
'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితులను సృష్టించలేను' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని కరవును జయించామని చెప్పుకొచ్చారు. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడా కరవు జాడ లేదని చంద్రబాబు తెలిపారు.