
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడతామన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కేంద్రం నుంచి ఆర్థిక సాయం తగ్గిందన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులే చెప్పారన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడే ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.
పెన్షన్‌దారుల సాధన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
విజయవాడ: సీఎం చంద్రబాబు 8 నెలలు అవుతున్నా పేదలకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ పెన్షన్ దారుల సాధన సంక్షేమ కమిటీ ప్రశ్నించింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం కార్పొరేటర్ సత్తిబాబు, పెన్షన్ రద్దు అయిన వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు. గతంలో ఉన్న పెన్షన్లను ఇప్పుడు తొలగించడం దారుణమని.. సంక్షేమ పాలన అంటే.. పెన్షన్లు కట్ చేయడమేనా? అంటూ సత్తిబాబు నిలదీశారు.
‘‘ఉన్నత వర్గాలకు కూటమి ప్రభుత్వం దోచిపెడుతోంది. పెన్షన్ కోసం అర్జీలు పెట్టుకున్నా రావడం లేదు. తక్షణం రద్దు చేసిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆలస్యం అయితే పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. ఈ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల విషయంపై ప్రకటన చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment