![AP CPI State Secretary Ramakrishna Comments On Somu Veerraju - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/16/CPI-RAMAKRISHNA.jpg.webp?itok=f_lsILNH)
సాక్షి, విజయవాడ: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆయనకు అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వారిని సోము వీర్రాజు మత కోణంలో చూస్తున్నారే తప్ప మనుషులుగా చూడటం లేదని దుయ్యబట్టారు. ప్రతి విషయం మత కోణంలో చూడటం తగదన్నారు. సోము వీర్రాజు నంద్యాలకు వెళ్లి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రామకృష్ణ హితవు పలికారు. (చదవండి: ‘ఆ మాటలు ప్రజలు మరిచిపోలేదు’)
శవ రాజకీయాలు నీచమైన చర్య..
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన బాధాకరమని ఏపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ వారి ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. అబ్దుల్ సలాం ఘటనను టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దారుణమన్నారు. ‘‘చంద్రబాబు ప్యాకేజీలిచ్చి రాజకీయ లబ్ధి పొందడం కొత్తేమీ కాదు. ఆయన కుట్రలను మైనార్టీలు నమ్మరు. మైనార్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేయడం నీచమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. (చదవండి: అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!)
Comments
Please login to add a commentAdd a comment