
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతుందని శనివారం ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు హాజరవుతారని పేర్కొంది. ఈ నెల 2,3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు చర్చించనున్నట్లు తెలిపింది.