ramakrishna CPI
-
కూటమి సర్కార్ ఫెయిల్.. చంద్రబాబుకు సీపీఐ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందంటూ చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధరల నియంత్రణలో ఇంత దారుణంగా ప్రభుత్వం ఫెయిలవుతుందని తాను ఊహించనేలేదన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ట్రూ అప్ ఛార్జీల 17 వేల కోట్ల రూపాయలు భారం రూపంలో మోపుతున్నారంటూ ఆయన నిలదీశారు.‘‘ఏపీ చరిత్రలో ఇంత భారం ఏనాడూ మోపలేదు. ట్రూ అప్ ఛార్జీల భారంపై ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన చేపడతాం. నవంబర్ నెలాఖరు వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తాం. ట్రూ అప్ ఛార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాడతాం. కరెంట్ ఛార్జీలు మోపితే కచ్చితంగా అదే మీకు శాపం అవుతుంది. డిసెంబర్లో విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అని రామకృష్ణ హెచ్చరించారు.‘‘నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోతున్నారు. చంద్రబాబు బుస్ బుస్ అనడం తప్ప ఏం ఉపయోగం లేదు. నాదెండ్ల మనోహర్ అక్కడక్కడా తిరిగినా ఏం ప్రయోజనం. ముఖ్యమంత్రులు, మంత్రుల మాట ఒక్కడు ఖాతరు చేయడం లేదు. మంత్రుల హుకరింపులు తప్ప ధరలు తగ్గిందే లేదు. ఒక్క వస్తువుపై ఒక్క రూపాయి కూడా తగ్గలేదు’’ అని రామకృష్ణ దుయ్యబట్టారు.‘‘ఉచిత ఇసుకను అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఫెయిల్ చేశారు. మీ ఎమ్మెల్యేలే బ్లాక్ చేసి అమ్ముకుంటుంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం చెప్పిన మాట ఏదీ అమలు కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాట ఎవరూ వినే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు. నీటిపారుదల రంగంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతోందనే ఆందోళన నెలకొంది. గోదావరి, కృష్ణా,పెన్నా నదులను అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. పోలవరం అంశంలో కేంద్రం పదేపదే ఆటంకాలు కలిగించాలని చూస్తోంది. కానీ కేంద్రం వైఖరితో అన్ని రకాలుగా మనకు ప్రమాదం పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘పోలవరం ఎత్తు 4.15 మీటర్లకు కుదించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఏపీ ప్రయోజనాలు నెరవేరాలంటే పోలవరం 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిందే. ఎత్తు తగ్గించడం వల్ల నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్లు ఆదాయం చేసుకోవాలని చూస్తున్నారు. పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్ధ్యం తగ్గించాలని చూస్తున్నారు. నిధులు ఆదా చేసుకునేందుకు పరిహారం ఎగ్గొట్టేందుకే ఈ ప్రయత్నాలు. ఎత్తు తగ్గింపు, కాలువల సామర్ధ్యం తగ్గింపు ద్వారా 29 వేల కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పదే పదే ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు పోలవరం విషయంపై కేంద్రంతో ఏం మాట్లాడుతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఏం చెప్పింది?. మీరు ఏం వివరించారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని రామకృష్ణ నిలదీశారు.‘‘విభజన బిల్లులో 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. 194 టీఎంసీల నీటిలో కోత పెట్టాలని చూస్తున్నారు. గోదావరి, కృష్ణానది జలాల్లో ఏపీకి అన్యాయం జరగకుండా చంద్రబాబు చూడాలి. పోలవరం పై చంద్రబాబు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాజకీయ, ఇరిగేషన్, రైతు సంఘాలతో చర్చించాలి. పోలవరం పార్టీ వ్యవహారం కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. నదీ జలాల్లో మరోసారి అన్యాయం జరిగితే ఏపీ భవిష్యత్తు అంధకారమే. పోలవరంపై చంద్రబాబు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ తెగనమ్మడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరండి’’ అంటూ రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి -
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ? అంటూ ప్రశ్నించారు.‘‘సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు? బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?. నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. నాలుగేళ్లలో మోదీ ఏం చేశాడు? మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి?’’ అని రామకృష్ణ నిలదీశారు.‘‘కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’’ అంటూ రామకృష్ణ మండిపడ్డారు. -
రామకృష్ణ రూటే సెపరేటు.. నిజాలు తెలిసి నాలుక మడత
కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాడతారనే పేరుండేది. కాని ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రకటనలు అనుమానాలకు తావిస్తోంది. సిద్ధాంతాలకు తిలోదకాలు భారత కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణ.. పాతికేళ్ళ క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కొంతకాలంగా రామకృష్ణ అనుసరిస్తున్న తీరుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని సీపీఐ వర్గాలే చెబుతున్నాయి. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా పోరాడే పార్టీగా తమ పార్టీ సీపీఐకి బ్రాండ్ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణపై సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రామకృష్ణ. అనంతపురం కేంద్రంగా గత కొన్ని రోజులనుంచి జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాకీపై పచ్చ పడగ అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జాకీ కంపెనీ ముందుకొచ్చింది. 129 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనంతపురంరాప్తాడు మధ్య 27 ఎకరాల భూమిని సేకరించి కంపెనీకి ఇచ్చింది. 2018లోపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ జాకీ కంపెనీ రాప్తాడులో ఏర్పాటు కాలేదు. రాప్తాడుకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ఈ కంపెనీని ఇరవై కోట్ల రూపాయల కమిషన్లు అడిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఆ రోజున సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతల అవినీతి గురించి ప్రశ్నించలేదు. అర్థాంతరంగా పనులు నిలిపివేసి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమపై ఆయన ఏ మాత్రం స్పందించలేదు. నిజాలు తెలిసి నాలుక మడత నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జాకీ అంశం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేయటం వల్లే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఆరోపించారు. దీన్నే ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తెలుగుదేశం నాయకుల ఆరోపణలకు మద్దతుగా రంగంలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ రాలేదంటూ టీడీపీ ఆరోపణలను రామకృష్ణ కూడా వల్లె వేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల వల్లే జాకీ కంపెనీ వెళ్లిపోతే..అప్పుడు సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ మాజీ మంత్రి పరిటాల సునీతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యే తోపుదుర్తిపైనా ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో టాక్ నడుస్తోంది. ఏమైంది చిత్తశుద్ధి? ఆనాడు మౌనంగా ఉండి నేడు హడావిడి చేయడానికి కారణం టీడీపీకి మద్దతుగా నిలవడమేనని కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ నేతల అవినీతి, జాకీ పరిశ్రమ తరలిపోవటంపై నిలదీసి ఉండోచ్చని అంటున్నారు. హింసా రాజకీయాలు అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని వెనకేసుకు రావటం ద్వారా సీపీఐ నేత రామకృష్ణ కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీశారంటూ జిల్లాలోని వామపక్ష వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘అక్కడ జూమ్‌లో ఆదేశిస్తారు.. ఇక్కడ అమలు చేస్తారు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు అజెండా కోసమే సీపీఐ నేత రామకృష్ణ పనిచేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరంపై సీపీఐ రామకృష్ణ రాజకీయం చేయాలని చూశారని, అలాంటివి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహించదని ధ్వజమెత్తారు. ‘‘పోలవరం గురించి తెలుసుకోవాలంటే పది మంది వెళ్తే సరిపోతుంది. 200 మంది వెళ్లి పోలవరంలో ఏమి చేస్తారు. వామపక్ష పార్టీలు పేదల కోసం పోరాడేవి. ఇప్పుడు సీపీఐ రామకృష్ణ చంద్రబాబు అజెండా కోసం, మెప్పు కోసం పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పోలవరంపై రామకృష్ణ ఎందుకు పోరాటం చేయలేదు. ఎర్త్ డ్యాం పనులే ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతాయి. రామకృష్ణ చెప్పినట్టు అంగుళం ఎత్తు కూడా తగ్గించడం లేదు. పోలవరం ప్రారంభోత్సవానికి మిమ్మల్ని పిలుస్తాం. వచ్చి టేపు పట్టుకుని కొలతలు వేసుకోవచ్చు. (చదవండి: ‘హైదరాబాద్ జూమ్ టీవీలో ప్రతిపక్షం’) పోలవరంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు.. చంద్రబాబుకు నష్టం జరిగే వ్యాఖ్యలు రామకృష్ణ చేయరు. కేవలం రచ్చ చేయడానికి పోలవరం వెళ్లే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల నుండి ప్రతినిధులు వచ్చినా పోలవరం పనులు మేము వివరిస్తాం. ప్రతి పార్టీ నుండి ఇద్దరు వచ్చినా వివరాలు అందిస్తాం. జూమ్‌లో చంద్రబాబు ఆదేశాలు ఇస్తారు. రామకృష్ణ ఇక్కడ అమలు చేశారు. పోలవరం అర్అండ్ఆర్ గృహ నిర్మాణల పై రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబు చేసిన గలీజును కడిగేస్తుంటే చూసి ఓర్వలేక పోతున్నారు. పోలవరంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. 2017లో క్యాబినెట్లో చంద్రబాబు ఒప్పుకున్న దానిని గురించి రామకృష్ణ నోరు మెదపరని’’ మంత్రి నిప్పులు చెరిగారు. (చదవండి: పోలవరం పరుగులు: ఎమ్మెల్సీ డొక్కా) రచ్చ చేస్తానంటే చూస్తూ ఊరుకోం.. 2021కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఆదేశాలతో రామకృష్ణ రచ్చ చేస్తానంటే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరం కడతానని ఒప్పుకున్నారు. ఆర్ధిక మంత్రి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఇవి వారికి కనబడవని మంత్రి ధ్వజమెత్తారు. ‘‘పోలవరం కట్టి ఎడమ, కుడి కాల్వ నుంచి నీరు ఇస్తాం. పోలవరం పూర్తయితే.. కొంత మంది కళ్లలో రక్తం కారుతుంది. పోలవరం దగ్గర బల ప్రదర్శనలు పనికి రావు. ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క అడుగు, సెంటీ మీటర్ తగ్గిస్తుందని చెప్పిందా? 70 సంవత్సరాల కల పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన మహానేత వైఎస్సార్. ఎన్టీఆర్‌ను 150 అడుగులు లోతులో పూడ్చిన నేత చంద్రబాబు. ప్రాజెక్ట్ పూర్తయితే వైఎస్సార్ విగ్రహం పెడతామంటే తప్పేముంది. పోలవరం కోసం వైఎస్సార్ చేసిన కృషి ప్రజలకు తెలియాలి. వయసు పైబడిన చంద్రబాబుకు మతి భ్రమించిందని’’ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. -
ఆయనకు అసలు మానవత్వం ఉందా?
సాక్షి, విజయవాడ: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆయనకు అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వారిని సోము వీర్రాజు మత కోణంలో చూస్తున్నారే తప్ప మనుషులుగా చూడటం లేదని దుయ్యబట్టారు. ప్రతి విషయం మత కోణంలో చూడటం తగదన్నారు. సోము వీర్రాజు నంద్యాలకు వెళ్లి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రామకృష్ణ హితవు పలికారు. (చదవండి: ‘ఆ మాటలు ప్రజలు మరిచిపోలేదు’) శవ రాజకీయాలు నీచమైన చర్య.. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన బాధాకరమని ఏపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ వారి ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. అబ్దుల్ సలాం ఘటనను టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణమన్నారు. ‘‘చంద్రబాబు ప్యాకేజీలిచ్చి రాజకీయ లబ్ధి పొందడం కొత్తేమీ కాదు. ఆయన కుట్రలను మైనార్టీలు నమ్మరు. మైనార్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేయడం నీచమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. (చదవండి: అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!) -
‘రమేష్‌ను ఎక్కడ దాచారో చంద్రబాబు చెప్పాలి’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో ప్రజా ఉద్యమమే లేదు. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం అన్నారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. అమరావతి అనేది పెద్ద స్కాం. చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమమం ఇలా ఉంటుందా. దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాం. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు’ అని స్పష్టం చేశారు అంబటి. (డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?) అంతేకాక ‘జూమ్‌లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు. పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు. తమది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా.. లేక క్యాప్టలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా అనే దానికి రామకృష్ణ సమాధానం చెప్పాలి. నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా. అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు.. తనని పోలీసులకు అప్పగించాలి. విచారణకు రమేష్ సహకరించాలి. తనని ఎక్కడ దాచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు అంబటి. -
ఆంగ్ల బోధనపై ‘కన్నా’ వ్యాఖ్యలను ఖండించిన సీపీఐ
సాక్షి, అమరావతి: ఆంగ్లభాషలో బోధన..మత మార్పిడిలను ప్రోత్సహించేదిగా ఉందన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత మార్పిడిలను ప్రోత్సహించేదైతే మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారని ప్రశ్నించారు. తెలుగుతో సమాంతరంగా ఆంగ్లభాషలో బోధనను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. చదవండి: అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్ -
వారిలో కౌలు రైతులే అధికం : సీపీఎం మధు
సాక్షి, విజయవాడ : ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కనీసం 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ సాయం అందటం లేదని పేర్కొన్నారు. కౌలు రైతుకు పెట్టుబడి సాయంగా రూ.25 వేలు అందించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. భూ యజమానులకే ప్రభుత్వ సాయం : రామకృష్ణ భూ యజమానులకే ప్రభుత్వ సాయం అందుతోందని, నిజమైన పేద కౌలు రైతులకు సాయం అందకపోవటం వల్లే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ల సమయంలోనే ప్రభుత్వానికి రైతులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం స్వామీనాథన్ కమిటీ సిఫార్సులు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏమీ చేయలేదన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, రైతులు తమ ఇబ్బందులను చెప్పేందుకు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తే వారిపై లాఠీచార్జ్ చేయించారని మండిపడ్డారు. -
‘ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తారా బాబూ..?’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రం వ్యాప్తంగా 16 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. ఆయన తీరు చూస్తుంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు పట్టం కడితే అదే జరగొచ్చని హెచ్చరించారు. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడానికే ప్రైవేటు పాట పాడుతున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రజానీకం ఓవైపు కరువుతో అల్లాడుతోంటే మంత్రివర్గంలో కనీస చర్చ పెట్టరు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో చంద్రబాబు ఇద్దరూ ప్రైవేటు వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారు’ అని విమర్శించారు. కరువు మండలాల్లో రైతు రుణమాఫీ చేసి.. పంట నష్ట పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నెల 27న రైతులకు ఆదుకోవడానికి ‘రైతుబంద్’కు పిలుపునిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీలు నిత్యం నిరసనలు చేస్తుంటే ప్రధాని కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎంపీలకు మద్దతుగా 3,4 తేదీల్లో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. -
‘వారి మధ్య వైరం ప్రజలకు శాపంగా మారింది’
సాక్షి, విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని అన్నారు. 522 మండలాలు డ్రై మండలాలుగా ఉన్నాయని, 347 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలను ఆదుకోవాలని కోరారు. రబీ పంట లేదని, ఖరీఫ్‌లో నష్టపోయారు.. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఈ నెల 17న కర్నూలులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఇరుపార్టీల ఆధ్వర్యంలో పీపుల్స్ ఎజెండా ప్రకటించి, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను చంద్రబాబు పక్కన పెట్టాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకబేరంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గురువారం 16వ ఏఐటీయూసీ మహాసభలను కర్నూలులో ఆయన ప్రారంభించారు. ఏఐటీయూసీ నాయకులు కర్నూలు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. రానున్న 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మహాకూటమిగా పోటీ చేస్తాయని తెలిపారు. -
‘ఆయనకది సిగ్గు చేటు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకది సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఉంటూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా ఒక్క ఎకరా అయినా సాగు జరిగిందా అని ప్రశ్నించారు. అసలు రెయిన్ గన్లు ఎక్కడ ఉన్నాయి.. మీ నాయకుల ఇళ్లలోనా.. చూపించండి అంటూ సవాల్ విసిరారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ఎవరైనా ఈ విధంగా చూపిస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో చేనేత, ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు! ఉద్యమకారులపై కేసులు పెట్టి జైలులో పెట్టావు మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. ఉద్యమం నేపథ్యంలో తమపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తానన్న సంగతిని గుర్తుచేశారు. ఇప్పటి వరకు అది జరగలేదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు -
చంద్రబాబు పాలనంతా అవినీమయం