సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి సహకరించట్లేదనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ప్రధాన మంత్రి ఏం మాట్లాడుతారని ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్రం భరిస్తోంది.. హైదరాబాద్-కరీంనగర్ రైల్వే పనులు తెలంగాణ పైసలతో అవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనేది తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అంశం తప్ప, కేంద్రం ప్రేమతో ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు, మోదీకి సంబంధం లేదన్నారు. మోదీ కొత్తగా రైల్వే ప్రాజెక్ట్‌లు ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టం మేరకు జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు.. బీజేపీ పార్టీలో ఉన్నవాళ్లలో కుటుంబ పాలన లేదా అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. మోదీని గద్దె దింపేవరకు వదిలిపెట్టం.
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
‘తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కారు. మోదీదే అవినీతి ప్రభుత్వం. నేటీకి గుజరాత్‌లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అభివృద్ధి నీ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి. ప్రధాని తనసభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారు. ప్రధాని స్థాయిలో మోదీ మాట్లాడలేదు. మోదీ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదు.
-మంత్రి జగదీష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment