మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
సాక్షి, విజయవాడ : ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్‌లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కనీసం 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ సాయం అందటం లేదని పేర్కొన్నారు. కౌలు రైతుకు పెట్టుబడి సాయంగా రూ.25 వేలు అందించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
భూ యజమానులకే ప్రభుత్వ సాయం : రామకృష్ణ
భూ యజమానులకే ప్రభుత్వ సాయం అందుతోందని, నిజమైన పేద కౌలు రైతులకు సాయం అందకపోవటం వల్లే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్‌లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ల సమయంలోనే ప్రభుత్వానికి రైతులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం స్వామీనాథన్ కమిటీ సిఫార్సులు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏమీ చేయలేదన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, రైతులు తమ ఇబ్బందులను చెప్పేందుకు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తే వారిపై లాఠీచార్జ్ చేయించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment