central govt funds
-
కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్(ఎన్ఎంఈఓ)’ ఏర్పాటు కోసం రూ.10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘అన్నదాతల ఆదాయం పెంచేందుకు, దేశంలో ఆహార భద్రతను వృద్ధి చేసేందుకు పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన పథకాలను ప్రారంభిస్తున్నాం. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయిస్తున్నాం. పీఎం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ.. వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం. దేశంలో వంట నూనె అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్(ఎన్ఎంఈఓ)ను ఏర్పాటు చేస్తున్నాం. అందుకు రూ.10,103 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం. 2022-23 సంవత్సరానికిగాను నూనె గింజల ఉత్పత్తి 39 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం. ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి కీలక నూనెగింజ పంటల ఉత్పత్తిని మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కాటన్ సీడ్, రైస్ బ్రాన్..నుంచి నూనె తీసే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నాం. రూ.63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 118.9 కిలోమీటర్లమేర మూడు కారిడార్లు, 128 స్టేషన్లు ఉంటాయి’ అని చెప్పారు.ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుభారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. -
వైద్య పరికరాల ఉత్పత్తికి రూ.24 వేల కోట్లతో ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ.24,300 కోట్లతో అనేక ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాదానమిస్తూ.. 2020–21 నుంచి 2022–23 వరకు 22,274 డాలర్ల విలువైన వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోగా.. మన దేశం నుంచి కేవలం 8,846 డాలర్ల విలువైన వైద్య పరికరాలను మాత్రమే ఎగుమతి చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా అధునాతన వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలైన బోండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరంగి పెర్జా తెగల కలలు నెరవేరాయి. వారిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎస్సీ, ఎస్టీల జాబితాను సవరించే రెండు బిల్లుల్ని మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. అండమాన్ నుంచి ప్రధాన భూభాగం వరకూ 75 అత్యంత వెనకబడిన గిరిజన సమూహాలు విస్తరించి ఉన్నాయన్నారు. వీటిలో 10 సమూహాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చకపోవడం వల్ల అన్యాయాలను ఎదుర్కొంటూ హక్కుల్ని కోల్పోయాయన్నారు. బలహీన గిరిజన సమూహాల సామాజిక, ఆరి్థక స్థితిగతుల్ని మార్చడానికి కేంద్రం పలు పథకాలు తీసుకొచ్చిందని, బిల్లులు సమర్థించినందుకు సభకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని గిరిజన సంఘాల్ని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని పలువురు సభ్యులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. గిరిజన పథకాలకు బడ్జెట్ పెంచాలి గిరిజన పథకాలకు బడ్జెట్ మరింత పెరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య నిమిత్తం నేషనల్ ఫెలోషిప్, స్కాలర్íÙప్‌కు బడ్జెట్ తగ్గించిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో షెడ్యూల్డు తెగల జాబితా సవరణ, ఒడిశాలోని షెడ్యూల్డు కులాలు, తెగల జాబితా సవరణ బిల్లులకు మద్దతుగా మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన గిరిజనులకు సంబంధించి ఖచ్చితమైన రికార్డు లేకపోవడం శోచనీయమని, ఖచ్చితమైన మూల్యాంకనం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాలి దేశవ్యాప్తంగా పారిశ్రామిక నీటి కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభా‹Ùచంద్రబోస్ కోరారు. రాజ్యసభలో మంగళవారం నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) బిల్లుకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 6 శాతం కంటే ఎక్కువ పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రసాయనాలు/ఎరువులు, సిమెంట్ పరిశ్రమలపై రూ.13.40 కోట్లకు పైగా పర్యావరణ పరిహారాన్ని విధించినప్పటికీ నీటి కలుíÙతం యధేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఈ బిల్లు ద్వారా పర్యావరణ పరిరక్షణ నిధికి జమ చేసిన మొత్తాన్ని నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి ఉపయోగించాలని సూచించారు. నెలాఖరు నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్టు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ప్రాజెక్టు విలువ రూ.288.8 కోట్లు కాగా.. ఇందులో కేంద్ర వాటా రూ.138.29 కోట్లు అని తెలిపారు. రూ.12,79,331 కోట్ల రుణాలు ఆర్బీఐ గణాంకాల ప్రకారం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల్లో సెప్టెంబర్ 2023 నాటికి అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ రూ.12,79,331 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.వైఎస్సార్సీపీ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, బీద మస్తానరావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ ప్రతిపాదన ఏదీలేదు ఆంధ్రప్రదేశ్‌లో మోడరనైజ్డ్, ఇంప్రూవ్ డిసీజ్ సరై్వలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా పది టైర్–1, పది టైర్–2 సిటీల్లో ఈ యూనిట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి.. బోర్లాపడ్డ విపక్షాలు
సాక్షి, అమరావతి : ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపుతాయి. ఇంకా వీలయితే ప్రజలకు ఏ విధంగా మరింత మంచి చేయవచ్చో సలహాలూ ఇస్తాయి. అంతేకానీ ప్రజలకు జరిగే మేలును, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవు. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు ఇందుకు పూర్తి భిన్నం. ప్రజల మంచికంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే పరమావధి. ఇందుకోసం ప్రజలకు అందాల్సిన నిధులను, రాష్ట్ర అభివృద్ధిని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడకుండా అత్యంత సమర్ధవంతంగా వ్యవహరిస్తోంది. దీంతో విపక్షాల ఆటలు సాగడంలేదు. ఇదే తీరులో తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బీజేపీలోని చంద్రబాబు తాబేదార్లు కేంద్ర నిధులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. అదీ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుటిల యత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను విపక్ష నేతలు అడ్డుకోబోయారు. వీటిని ఆపితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తద్వారా వారి రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లవచ్చన్నది వారి వ్యూహం. పుంఖానుపుంఖాలుగా వారు చేసిన ఫిర్యాదులతో 8 నెలలపాటు గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆపగలిగారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను కేంద్రానికి అందించడంతో ఇప్పుడా నిధులన్నీ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవీ ఆ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 2,000 కోట్లకు పైగా నిధులు ఇస్తుంది. కేంద్రం ఈ నిధులను రెండుగా వర్గీకరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసుల మేరకు 40 శాతం నిధులు బేసిక్ గ్రాంట్‌గా ఇస్తుంది. మరో 60 శాతం కేంద్ర జలశక్తి శాఖ సిఫారులతో టైడ్ గ్రాంట్ పేరుతో విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల, జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున కేటాయిస్తారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల పరిధిలో జనాభా, ఆ ప్రాంత విస్తీర్ణం ప్రాతిపదికన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో.. అయితే, సర్పంచుల సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, జనసేన నేతల ఆధ్వర్యంలోని వివిధ సంఘాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందంటూ మూడేళ్లుగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అన్నింటా చంద్రబాబుకు వంతపాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇటీవల ఇదే తీరులో కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రాష్ట్రాలకు విడుదల చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రూ. 2,010 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాల్సి ఉంది. తొలుత మొదటి విడతలో బేసిక్, టైడ్ గ్రాంట్ నిధులు రూ.988 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేసింది. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఫిర్యాదులతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదల చేయాల్సిన తదుపరి గ్రాంట్‌ను కేంద్రం 8 నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం విచారణ.. నిధుల విడుదలకు అనుమతి పురందేశ్వరి తదితరుల ఫిర్యాదులపై పరిశీలనకు ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించారు. విపక్షాల ఫిర్యాదులన్నింటిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించి, సమగ్ర వివరణ తీసుకున్నారు. ఆ ఫిర్యాదులన్నీ తప్పు అని తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడంతో కేంద్రం ఆ నిధుల విడుదలకు అనుమతించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో విడత బేసిక్ గ్రాంట్ రూ. 393.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసు చేసింది. ఈమేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి (అండర్ సెక్రటరీ) కేఎస్ పార్థసారధి రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. పంచాయతీరాజ్ శాఖ సిఫారసులతో ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లాంఛనమేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల బకాయిలు దశలవారీగా రాష్ట్రానికి అందుతాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి మరో రూ. 2031 కోట్లు కూడా విడుదల చేయాల్సి ఉందన్నారు. అంటే ఈ ఏడాది నిధులతో కలిపి రూ.3 వేల కోట్లకు పైగా విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
పెన్షన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త!
పెన్షన్ లబ్ధిదారలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షన్ దారులు వారి నిర్ణయం ప్రకారం.. ఎంత నగదు కావాలనుకుంటే అంత నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మొహంతీ తెలిపారు. సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో భాగంగా 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లలోపు నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) పెన్షన్ దారులు ఒకనెల, మూడు నెలలు, ఆరు నెలలు డబ్బుల్ని డ్రా చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ దారులు 60 ఏళ్ల తర్వాత తన రీటైర్మెంట్ సొమ్మును మొత్తం డ్రా చేసుకునేందుకు వీలు లేదు. కేవలం 60 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ఏడాదికి కొంత మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉంది. తాజాగా, ఆ పథకంలో మార్పులు చేస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు దీపక్ మొహంతీ పేర్కొన్నారు. ఇక, ఈ మార్పులతో ఎవరైతే 60 శాతం పెన్షన్‌ను ఒకేసారి తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీంతో పాటు, ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారు 70 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇప్పుడు ఆ కాలాన్ని మరో ఐదేళ్లు అంటే 75ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చివరిగా :: దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: అసహనంతో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి కేంద్ర నిధుల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ కాన్సంట్రేషన్ తక్కువ అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్ ఇప్పుడు మళ్లీ చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, బ్యాంకుల నుంచి ప్రజలు తీసుకున్న వ్యక్తిగత రుణాలను కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41శాతం కాగా కేవలం 30 శాతం మాత్రమే రాష్ట్రాలు పొందుతున్నాయని వివరించారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014–15లో 2.893 శాతం ఉండగా 2021–22 నాటికి 2.102 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతాలో కిషన్‌రెడ్డి వేయడాన్ని ఖండించారు. తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తెలంగాణ ప్రభుత్వం హక్కు అని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఇవ్వాల్సి ఉన్నా 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాకపోవడంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారని హరీశ్ ప్రశ్నించారు. గొప్పలు చెప్పేందుకు కిషన్‌రెడ్డి తిప్పలు లేని గొప్పులు చెప్పుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తిప్పలు పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలుతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆయన కేంద్రంపై పోరాటం చేయాలని కోరారు. కిషన్ మాట్లాడిన కొన్ని అబద్ధాలకు మాత్రమే తాము ప్రస్తుతం సమాధానం ఇస్తున్నామని, ఆయన అబద్ధాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో బద్దలు కొడతామని మంత్రి హరీశ్‌రావు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
మోదీ కొత్తగా తెలంగాణకు చేసిందేమి లేదు.: వినోద్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి సహకరించట్లేదనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ప్రధాన మంత్రి ఏం మాట్లాడుతారని ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్రం భరిస్తోంది.. హైదరాబాద్-కరీంనగర్ రైల్వే పనులు తెలంగాణ పైసలతో అవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనేది తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అంశం తప్ప, కేంద్రం ప్రేమతో ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు, మోదీకి సంబంధం లేదన్నారు. మోదీ కొత్తగా రైల్వే ప్రాజెక్ట్‌లు ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టం మేరకు జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు.. బీజేపీ పార్టీలో ఉన్నవాళ్లలో కుటుంబ పాలన లేదా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. మోదీని గద్దె దింపేవరకు వదిలిపెట్టం. -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ‘తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కారు. మోదీదే అవినీతి ప్రభుత్వం. నేటీకి గుజరాత్లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అభివృద్ధి నీ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి. ప్రధాని తనసభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారు. ప్రధాని స్థాయిలో మోదీ మాట్లాడలేదు. మోదీ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదు. -మంత్రి జగదీష్ రెడ్డి -
బడ్జెట్లో సికిల్ సెల్‌పై ప్రస్తావన.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి గురించి తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో సికిల్ సెల్ ఎనీమియాను సంపూర్ణంగా తుడిచిపెట్టేందుకు కార్యాచరణ ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం అమలుకు నోచుకుంటే ఈ వ్యాధి మరో పాతికేళ్లలో కనుమరుగు కావడం తథ్యమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటీ సికిల్ సెల్? మానవ శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యతగా సికిల్‌సెల్‌ను పేర్కొంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయి. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయి. న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్... వంటివి వ్యాధి లక్షణాల్లో కొన్ని. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుంది. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలవారు, ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వెద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకలు సాగించేవారు కూడా ఎక్కువే. మంచి నిర్ణయం.. వచ్చే 2047కల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. దీనిలో భాగంగా ఈ వ్యాధికి అత్యధికంగా గురయ్యే ఆదివాసీ ప్రాంతాల్లో 0–40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 7 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం వ్యాధి నిర్మూలనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న మా సొసైటీ ఈ మిషన్ అమలులో ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. – చంద్రకాంత్ అగర్వాల్, అధ్యక్షుడు, తలçమియా సికిల్‌సెల్ సొసైటీ. మేనరికపు వివాహాలు కూడా కారణమే తండాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు, దగ్గర బంధువుల్లో వివాహాలు కూడా కారణమే. ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, అవగాహన పెంచడం, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహదపడతాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నాం. – డాక్టర్ కె.సి గౌతమ్‌రెడ్డి, కన్సల్టెంట్ అంకాలజిస్ట్ అమోర్ అసుపత్రి. -
త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి హరీష్ రావు
-
పోలవరానికి విడుదల కానున్న రూ 5,036 కోట్లు
-
కేంద్రంలో చేత కానీ ప్రభుత్వం ఉంది : సీఎం కేసీఆర్
-
రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’
అసత్యం ప్రమాదకరమే. కానీ అర్థసత్యం అంతకన్నా ప్రమాదకరం. కానీ ‘ఈనాడు’ పత్రిక ఈ రెండింటినే ఆయుధాలుగా చేసుకుంది. వీటితోనే నిత్యం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై కుట్రలకు తెరతీస్తోంది. సోమవారం నాడు పతాక శీర్షికల్లో ‘రూ.948 కోట్ల మళ్లింపు?’’ అంటూ వండివార్చిన కథనం ఇలాంటి అర్థసత్యాల్లో భాగమే. పైపెచ్చు ఈ శీర్షికకు చివర్లో ప్రశ్నార్థకమొకటి!. అంటే... రాసిన రామోజీరావుకే సందేహం ఉందన్న మాట. మరి అంత సందేహం ఉన్నపుడు రాయటమెందుకు? పైపెచ్చు వార్త నిండా నిధుల మళ్లింపు జరిగిపోయిందన్నట్లుగా వ్యాఖ్యలు? ఇదెక్కడి పాత్రికేయం రామోజీరావుగారూ? ఇదేనా పత్రికను నడిపే తీరు? నిజానికి మీ వార్తలో ఆర్థిక సంఘం నుంచి ప్రభుత్వానికి నిధులు వచ్చాయన్నది మాత్రమే నిజం. కానీ మళ్లించారన్నది పచ్చి అబద్ధం. అందుకే మీరు, మీ అర్ధ సత్యాలు ఈ రాష్ట్రానికి అత్యంత హానికరం. అంతవరకూ బాగానే ఉన్నా... ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గరి నుంచీ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆయా సంస్థల పీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనూ ఇదే చేశారు. కాకపోతే ఇలాకాకుండా వాటి వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని కేంద్రం సూచించటంతో... అలా చేస్తే కనీసం ట్రెజరీ అధికారుల నియంత్రణ కూడా ఉండదని, నిధులు విడుదల చేసే ముందు బిల్లుల్ని పరిశీలించటం, తనిఖీ చేయటం ఏమాత్రం ఉండదని కాబట్టి దీన్ని ఏం చేయాలన్న విషయంలో పంచాయతీ రాజ్ శాఖతో ఆర్థిక శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. అక్రమాలను కనీసం తనిఖీ చేసే వీలుంటుంది కనక పీడీ ఖాతాలకే ఆర్థిక శాఖ మొగ్గు చూపుతుండగా... ఇలా చేస్తే మళ్లీ నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసే అవకాశం ఉందని, కాబట్టి వ్యక్తిగత ఖాతాలే బెటరని పంచాయతీ రాజ్ శాఖ సూచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఆలస్యమయ్యింది తప్ప... రామోజీ చెప్పినట్లు రూపాయి కూడా మళ్లించలేదు. అదీ నిజం. విద్యుత్తు బిల్లులు చెల్లిస్తే తప్పా? రామోజీరావు రాతలో మరింత ఘోరమైన సంగతేంటంటే ఈ నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపునకు వినియోగిస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేయటం!!. అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా రామోజీరావు గారూ? చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ పంచాయతీలు, స్థానిక సంస్థల బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు. పైపెచ్చు పీపీఏల పేరిట విద్యుత్తు రంగాన్ని నాశనం చేశారు. దాంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ.3వేల కోట్ల అప్పుల నుంచి రూ.19,900 కోట్ల అప్పుల్లోకి జారిపోయాయి. స్థానిక సంస్థలు, పంచాయతీలైతే రూ.5వేల కోట్లకుపైగా బకాయిపడ్డాయి. విద్యుత్తు సంస్థలు కనక వాటి నిబంధనలు ప్రకారం బిల్లు కట్టని పంచాయతీలకు కరెంటు నిలిపేస్తే పరిస్థితేంటి? ‘‘అంధకారంలో పంచాయతీలు’’ ‘‘బిల్లులు చెల్లించని దుస్థితిలో పంచాయతీలు’’ అని మీరే పతాక శీర్షికల్లో వేస్తారుగా? మరి ఇప్పుడు పంచాయతీలకు నిధులు వచ్చినపుడు అవి వాడుకున్న కరెంటు తాలూకు బిల్లును ఆ డబ్బుల నుంచి చెల్లిస్తే మీకేంటి నొప్పి? పడిపోతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలను నిలబెట్టాలి కదా? ఆ మాత్రం కూడా బాధ్యతలేకుండా దౌర్భాగ్యపు రాతలెందుకు? ఇదీ... పీడీ ఖాతాల కథ... సాధారణ నిధులైతేనేం, ఆర్థిక సంఘం గ్రాంట్ల నిధులైతేనేం రాష్ట్ర విభజన నాటి నుంచీ... అన్నీ ఆయా స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే నిర్వహిస్తున్నారు. వాటి పీడీ ఖాతాల్లోని నిధుల లభ్యతను బట్టి గ్రామ పంచాయతీలు కానీ, స్థానిక సంస్థలు గానీ బిల్లులు సమర్పించడం... వాటిని క్లియర్ చెయ్యటం జరుగుతుంటుంది. ‘ఈనాడు’ చెప్పని నిజమేంటంటే... పంచాయతీలు అప్లోడ్ చేసే బిల్లులు సాధారణ నిధుల నుంచో, 14/15వ ఆర్థిక సంఘం నిధుల నుంచో పెద్దగా ఆలస్యం లేకుండా క్లియరవుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సాధారణ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు రూ.381 కోట్ల విలువైన బిల్లులు చెల్లించగా... అదే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఏకంగా రూ.638.41 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఆర్థిక సంఘం నిధుల నుంచి గతేడాది రూ.313.48 కోట్ల బిల్లులు క్లియర్ చేయగా... ఈ ఏడాది 588.53 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఈ స్థాయిలో చెల్లింపులు పెరిగిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పదు. కాకపోతే కొన్ని స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులు లేకపోవటంతో వాటికి బిల్లులు అప్లోడ్ చేయటంలో సమస్యలొస్తున్నది నిజమే. ఈ సమస్యలు కూడా ఎందుకంటే ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేస్తోంది. 2021–22కు సంబంధించిన రెండవ అంచె నిధులు 2022–23 రెండో త్రైమాసికంలో విడుదలయ్యాయి. ఇక 2022–23 మూడో త్రైమాసికంలోకి అడుగుపెట్టినా... ఈ ఏడాది తొలి అంచె నిధులింకా రాలేదు. పైపెచ్చు చాలా గ్రామ పంచాయతీల్లో ఐదేళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తి పన్ను వసూళ్లలో ఆలస్యం కారణంగా పంచాయతీల నిధులు తగ్గిపోయాయి. వీటన్నిటికీ తోడు... డిస్కమ్‌లకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాష్త్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని స్వయంగా కేంద్ర ఆర్థిక సంఘమే ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీటన్నిటినీ ప్రస్తావించకుండా... విద్యుత్ బిల్లుల కింద మినహాయిస్తారేమోననే రెచ్చగొట్టే బాధ్యతారాహిత్యపు వార్తలు ఎవరికోసం రామోజీరావు గారూ? అసలేం జరిగిందంటే... 2021–22 సంవత్సరానికి సంబందించి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఈ ఏడాది జూలై 29న కేంద్రం రూ.379 కోట్లు, ఆగస్టు 31న మరో రూ.569 కోట్లు మొత్తం రూ.948 కోట్లను విడుదల చేసింది. నిజానికి ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చికి ముందే రావాలి. కానీ కేంద్రం నుంచి ఆలస్యమయ్యాయి. ఆ నిధులు వచ్చిన 4 రోజుల్లోనే... వాటిని సంబంధిత స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) జారీ చేయగా... వాటికి అనుగుణంగా ఆగస్టు 4న పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి ఆ నిధుల విడుదలకు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేశారు. ఆ తరవాత వారం రోజులకే పంచాయితీ రాజ్ కమిషనర్ ఆ నిధుల్ని సంబంధిత స్థానిక సంస్థల వ్యక్తిగత ఖాతాల్లో జమచేసేందుకు ఉత్తర్వులిచ్చారు. -
కేంద్రం ఇచ్చిన 2.5 లక్షల కోట్లు ఏమయ్యాయి..?
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రైల్వే, హైవే, మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టుల కింద వచ్చిన రూ.2.5 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లకు పెంచినా దీన్నుంచి పొలాలకు ఒక్క చుక్కనీరు కూడా రాలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం, సవివర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాక అక్రమాలపై విచారణ జరుపుతామని చెప్పారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా జోషి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనులను పక్కన పెట్టి కేవలం రాజకీయాలు చేసేందుకే పరిమితమైందన్నారు. తెలంగాణకు ఇచ్చే చౌక బియ్యానికి కేంద్రం 85 శాతం ఖర్చు చేస్తోంటే, టీఆర్ఎస్ నేతలు బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా నిధుల దుర్వినియోగం, వ్యయంపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తెలంగాణలో సంపాదించిన డబ్బును జాతీయ రాజకీయాల్లో ఖర్చు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో రూపాయి మారకం విలువ దిగజారిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం ఇతర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని బదులిచ్చారు. నిధులు దారిమళ్లిస్తోంది... కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోగా, వివిధ పథకాల కింద వస్తున్న నిధులను టీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లించి పథకాల పేర్లు మారుస్తోందని జోషి మండిపడ్డారు. వర్షాకాలంలో వరదలు, నీళ్లు నిలిచిపోవడం వంటి కారణాలతోనే పదిశాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం చెప్పిందన్నారు. ఇందులో టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదా ఏదో ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసమో కాదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్తో సహా బలహీనపడుతున్న పార్టీలు మోదీ ప్రభుత్వంపై ఏదో ఒక నెపం మోపి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. -
అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం
జమ్మూ: జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్ షా ఆదివారం భగవతీ నగర్లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు. ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అమిత్ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు. ఐఐటీ కొత్త క్యాంపస్ ప్రారంభం రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. -
పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్ ఫండ్.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్ ఫండ్ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్ గంగ్వాల్ ఒక పిటిషన్ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించారు. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్యానెల్ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్ అకౌంటెంట్‌తో ట్రస్టు ఆడిటింగ్ పూర్తయిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్‌పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్సైట్ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్‌ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు. -
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాం: బండి సంజయ్
-
టీఆర్ఎస్లో చేరడానికి అదే కారణం: ఎర్రబెల్లి
సాక్షి, గజ్వేల్: ‘మిషన్ భగీరథ’దేశంలోనే గొప్ప పథకమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నయా పైసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద నాలెడ్జ్ సెంటర్లో పథకం అమలు తీరుపై సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగీరథ పథకానికి నిధుల కోసం తాను, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.15 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. కానీ, గుజరాత్, వారణాసిలో తాగునీటి పథకాలకు కేంద్రం సాయం చేస్తుందని, అదే తెలంగాణ విషయమై వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ‘జల్‌జీవన్ మిషన్ పథకం’ కంటే కూడా భగీరథ గొప్పదన్నారు. అప్పులు తెచ్చి భగీరథ ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని విజయవంతంగా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. భగీరథ డిజైన్ చూశాకే మనసు మార్చుకున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మంచినీటి కోసం పడుతున్న గోస చూసి చలించిపోయానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ పక్ష నేతగా ఉన్న తాను ఈ ప్రాజెక్టు డిజైన్ చూసిన తర్వాతనే మనసు మార్చుకున్నానని, టీఆర్ఎస్లో చేరడానికి భగీరథ పథకమే కారణమని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వందశాతం ఆవాసాలకు తాగునీటిని అందిస్తున్నామని స్మితాసబర్వాల్ తెలిపారు. కాగా, ఉత్తమ సేవలందించిన ఇంజనీర్లను మంత్రి ఎర్రబెల్లి సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. కాగా, భగీరథ లేబుళ్లు ఉన్న వాటర్ బాటిళ్లను ప్రారంభించిన మంత్రి దయాకర్‌రావు, స్మితాసబర్వాల్.. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భగీరథ వాటర్ బాటిళ్లనే వినియోగించాలని, వీటిని ఉచితంగానే పంపిణీ చేస్తామని చెప్పారు. -
టీకా పంపిణీకి 80 వేల కోట్లు ఉన్నాయా?
పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా ప్రశ్నించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్ఐఐ ఇటీవలే ప్రకటించింది. -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.31,802 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఐటీ, జీఎస్టీ తదితర పద్దుల కింద మొత్తం రూ.2,72,926 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రం చెల్లించిన దాంట్లో కనీసం 15% కూడా వెనక్కు రాలేదన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులిస్తున్నట్లు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప అసలు గణాంకాలపై మాట్లాడబోరన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఆ రిజర్వేషన్ల మాటేంటి?: జీవన్‌రెడ్డి ఎస్సీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటాపై రాష్ట్ర వైఖరి తెలపాలన్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటైనప్పటికీ అక్కడ కొత్త రేషన్ షాపుల్లేక పాత పద్ధతే కొనసాగుతోందని, పంచాయతీకి రావాల్సిన రెవెన్యూ సైతం ఉమ్మడి పంచాయతీకి వెళ్తోందన్నారు. ఖైదీల క్షమాభిక్ష, టెట్ నిర్వహణ, రాష్ట్ర అప్పులపై స్పందించాలని కోరారు. రాష్ట్ర అప్పులు రూ.1.28 లక్షల కోట్లు.. అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తప్పనిసరి అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందని, నిబంధనలకు లోబడే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని, అర్హత కంటే తక్కువ అప్పులున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు 1,28,153 కోట్లేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్లు అప్పుండగా.. ఆ తర్వాత రూ.1,57,351 కోట్లకు చేరిందన్నారు. ఇటీవల 29,198 కోట్లు రీపేమెంట్లు చేసినట్లు చెప్పారు. ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు రేషన్‌షాపులతో పాటు పంచాయతీ భవనాలను నిర్మిస్తామని, క్రమపద్ధతిలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఖైదీల క్షమాభిక్ష, ఉద్యోగులకు ఐఆర్, పదవీ విరమణ పెంపు అంశం సీఎం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుందని చెప్పారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టంపై త్వరలో శాసనసభ, మండలిలో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల మేర రాయితీలు ప్రకటించిందని, దీంతో కేంద్రానికి రావాల్సిన ఆదాయం ఆమేరకు తగ్గుతుందని, ఫలితంగా సంక్షేమ పథకాల్లో కోత లు పడతాయన్నారు. ఈ ప్రభావం రాష్ట్రాల బడ్జెట్ పై పడుతుందని వెల్లడించారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది రైతులకు రైతు బంధు అందడం లేదని, ఉద్యోగాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సభలో డిమాండ్ చేశారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తాల వివరాలను సభ ముందుంచారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు తగ్గించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.49 లక్షల ఉద్యోగాలకు ఆమోదం తెలిపితే నియామక బోర్డులు, శాఖల ద్వారా ఇప్పటివరకు 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. మిగతా వాటిపై కోర్టు కేసులుండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమైందన్నారు. -
2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసింది. తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మంది రైతులకు రూ. 4,366 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఐదెకరాలలోపున్న నిర్దేశిత సన్న చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చుల నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి నిధులను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలు అయ్యాక మిగిలిన రైతులకు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 14.41 లక్షల మందికి ఐదెకరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులని పీఎం–కిసాన్ పథకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా, మాజీ చైర్మన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైర్ అయిన ఉద్యోగులు, అధికారులు అనర్హులు. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు కూడా అనర్హులే. 10 వేల రూపాయలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా అనర్హుల జాబితా కిందకే వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులకు ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. దీంతో తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు దాదాపు 47 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 26 లక్షల మంది మాత్రమే పీఎం–కిసాన్ పథకానికి అర్హులయ్యారు. తెలంగాణ లో 14.41 లక్షల మంది రైతులకు రూ.288 కోట్లు విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా ఏపీలో 32.15 లక్షల మంది రైతులకు రూ.643 కోట్లు అందజేసింది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 25.58 లక్షల మంది రైతులకు రూ. 511.62 కోట్లు అందజేసింది. అత్యంత తక్కువగా ఛత్తీస్‌గఢ్‌లో 36 మంది రైతులకు రూ.72 వేలు అందజేసింది. -
కేరళకు రూ. 600 కోట్ల వరద సాయం
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద ఈ నిధులను విడుదల చేసింది. కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా వరద బీభత్సంతో భీతిల్లిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించగా, పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. -
'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్‌లో కరవు పరిస్థితులను సృష్టించలేను' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని కరవును జయించామని చెప్పుకొచ్చారు. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడా కరవు జాడ లేదని చంద్రబాబు తెలిపారు. -
కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ
హైదరాబాద్: పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించిన విధి విధానాలనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంభిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్కు చురకలంటించారు. ప్రలోభాలపై అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయంపై తెలంగాణ మంత్రలు అబద్ధాలు చెబుతున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.