాయవాది మజీద్ మెమొన్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, కేసీ సింగ్, సంజయ్ ఝా, సుదీంధ్ర కులకర్ణి, ఆర్థికవేత్త అరుణ్ కుమార్, ఘన్‌శ్యామ్ తివారీ, సహా పలువురు పాల్గొంటారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. నాకు సంబంధం లేదు: ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ ఎన్డీటీవీతో అన్నారు. ‘మూడో ఫ్రంట్... నాలుగో ఫ్రంట్లను నేను విశ్వసించను. థర్డ్ ఫ్రంట్ బీజేపీ ఓడిస్తుందనే నమ్మకం నాకు లేదు’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇంతకుమించి మాట్లాడలేదు. చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024 -
పవార్‌తో పీకే భేటీ.. కారణమిదేనంటున్న ఎన్సీపీ నేత
ముంబై: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. 2024లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల తన ‘మిషన్-2024’ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని పలువురు భావిస్తున్నారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన వీరి చర్చల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి ధీటైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై, అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ప్రతి రాజకీయ నేతనూ కలుస్తానని.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని, అందులో తప్పు లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాగా తాజాగా పీకే, పవార్ భేటీపై ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘శరద్ పవర్‌ను శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మర్యాద పూర్వకంగానే ఇంట్లో కలిశారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలు సాగింది. అయితే ఇందులో ఎన్సీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకునే చర్చ ఏం జరగలేదు. అతను ఒక వ్యూహకర్త. అతను విషయాలను వేరే విధంగా విశ్లేషిస్తాడు. తన అనుభవాన్ని పవర్ సాబ్తో పంచుకున్నారు. పవర్ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేకంగా బలమైన రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని పవర్ కోరుకుంటున్నారు. ఆ దిశగానే ఎన్సీపీ పనిచేస్తోంది’ అని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక నాయకులను తమ పార్టీలో చేరమని బీజేపీ నాయకులు బెదిరించారని అందుకే ప్రజలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరారని, బెంగాల్లో టీఎంసీలో ఇంకా చేరాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీల జాబితా ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యూహరచయితగా వ్యవహరించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయనని ప్రశాంత్ తేల్చి చెప్పారు. చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024 -
పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024
ముంబై: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీకే శుక్రవారం ముంబైలో శరద్ పవార్‌తో కలిసి లంచ్ చేసినట్లు సమాచారం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ ఇంటిలో వీరిద్దరు కలవడంతో అందరి దృష్టి 2024 ఎన్నికలపై సడింది. పవార్, పీకే మిషన్ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు మాత్రం ఈ భేటీని ధన్యవాదసమావేశంగా పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహరచయితగా వ్యవహరించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించడంతో వారికి మద్దతిచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కృతజ్ఞతల తెలిపే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కానీ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం ధన్యవాద సమావేశం మాత్రమే కాదు.. అంతకు మించి పెద్ద విషయాల గురించే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో మోదీకి పోటీ ఇచ్చే బలమైన ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి ఎవరనే దాని గురించి చర్చించి ఉంటారంటున్నారు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని సంచలన ప్రకటన చేసి.. అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఇన్ని రోజులుగా నేను చేస్తున్న పనిని ఇక మీదట కొనసాగించబోను. ఇప్పటికే చాలా చేశాను. కొంత విరామం తీసుకుని.. జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా’’ అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ.. ‘‘నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. నేను వెనక్కి వెళ్లి ఏం చేయాలో చూడాలి’’ అన్నారు. అయితే పీకే ఏదో భారీ రాజకీయ వ్యూహంతో తిరిగి రంగంలోకి దిగుతారని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు శరద్ పవార్‌తో భేటీ కావడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. చదవండి: మమత కోసం రంగంలోకి శరద్ పవార్ వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్ -
వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహరచనల్లో సాయపడిన ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని ఆదివారం ప్రకటించారు. గతంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), వైఎస్ఆర్సీపీ, డీఎంకే పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ ప్రశాంత్ ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆదివారం ఇండియా టుడే టీవీ చానెల్లో మాట్లాడిన సందర్భంగా ప్రశాంత్ తన నిర్ణయాన్ని బయట పెట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కేంద్ర ఎన్నికల సంఘం... బీజేపీకి మరో రూపం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. ‘ ఇంతగా ఒకటే రాజకీయ పార్టీ కోసం పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘంను నేనెప్పుడూ చూడలేదు. బీజేపీకి సాయపడేందుకు ఈసీ చేయాల్సినదంతా చేసింది. మతం కార్డును వాడు కోవడం, ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీకి అనుకూ లంగా తీర్చిదిద్దడం, నియమాలను తుంగలో తొక్కడం.. ఇలా ప్రతీ అంశంలో బీజేపీకి అనువు గా ఈసీ వ్యవహరించింది’ అని ప్రశాంత్ ఆరోపించారు. ‘బెంగాల్లో ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ మాత్రం బెంగాల్లో బలమైన పార్టీ గా ఎదిగింది’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 100లోపు స్థానాలనే గెలుస్తుందని గత ఏడాది డిసెంబర్లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. 2014లో మోదీతో మొదలై.. రాజకీయ శ్రేణుల్లో పీకేగా ముద్దుగా పిలుచుకునే ప్రశాంత్‌కిశోర్ మొదటిసారిగా నేరుగా రాజకీయపార్టీల కోసం పనిచేసింది మాత్రం 2014లోనే. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగినపుడు ‘ఛాయ్ పే చర్చ’ అంటూ మొదలైన వినూత్న ప్రచార కార్యక్రమ వ్యూహాల్లో ప్రశాంత కీలక భూమిక పోషించారని కలకత్తా రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన రజత్ రాయ్ చెప్పారు. 2015లో బిహార్‌లో నితీశ్‌కుమార్ కోసం ఎన్నికల వ్యూహాల్లో ప్రశాంత్ కిశోర్ చాలా నెలలు పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్‌తో కలిసి పీకే ఎత్తుగడలు వేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంలోనూ ప్రశాంత్ పాత్ర కీలకమైంది. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. బాల్య వివాహాల ను ఆపేలా, అమ్మాయిల చదువులు కొనసాగేలా చేసిన ఐక్యరాజ్యసమితి అవార్డు పొందిన ‘కన్యాశ్రీ’ వంటి పథకాలతో మహిళా పక్షపాత ప్రభుత్వమని టీఎంసీకి పేరు తెచ్చిన ఘనత పీకేదే. ఈసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేశారు. ఎన్నికల వ్యూహాలు ఇక రచించను Trends show BJP crossed double digits now waiting for @PrashantKishor to quit Twitter pic.twitter.com/KeqxsxWpJv — Exsecular (@ExSecular) May 2, 2021 -
టీఎంసీ హ్యాట్రిక్: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
కోలకత : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి కాలుతోనే బెంగాల్‌ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దాదాపు 200కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో నిలిచిన టీఎంసీ బీజేపీకి గట్టి షాకే ఇస్తోంది. మరోవైపు బెంగాల్లో దీదీకే మళ్లీ పట్టం అని పదే పదే నొక్కి వక్కాణించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ 100 శాతం నిజమైంది. ఈ సందర్బంగా గతంలో పీకే ట్వీట్లు ఇపుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తాజా ఫలితాల సరళి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. మోదీ పాపులర్ వ్యక్తి అయినంత మాత్రానా బీజేపీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీఎంసీకి విజయం ఏకపక్షమే అయిన తీవ్ర పోటీ ఎదురైందన్నారు. ఎన్నికల కమిషన్ పాక్షికం వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని పీకే వ్యాఖ్యానించారు. బెంగాల్లో గెలవబోతున్నామంటూ బీజేపీ భారీ ప్రచారాన్ని చేపట్టింది. అయినా ఊహించని విజయాన్ని ప్రజలు టీఎంసీ కిచ్చారంటూ పీకే సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు 294 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కూడా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21 ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నాయకులు పీకేపై మండిపడుతున్నారు. దీంతో బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారం నిబెట్టుకున్నా.. బీజేపీ సునామీతో ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనుందని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా ట్వీట్ చేశారు. కాగా గత సంవత్సరకాలంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించినప్పటినుంచి మోదీషా ద్వయం బెంగాల్లో మమతను అధికార పీఠంనుంచి దూరం చేసేందుకు పావులు కదిపారు. కానీ బెంగాల్ ప్రజలు మాత్రం దీదీవైపై మొగ్గారు. అయితే గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకునేదశగా కదులుతోంది. ప్రస్తుతం 74 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఒక స్థానమైనా దక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే. -
దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే
కోలకతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావొచ్చంటూ పీకే ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విటర్ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటలకంటే, తన మాటలను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తమకనుకూలమైన క్లిప్పింగులకు బదులుగా, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ100 సీట్ల మార్క్‌ను దాటబోదు అంటూ ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్ చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన ఒక క్లిప్ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్‌లో మమతాపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగాపెరిగిందనీ, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసు కుంటున్నారు. మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది. తాజా ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా టీఎంసీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార టీఎంసీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రకటించారు. కాగా బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం నాలుగో దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న రానున్న సంగతి తెలిసిందే. I am glad BJP is taking my chat more seriously than words of their own leaders!😊 They should show courage & share the full chat instead of getting excited with selective use of parts of it. I have said this before & repeating again - BJP will not to CROSS 100 in WB. Period. — Prashant Kishor (@PrashantKishor) April 10, 2021 Is it open? That moment when Mamata Banerjee’s strategiest realised that the Club House room was open and his admissions were being heard by the public at large and not just a handful of Lutyens journalist. Deafening silence followed... TMC’s election was just thrown away! pic.twitter.com/2XJ4RWbv3K — Amit Malviya (@amitmalviya) April 10, 2021 -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
బెంగాల్ ఎన్నికలు: పీకే ఆసక్తికర ట్వీట్
కోల్‌కతా: ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునే క్రమంలో పశ్చిమ బెంగాల్ అతిపెద్ద ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. సరైన నాయకులను ఎంచుకునేందుకు, స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు బెంగాల్ ప్రజలు సన్నద్ధమయ్యారంటూ పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. తమ పుత్రికనే మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని బెంగాల్ కోరుకుంటోందని సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 294 శాసన సభ స్థానాలు గల బెంగాల్లో 8 విడతల్లో(మార్చి 27- ఏప్రిల్ 29) పోలింగ్ జరుపనున్నట్లు సీఈసీ సునిల్ అరోరా వెల్లడించారు. అసోంలో మూడు దశల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే పరస్పర విమర్శలతో అధికార తృణమూల్- బీజేపీ దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం కేంద్రం తీరుపై మండిపడ్డారు. అసోంలో ఎన్నికల ప్రచారం పూర్తిచేసుకుని బెంగాల్లో ప్రచారానికి వచ్చేందుకే 8 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారా అంటూ మోదీ సర్కారును విమర్శించారు. ఈ క్రమంలో టీఎంసీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘భారత్‌లోని అతిపెద్ద ప్రజాస్వామ్య పోరాటం పశ్చిమ బెంగాల్లో జరుగనుంది. బెంగాల్ ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నారు. వారి వైఖరి ఏమిటో స్పష్టం చేసేందుకు సన్నద్ధమయ్యారు. బెంగాల్ తమ బిడ్డ గెలుపునే కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. సీఎం మమత మరోసారి విజయభేరి మోగించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ మే 2 వరకు తనను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: టీఎంసీ- బీజేపీ పోరు: 8 విడతల్లో బెంగాల్ ఎన్నికలు! ఎన్నికల షెడ్యూల్: కేంద్రంపై సీఎం ఫైర్ -
బీజేపీ సవాల్: వ్యూహాలకు ప్రశాంత్ పదును
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రానున్న మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించి బెంగాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు అసలైన సవాలు విసురుతున్నాయి. మరోవైపు కేంద్రంలో బలమైన ప్రభుత్వం, నాయకత్వం కలిగిన అధికార బీజేపీ బెంగాల్ కోటాపై కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. దీనిలో భాగాంగానే ఏడాది ముందు నుంచే ఎన్నికల రణరంగంలోకి దిగింది. వ్యూహచతురత, ప్రత్యర్థిని దెబ్బతీయడంలో దిట్టగా పేరొందిన మమతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని భావించిన కాషాయదళం.. దీదీకి ధీటుగా వ్యూహాలను అమలు చేస్తోంది. మమతకు ఎదరుదెబ్బ.. టీఎంసీలో బలమైన నేతలుగా ఉన్న సీనియర్లును తమవైపు తిప్పుకుని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం ఆదివాసీ ప్రాంతాల్లో పట్టుకలిగిన సుమేందు అధికారిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా మమతను మానసికంగా, రాజకీయంగా కమలదళం దెబ్బతీయగలికింది. అంతేకాకుండా దీదీ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను నిర్వరిస్తున్న కేబినెట్ మంత్రులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం టీఎంసీలో పెను కల్లోలాన్ని సృష్టిస్తోంది. గత లోక్‌సభల ఎన్నికల ముందు వరకు కనీస ప్రభావం లేని కాషాయదళం.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన మార్కును స్పష్టంగా చూపించింది. ఎవరూ ఊహించిన రీతిలో ఏకంగా 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాజకీయవేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. వ్యూహాలపైనే రాజకీయ భవిష్యత్ ఈ క్రమంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన పార్టీ పునాదులు కలిగిన మమతా బెనర్జీ అనుసరించే వ్యూహాలు ఆమె రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి ఓవైపు.. తుఫానులా ముంచుకువస్తున్న బీజేపీ మరోవైపు దీదీకి సవాలు విసురుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని, వ్యూహాలకు మరింత పదును పెట్టకపోతే తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉందని ఆమె రాజకీయ సలహాదారులు ఇప్పటికే పసిగట్టారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు వరుసపెట్టి రాజీనామా చేస్తుండటంతో.. మరోవైపు టీఎంసీకి మొన్నటి వరకు మద్దతుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, ఆదివాసీ ఓటర్లు క్రమంగా దూరమవ్వడం మమతను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌పై మమత బోలెడు ఆశలు పెట్టుకున్నారు. టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్.. మమతను ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని పాచికలు వేస్తున్నారు. వ్యక్తిగతంలో బీజేపీ వ్యతిరేక వైఖరి కలిగిన ఆయన.. బెంగాల్లో కాషాయ పార్టీని కట్టడి చేసేందుకు విలువైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి చవిచూసిన ప్రాంతాలపై దృష్టి సారించారు. జంగల్‌మహాల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా దెబ్బతింది. బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మరోవైపు సువేందు అధికారి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రాంతో పాటు జంగల్‌మహాల్ ఏరియాల్లో కూడా ఆయన అనుచరులకు మంచి పట్టుంది. మమత విజయం కోసం ప్రశాంత్ శ్రమ ఈ నియోజవర్గల్లో ఈసారి టీఎంసీని గెలిపించే బాధ్యతను ఈసారి ప్రశాంత్‌కు అప్పగించారు దీదీ. దీంతో రంగంలోకి దిగిన ఆయన ఆయా నియోజకవర్గల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాలను సైతం ఆయనే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆశావహులతో పాటు జిల్లా స్థాయి నేతలను నేరుగా మమత దగ్గరకు తీసుపోతూ.. పార్టీని పటిష్ట స్థితికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్రచార వ్యవహారాలకు సైతం నిపుణులను సిద్ధం చేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మమత విజయం కోసం ప్రశాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ దూకుడు ముందు మమత ఏ విధంగా నిలుస్తారు అనేది ఎన్నికల అనంతరం తెలియనుంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 209 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 27, కాంగ్రెస్ 23, సీపీఎం 19 స్థానాల్లో విజయం సాధించాయి. -
మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్
కోల్కత్తా : మరో ఆరు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ కోటను కూల్చిందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే బరిలోకి దిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. వరుస ర్యాలీలతో తృణమూల్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు కమళదళమంతా బెంగాల్‌పై దృష్టిసారించగా.. దీదీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమతకు అండగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని సవాలు విసురుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అమిత్ షా ప్రచారం చేస్తున్నట్లు 200 సీట్లు సాధిస్తే తాను నిర్వర్తిస్తున్న విధుల నుంచి శాశ్వతంగా వైదులుతానని స్పష్టం చేశారు. (అమిత్ షా ఎత్తుగడ.. మమతకు మద్దతు!) ప్రశాంత్ సవాల్ అనంతరం బీజేపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో ఇరు పక్షాల మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రశాంత్ కిషోర్ ట్వీట్‌కు స్పందించిన బీజేపీ నేత కైలాష్ విజయ వర్గీయ.. దేశం త్వరలోనే ఓ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సేవలను కోల్పోనుందని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సృష్టించబోయే సునామీలో ఆ పార్టీ నేతలంతా కొట్టుకుపోడడం ఖాయమన్నారు. దీనికి బందులుగా స్పందించిన ప్రశాంత్.. 100 సీట్లు సాధించకపోతే మీరు (బీజేపీ నేతలు) అనుభవిస్తున్న పదవుల నుంచి తప్పుకునే దమ్ముందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీల్లో తృణమూల్ విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఊహలకు అందని విధంగా రంగ ప్రవేశం చేసిన అమిత్ షా... మమతకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారితో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని దీదీ, ప్రశాంత్‌లకు గట్టి షాకే ఇచ్చారు. అనంతరం అప్రమత్తమైన మమత, పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. -
బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ జోస్యం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్న వేళ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి ఊరటనిచ్చే విషయాలు చెప్పారు. ఆయన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 200 సీట్లలో విజయం సాధించి బెంగాల్లో ఈసారి అధికారం చేపడుతామన్న అమిత్ షా పాచికలు పారవని అన్నారు. అక్కడ కనీసం రెండంకెల సీట్లు కూడా కాషాయ పార్టీ గెలుచుకోలేదని పీకే జోస్యం చెప్పారు. బెంగాల్లో బీజేపీ ఇప్పుడున్న దానికన్నా ఏమాంత్రం మెరుగ్గా మారిన తన స్థానాన్ని వదులుకుంటానని సవాల్ విసిరారు. అనుకూల మీడియా ద్వారా బీజేపీ ఊదరగొట్టే ప్రచారాలు చేస్తోందని పీకే ఎద్దేవా చేశారు. అంతేగానీ, అక్కడ కమలం పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. మమతా దీదీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే పీకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక టీఎంసీ అసమ్మతి నేతలు రవాణాశాఖ మాజీ మంత్రి సువేందు అధికారి, మరో ఎంపీ సునీల్ కుమార్ మోండల్, మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ‘ఇది ఆరంభం మాత్రమే.. తృణమూల్ కాంగ్రెస్‌లో చివరకు మీరొక్కరే మిగిలుతారు’అని అమిత్ షా ఈ సందర్భంగా మమతాపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ఇదిలాఉండగా.. బెంగాల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 294. (చదవండి: ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’) -
నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్‌లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్‌తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!) ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్‌ను అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ‘బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్‌కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బిహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. (నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?) కాగా గతంలో నితీష్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్‌ను తొలగిస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్‌పై స్పందించారు. -
ప్రశాంత్ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు హస్తం పార్టీ సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చోవాలని సీఎం నిర్ణయించారు. మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపల్పన వంటి అంశాలపై చర్చించాలని ప్రణాళికలు రచించారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్ శాసనసభ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, శిరోమణీ అకలీదళ్, ఆమ్ఆద్మీ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. దశాబ్ధాలుగా బీజేపీతో ఉన్న స్నేహనికి అకాలీదళ్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సుఖ్బీర్సింగ్ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రశాంత్ సేవలను ఉపయోగించుకోవాలని అమరీందర్ సింగ్ ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రశాంత్ కృషి చేసిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఫలితాలనే పునరావృత్తం చేయాలనుకుంటున్న కెప్టెన్.. వ్యూహకర్తతో ఒప్పందానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రతిపాదనకు ప్రశాంత్ ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఇరు వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా సునీల్) గతంలో అనేక మందికి వ్యూహకర్తగా వ్యహరించి విజయాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో జట్టు కట్టేందుకు ప్రశాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో ప్రశాంత్ ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరంద్రే మోదీని అద్భుతమైన విజయాన్ని అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. -
‘వైరస్‌పై కాదు ప్రచారంపైనే దృష్టి’
పట్నా : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తుంటే బిహార్ ముఖ్యమంత్రి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ప్రారంభించడాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. బిహార్‌లో అతితక్కువగా టెస్ట్‌లు చేస్తున్నా 6000కు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో కరోనా వైరస్ నియంత్రణను పక్కనపెట్టి బిహార్‌లో ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ భయాలతో ఇంటికే పరిమితమైన నితీష్ కుమార్ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తే ప్రజలు మాత్రం వైరస్‌కు గురికారని ఆయన ఆలోచిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌పై బిహార్ ప్రభుత్వ తీరును ఆదివారం వరుస ట్వీట్లలో ఆయన తప్పుపట్టారు. ప్రశాంత్ కిషోర్ కొద్దికాలం జనతాదళ్ (యూ)లో పనిచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన తర్వాత నితీష్ కుమార్ ఇంతవరకూ మహమ్మారిపై ప్రజలను ఉద్దేశించి ఇంతవరకూ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ నితీష్ ఇంతవరకూ మీడియా ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి : ఇక మన బాధలన్నీ మర్చిపోవచ్చు : ప్రశాంత్ కిషోర్ -
ఆ పార్టీ కోసం పని చేయను: పీకే
భోపాల్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. పీకేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను కోరింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరారు. కాని నేను దానికి అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను’ అన్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోదీ కోసం పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్.. అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కోసం.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.(ప్రశాంత్ కిషోర్‌కు అత్యవసర పిలుపు..) -
ఇక మన బాధలన్నీ మర్చిపోవచ్చు : ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దు వివాదం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇక మన బాధలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండొచ్చు...మన కష్టాలన్నీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లినట్టుగా కనిపిస్తోందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక స్థితి గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారంటూ ఆయన సెటైర్లు వేశారు (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) కాగా ఇండో-చైనా సరిహద్దు వివాదంపై మధ్యవర్తిత్వం వహించేందుకు ఉత్సాహంగా ఉన్న ట్రంప్, ఈ విషయంలో మోదీ మాట్లాడే మూడ్‌లో లేరంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఇటీవలి కాలంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన) We can FORGET all our WORRIES as India seem to have truly ARRIVED at the global stage. We now have President of United States informing the world about the MOOD of our Prime Minister!! — Prashant Kishor (@PrashantKishor) May 29, 2020 -
మమత పిలుపు: పీకేకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కోల్‌కతా వెళ్లారా, లేదా అనే దానిపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో కార్గో విమానంలో ఆయన కోల్‌కతా వెళ్లినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. ‘మేము విచారణ ప్రారంభించాం. లాక్డౌన్ ఆదేశాలను ధిక్కరించి ప్రశాంత్ కిశోర్ విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నించారా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నాం. దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అన్ని విమానాశ్రయాలను కోరామ’ని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కోల్‌కతాకు కార్గో విమానాలు నడుపుతున్న విమానయాన సంస్థలను ఈ వ్యవహారం గురించి ప్రశ్నించగా తమకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పినట్టు తెలిపారు. అయితే తాను కార్గో విమానంలో కోల్‌కతా వెళ్లినట్టు వచ్చిన వార్తలను ప్రశాంత్ కిశోర్ తోసిపుచ్చారు. మార్చి 19 తర్వాత తాను ఏ విమానాశ్రయానికి వెళ్లలేదని.. దీనికి విరుద్ధంగా ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే ఆ వివరాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. కాగా, బెంగాల్ సర్కారుతో వరుస సమావేశాల తర్వాత ప్రశాంత్ కిశోర్ మార్చి 19న కోల్‌కతా నుంచి వెళ్లిపోయినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలు, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కార్గో విమానాలు తిరిగేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు 347 కార్గో విమానాలు తిరుగుతున్నాయి. చదవండి: కరోనా పోరులో రాజకీయ కొట్లాట -
ప్రశాంత్ కిషోర్‌కు అత్యవసర పిలుపు..
కోల్‌కతా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. కరోనా వ్యాధి విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శలతో దూసుకుపోతుండటంతో, ఈ క్లిష్ట సమయంలో తమకు మార్గదర్శకం చేయాలంటూ ప్రశాంత్‌కిషోర్‌కు మమత కార్యాలయం నుంచి కబురు అందింది. ప్రస్తుతం పీకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ‘బంగ్లార్ గార్బో మమతా’ ప్రచార కార్యక్రమానికి తెరపడంతో ప్రశాంత్‌కిషోర్ ఢిల్లీ వెళ్లిపోయారు. తిరిగి దీదీ నుంచి పిలుపురావడంతో కార్గో విమానంలో పశ్చిమబెంగాల్ చేరుకున్నారు. అయితే ప్రశాంత్ వచ్చిన సమయంలోనే, రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్రంపంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు కూడా కోల్‌కతా చేరుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానళ్లలో కరోనా మహమ్మారి విషయంలో మమత ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే పనులను ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షించనున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారంటూ మమతా ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఐటీ విభాగం ఎండగట్టుతుంది. రాష్ట్రంలో పదిలక్షల మందిలో సగటున కేవలం 198 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేయడంపై బీజేపీ పెద్దలు కూడా మమత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.(టెస్టుల్లో ఏపీ ఫస్ట్) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని టీఎంసీ నేతలపై మండిపడుతున్నారు. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తబ్లిగి జమాత్‌కి వెళ్లొచ్చిన వారు క్వారంటైన్ ఉండకుండా మమతానే వారికి అండగా ఉంటుందని, వారిని అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వీడియోలతోపాటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలతో బెంగాల్ మొత్తం ఇబ్బందులు పడే అవకాశం ఉందని బీజేపీనేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి తోడూ జాతీయ, అంతర్జాతీయ మీడియాసైతం మమత ప్రభుత్వవైఫల్యాలపై కథనాలు ప్రచురించడం, కేంద్ర ప్రభుత్వం కూడా బెంగాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి ఎప్పటికప్పుడు బృందాలను పంపించడం మమతకు పెద్ద తలనొప్పిగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే ఎన్నడూలేని విధంగా బీజేపీ బాగా పుంజుకుంది. ఏకంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి పీకేని అత్యవసరంగా బెంగాల్‌కు పిలిపించినట్టు తెలుస్తోంది. -
కరోనా పోరులో రాజకీయ కొట్లాట
పట్నా : దేశమంతా కరోనాపై కొట్లాడుతుంటే దీనికి భిన్నంగా బిహార్‌లో మాత్రం రాజకీయ విమర్శల వేడి పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై మాటల దాడికి దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. ప్రముఖ ఎన్నికల వ్యహాకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీష్‌పై మాటల యుద్ధానికి దిగారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పంపడంపై నితీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నింబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులను పంపడం సరైనది కాదని విమర్శించారు. అయితే తాజాగా బిహార్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేసింది. రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన బిహార్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి కోసం ప్రభుత్వం స్పెషల్ పాస్‌ను జారీచేసింది. ఆయన్ని తీసుకుని వచ్చేందుకు ఓ వాహనాన్ని సైతం పంపింది. దీనిని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇటీవల యూపీ ప్రభుత్వం ఇదే పని చేస్తే తప్పు అని విమర్శించారు. మరి తాజాగా మీరు చేసింది ఏంటీ నితీష్ జీ..?’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే కొడుకు కోసం లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తారా? అని నిలదీశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా నితీష్ ఆరోపణలకు దిగుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నపేదలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. (యూపీ ప్రభుత్వ తీరుపై బిహార్ సీఎం ఆగ్రహం) -
లాక్డౌన్ పొడిగింపు... ప్రశాంత్ కిషోర్ ట్వీట్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఒకవేళ లాక్డౌన్ సత్పలితాలను ఇవ్వకపోతే ఇందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1211 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ బాధితుల సంఖ్య 10 వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం ప్రకటన చేశారు.(లాక్డౌన్ కష్టాలు: మండిపడ్డ మాయావతి) ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్... ‘‘ లాక్‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే వాస్తవం ఏమిటంటే... ఒకవేళ లాక్డౌన్ వల్ల ఆశించిన ఫలితం రానట్లయితే మే 3 తర్వాత ఏం జరగబోతోంది. ఆ తప్పిదాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా’’అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. తొలిసారిగా మార్చి 24 అర్ధరాత్రి విధించిన లాక్డౌన్ సరైందేనన్న ప్రశాంత్ కిషోర్.. దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని గతంలోనే పేర్కొన్నారు. అయితే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సరైన రీతిలో సంసిద్ధం కాలేదని.. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. (ఆ విషయాన్ని రేపు ప్రధాని వెల్లడిస్తారు: జవదేకర్) అసహ్యంగా ఉంది: ప్రశాంత్ కిషోర్ It’s pointless to endlessly debate the rationale & modalities of the #lockdown2 The REAL question however is what happens if we don’t get the desired result even by staying the course on our chosen path till 3rd May? Do we have an alternate plan or the will to course correct? — Prashant Kishor (@PrashantKishor) April 14, 2020 -
కన్నీటిపర్యంతం.. రాజీనామా చేయండి!
పట్నా : దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన మహ్మమారి కరోనా వైరస్ చివరికి రాజకీయాలకూ పాకింది. రాష్ట్రంలోని వలస కార్మికులను రక్షించడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దారుణంగా విఫలమైయ్యారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. దీనికి ట్విటర్‌ను వేదికగా చేసుకుని ’ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన’ అంటూ నితీష్‌పై ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ను ఎదుర్కొవడంలో నితీష్ తీవ్రంగా విఫలమయ్యారని, అంతిమంగా పొట్టకూటి కోసం దేశ నలుమూలల నుంచి బిహార్‌కు వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశాంత్ కిషోర్ దుమ్మెత్తి పోశారు. అంతేకాకుండా తన వైఫల్యాలను అంగీకరించి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే దేశమంతా రవాణ సౌకర్యాన్ని ఎక్కడిక్కడికి నిలిపివేశారు. దీంతో ఉపాధి కోసం పలు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పలు ప్రాంతాల్లో తింటానికి కూడా తిండిలేక కాలేకడుపుతో అలమటిస్తున్నారు. అ క్రమంలోనే వివిధ ప్రాంతాలను నుంచి బిహార్‌కు వలస వచ్చిన కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. (200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి) ప్రజలెవ్వరూ రాష్ట్రాల సరిహద్దులు దాటరాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులందరినీ క్వారెంటెన్ కేంద్రాలకు పంపించారు. కార్మికులకు నివాసం కల్పించిన ఓ వీడియోను ప్రశాంత్ కిషోర్ ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతవుతున్నారు. ప్రభుత్వం నుంచి తామకు ఏమీ అవసరంలేదని, తమ స్వస్థలాలకు పంపిస్తే చాలని విలపిస్తున్నారు. కనీన సామాజిక దూరం పాటించలన్న నిబంధనలు ఉల్లంఘించి... అందరినీ ఒకే గదిలో బందించినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడంపై ప్రశాంత్ కిషోర్ ఇదివరకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోలేకపోతున్నారని, కరోనా వైరస్ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో ఎదుర్కోలేపోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైరస్ విపత్తు నుంచి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ప్రశాంత్ స్వాగతించారు. .#Corona संक्रमण से लोगों को बचाने के सरकारी प्रयासों की एक और भयावह तस्वीर - भारी तकलीफ़ और मुसीबतों को झेलकर देश के कई हिस्सों से बिहार पहुँचने वाले गरीब लोगों के लिए #NitishKumar की #SocialDistancing और #Quarantine की ये व्यवस्था दिल दहलाने वाली है।#NitishMustQuit pic.twitter.com/ot3hygGRk7 — Prashant Kishor (@PrashantKishor) March 29, 2020 -
అసహ్యంగా ఉంది: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. లాక్డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని.. కోవిడ్-19(కరోనా వైరస్)సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మస్తుతి అసహ్యంగా ఉందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఇందుకు చిన్న పిల్లలు గడ్డి తింటున్నట్లుగా ఉన్న ఫొటోను జత చేశారు. కాగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించిన 36 గంటల్లో.. రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.(కరోనా లాక్డౌన్: ప్రశాంత్ కిషోర్ ట్వీట్) ఈ క్రమంలో ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక బిహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. రోజూవారీ కూలీలు, పేదల కోసం బిహార్ ప్రభుత్వం నిధిని కేటాయించాలంటూ గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మరో ట్వీట్లో పేర్కొన్నారు.(బయటికొస్తే కాల్చిపడేస్తా) After all the public outcry, GoB has announced new measures to help daily wage workers & poor people stranded across India due to the #lockdown. This includes additional fund of 100Cr from CM relief fund. Thank you all for adding your voice to the cause. @NitishKumar जी को भी 🙏🏼 pic.twitter.com/YFM6tDZi9s — Prashant Kishor (@PrashantKishor) March 26, 2020 -
కరోనా లాక్డౌన్: ప్రశాంత్ కిషోర్ ట్వీట్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో లాక్డౌన్ ప్రకటించడం సరైన నిర్ణయేమనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 21 రోజుల లాక్డౌన్ పొడగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సరైన విధంగా సన్నద్ధం కాలేదని.. అందుకే భారీ మూల్యం చెల్లించాల్సివస్తోందని విమర్శించారు. మున్ముందు మరింత కఠిన రోజులు చూడాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ప్రాణాంతక వైరస్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇంట్లోనే ఉండి.. మహమ్మారిని కట్టడి చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక కరోనా ధాటికి భారత్‌లో ఇప్పటికే 11 మరణాలు సంభవించగా... 519 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్ కిషోర్ ట్వీట్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే వారు... జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటాన్ని అతిపెద్ద కుదుపుగా ఎలా భావిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘ఇంటి పేరు కారణంగా... కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తప్పుబట్టేవారు... ఇప్పుడేమో సింధియా పార్టీని వీడితే.. పార్టీకి ఇదొక ఝలక్ అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే.. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇంటిపేరు కారణంగానే మాస్ లీడర్, రాజకీయవేత్త, పాలకుడిగా ఉన్నారు’’అని ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా విజయాలకు కేవలం కుటుంబ చరిత్రే కారణమని జ్యోతిరాదిత్య అనుచరులు భావించడం సరికాదన్న ఉద్దేశంతో ఆయన ఈవిధంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. (బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ ) కాగా గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా... మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన ఆయన.. ఇకపై మరింత మెరుగ్గా ప్రజాసేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో.. గుణ లోక్‌సభ స్థానానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి జ్యోతిరాదిత్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యకి సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్‌కి దక్కింది. ఎంపీగా 2019లో ఓటమి చవిచూడడంతో పార్టీ జ్యోతిరాదిత్యని పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్) ఇక అనేక ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గ్వాలియర్ రాజమాత విజయరాజే.. ఆ తర్వాత జనసంఘ్‌లో చేరిన విషయం తెలిసిందే. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న ఆమె ఏనాడు ఓటమిని చవిచూడలేదు. ఇక ఆమె కుమారుడు మాధవరావు బీజేపీ నుంచి పోటీ చేసి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు. అయితే అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి.. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో... ఇన్నాళ్లుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన జ్యోతిరాదిత్య ప్రస్తుతం పార్టీని వీడారు. ఇక ఆయన మేనత్తలు వసుంధర రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోధర బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. Amazing that those who usually find fault with #Gandhis leading Congress because of their surname are finding a #scindia leaving #INC as big jolt for the party! Fact is but for his surname even @JM_Scindia has little to show as mass leader, political organiser or administrator. — Prashant Kishor (@PrashantKishor) March 10, 2020 -
పొత్తులపై క్లారిటీ.. నితీష్‌ను టార్గెట్ చేసిన ప్రశాంత్
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శల దాడికి దిగారు. ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ బహిరంగ సభలో నితీష్ ప్రసంగించిన విషయం తెలిసిందే. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు పైగా జేడీయూ విజయం సాధిస్తుందన్న... సీఎం వ్యాఖ్యలపై ప్రశాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో సుధీర్ఘ ప్రసంగం చేసిన నితీష్.. ఢిల్లీ అల్లర్లపై కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాజధాని ఘర్షణలో 46 మంది పౌరులు మరణిస్తే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోరు మొదపకపోవడం దారుణమన్నారు. అలాగే అభివృద్ధి, విద్యా, వైద్యంలో బిహార్ ఇప్పటికీ ఎందుకు వెనుకబడిందో ఆయన స్పష్టం చేయాలని పీకే డిమాండ్ చేశారు. ఐదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా.. కేవలం రాజకీయ ప్రచారం కోసమే సభ నిర్వహించారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా నితీష్‌పై విమర్శలకు దిగారు. (రాజ్యసభకు ప్రశాంత్ కిషోర్..!) శనివారం పట్నాలో నిర్వహించిన బహిరంగ సభలో నితీష్ కీలక అంశాలను ప్రస్తావించిన తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద చట్టాల నేపథ్యంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తూనే.. రాష్ట్రంలో అధికార పార్టీయే టార్గెట్‌గా విమర్శలకు పదునుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులను, విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసేందుకు 100 రోజుల ప్రణాళికను ప్రశాంత్ ఇదివరకే రూపొందించారు. మరోవైపు టీఎంసీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. -
రాజ్యసభకు ప్రశాంత్ కిషోర్..!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పెద్దల సభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రశాంత్ కిషోర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో టీఎంసీకి చెందిన నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే బెంగాల్ అసెంబ్లీలో బలం ఆధారంగా ఆ నాలుగు స్థానాలకు తిరిగి టీఎంసీ కైవసం చేసుకోనుంది. (మరో పార్టీతో జట్టుకట్టిన ప్రశాంత్ కిషోర్) ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన నేతలను రాజ్యసభకు పంపాలని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకులుగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రశాంత్ కిషోర్ పెద్దల సభకు నామినేట్ చేయాలని దీదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రశాంత్ కిషోర్ బహిరంగానే విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే. దీని కారణంగానే జేడీయూ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. ఈ పరిణామాలన్నీ మమతకు అనుకూలంగా ఉండటంతో.. టీఎంసీ తరఫున పీకేను రాజ్యసభకు పంపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించనుందని సమాచారం. (ఎన్నికల నగారా... షెడ్యూల్ విడుదల) కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే మమతకు రాజకీయ సలహాదారుడిగా సేవలందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయమే ధ్వేయంగా పీకే సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దీంతో పీకేను పెద్దల సభకు పంపితే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని దీదీ భావిస్తున్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రశాంత్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది. ఈ వార్తలపై ఇరువురి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. కాగా మార్చి 26న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నారు. (రాజ్యసభ బరిలో మాజీ ఎంపీ కవిత..!) -
ప్రశాంత్ కిషోర్‌పై చీటింగ్ కేసు
పాట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన ఐడియాను కాపీ చేసి ప్రశాంత్ కిషోర్‘ బాత్ బిహార్ కీ’ కార్యక్రమాన్ని రూపొందించారంటూ బిహార్ మోతీహారీకి చెందిన గౌతమ్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ‘బాత్ బిహార్ కీ’ కార్యక్రమం తన ఆలోచనల్లో రూపుదిద్దుకుందని, కానీ, తన మాజీ సహోద్యోగి అయిన ఒసామా అనే వ్యక్తి ఆ ఐడియాను ప్రశాంత్ కిషోర్‌కు చెప్పాడని గౌతమ్ ఆరోపించాడు. తాను ‘బిహార్ కీ బాత్ ’ అనే కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభిస్తే.. ఆయన తన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించాడని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశాడు.( ప్రశాంత్ కిశోర్‌కి యమ క్రేజ్! ) దీంతో 402, 406 సెక్షన్ల కింద ప్రశాంత్ కిషోర్, ఒసామాలపై కేసులు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20న ప్రశాంత్ కిషోర్ ‘బాత్ బిహార్ కీ’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బిహార్‌ను దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.( గాంధీ వైపా? గాడ్సే వైపా? ) -
ప్రశాంత్ కిశోర్‌కి యమ క్రేజ్!
సాక్షి, బెంగళూరు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తిరిగి గెలుపొందడంతో ప్రశాంత్ కిషోర్‌కు డిమాండ్ పెరిగింది. ఆయనతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకులు కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను త్వరలో వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు. కాగా.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. తరువాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీ వైపా? గాడ్సే వైపా? -
గాంధీ వైపా? గాడ్సే వైపా?
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గాంధీ భావజాలాన్ని సమర్థిస్తారో, గాంధీని చంపిన గాడ్సేని సమర్థిస్తున్నవారితో చేతులు కలుపుతారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన భావజాలాన్ని పక్కనపెట్టి నితీశ్ ప్రభుత్వం బీజేపీతో చేతులుకలపడాన్ని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన వ్యతిరేకతను స్పష్టంచేసిన ప్రశాంత్ కిశోర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియాల సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ ఎన్నటికీ వీడబోనని ఎప్పుడూ చెపుతూ ఉండే నితీశ్ నాథూరాం గాడ్సేని సమర్థించే వారితో ఎలా ఉండగలుగుతారని ప్రశాంత్ కిశోర్ సూటిగా ప్రశ్నించారు. నితీశ్ బీజేపీ వైపు ఉండదల్చుకుంటే మాకేం అభ్యంతరం లేదనీ, అయితే ఇటు గాంధీ ఆదర్శాలను సమర్థిస్తూ, అటు గాడ్సే మద్దతుదారులతో చేతులుకలుపుతానంటే కుదరదన్నారు. ఉత్తమ టాప్ 10 రాష్ట్రాల్లో బిహార్‌ను ఒకటిగా చేసేందుకే 20వ తేదీన ‘‘బాత్ బిహార్‌కీ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యువనాయకులను తయారుచేసే దిశగా కృషిచేస్తానని తెలిపారు. వంద రోజుల్లో కోటిమంది యువతను కలుస్తానన్నారు. ప్రశాంత్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. నితీశ్‌ను విమర్శించే బదులు తన విలువైన సమయాన్ని ‘వ్యాపారం’కోసం ప్రశాంత్ కేటాయిస్తే మంచిదని పార్టీ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. -
‘బాత్ బిహార్ కీ’: ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన!
పట్నా: బిహార్ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. అందుకే వేలాది మంది యువతతో రాజకీయ శక్తిని తయారుచేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ మేరకు ‘బాత్ బిహార్ కీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)పై ప్రశాంత్‌కిషోర్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా నిలిచిన జేడీయూ... పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. నితీశ్ నిర్ణయంపై ప్రశాంత్ కిషోర్ ఎలా స్పందిస్తారో అన్న విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు జనతాదళ్ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రశ్నించబోనని స్పష్టం చేశారు. తనకు నితీశ్‌తో సత్సంబంధాలే ఉన్నాయని.. ఆయన మీద అపారమైన గౌరవం కూడా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో.. ‘‘పార్టీ సిద్ధాంతం గురించి నేను, నితీశ్ జీతో చాలా చర్చలు జరిపాను. గాంధీజీ ఆశయాలను పార్టీ ఎన్నటికీ వీడదని ఆయన చెప్పారు. కానీ గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా నేడు వారు మాట్లాడుతున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు గాంధీ- గాడ్సే చేతులు పట్టుకుని ఉండరు కదా’’ అని చురకలు అంటించారు. ‘‘నిజానికి ఘట్బంధన్ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎంతగా తల వంచినప్పటికీ.. పరిస్థితిలో మార్పురావడం లేదు. గత పదిహేనేళ్లుగా నితీశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం చూశాం. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే. పైగా ఆయన కొత్త స్నేహాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బిహార్ ఇప్పుడు ఎక్కడ ఉంది’’ అని నితీశ్ కుమార్, బీజేపీ దోస్తీపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటాను. బిహార్ కోసం పనిచేస్తాను. బిహార్ అభివృద్ధిని కోరుకునే వారు నాతో కలిసి రావచ్చు. రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ‘బాత్ బిహార్ కీ’లో పాల్గొనండి’’ అని పిలుపునిచ్చారు. నితీశ్ పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని.. కానీ ప్రస్తుతం ఆయన కొత్త స్నేహాలు ఇందుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాడ్సే సిద్ధాంతాన్ని అవలంభించే వాళ్లతో కలిసి నడవడం తనకు ఇష్టం లేదన్నారు.(ఆరోజే బిగ్ అనౌన్స్మెంట్: ప్రశాంత్ కిషోర్) Political strategist Prashant Kishor: I am starting a program called 'Baat Bihar ki' from 20th February, to work towards making Bihar one of the 10 best states in the country pic.twitter.com/fZ2GOQM0oo — ANI (@ANI) February 18, 2020 -
ప్రశాంత్‌కిశోర్‌కు జడ్ కేటగిరీ భద్రత !
కోల్‌కతా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించనుందని ఆ రాష్ట్ర సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రశాంత్ కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయనకు ఎందుకు భద్రత కల్పిస్తారని ట్విట్టర్లో ప్రశ్నించారు. -
ఆరోజే బిగ్ అనౌన్స్మెంట్: ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీతో జట్టుకట్టినా విజయం వారిని వరిస్తుందని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి పీకే రచించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలకు ముందు బిహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలు పీకే రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తించాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)పై ప్రశాంత్‌కిషోర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ వాటికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు జేడీయూ ఉపాధ్యక్షుడుగా ఉన్న పీకేను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనపై వేటు పడింది.( ఆరోజు.. అక్కడే మాట్లాడతా: ప్రశాంత్ కిషోర్) ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఈ విషయాల గురించి మాట్లాడతానని పీకే గతంలో ఓ ప్రకటన చేశారు. అయితే ఫిబ్రవరి 11న రిజల్ట్స్ వచ్చినప్పటికీ.. బిహార్ రాజకీయాల గురించి ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. దీంతో రాజకీయ భవిష్యత్తు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీకే.. ‘ఫిబ్రవరి 11 తర్వాత అందరూ కీలక ప్రకటన(బిగ్ అనౌన్స్మెంట్) గురించి ఎదురుచూశారు. అయితే ఫిబ్రవరి 18న ఆ విషయం గురించి మాట్లాడబోతున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ.. పీకే టీంతో జట్టుకట్టారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఐప్యాక్ బృందం.. దీదీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. (పీకే.. పక్కా వ్యూహకర్త) -
పీకే.. పక్కా వ్యూహకర్త
న్యూఢిల్లీ: ప్రశాంత్ కిశోర్. ఎవరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు. ఎన్నో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా తెరవెనుక పని చేసి తనకంటూ ఒక ఇమేజ్ కల్పించుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయంతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్)తో గత డిసెంబర్లో ఆప్ చేతులు కలిపింది. అప్పట్నుంచి ఆప్ ప్రచార ధోరణే మారిపోయింది. బీజేపీ చేసే వ్యతిరేక ప్రచారానికి అసలు బదులివ్వొద్దని, సంయమనం పాటించాలని కేజ్రివాల్‌కు సూచించింది ప్రశాంత్ కిశోరేనని ఐప్యాక్ వర్గాలు వెల్లడించాయి. అలా పాజిటివ్ ప్రచారంతో ఆప్ విజయభేరి మోగించింది. ఫలితాలు వెలువడగానే ప్రశాంత్ కిశోర్ ‘‘భారత్ ఆత్మను కాపాడడానికి ఒక్కటై నిలిచిన ఢిల్లీవాసులకి ధన్యవాదాలు’’అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ సర్కార్ విద్య, ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాలనే ప్రచారంలో హైలైట్ చేశారు. స్విమ్మింగ్ పూల్స్‌తో ఉన్న పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, ఆప్ థీమ్ సాంగ్ లగేరహో కేజ్రివాల్ అనే పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దాడ్లానీతో దగ్గరుండి ట్యూన్ చేయించి ప్రభుత్వ పథకాలు జనంలోకి వెళ్లేలా చేయడంలో విజయం సాధించారు. ఐపాక్ సంస్థ తొలిసారిగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెరవెనుక ఎన్నికల వ్యూహాలను రచించింది. అప్పుడు ప్రచారంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ చాయ్ పే చర్చ కార్యక్రమం రచించింది ప్రశాంత్ కిశోరే. -
మరో పార్టీతో జట్టుకట్టిన ప్రశాంత్ కిషోర్
సాక్షి, చెన్నై : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కొత్త రాజకీయ పార్టీతో జట్టుకట్టారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు రాజకీయ సలహాదారుడిగా ఆయన వ్యవహరించనున్నారు. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలపై స్టాలిన్‌కు సూచనలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. అయితే ఈ విషయాలపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందంపై స్టాలిన్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘తమిళనాడు ప్రజల భవిష్యత్తు కొరకు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కావాల్సిన సహకారాలు ఆయన అందిస్తారు. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆనందంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా’ అని సోషల్ మీడియా వేదికగా స్టాలిన్ ప్రకటించారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కూడా స్పందించారు. ‘మీతో (స్టాలిన్)తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయానికి మావంతు కృషి తప్పక చేస్తాం.’ అని అన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీకి సలహాదారుడిగా వ్యవహరించాలంటూ దేశంలోని ప్రముఖ నేతలంతా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రశాంత్ అపాయింట్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి పీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత బిహార్‌లో నితీష్ కుమార్ కూటమి విజయం, పంజాబ్‌లో అమరిందర్ సింగ్ గెలుపుకోసం విశేషంగా కృషి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఇప్పటికే కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. -
ప్రశాంత్ కిషోర్‌కు మరో ఆఫర్..
పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎపిసోడ్ ముగియక ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్‌ను కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు తమవైపుకు తప్పికునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఆహ్వానం పంపింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఆర్జేడీ నేతలూ ఆయన్ని సంప్రదించేందుకు మంతనాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా.. తేజ్ ప్రతాప్ ప్రకటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!) మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికిప్పుడు తానేమీ మాట్లాడనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న పట్నాలో జరిగే సమావేశంలో తన ప్రణాళికలు గురించి వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా నితీష్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో.. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో జేడీయూ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశాంత్ వ్యవరిస్తున్నారు. బిహార్ అసెంబ్లీకి సమయం దగ్గర పడుతుండంతో ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇరు పార్టీల నేతలు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని తప్పించినట్లు తెలుస్తోంది. (పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!) -
అప్పటి దాకా ఏం మాట్లాడను: పీకే
న్యూఢిల్లీ: తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఫిబ్రవరి 11న పట్నాలో మాట్లాడతానని ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జనతాదళ్(యూ) బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతవరకు తాను ఎవరితోనూ ఏమీ మాట్లానబోనని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సర్కారు తీసుకవచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో జేడీయూ పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించిన విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో ప్రశాంత్ కిషోర్, జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ల వాగ్యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ పీకేపై పార్టీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో.. బిహార్ సీఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన పీకే.. తనను బహిష్కరించినందుకు నితీశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే.. మరోసారి సీఎం కావాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక ఫిబ్రవరి 11న నిర్ణయం చెబుతానంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు.(అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!) కాగా సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పీకే టీంతో జట్టుకట్టి.. బీజేపీని విమర్శించడాన్ని పక్కనపెట్టి.. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన ఫిబ్రవరి 11న తన నిర్ణయం ప్రకటిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో స్పందించారు. తన వ్యూహాలతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జేడీయూకు చెక్ పెడతానని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆహ్వానించారు. ఆయన కోసం తామెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటామని పేర్కొన్నారు.(పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!) -
పీకే బహిష్కరణ.. థాంక్యూ నితీశ్ కుమార్!
పట్నా: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్ వర్మను కూడా పార్టీ నుంచి తొలగించింది. కాగా 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే విధంగా బిహార్‌లో జేడీయూ అధికారం చేపట్టడం, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో పీకే.. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. (అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!) కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉపాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఇరు పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం ప్రశాంత్ తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీలో కొనసాగాలంటే నిబంధనలు, విధానాలకు లోబడి పనిచేయాలని.. లేనట్లయితే పార్టీని వీడవచ్చంటూ నితీశ్ ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశించి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక పార్టీ నిర్ణయంపై ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘థాంక్యూ నితీశ్ కుమార్. మీరు మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’అని ట్వీట్ చేశారు. (ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!) Thank you @NitishKumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.🙏🏼 — Prashant Kishor (@PrashantKishor) January 29, 2020 -
ఇంత దిగజారి అబద్ధం చెప్తారా?
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఫారసు మేరకే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకున్నామని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. తనను ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారనే విషయంలో ఎంతో దిగజారి నితీశ్ అబద్దం చెప్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా సిఫారసు చేసిన వ్యక్తి మాటలు సైతం వినే ధైర్యం లేదని నితీశ్‌కు లేదని ఎద్దేవా చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్‌పై నితీష్ మంగళవారం తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ‘పార్టీలో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు’ అంటూ ప్రశాంత్‌కు ఆయన తేల్చిచెప్పారు. పార్టీలో కొనసాగాలి అనుకుంటే జేడీయూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేకపోతే పార్టీ వదిలి వెళ్లాలన్నారు. దీనిపై ట్విటర్లో స్పందించిన ప్రశాంత్.. నితీశ్ అబద్ధం చెప్తున్నారని పేర్కొన్నారు. చదవండి: అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్డీయే మిత్రపక్షమైన జేడీయూలో కొనసాగుతూ.. బీజేపీ వ్యతిరేక పక్షాలకు మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ తలదూర్చారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. హస్తినలో ఆప్ విజయానికి ప్రణాళికలు రచిస్తూ... తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఆప్ తరఫున ప్రచార బరిలోనూ దిగుతానని ఇటీవల ప్రకటించారు. మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తూ ఇటీవల ఆయన ట్వీట్ కూడా చేశారు. -
సుశీల్‌కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్
పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్‌ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. 'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్ కుమార్ ఇంతకుముందు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. దీంతోపాటు ప్రశాంత్ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ షేర్ చేసిన వీడియోలో సుశీల్ కుమార్ నితీశ్ కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ మాట్లాడుతూ' నితీశ్ కుమార్ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్ డీఎన్ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్‌పై ట్విటర్లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. (విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్: సుశీల్ మోదీ) -
సీఏఏపై అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను అమలు చేయాలని హోంమంత్రి అమిత్ షాకు జనతాదళ్ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. పౌరుల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వానికి బలం కాదని హితవు పలికారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను మీరు ఖాతరు చేయని పక్షంలో మీరు ప్రకటించిన కార్యక్రమానికి అనుగుణంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై ముందుకు వెళ్లి వాటిని ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాగా, నిరసనలకు భయపడి సీఏఏను వెనక్కితీసుకోబోమని, తాము నిరసనల మధ్యే జన్మించామని, ఎదిగామని విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇదే చెబుతున్నామని లక్నోలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పునరుద్ఘాటించిన క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. చదవండి : పౌర నిరసనలు : వారంతా ఏమైపోయినట్టు..? -
విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్..!
పట్నా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం స్థానాల్లో జేడీయూ పోటీచేస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రశాంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య స్నేహాన్ని దెబ్బతీసేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. ప్రశాంత్ వ్యాఖ్యలు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని కూటమి సమర్థించదని అన్నారు. (బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!) మంగళవారం పట్నాలో సుశీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో బీజేపీ-జేడీయూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీట్ల పంపకాలు గురించి పార్టీ అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిహార్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!
న్యూఢిల్లీ: తానెవరో తెలియదంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన లాంటి సామాన్యుల గురించి ఉన్నత పదవిలో ఉన్న మంత్రికి తెలియకపోవడం సాధారణ విషయమే అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సైతం ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పీకే బృందంతో జట్టుకట్టారు. దీంతో కిషోర్ నేత్వంలోని ఐపాక్ టీం తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కో- ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు’ అని ప్రశ్నించారు.(రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!) ఇందుకు బదులుగా పీకే గురించి విలేకరులు ప్రస్తావించడంతో.. ‘ అతడి గురించి నేను తెలుసుకోవాల్సింది.. కానీ నాకు అతనెవరో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పీకే.. ‘ఆయన ఒక సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుల గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్- బిహార్ రాష్ట్రాల నుంచి నాలాగా ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది ఇక్కడ జీవనపోరాటం చేస్తున్నారు. ఆ లక్షల మందిలో ఒక్కడినైన నా గురించి కేంద్ర మంత్రికి తెలిసే అవకాశమే ఉండదు కదా’ అంటూ వినయపూర్వకంగానే హర్దీప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.(అరవింద్ కేజ్రీవాల్‌తో పీకే టీం) ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అవసరం ఉన్నపుడు అతడి సేవలు వినియోగించుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున అతడు ప్రచారంలోకి దిగగానే ఎవరని ప్రశ్నిస్తారా? కనీసం ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీయూ ఉపాధ్యక్షుడని కూడా తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు. Prashant Kishor,Political Strategist on Union Min HS Puri asking 'Who is Prashant Kishor?': He is a senior minister,why will he know a ordinary man like me?In Delhi lakhs of ppl like me from UP-Bihar live and struggle,how will such a senior leader like Puri ji know so many ppl? pic.twitter.com/n9TW1WCCvb — ANI (@ANI) December 28, 2019 -
సీఎంలు స్పందించకుంటే అర్థం ఉండదు..
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)కి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం లేదని రాజకీయ వ్యూహకర్త, జేడీయు వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ట్విటర్ వేదికగా శనివారం విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజేపీపై విమర్శిస్తూ చేసిన వీడియో స్టేట్మెంట్ను చూశానని అన్నారు. శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్సీని సోనియా విమర్శిస్తూ.. బీజేపీ ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు స్పందించకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇటీవలి కాలంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో ప్రశాంత్ కిషోర్ చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. బీజేపీ అమలు చేస్తామంటున్న ఎన్ఆర్సీ.. పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని గతంలో ఆయన ట్వీట్ చేసిన విషయం విదితమే. Congress is not on streets and its top leadership has been largely absent in the citizens’ fight against CAA-NRC The least party could do it to make ALL Congress CMs join other CMs who have said that they will not allow NRC in their states. Or else these statements means nothing https://t.co/EWJLyc3kgR — Prashant Kishor (@PrashantKishor) December 21, 2019 -
అరవింద్ కేజ్రీవాల్‌తో పీకే టీం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. వరుసగా రెండోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో జత కడుతున్నట్టు వెల్లడించారు. రాజధానిలో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ-పీఏసి)తో ఆప్ కలిసి పనిచేయనున్నట్టు ట్విటర్ ద్వారా ముఖ్యమంత్రి శనివారం ప్రకటించారు. ఐపాక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది..స్వాగతం అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీంతో కేజ్రీవాల్, పీకే (ప్రశాంత్ కిషోర్) టీం భాగస్వామ్యం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని ఐపాక్ కూడా తన ట్వీట్ ద్వారా ధృవీకరించింది. పంజాబ్ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్‌ను గుర్తించామని, ఈ నేపథ్యంలో ఆప్‌తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్ పేర్కొంది. వివాదాస్పదమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి), పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. అలాగే ఐపాక్ తాజా క్లయింట్లు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం ఆసక్తికరమైన విషయం. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాగా వేసి, ఢిల్లీలో కూడా అధికార పగ్గాలకోసం ఉవ్విరూళుతున్న బీజేపీ షాకిచ్చేలా కేజ్రీవాల్ ఈ కీలక అడుగు వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా తనదైన శైలిలో రాణిస్తూ ఆయా పార్టీలకు అధికారాన్ని సునాయాసంగా అందిస్తున్న పీకే వ్యూహాలు అరవింద్ కేజ్రీవాల్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి. కాగా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ పనిచేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో దీదీ మమతా బెనర్జీ కూడా పీకేను నమ్ముకున్న సంగతి తెలిసిందే. Happy to share that @indianpac is coming on-board with us. Welcome aboard! — Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2019 After Punjab results, we acknowledged you as the toughest opponent that we have ever faced. Happy to join forces now with @ArvindKejriwal and @AamAadmiParty. https://t.co/5Rcz4ie6Xs — I-PAC (@IndianPAC) December 14, 2019 -
ఓ సారి ఆలోచించండి : ప్రశాంత్ కిషోర్
పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నాయకులు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ బిల్లుపై తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తీకరించారు. పౌరసత్వ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరనుండగా.. ఆయన తన పార్టీ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై ఓ సారి ఆలోచించాలని కోరారు. 2015 ఎన్నికల సమయంలో జేడీయూ గెలుపుకు కృషి చేసిన వారి గురించి ఆలోచించాలంటూ ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు మరికొందరు జేడీయూ నేతలు కూడా పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన జేడీయూ.. రాజ్యసభలో కూడా అదే వైఖరితో ముందుకు సాగాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం కూడా ఈ బిల్లుపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించే బిల్లుకు జేడీయూ లోక్‌సభలో మద్దతు తెలుపడం నిరాశకు గురిచేసిందన్నారు. -
రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీ వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీకే టీం రాజకీయాల్లో యువత (పాలిటిక్స్ ఇన్ యూత్) పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతలో రాజకీయ చైతన్యం పెంచే క్రమంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే దిశగా ముందు సాగుతోంది. ఇప్పటికే రోజుకు దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు నాటికి 5 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పీకే టీం ప్రణాళికలు రచిస్తోంది. తమ టార్గెట్ పూర్తైన తర్వాత 15 నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనుంది. ఇక ఈ ట్రెయినింగ్ పూర్తైన తర్వాత యువత తమకు నచ్చిన పార్టీలో చేరే వీలు కల్పించడం విశేషం. మరోవైపు టీఎంసీ కూడా ‘యూత్ ఇన్ పాలిటిక్స్’ పేరిట సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీకి... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇక బెంగాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యూహకర్తగా ఉంటే గెలుపు తథ్యమనే భావన నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో బెంగాల్లో క్రమేపీ బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు దీదీ పీకే టీంను ఎంచుకున్నట్లు సమాచారం. -
దీదీ కోసం పీకే..?
న్యూఢిల్లీ : ప్రశాంత్ కిషోర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం వెనక ప్రశాంత్ వ్యూహాలు ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం.. నరేంద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం వెనక కూడా పీకే వ్యూహాలు కీలకంగా పని చేశాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యూహకర్తగా ఉంటే గెలుపు తథ్యమనే అభిప్రాయం నాయకుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు దీదీ, పీకేతో భేటీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో కలిసి పని చేయాల్సిందిగా దీదీ.. పీకేను కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బెంగాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యి.. తమ పార్టీ కోసం పని చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. -
నితీశ్‌పై లాలూ పుస్తకంలో వ్యాఖ్యలు.. దుమారం!
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి మహాగట్బంధన్ (మహాకూటమి)లో చేరడానికి ప్రయత్నించారని ప్రతిపక్ష ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పుస్తకంలో రాసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ‘మహాకూటమిని వీడి, ఎన్డీయేలో చేరిన ఆరు నెలలకే, తిరిగి మా దగ్గరికి రావడానికి నితీష్ కుమార్ చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన మా నమ్మకాన్ని కోల్పోయార’ని ‘గోపాల్‌గంజ్ టూ రైజినా: మై పొలిటికల్ జర్నీ’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. జేడీ (యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీని మళ్లీ కూటమిలో చేర్చే అంశానికి సంబంధించి తనను పలుమార్లు సంప్రదించారని లాలూ పుస్తకంలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన లాలూ తనయుడు తేజస్వీ కూడా.. ఆర్జేడీ కూటమిలో తిరిగి చేరే విషయంపై తమతో మాట్లాడినట్టు తెలిపారు. గతేడాది ఈ విషయంపై తేజస్వీ మాట్లాడేతూ.. ‘ఎన్డీయేలో జేడీ (యూ) చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఆ పార్టీకి మహాకూటమిలో చోటు లేదు. వారికి కూటమిలోకి వచ్చే తలుపులను మూసేశామ’ని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. లాలూ మాటల్ని బోగస్‌గా కొట్టేసిన ఆయన.. ‘మా అధినేత (నితీష్ కుమార్) ఔచిత్యాన్ని దెబ్బతీయడానికి ఆర్జేడీ చేసిన పేలవ ప్రయత్నమిది. నేను జేడీయూలో చేరడానికి ముందు లాలూను కలిశాను. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణా వివరాలను వెల్లడిస్తే, ఆయన చిన్నబుచ్చుకోవడం ఖాయమ’ని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సీంకీర్ణ కూటమిలో దాదాపు 20 నెలలున్న తర్వాత 2017లో నితీష్‌కుమార్.. అందులోంచి బయటకు వచ్చి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు. -
చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి : ‘రావలి జగన్, కావలి జగన్’ పాట యూట్యూబ్‌లో సంచలనాలను సృష్టిస్తోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్విటర్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రచార పాటను కోటిమందికి పైగా వీక్షించడం యూట్యూబ్‌లో సరికొత్త రికార్డని తెలిపారు. ‘సోదరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేలోపే రాక్‌స్టార్‌ని చేశారు. సీబీఎన్‌జీ (చంద్రబాబు నాయుడు గారు) మీ నుంచి మరిన్ని విమర్శలు రాకముందే కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. The first EVER political campaign song to have crossed 10 Million views on YouTube. @ysjagan, brother, before people of AP bless you to become their CM, they have already made you the rockstar! @ncbn, Sirji, thanks in advance for no more abuses 🙏https://t.co/L0ff118Iub — Prashant Kishor (@PrashantKishor) 30 March 2019 చదవండి...(కోటికి చేరిన ‘రావాలి జగన్ కావాలి జగన్’) కాగా..ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ఎన్నికల ప్రచార వీడియో ‘రావాలి జగన్.. కావాలి జగన్’. వైఎస్సార్సీపీ రూపొందించిన ఈ వీడియో ఏకంగా కోటి వీక్షణలతో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, జగన్ వైపు అబ్బురంగా చూస్తోంది. ఒక పార్టీ ప్రచార గీతం.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం.. జాతీయ పార్టీల ప్రచార గీతాలను వెనక్కినెట్టి మరీ రికార్డు స్థాయి వ్యూవర్స్‌ను ఆకర్షించడమే దీనంతటికీ కారణం. -
బాబుపై ప్రశాంత్ కిషోర్ ఫైర్
-
బాబుపై ప్రశాంత్ కిషోర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ చెలరేగిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు. ఓటమి కళ్లముందు మెదులుతుంటే చంద్రబాబులాంటి నేతలు అడ్డగోలుగా మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదని, బిహార్‌ను కించపరిచేరీతిలో దుర్భాషలు ఆడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటెయ్యాలనే దానిపై ఫోకస్ చేయండి అంటూ చంద్రబాబుకు ఘాటుగా సూచించారు. ‘ ఓటమి తథ్యమని తేలడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది. చంద్రబాబునాయుడు ఉపయోగిస్తున్న భాష నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. సర్జీ బిహార్‌ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానిపై ఫోకస్ చేయాలి’ అని ప్రశాంత్ కిషోర్ ట్విటర్లో హితవు పలికారు. ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారని, బిహార్ బందీపోటు ప్రశాంత్ కిషోర్ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని అడ్డగోలుగా చేసిన ఆరోపణలపై ఆయన ఈమేరకు స్పందించారు. An imminent defeat can rattle even the most seasoned politicians. So I’m not surprised with the baseless utterances of @ncbn Sirji rather than using derogatory language that shows your prejudice & malice against Bihar, just focus on why people of AP should vote for you again. https://t.co/CYSJNRJ43W — Prashant Kishor (@PrashantKishor) 19 March 2019 -
ఉద్ధవ్ ఠాక్రేతో ప్రశాంత్ కిశోర్ భేటీ
ముంబై: జనతాదళ్(యు) ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సేన– బీజేపీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన నిరాకరించింది. ‘ఎన్డీఏలో భాగంగానే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది’ అంటూ ప్రశాంత్ కిశోర్ అంతకుముందు ట్విట్టర్లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం ‘మాతోశ్రీ’కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే బదులిచ్చారు. ఉద్ధవ్, ప్రశాంత్ కిశోర్‌ల భేటీ ఫొటోలను ఆదిత్య థాకరే ట్విట్టర్లో ఉంచారు. శివసేన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంది. -
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన జగన్
♦ మన పార్టీ కోసం సహాయసహకారాలు అందిస్తారు ♦ నరేంద్ర మోదీ గెలుపులో ఆయనదే క్రియాశీలకపాత్ర ♦ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా: జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. దేశ రాజకీయాల్లో అవగాహన ఉన్న వారందరికీ ఆయన తెలిసే ఉంటారని చెప్పారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. అదేవిధంగా బిహార్‌లో నితీశ్ కుమార్‌ను గెలిపించారని చెప్పారు. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ గెలుస్తుందని అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో తన వ్యూహాల ద్వారా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారన్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కాస్త దెబ్బతగిలిందని, అందుకు కారణాలు అందరికీ తెలిసినవేనని వైఎస్ జగన్ అన్నారు. రానున్న ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటారని, సహాయసహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు ఇక్కడ ఏకమై రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిస్తున్నామని, చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేసేందుకు దశదిశా నిర్దేశించుకుంటున్నామని చెప్పారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ తనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
పార్టీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ