సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్‌కిశోర్ అవసరమే లేదని, గాంధీభవన్‌కు వచ్చి చూస్తే అక్కడ ఎంతమంది ప్రశాంత్‌కిశోర్‌లు ఉన్నారో తెలుస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియాహాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రశాంత్‌కిశోర్‌తో సమానమన్నారు. ప్రశాంత్‌కిశోర్ కనీస పరిజ్ఞానం లేకుండా తమ పార్టీ నేత రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీది మూడోస్థానమేనని అన్నారు. బీజేపీనే కాదు బీఎస్పీ కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాలెలా ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు దోస్తానా ఉండదని, ఉండేది కొట్లాటేనని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో 230 ఓట్లున్న తమను చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందని, అందుకే తామేదో చేస్తున్నామంటూ ఫిర్యాదు చేస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment