ఇప్పటికే బాబు కోసం పని చేస్తున్న ఓ పీకే(పవన్ కల్యాణ్)
తాజాగా ఏపీ రాజకీయాల్లోకి మరో పీకే(ప్రశాంత్ కిషోర్)
కొంతకాలంగా ప్రైవేట్ ఇంటర్వ్యూల్లో చంద్రబాబుకి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ స్టేట్‌మెంట్లు
హైలైట్ చేస్తూ మురిసిపోతున్న ఎల్లో మీడియా
ఇద్దరు ప్యాకేజీ స్టార్లతో చెత్త రాజకీయాలు నడిపిస్తున్న చంద్రబాబు
ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల వ్యూహకర్త. ఆయన స్కెచ్ వేశాడంటే.. ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే!. ఒక పార్టీకో, ఒక కూటమికో అనుకూలం అని కాకుండా.. పరిస్థితుల్ని బట్టి ఆ సమయానికి ఐ-ప్యాక్(Indian Political Action Committee) అనే రాజకీయ వ్యవహారాల విభాగంతో ఫలానా పార్టీకి పని చేసి విజయాల్ని అందిస్తూ వచ్చిన వ్యక్తి. కానీ, ఇదంతా గతం. ఇప్పుడాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు. దిగితే ఫర్వాలేదు.. చంద్రబాబు లాంటి వాళ్లతో చేతులు కలిపి మకిలి అంటించుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
కొన్ని నెలల కిందట.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ గంటన్నరకు పైగా భేటీ అయ్యాడు. ఆ చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గత ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ కోసం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం పని చేసిన పీకే.. ఈసారి చంద్రబాబు కోసం పని చేయబోతున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ అనుకూల వెబ్‌సైట్లు బిల్డప్పులు అల్లేసి తెగ రాసేశాయి. ఆ ఊకదంపుడు మీడియా రాతల్ని ఐ-టీడీపీ పేజీలు, జనసేన సోషల్ మీడియా విభాగాలు తెగ ప్రచారం చేశాయి. చివరకు తాను చంద్రబాబుకి పని చేయబోవడం లేదంటూ పీకే క్లారిటీ ఇచ్చేదాకా ఆ ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే ఆ తర్వాతి నుంచే పీకే ఇక్కడి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తున్నాడు.
‘‘చంద్రబాబు ఎప్పటి నుంచో నన్ను కలవాలని అనుకుంటున్నారట. ఓ కామన్ ఫ్రెండ్ పదే పదే ఒత్తిడి చేయడంతో వెళ్లి కలిశాను. ఈసారి జరగబోయే ఎన్నికలకు నన్ను పనిచేయమని అడిగారు. కానీ, నేను ఇప్పుడు అలాంటి పనులు(ఎన్నికల వ్యూహకర్త) చేయడం లేదని చెప్పాను’’ అని ప్రశాంత్ కిషోర్ పచ్చ మీడియా అల్లిన కథలకు చెక్ పెట్టాడు. అయితే.. ఇద్దరు పీకేలతో చంద్రబాబు ఆడిస్తున్న చెత్త రాజకీయ డ్రామాలు ఇప్పుడు ఎల్లో మీడియా సాక్షిగా బయటపడింది.
ఐ-ప్యాక్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయ వ్యూహాలకు దూరమైన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ రొంపిలోకి దిగి కుట్రలను మాత్రం అలవర్చుకున్నట్లు అవగతమవుతోంది. బీహార్ రాజకీయాల్లో జన సూరాజ్ పేరిట ఆయన చేసిన హడావిడినే అందుకు నిదర్శనం. రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగాయి నైరాశంలో ఉండిపోయాడు. అయితే అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో.. ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే.. పలు పార్టీలకు అనుకూలంగా ప్రైవేట్ ఇంటర్వ్యూలలో స్టేట్‌మెంట్లు ఇవ్వడం!.
తాను రాజకీయ వ్యూహాలకు శాశ్వతంగా దూరమైనట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించుకున్నారు. కానీ, వరుస పెట్టి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మాత్రం ఆయన ఆ హోదాతోనే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఆ వ్యాఖ్యలనే ఆయా పార్టీల అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుతోనూ ‘ఏదో’ డీల్ కుదిరినట్లు ఆయన వరుసగా ఏపీ రాజకీయాలపై ఇస్తున్న ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.
మరోవైపు.. అప్పటికే ఉన్న దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ టీడీపీ కోసం ఎంతలా పని చేస్తున్నాడో చూస్తూన్నదే. కూటమి పేరిట బీజేపీ, టీడీపీని చేర్చే క్రమంలో జనసేన తరఫున పవన్ ఎన్నో త్యాగాలు చేశాడట. చివరకు బాబులాంటి వాడితో పొత్తు కోసం నీ రాయబారం ఏంటయ్యా? అని బీజేపీతోనూ తిట్లు తిన్నాడట. స్వయంగా ఈ ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్.. అయినా సరే బాబుకు ఊడిగం చేయడంలో ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేశాడు. నమ్ముకున్నవాళ్లను, పదేళ్లుగా పార్టీ వెంట నడుస్తున్న వాళ్లకు వెన్నుపోటు పొడుస్తూ.. 21 సీట్లతో సర్దిపుచ్చుకుని ప్యాకేజీకి న్యాయం చేయడంలో సార్థక నామధేయుడిగా నిలిచాడు.
వచ్చే ఎన్నికల్లో తాను, తన పార్టీ, కూటమిగా వచ్చినా గెలవలేదనే విషయం చంద్రబాబుకు అర్థమైంది. ఒకవైపు పవన్ కల్యాణ్ సినీ గ్లామర్‌ను మరోసారి వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు.. సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ ఓడిపోతారంటూ పీకే ద్వారా నాలుగు మాటలు చెప్పిస్తున్నాడు. మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పించాడు. తాజాగా పీటీఐ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం కష్టమంటూ ప్రశాంత్ కిషోర్ ఓ ప్రకటన ఇచ్చాడు. ఇంకేం.. ఎల్లో మీడియా సంబురాలు చేసుకుంటోంది. ఆ ఇంటర్వ్యూను ఎగ్గొట్టి దిగ్గొట్టి రకరకాలుగా కథనాలు ఇస్తోంది. గతంలో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన పీకే.. ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి. అదీ.. చంద్రబాబును కలిశాకే.
కొత్తగా @ncbn నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో అలా అంటున్నావు కానీ రాష్ట్రాభివృద్ధికి ఎవరేం చేశారన్నది కేంద్ర గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి ప్రశాంత్ కిషోర్.
— YSR Congress Party (@YSRCParty) April 7, 2024
విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో వృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఏపీ సీఎం వైయస్… pic.twitter.com/T5GL7SKi2q
అయినా ఒకప్పుడు ప్యాకేజీలు తీసుకుని పార్టీల కోసం సలహాలు, సూచనలు ఇచ్చిన వ్యూహకర్త.. ఇప్పుడు పొలిటీషియన్‌గా జెన్యూన్ స్టేట్‌మెంట్లు ఇస్తారని అనుకోగలమా?. పైగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు ఎలాంటి సర్వేలు చేయడం లేదు. పైగా ఆయన వేస్తున్న అంచనాలు ఘోరంగా తప్పుతున్నాయి. ఉదాహరణకు.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుస్తుందని చెప్పిన అంచనా బోల్తా కొట్టింది. కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా అనుభవం, కాస్త పైత్యాన్ని రంగరించే వరుస ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరి పదే పదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఏపీ రాజకీయాలపై ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తుంటే.. ఎల్లో మీడియా కూడా ఆ కథనాలనే ప్రముఖంగా ప్రచురిస్తుంటే ఏపీ ప్రజలుప్రజలు అర్థం చేసుకోలేరా?.. పైగా కరకట్ట నివాసం భేటీ తర్వాతే పీకే ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే అనుమానాలు రావా?.. ఇద్దరు పీకేలు, ఇద్దరూ ప్యాకేజీ స్టార్లతో యాంటీ జగన్ వేవ్‌ను సృష్టించేందుకు నడుస్తున్న పచ్చ కుట్రలను అర్థం చేసుకోలేరా?.. అసలు చంద్రబాబు నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని.. అది ఎన్నికల సమయంలో ఆశించడం అత్యాశే అవుతుందేమో కదా!.
Comments
Please login to add a commentAdd a comment