Drought areas
-
పల్లెలు ఎడారులవుతున్న వేళ...!
కొద్దిమంది వృద్ధుల్ని మినహాయిస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జనం మొత్తంగా వలస వెళ్లిపోయారు. ఇది ఒక గ్రామం కథ మాత్రమే కాదు.. భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలన్నింటి వ్యథా ఇలాగే ఉంటోంది. ఉన్న ఊరులో బతికే పరిస్థితులు లేక మొత్తం జనం పనుల కోసం వలస వెళ్లిపోతున్నారంటే.. మన గ్రామీణ ప్రాంతాలు చాలావరకు నిర్మానుష్యంగా మారుతున్నాయని అర్థం. రుతుపవనాల రాకలో జాప్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను నిలిపివేయాలి. ‘‘అందరికీ అభినందనలు... మనం ఈ సంవత్సరం 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధిం చాము. వచ్చే సంవత్సరం 60 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధించడానికి మనం మరిన్ని చెట్లను నరికేద్దాం పదండి’’ పూర్తిగా వ్యంగ్యాన్ని చొప్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ నిజంగానే షాక్ కలిగించింది. అయితే ఈ వ్యంగ్యం ట్విట్టర్‌ను అనుసరిస్తున్న మెజారిటీ పాఠకుల తలకెక్కిందా లేక ఎక్కువమంది జనాలను స్థిమితంగా ఆలోచింపజేసిందా అనేది తేల్చి చెప్పడం కష్టమే. ఈ ట్విట్టర్ వ్యాఖ్య ప్రభావం ఎంత అనే చర్చ పక్కన బెట్టి చూస్తే, గత 140 ఏళ్లలో అంటే ఉష్ణోగ్రతల స్థాయిలను ప్రపంచం నమోదు చేయడం మొదలు పెట్టిన తర్వాత నాలుగో అత్యంత ఉష్ణోగ్రతా సంవత్సరంగా 2018 సంవత్సరం చరిత్రకెక్కింది. 2019 సంవత్సరంలో మరింత ఉష్ణోగ్రత ఉంటుందని నాసా అంచనా. ఇప్పటికే వేడి మనుషులను అమాంతంగా చంపేస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు రుతుపవనాలకు ముందస్తుగా కురిసే వర్షపాతం భారత్‌లో 22 శాతం లోటును నమోదు చేసింది. ఇది గత 65 ఏళ్లలో రెండో అత్యంత తక్కువ వర్షపాతం. ఈ ఏడు రుతుపవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఈ సీజన్లో ఇప్పటికే ఉష్ణోగ్రత 50 డిగ్రీల స్థాయిని మూడుసార్లు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రస్తుతం 48 డిగ్రీల సెల్సియస్‌తో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నీటి వనరుల క్షీణతే కరువుకు కారణం ఇప్పటికే దేశ భూభాగంలో దాదాపు 43 శాతం కరువుకోరల్లో చిక్కుకుంది. దాదాపు 60 కోట్లమంది కరువు బారిన పడ్డారని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో నీటి వనరులు శుష్కించిపోతున్నాయి. ఎండవేడికి బీళ్లుగా మారిన నేల ఎంత ప్రభావం చూపిస్తుందో మాటల్లో వర్ణిం చలేం. గార్డియన్ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. మహారాష్ట్రలో 1,501 పశు నిర్వహణా శిబిరాలు ఉంటున్నాయి. ఇక్కడ 72 శాతం భూభాగం కరువు బారినపడింది. ఇక ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు. ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. ఈ రాష్ట్రం లోని 176 తాలూకాలలో 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత 18 ఏళ్లలో 12 సంవత్సరాలు కర్ణాటక కరువు బారిన పడటం గమనార్హం. 2018–19 సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయంలో మైనస్ 4.8 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కరువు వ్యవసాయ పంటలకు భారీ నష్టం కలిగించడంతోపాటు, వ్యవసాయాధారిత ఆర్థిక కార్యాచరణ కుప్పగూలిపోయింది. ఒక కర్ణాటక మాత్రమే కాకుండా, దాదాపు సగం దేశంలో క్షీణిస్తున్న భూగర్భజల మట్టాలు చివరకు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య నీటికి సంబంధించిన ఘర్షణలకు తోడుగా నీటికోసం క్యూలలో నిలుచున్న వ్యక్తుల మధ్య ఘర్షణలు కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మన విధాన నిర్ణేతలు నీటి పరిరక్షణ, నీటి పొదుపు ప్రాముఖ్యతను ఇప్పుడు గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ)తోసహా 21 నగరాలు 2020 నాటికల్లా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడాన్ని చవిచూడనున్నాయని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక నిజంగానే ప్రమాద ఘటిం కలను మోగిస్తోంది. భూగర్భజలాలు దేశప్రజలకు అవసరమైన 40 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నందువల్ల, దేశవ్యాప్తంగా 60 కోట్లమంది ప్రజలు రానున్న జల సంక్షోభం బారిన పడనున్నారు. జల సంక్షోభం తీసుకువస్తున్న ఘర్షణలు అయితే భూగర్భ జల మట్టాలు క్షీణించిపోవడం నగరాలకే పరిమితం కాలేదు. నిజానికి భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడిపారేయడం వల్లే వర్షపాతం కాసింతమేరకు తగ్గినా సరే అది విధ్వంసకరమైన కరువుకు దారితీస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి భూగర్భజలాల క్షీణత రేటు 0.5 మీటర్లకు మించి నమోదవుతోంది. ఇది ఒక మీటర్ వరకు పడిపోతోంది. ఇక ఎండిపోతున్న నదుల నుంచి లభ్యమయ్యే నీరు కూడా తగ్గిపోతోంది. ఇలా నీటి సంక్షోభం ప్రభావాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యంత సమృద్దమైన జలరాశికి నిలయమైన నర్మదా నదిలో నీటి లభ్యత గత దశాబ్దకాలంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలోని 91 రిజర్వాయర్లలో నీటి మట్టం వాటి సామర్ద్యం కంటే 18 శాతం దిగువకు క్షీణించిపోయింది. పైగా, అనేక డ్యామ్‌ల లోని నీటిని వ్యవసాయ అవసరాలనుంచి తాగునీటితో సహా నగరప్రాంతాల అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో రైతుల నిరసనలు తీవ్రతరమై గ్రామీణ–పట్టణ ఘర్షణలకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి పరిరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల రీచార్జ్ నుంచి ప్రభుత్వాల ప్రాధమ్యాలు మారిపోయాయి. కరువు ముంచుకొచ్చిన సమయాల్లో కీలకపాత్ర పోషించే సంప్రదాయక నీటి బావుల పునరుద్ధరణ పనులను పెడచెవిన పెడుతూ వచ్చారు. నీటి చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జికి చేపట్టవలసిన చర్యలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. లేదా వాటిని పూర్తిగా వదిలేశాయి. లేక చాలా నత్తనడకన సాగుతున్నాయి. దేశవ్యాప్త్గంగా ఇప్పటికీ 2 లక్షల మేరకు సంప్రదాయక చెరువులు, దిగుడుబావులు ఉంటున్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో 138 బ్లాక్‌లలో 110 బ్లాకులు డార్క్ జోన్లో ఉంటున్నాయి. అంటే వీటీలో నీటిని విపరీతంగా తోడేశారన్నమాట. 15 వేల చెరువులు, గుంతలను పునరుద్ధరించినట్లయితే భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంతవరకు పంజాబ్‌లో 54 గ్రామీణ చెరువులను పునరుద్ధరించారు. ఆశ్చర్యమేమిటంటే, రాజస్థాన్‌లోనూ, తరాలుగా కొనసాగుతున్న అద్భుతమైన నీటి పరిరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడానికి బదులుగా బిందు సేద్యంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో 39వేల సంప్రదాయక చెరువులు, ట్యాంకులు ఉనికిలో ఉంటున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులకు పైగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. వీటిలో చాలావాటిని ఇప్పటికీ పునరుద్ధరించవచ్చు. ఈలోగా కర్ణాటక రాష్ట్రం జలామృత పథకాన్ని ప్రారంభించి సంప్రదాయక నీటి వనరులను పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం మొదలెట్టింది. ఇది చాలా మంచి ప్రయత్నమే కానీ సంప్రదాయక నీటి వనరులను పునరుత్థానం చెందించడాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంప్రదాయక జల వనరులను పునరుద్ధరించాలి సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థలు అదృశ్యమైపోయాయి. కర్ణాటక రాష్ట్రం ‘కల్యాణీస్’ అనే తనదైన సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను పరిరక్షించాలని ప్రయత్నిస్తోంది. ఒడిశా అయితే ‘కుట్టా, ముండా’ అనే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంటోంది. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉంటున్నాయి. అయితే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థల చుట్టూ ఉండే సంప్రదాయక జ్ఞానాన్ని మనం ఇప్పటికే చాలావరకు కోల్పోయాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని టెక్సాస్ ఏ– ఎమ్ యూనివర్శిటీకి నేను వెళ్లినప్పుడు వారు తాము అనుసరిస్తున్న తమిళనాడులోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థలను నాకు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి తనదైన సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా అనేది నాకు తెలీదు. కానీ కొంతకాలం క్రితం సెంటర్ ఫర్ సైన్స్ – ఎన్విరాన్మెంట్ సంస్థ దేశంలోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల జాబితాను పొందుపరుస్తూ ‘డైయింగ్ విజ్డమ్’ (అంతరిస్తున్న జ్ఞానం) అనే పుస్తకం ప్రచురించింది. జల వనరుల పరిరక్షణకు సంబంధించి అంతరిస్తున్న మన సంప్రదాయక విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించవలసిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. బోర్‌వెల్స్ ప్రపంచమంతటా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల వైపునకు మళ్లీ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బోర్‌వెల్స్ కూడా త్వరలోనో లేక ఆ తర్వాతో వట్టిపోక తప్పదు. అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. అయితే యధాతథ స్థితి అనేది ఎప్పటిలాగే కొనసాగుతున్న తరుణంలో దీన్ని ఒక విడి చర్యగా చేపట్టకూడదు. అభివృద్ధి పేరిట అడవులను, జల వ్యవస్థలను, నదీపరివాహక ప్రాంతాలను విధ్వంసం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతుం డటం అనేది మనం ఊహించని ఉపద్రవాలకు దారితీయక మానదు. వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్‌లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి.. ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది.. అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు - గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. - మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. - పదిహేనేళ్ల బత్తాయి తోట సార్. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్వర్క్: ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది. రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళానికి చేరిన భూగర్భ జలాలు రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ ప్రస్తుత రబీ సీజన్లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్‌లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది. దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేధిస్తున్న పశుగ్రాసం కొరత పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది. గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. నిలువ నీడ లేదు.. నీరు లేదు ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు. – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా గ్లూకోజ్ నీరు ఒక్కరోజే ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్ నీటిని అందించారు. తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా. పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో 17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు నేను ఎంటెక్ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు. – బాణావత్ వెంకటేశ్ నాయక్, గంగుపల్లి తండా -
జిల్లాలో 40 కరువు మండలాలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 228 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. తీవ్రమైన కరువు జిల్లాల్లో ప్రకాశం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్ కడప జిల్లా 43 తీవ్ర కరువు మండలాలతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రకాశం 40, చిత్తూరులో 37, కర్నూలు 33, అనంతపురం 32, విజయనగరంలో 22 మండలాలలో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఒకమోస్తరు కరువు ఉన్నట్లు 29 మండలాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డి.వరప్రసాదు బుధవారం జీఓ ఎంఎస్ నంబర్–2 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 56 మండలాలనుకరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రబీలో ఏం వర్షాలు పడి పంటలు పండాయో గాని 16 మండలాలను తాజా జాబితాలో చేర్చలేదు. వర్షపాతం కూడా పూర్తి లోటుగా ఉన్నా కరువు మండలాల ప్రకటనలో మాత్రం ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కరువు మండలాలు ఇవే.. అద్దంకి, అర్ధవీడు, బేస్తవారిపేట, సీఎస్ పురం, చీమకుర్తి, కంభం, దొనకొండ, పెదదోర్నాల, గిద్దలూరు, హనుమంతునిపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కొనకనమిట్ల, కారంచేడు, కొమరోలు, కనిగిరి, కొండపి, కొరిశపాడు, కొత్తపట్నం, మార్కాపురం, మర్రిపూడి, మార్టూరు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పీసీపల్లి, పొదిలి, పొన్నలూరు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, సింగరాయకొండ, రాచర్ల, టంగుటూరు, తర్లుపాడు, తాళ్ళూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, యద్దనపూడి, యర్రగొండపాలెం. -
‘వారి మధ్య వైరం ప్రజలకు శాపంగా మారింది’
సాక్షి, విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని అన్నారు. 522 మండలాలు డ్రై మండలాలుగా ఉన్నాయని, 347 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలను ఆదుకోవాలని కోరారు. రబీ పంట లేదని, ఖరీఫ్‌లో నష్టపోయారు.. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఈ నెల 17న కర్నూలులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఇరుపార్టీల ఆధ్వర్యంలో పీపుల్స్ ఎజెండా ప్రకటించి, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. -
'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్‌లో కరవు పరిస్థితులను సృష్టించలేను' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని కరవును జయించామని చెప్పుకొచ్చారు. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడా కరవు జాడ లేదని చంద్రబాబు తెలిపారు. -
కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాలి
అనంతపురం అర్బన్ : కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కోన శశిధర్‌కి కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, ఇతర నాయకులు కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. పీసీసీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, రాష్ట్ర నాయకులు రెండు బృందాలుగా ఏర్పడి 13 జిల్లాలోని కరువు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. ఈ క్రమంలో కరువు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించామన్నారు. అలాగే ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయన్నారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను వినతిపత్రంలో ఉంచామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. -
ప్రజలకు అండగా ఉంటాం
► కరువుతో రూ.16వేల కోట్ల మేర పంటలు దెబ్బతిన్నాయి ► కరువు నివారణకు నిధుల కొరత లేదు ► పావగడలో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ తుమకూరు : కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ అన్నారు. ఇంధనశాఖ మంత్రి శాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పడిన మంత్రులు బృందం ఉపసమితి సభ్యులు బుధవారం తుమకూరు జిల్లా, పావగడ తాలూకాలో పర్యటించారు. ర్యాప్టె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగడూరు గ్రామాన్ని సందర్శించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. స్థానికులతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌ప్లాంట్, నరేగా పథకం కింద నిర్మించిన భవనాన్ని, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. తర్వాత మీడియాతో మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ మాట్లాడారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సీఎం సిద్దరామయ్యతోపాటు మంత్రులు నాలుగు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. దాదాపు 16 వేల కోట్ల మేర రైతులు పంటలు నష్టపోయారన్నారు. మూడు రోజుల్లో సీఎంతో సమావేశమై నివేదికను సమర్పిస్తామన్నారు. తుమకూరు జిల్లాలో 9 కరువు తాలూకాలు గుర్తించగా అందులో పావగడలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. తాగు నీటి సమస్యను తీర్చడాకి 85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంధనశాఖ మంత్రి కె.శివకుమార్ మాట్లాడుతూ పావగడ తాలూకాలో 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 8400 ఎకరాలు సేకరించామన్నారు. ప్రతి తాలూకాలో 20 నుంచి 30 మెగా వాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కరువు ప్రాంతాలు ప్రకటిస్తాం
శాసనమండలిలో మంత్రి పోచారం ప్రకటన - రూ.1,500 కోట్ల వరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం - రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 93,500 అప్పు ఉంది - నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు అఖిలపక్షం నిర్వహిస్తాం - వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో కరువు ప్రాంతాలను ప్రకటించి ప్రభుత్వమే ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,500 కోట్ల మేరకు రైతుకు సాయంగా అందిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. 200కు పైగా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. శాసనమండలిలో గురువారం ఆయన రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. త్వరలో మిగిలిన సగం రుణమాఫీని ఏకమొత్తంగా చెల్లించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని, చెల్లింపును వచ్చే ఏడాది వరకు సాగదీయబోమని స్పష్టంచేశారు. బ్యాంకుల్లో రుణం రెన్యువల్ చేసుకోని రైతుల డాక్యుమెంట్లను వెనక్కిచ్చే ఏర్పాట్లు చేస్తామని, వసూలు చేసిన వడ్డీని తిరిగి రైతులకిచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బోగస్ రుణాలు పొందిన వారిని ప్రోత్సహించవద్దని చెప్పారు. ‘700 మంది ఓటర్లున్న మా గ్రామంలోనే 500 మంది బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారు. అలాగే నా నియోజకవర్గంలో రూ. 9 కోట్ల రుణాలు బినామీల ఖాతాల్లోకి వెళ్లాయి’ అని పోచారం ఉదహరించారు. దేశంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 47 వేల అప్పుంటే, తెలంగాణలో రూ. 93,500 అప్పు ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నల్లబెల్లం విక్రయాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో వెయ్యి ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పశువుల వైద్యం కోసం 36 డివిజన్లలో శుక్రవారం నుంచి మొబైల్ వెటర్నరీ వ్యాన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 108, 104 మాదిరి ఇవి పనిచేస్తాయన్నారు. రైతులు తమ పశువుల అనారోగ్యంపై ఫోన్ చేసిన వెంటనే మొబైల్ వ్యాన్ సంబంధిత గ్రామానికి వెళ్తుందని పోచారం పేర్కొన్నారు. వెంటనే ఎందుకు స్పందించలేదు? రైతు ఆత్మహత్యలపై సర్కారు వెంటనే స్పందించలేదని మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమవుతుందన్న భయంతోనే సర్కారు ఇప్పుడు హడావుడి చేస్తోందే తప్ప.. రైతులపై ప్రేమతో కాదన్నారు. మొదట్లోనే భరోసా ఇచ్చి ఉంటే వెయ్యి మందికిపైగా రైతుల ఆత్మహత్యలు ఆగేవన్నారు. గత ఏడాది 337 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే, కేంద్రానికి కరువు మండలాల జాబితాను పంపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెద్దగా కరువులేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందని వివరించారు. ఈ పరిస్థితుత్లో రబీలో రైతుకు ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు. ప్రైవేటు అప్పులపై రెండు మూడేళ్లు మారటోరియం ప్రకటించాలన్నారు. ఎప్పటిలోగా రుణమాఫీ సొమ్ము చెల్లిస్తారో నిర్ణీత తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించాలన్నారు. నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నారు. కేంద్రం నుంచి రూ. 10 వేల ప్రత్యేక ప్యాకేజీ సాధించాలన్నారు. ఈ చర్చలో బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు కూడా మాట్లాడారు. -
కరవు ప్రాంతాలకు ఆర్థిక సాయం
- రూ. 34 కోట్లు ప్రకటించిన సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ - జిల్లాకు రూ. కోటి చొప్పున ఇచ్చినట్లు వెల్లడి - త్వరలో డయాలసిస్ మిషిన్లను పంపిణీ చేస్తామన్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాణే సాక్షి, ముంబై: ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ‘ఐఎస్వో 9001’ సర్టిఫికెట్ అందుకున్న ప్రఖ్యాత సిద్ధి వినాయక మందిరం టస్టు.. కరవు ప్రాంతాల సహాయార్థం రూ. 34 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ చెర్మైన్ నరేంద్ర రాణే శనివారం తెలిపారు. ప్రభుత్వం దాదాపు 25 వేల గ్రామాలను కరవు నిరోధిత ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించడంతో తాము ఒక్కో జిల్లాకు రూ. కోటి విరాళంగా ప్రకటించామని ఆయన తెలిపారు. ఈ మొతాన్ని అధికారులకు ఇవ్వకుండా నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని చెక్ రూపంలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కరవు పరిస్థితి ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించామని, నిధుల వినియోగంపై నిరంతర సమీక్ష నిర్వహిస్తుంటామని చెప్పారు. త్వరలో రూ.7.5 కోట్లు వెచ్చించి 102 పట్టణాలు, గ్రామాల్లో డయాలసిస్ మిషిన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డయాలసిస్ కోసం అయ్యే ఖర్చును భరించలేరని, అందుకే ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాణే తెలిపారు. వాడియా ప్రసూతి ఆస్పత్రిలో 20 నియోనాటల్ ఐసీయూలను ఏర్పాటు చేయడానికి ట్రస్ట్ తరఫున రూ.1.5 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. గుండె, కాలేయం, కిడ్నీ రోగులకు, మోకాళ్ల మార్పిడికి సంబంధించిన అవుడ్ పేషెంట్లకు ట్రస్ట్ ప్రతి ఏడాది రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్క రోగి తరఫున రూ.25 వేలు చికిత్స చేసిన ఆస్పత్రికి ఫార్వర్డ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు పుస్తక పంపిణీ కోసం రూ.1.5 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆలయంలో భద్రత కోసం వంద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశామని, వాటిని పర్యవేక్షణ స్థానిక పోలీస్టేషన్లో జరుగుతుందని అన్నారు. -
కరువు కానరాదా?
రాష్ట్రంలో కరువు పరిస్థితులను పట్టించుకోని సర్కారు 401 మండలాలను ప్రతిపాదించిన కలెక్టర్లు 88 మండలాలకే ఉన్నత స్థాయి కమిటీ గ్రీన్‌సిగ్నల్! ప్రభుత్వ తీరుపై రైతు సంఘాల మండిపాటు తెలంగాణలో దుర్భర పరిస్థితులను పట్టించుకోని సర్కారు ముఖం చాటేసిన రుతుపవనాలు.. కురిసీ కురవని వర్షాలు.. భారీగా తగ్గిపోయిన సాగు విస్తీర్ణం.. సగానికిపైగా పడిపోయిన దిగుబడులు.. రాష్ట్రంలో ఇంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా, ఇవేవీ ప్రభుత్వానికి మాత్రం కానరావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు మొత్తుకొంటున్నా... అధికార యంత్రాంగం అసలేమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే.. కరువు ప్రాంతాలుగా గుర్తిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది మరి! - సాక్షి, హైదరాబాద్ 401 మండలాలు గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా 401 మండలాల్లో కరువు పరి స్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ కరువు పరిస్థితుల నిర్ధారణపై ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ మాత్రం... అందులో 88 మండలాలనే కరువు ప్రభావిత మండలాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుంటే... 40 మండలాల్లో కరువు ఉన్నట్లు అక్కడి కలెక్టర్ ప్రతిపాదించారు. కానీ రాష్ట్రస్థాయి కమిటీ మాత్రం ఆ జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించలేదు. ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా... 32 మండలాల్లో కరువు ఉందని కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చింది. కానీ ఆ జిల్లాలోనూ ఒక్క కరువు మండలం లేదని నిర్ధారించినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోని 51 మండలాల్లో 40 చోట్ల కరువుందని కలెక్టర్ ప్రతిపాదిస్తే... ఒక్క మండలాన్ని మా త్రమే కరువు ప్రభావితంగా గుర్తిం చారు. ఇలా ప్రతీ జిల్లా నుంచి వచ్చి న ప్రతిపాదనల్లో చాలా వాటిని తొలగించడం గమనార్హం. తీవ్ర వర్షాభావం.. రాష్ట్రంలో 2014-15 ఏడాదికి వ్యవసాయ రంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కుంటోంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్‌లో లోటు వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ మినహా ఏజిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. గత జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 30 శాతం లోటు నమోదైంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 464 మండలాలకుగాను.. 339 మండలాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. కేవలం 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షపాతం లోటు కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఈ కారణాలన్నింటితో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. భారీగా పడిపోయిన దిగుబడి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో పంటల ఉత్పాదకత పడిపోయింది. అనేకచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 78.98 లక్షల టన్నులుగా వ్యవసాయ శాఖ నిర్దేశించుకోగా... దిగుబడి 53.86 లక్షల టన్నులకు మాత్రమే చేరుకుంది. ఏకంగా 25.11 లక్షల టన్నుల (31.81%) ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తంగా వరి దిగుబడి లక్ష్యం 50.81 లక్షల టన్నులుకాగా... 35.27 లక్షల టన్నులకే పరిమితమైంది. 15.54 లక్షల టన్నులు (30.59) తగ్గింది. పప్పుధాన్యాల పరిస్థితీ అంతే. శనగ 0.47 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా.. 0.14 లక్షల టన్నులకే పరిమితమైంది. సోయాబీన్ 4.7 లక్షల టన్నులకుగాను 4.12 లక్షల టన్నులు దిగుబడి అయింది. ఇక పత్తి దిగుబడి భారీగా పడిపోయింది. ఇలా కరువు పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లే వ్యవహరిస్తోంది. తగ్గిపోయిన సాగు.. ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. అందులో వరి సాగు 10.04 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా... 8.17 లక్షల హెక్టార్లకు (81%) పడిపోయింది. పప్పుధాన్యాల సాగు 4.92 లక్షల హెక్టార్ల నుంచి 3.45 లక్షల హెక్టార్లకు (70%) తగ్గింది. ఇదీ లెక్క! ఐదు అంశాల ఆధారంగా కరువు పరిస్థితులను నిర్ధారిస్తారు. ఒకటి వర్షపాతం 50 శాతానికన్నా తక్కువగా నమోదు కావడం.. రెండోది వర్షాల మధ్య అంతరం.. మూడోది మండలం యూనిట్‌గా తగ్గే సాగు విస్తీర్ణాన్ని లెక్కిస్తారు.. నాలుగోది పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవడం.. పశుగ్రాసానికి కొరత ఐదో అంశం.. ఈ ఐదింటిలో ఏ మూడు అంశాలు కరువు ప్రకటన నిబంధనలకు సరిపోయినా... ఆయా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. ఈ సారి వర్షానికి వర్షానికి మధ్య 20రోజులకు మించి అంతరం ఉంది. ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నెలల్లో వర్షాలు సరిగా పడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాస్త కురిశాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం, దిగుబడి దారుణంగా పడిపోయాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ధారించిన దానికంటే.. కరువు మండలాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరువే.. ‘‘కరువు నిర్ధారణ అంశాల ఆధారంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కరువు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు 40 లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. దీంతో సాగు విస్తీర్ణం 50 శాతంలోపే ఉన్నట్లు లెక్క. వరి ఎండిపోవడంతో చాలా చోట్ల రైతులు తగులబెట్టేశారు. వేసిన పత్తిలో 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన ఫలితాలు కూడా 50 శాతంలోపే దిగుబడి వచ్చిందని నిర్ధారణ అయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కలెక్టర్లు వాస్తవ ప్రతిపాదనలు తయారుచేశారు. కానీ ప్రభుత్వం మాత్రం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టేందుకు కరువు మండలాలను తక్కువ చేసి చూపిస్తోంది. కరువు మండలాల ప్రకటన చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదు..’’ - సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం జాతీయ నాయకుడు ఖరీఫ్ తంటాలు.. (2014 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) సాధారణ వర్షపాతం : 715 మిల్లీమీటర్లు కురిసింది.. 498.1 మి.మీ మొత్తం మండలాలు : 464 వర్షాభావం నెలకొన్నవి : 339 సాధారణ వర్షపాతం నమోదైనవి.. 80 ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం.. 78.98 లక్షల టన్నులు ఇప్పటివరకు వచ్చిన దిగుబడి.. 53.86లక్షల టన్నులు తగ్గిన దిగుబడి : 31.81% -
కరువు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం : కలెక్టర్
చిత్తూరు : కరువు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ సిద్ధార్థజైన్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన చౌడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరువు పరిస్థితుల కారణంగా తాగు, సాగు నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవిలో పశువులకు పశుగ్రాసం అందిస్తామన్నారు. దెద్దూరు గ్రామంలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందని, వారి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. మండలంలోని రైతులు రెండు వేల ఎకరాల్లో గస గసాల పంట సాగు చేశారు. ఈ పంటపై ఎకై్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి, అకారణంగా మాపై కేసులు పెట్టారని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ కేసులు మాఫీ చేయాలని రైతులు కోరారు. (చౌడేపల్లి) -
మాటలొద్దు.. పని చేయండి: రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: కరువు ప్రాంతాల బాధితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తూ కాలయాపన చేసే బదులు వారికి ఉపయోగపడే పనులేవైనా చేస్తే ఎవరైనా హర్షిస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే హితవు పలికారు. ఆయన బుధవారం ఔరంగబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను హేళన చేసే విధంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఖడ్సే వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.. పంటలు పండక రైతులు బేజారవుతున్నారు.. చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రైతులను కించపరిచే విధంగా ఖడ్సే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మంత్రి ఖడ్సేకు ‘సెల్’ బహుమతి.. రైతులపై రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు ఇంతట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. జితేంద్ర జనావలే అనే శివసైనికుడు బుధవారం ఖడ్సేకు ఏకంగా ఓ మొబైల్ ఫోన్ బహుమతిగా పంపాడు. కరువు పీడిత ప్రాంత రైతులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఖడ్సేకు శాంతాకృజ్ పోస్టు ఆఫీస్ నుంచి ఈ ఫోన్ పంపినట్లు చెప్పాడు. -
ఊరట ఏదీ..?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడమంటే ఇదే..! వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 66 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి.. ఆదుకోవాలని కలెక్టర్ నివేదిక పంపారు. ఆ నివేదిక మేరకు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు బుధవారం హామీ ఇచ్చారు. కానీ గతేడాది నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం కానీ విడుదల చేయకపోవడం గమనార్హం. కరువు జిల్లాగా ప్రకటించి చేతులు దులుపుకుంటే ఏం ప్ర యోజనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షచాయ(రెయిన్ షాడో) ప్రాంతమైన జిల్లాలో గత నాలుగేళ్లుగా దుర్భిక్షం నెలకొంది. వరుసగా ఐదో ఏట కూడా వర్షాభావం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్‌లో 439.4 మిమీల వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 271.4 మిమీలవర్షమే కురిసింది. వర్షపాత వివరాలు ఎ క్కువగా ఉండడంతో 1.39 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. హెక్టారుకు సగటున 48 కిలోల దిగుబడి కూడా రైతులకు దక్కలేదన్నది పంట కోత ప్రయోగాల్లో వెల్లడైంది. రబీలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈశాన్య రుతుపవనాల వల్ల 395.4 మిమీల వర్షం కురువాల్సి ఉండగా.. ఇప్పటిదాకా కేవలం 68.2 మిమీల వర్షం పడింది. రబీలో 59,970 హెక్టార్లలో వరి, వేరుశెనగ తదితర పంటలను సాగుచేయాల్సి ఉండగా.. కేవలం 5,188 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడి అప్పుడే వేసవిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 1723 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పూర్తిగా ఏర్పడింది. వర్షపాతం, పంట దిగబడులు, తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం తదితర అంశాల ఆధారంగా జిల్లాలో 66 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని వారం క్రితం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. బుధవారం కురుబలకోట మం డలం అంగళ్లులో ‘జన్మభూమి- మా ఊరు’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. దుర్భిక్షం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. గతేడాదికే దిక్కులేదు.. గతేడాది జిల్లాలో వర్షాభావం రాజ్యమేలింది. జిల్లాలో 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వర్షాభావం నేపథ్యంలో 1.54 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని అధికారులు అప్పట్లో ప్రభుత్వానికి నివేదిక పంపారు. 1.12 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా కింద రూ.101 కోట్ల పరిహారం మంజూరు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఇన్పుట్ సబ్సిడీగానీ వాతావరణ బీమా పరిహారాన్నిగానీ ప్రభుత్వం ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని కెలామిటీ రిలీఫ్ ఫండ్(సీఆర్ఎఫ్) నిధులతో రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. సీఆర్‌ఎఫ్‌కు 75 శాతం నిధులను కేంద్రం సమకూర్చితే.. 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. గతేడాది నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని చెల్లించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే తన వాటా నిధులను విడుదల చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధుల ను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఖ రివల్లే పంట నష్టపోయి ఏడాది పూర్తవుతు న్నా నేటికీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందకపోవడం గమనార్హం. మాటలతో ప్రయోజనమేంటి..? జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటిస్తే.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. వాతావరణ బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం మంజూరు చేయాలి. పంట రుణాలను ప్రభుత్వం రీషెడ్యూలు చేసి.. కొత్త పంట రుణాలను ఇప్పిస్తుంది. తాగునీటి ఎద్దడికి అవసరమైన నిధులు.. పశుగ్రాసం కొరతను నివారించడానికి చర్యలు చేపడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించడానికి రూ.154 కోట్లు మంజూరు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కనీసం రూ.45 కోట్లు అవసరం అవుతాయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అంచనా వేస్తున్నారు. పశుగ్రాసం కొరత నివారించడానికి కనిష్ఠంగా రూ.12 కోట్ల మేర అవసరం అవుతాయని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి.. ఈ ఏడాది కొత్తగా పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయకపోవడం వల్ల రీషెడ్యూలు చేసే పరిస్థితి ఉండదు. బీమా ప్రీమియం రైతులు చెల్లించని నేపథ్యంలో పరిహారం మంజూరు చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే.. రైతులకు కేవలం ఒక్క ఇన్పుట్ సబ్సిడీని మాత్రమే అందించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్నే ఇప్పటికీ మంజూరు చేయని నేపథ్యంలో.. ఈ ఏడాది నష్టపోయిన రైతులకు ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తారన్నది అంతుచిక్కడం లేదు. -
చైతన్యం: కరువు లుక్కును ఫేస్‌బుక్‌కు మార్చేసింది!
ప్రభుత్వాలు కరవు మండలాలు అని ప్రకటించడం మీరు వినే ఉంటారు కదా... ఒక ప్రాంతం తీవ్రమైన కరవు ఎదుర్కొన్నాక అనేక శాఖల అధికారులు వాటిని పరిశీలించి, నాయకులు వాటిని ప్రతిపాదించి.. ప్రభుత్వం కరుణిస్తే కొన్ని డబ్బులు వస్తాయి, కొన్ని సహాయాలు వస్తాయి. కానీ అప్పటికి జరగాల్సింది జరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సాయం కూడా అందినంత వరకు అందుతుంది, లేకుంటే అదీ లేదు. మహారాష్ర్టలోని కొన్ని కరవు ప్రాంతాల పరిస్థితి కూడా ఇలాగే అయిఉండేదీ కానీ, సామాజిక స్పృహ ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతాలను ఆదుకున్నారు. అందుకు వారికి సహాయపడింది ప్రభుత్వం కాదు. ఫేస్బుక్! చాలామంది, ముఖ్యంగా పెద్దవాళ్లు ఫేస్బుక్ అంటే టైంపాస్ అని, వేస్ట్ అని అంటుంటారు. ఇందులో నిజం లేదు, అలాగని వారి అభిప్రాయాల్లో తప్పూ లేదు. ఏదైనా మన దృష్టిని బట్టి అవగాహన ఉంటుంది. మన విజన్‌ను బట్టి వినియోగం ఉంటుంది. కొందరు వృథా అనుకుంటున్న ఫేస్బుక్ కొన్ని దేశాలకు స్వాతంత్య్రాన్నే తెచ్చిపెట్టింది ఈ మధ్య. ఇండియాలో అంతపెద్ద పనిచేయలేదు గాని చాలా మంచి పనులే చేసింది. ఈ పనులకు, ఫేస్బుక్ యాజమాన్యానికీ ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ఫేస్బుక్ ఒక వేదిక అయ్యింది. 2013లో మహారాష్ట్రలో అత్యంత విషాదకరమైన కరవు సంభవించింది. తాగడానికి నీళ్లు లేక పశువులు చనిపోయాయి. మనుషులు నీళ్లకోసమే బతుకుతున్నట్లు వెంపర్లాడారు. తాగడానికే లేనపుడు పంటలకెలా వస్తాయని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి దుర్భరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కారణం... 2012లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షపాతం అతి తక్కువగా నమోదవడం. నామమాత్రంగా నాలుగు చినుకులు పడ్డాయంతే! పర్యవసానంగా తలెత్తిన దుర్భిక్షం కొందరు ఫేస్బుక్ మిత్రుల కంట పడింది. అంతే, మహారాష్ర్ట కరవు ప్రాంతాల ప్రజల దశ తిరిగింది. ఇంతకీ వారు ఏం చేశారు? డ్రాట్ హెల్ప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. ఆ గ్రూపులో ఎవరూ ఎవరికీ పరిచయం ఉన్నవాళ్లు కాదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చిన వారు. ఆ గ్రూపు పోస్టు చేసిన కరవు దృశ్యాలను చూసిన వారి గుండె ద్రవించింది. వారంతా ఏదో ఒక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. కరవు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో నెటిజన్లనే అక్కడి వాలంటీర్లగా వాడుకున్నారు. వాలంటీర్లే అక్కడి పరిస్థితులు చెబుతారు. అక్కడికి వాటర్ ట్యాంకు కావాలో, నీళ్లు కావాలో.. ఇంకా ఎలాంటి సాయం కావాలో పోస్ట్ చేస్తారు. దాన్ని చూసిన గ్రూపులో సభ్యులు స్పందించి ఎవరు చేయదలచుకున్న మార్గంలో వారు వస్తు, నగదు, సేవ రూపేణా సిద్ధమై ఆ ఊరి వాలంటీర్‌కు సమాచారం అందిస్తారు. ఆ వాలంటీర్ వీరు పంపిన వాటిని అక్కడ ఏర్పాటుచేసి వాటి ఫొటోలు తీసి మళ్లీ గ్రూపులో పోస్టు చేస్తాడు. దీనివల్ల వృథా, దుర్వినియోగం జరగడంలేదని స్పష్టంగా అర్థమౌతుంది. దీంతో సమస్యకు కేవలం రోజుల్లోనే పరిష్కారం దొరికేసింది. ఇలా అందరూ కలిసి రకరకాల రూపాల్లో 75 లక్షల రూపాయల సాయం చేశారు. అన్ని గ్రామాల్లో తాగునీరు, ఆహార, వైద్య సాయం ఏర్పాటుచేశారు. ఇందులో చాలామంది స్వయంగా సేవల రూపంలో తమ కష్టం అందించిన వారూ ఉన్నారు. ఇలా కొన్ని నెలల్లో మహారాష్ట్రలో వివిధ కరవు బాధిత ప్రాంతాలకు చెందిన పది లక్షల మందికి ఏదో ఒక రూపంలో సాయం అందింది. ఎన్నో జీవితాలు నిలబడ్డాయి. పదివేల మంది సభ్యులున్న గ్రూపు ఇదంతా కొన్ని నెలల్లో పూర్తిచేసేంది. కనీసం ఈ గ్రూపు ప్రైవేటుగా గాని, ప్రభుత్వపరంగా గాని ఎటువంటి గుర్తింపు పొందలేదు. కేవలం కొందరి మానవతా దృక్పథం, చొరవ. అంతే. దీనిని మొదలుపెట్టిన వ్యక్తి జయదీప్ పాతేర్ (సిస్టెలీ సొల్యూషన్స్). ఆయనకు ఆలోచనా సాయం చేసింది రవి ఘాటే. ఢిల్లీకి చెందిన డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వీరి సేవలను సత్కరించింది. ఈ గ్రూపు ఇకముందు కూడా కరవును అస్సలు లేకుండా చేసేందుకు ప్రజాచైతన్యం, అవగాహన, వ్యవస్థాపనా సదుపాయాలపై దృష్టిపెడుతోంది.