ఒక్క గుజరాత్‌కే కేంద్రం నిధులా..?  | Vinod Kumar Slams PM Modi Over Unlimited Largesse For Gujarat | Sakshi
Sakshi News home page

ఒక్క గుజరాత్‌కే కేంద్రం నిధులా..? 

Published Thu, Dec 8 2022 4:24 AM | Last Updated on Thu, Dec 8 2022 4:24 AM

Vinod Kumar Slams PM Modi Over Unlimited Largesse For Gujarat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాలకు కేంద్ర నిధులను విడుదల చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని, కేవలం గుజరాత్‌ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ విమర్శించారు. 9 నెలల కాలంలో ఒక్క గుజరాత్‌ రాష్ట్రానికే రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనులకు ప్రధాని మోదీ కేంద్ర నిధులు మంజూరు చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దాదాపు 40 సార్లు రాష్ట్రంలో పర్యటించి నిధుల వరద పారించారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయంలో మాత్రం మోదీ వివక్ష చూపుతున్నారన్నారు. ప్రధాని హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన మోదీ, ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో రకంగా చూడటం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement