![CPM state secretary Madhu Comments On Pawan Kalyan And BJP - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/17/sf.jpg.webp?itok=LZ0OM7ud)
కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటును బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. పవన్‌కల్యాణ్ కూడా బీజేపీ పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి నంగనాచి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివీస్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. స్థానికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జైలులో ఉన్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment