సాక్షి, హైదరాబాద్: అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై మోదీ మాకు నీతులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆపిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తలసాని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్మారని గుర్తు చేశారు. సింగరేణిని ప్రవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘భారత్ బయోటెక్ వచ్చినప్పుడు కేసీఆర్ రాకుండా చేసిందెవరు. బీబీ నగర్ ఏయిమ్స్‌ను మీరు కట్టారా. తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారు. నిధులు ఇవ్వడం లేదు. ఎంపీగా ఉండి తెలంగాణ ప్రజలకు లక్ష రూపాయలు కూడా కర్చు పెట్టలేదు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు. దేశానికి అత్యధిక రెవెన్యూ ఇస్తున్న రాఫ్ట ం తెలంగాణ. తెలంగాణకు చట్టం ప్రకారం రావాల్సిందే ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేం లేదు. తెలంగాణ అభివృద్ధిపై మోదీతో చర్చకు మేం సిద్ధం.’ అని మంత్రి తలసాని సవాల్ విసిరారు.
చదవండి: కేసీఆర్ కోసం ఎదురుచూశాం.. శాలువా కూడా తెచ్చా: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment