సాక్షి, విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని అన్నారు. 522 మండలాలు డ్రై మండలాలుగా ఉన్నాయని, 347 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలను ఆదుకోవాలని కోరారు. రబీ పంట లేదని, ఖరీఫ్‌లో నష్టపోయారు.. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఈ నెల 17న కర్నూలులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఇరుపార్టీల ఆధ్వర్యంలో పీపుల్స్ ఎజెండా ప్రకటించి, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment